Monday, 24 February 2020

పాటపాడుమా కృష్ణా



నారాయణ!నారాయణ!!
తెల్లారకుండా వచ్చి కూచున్నావేం నారదా! రాత్రి నిద్రట్టలేదా?
తాతా! తెలుగు గురించి చెప్పవూ?
ఏంటీ! నిన్నొక్కరోజు ఉపవాసంతో పైత్యం చేసిందా? మీ మామ్మని అల్లపు రసం తియ్యమన్నా!
అదేంకాదు తాతా! నిఝంగానే తెలుగురించి చెప్పు.
అవున్లే అరవపాటీ దగ్గర సాంబారు నీళ్ళు తాగుతున్నావు, నీకు తెనుగు గురించి చెప్పాలిసిందే! తెలుగు కాదు తెనుగు అనాలి. తెలిసెనా?

ముందు తెలిసెనా ప్రభూ!
ఈ మందిరమిటులుంచేనా!
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో, కాస్త

ముందు తెలిసెనా!! ప్రభూ



పాటపాడుమా కృష్ణా...
పలుకు తేనెలొలుకునటుల
మాటలాడుమా ముకుంద
మనసు మురియగా...

పాటపాడుమా.......

తెనుగు ఇలా ఉంటుంది.


సమయమాసన్నమైనది.
సమయమా సన్నమైనది.

స్వస్తి
మాటల మరాఠి.

14 comments:

  1. సమయమాసన్నమైనది
    సమయమా సన్నమైనది

    చిరు విరుపు... భాష సొగసు... అద్భుతః
    పద విన్యాసం... సరిలేరు మీకెవ్వరూ.

    ReplyDelete
    Replies
    1. తల్లీ భారతి
      ''సరిలేరు మీకెవ్వరూ.''
      నేను నేనే అంటారనమాట :)
      మామ

      Delete
  2. అయితే “తెలుగు” పదం సరి కాదంటారా శర్మ గారూ? “తెనుగు” అనే మూల పదానికి “తెలుగు” పదం రూపాంతరం అని బ్రౌణ్యంలో ఉందే?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      మీ ప్రశ్నలోనే జవాబుందండి :)
      మామ

      Delete


  3. తాతగారికి లు రాదు :)

    ReplyDelete
    Replies
    1. “ర” పలకని జనాలుంటారు గానీ “ల” రాకపోవడమేమిటండీ “జిలేబి” గారూ, మరీ మీ కొంటెమాటలు కాకపోతే?

      Delete


    2. ఈ ప్రశ్న తాతగారికి వేసి వుండాల్సింది :) లు రాదాండీ అని :)


      జిలేబి

      Delete
    3. జిలేబి.

      అవు”ను”. ఆస్థాన విద్వాంసులకు కూడా”లు” రాదు.
      మామ

      Delete
  4. సమయమాసన్నమైనది.
    సమయమా సన్నమైనది.
    :(
    kushalamena miru

    ReplyDelete

  5. నారాయణ నారాయణ!

    ఈ సమయ మా ....
    గట్రా కాపీ భాగోతమటా ! నిజమేనాండీ కష్టేఫలి వారు ?


    జిలేబి

    ReplyDelete
  6. మీ పిచ్చిగాని , వారికి
    కాపీ గట్రాలకన్న కమ్మన తెనుగా ?
    వాపును బలుపనుకొని బలు
    తీపుల కందాల దురద తీటలె ఘనమౌ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల
      అహో కవి హృదయమర్ధము చేసుకొనలేకపోతి కదా! కట! కటా! :)

      Delete

    2. మీకు తెలియదు రాజన్న గారు గ్రేపు వైను‌ కత పోతా వుంది సమయ మా... గట్రా కాపీ (అట).



      జిలేబి


      Delete
  7. మహేశుడు,జిలేబి.
    బండి నడుస్తోందండి........ ఆగుతుంది,తప్పదుగా..సహజం..అంతే.

    ReplyDelete