Saturday, 10 November 2018

గృధ్ర వాయస జలచర ......

Courtesy:Whats app
గృధ్ర వాయస జలచర ముఖేన భుంక్ష్వా ...... ఇదీ మంత్రం. అనగా గృధ్ర అనగా గ్రద్ద, వాయస కాకి, జలచర అనగా నీటిలో బతికే ప్రాణులు,చేప,తాబేలు...వగైరా జీవులు, వీటి ద్వారా చనిపోయిన వారికి చేరాలనేది ఆకాంక్ష... కాకి ముట్టుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నారు, పర్యావరణ సంతులన కాపాడుకుంటే కాకులు లేకుండాపోయేవికాదు కదయ్యా!

Courtesy:Whats app
కొడుకుల్లారా! ”బతికుండగా గొతులో మంచినీళ్ళు పోయలేదుగాని చనిపోయిన తరవాత కాటిలోకి పడమటి ఆవును తోలేడని” సామెత. తల్లి తండ్రులు బతికుండగా పలకరించండి,మాటాడండి, వారితో కూచుని భోజనం చేయండి, వారికి తృప్తి కలిగించేలా వ్యవహరించండి. చనిపోయిన తరవాత పడమటి ఆవు అంటే ఒంగోలు జాతి మంచి ఆవుని కాటిలోకి తోలి పాలు పిండి చితి దగ్గర పోసినా, పంచ భక్ష్య పరమన్నాలు కాటి దగ్గర పోసినా తల్లి తండ్రులు తినరారు సుమా! నిజానికివన్నీ మీ గొప్పకోసమూ, మీ మానసిక తృప్తి కోసమే, మీ మానసిక సంతులన కాపాడటం కోసం పెద్దలు పెట్టినవే సుమా! గుర్తించండి. 

25 comments:

  1. గురువు గారూ ... ___/\___ ...
    మీ తలపులూ, పలుకులూ మిస్ అయ్యాం సర్ ...
    మీ రాకకు మనసారా ఆనందం ... స్వాగతం ...

    ReplyDelete
    Replies
    1. ఊహించని ఎదురు దెబ్బకదండి! కోలుకోడానికి సమయం పడుతుంది కదా!

      Delete
    2. అవును గురువు గారు. తెలిసినంతనే చాలా బాధ కలిగింది. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

      Delete
    3. What happened

      Delete
  2. కాకి కోసం చివరికి ఈ పరిస్ధితి వచ్చిందన్నమాట. అయితే ఆ సేవ చేస్తున్న వ్యక్తి ఉచితంగా చేస్తున్నట్లే ఉంది లెండి .... వ్యాపారం చెయ్యకుండా. అది మెచ్చుకోదగినది.

    రెండో విడియోలో ఆమె చెప్పిన మాటే ఇటువంటి విషయాల పట్ల నా దృక్పథం కూడా. మనిషి పోయిన తరువాత ... కర్మ ఘనంగా చేశాం, ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రద్ధగా తద్దినం పెడుతున్నాం ... అని చెప్పుకునే మాటలు / చేసే కార్యాలు మీరన్నట్లు మానసిక తృప్తి మాత్రమే, చెయ్యకపోతే బంధుమిత్రులు ఏమనుకుంటారో అని మాత్రమే.

    ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయమండి 🙏.

    ReplyDelete
    Replies
    1. ఇదొక పట్టణంలో జరుగుతున్నదండి. అతనేమీ సమాజసేవ చేయటం లేదండీ! వ్యాపారమే చేస్తున్నాడు,డబ్బులు పుచ్చుకుంటున్నాడు.

      ఇక కరమ ఘనంగా చేశాం,ఇలా చెప్పుకునేదీ చేసేదీ వారి మనశ్శాంతి కోసం తప్పించి పోయినవారికోసం కాదండి. బతికుండగా మంచినీళ్ళు గొంతులో పొయ్యనివారు ఏమీ ఘనంగా చేస్తే పోయినవారు చూడొచ్చారు?
      చేసే కర్మలన్నీ బతికున్నవాళ్ళ తృప్తికి మనశ్శాంతికేనని నా అభిప్రాయమండి.

      Delete
  3. శర్మగారికి నమస్సులు ,

    వయసుడిగిన మేను వార్ధక్యమున జిక్కి
    పూని చాకిరి చేయలేని నాడు
    బుధ్ధి పటుత్వము పోయి , మతిమరుపు
    చేరి సహాయము కోరు నాడు
    ముదిమి తోబాటుగా నెదుగు రోగాలకు
    వైద్యావసరము కావలయునాడు
    మలిసంధ్య చీకట్ల మనుగడ మసకలో
    కలగుండు పడు కష్ట మొలుకు నాడు

    అమ్మ " నొక బిడ్డ " గా జూడ సమ్మతించి
    కాచి కడతేర్చు బిడ్డలు గలర ?  అంత
    గాక పోయిన బాధ్యతగా దలంచి
    జాలి చూపించ గలర ?  కాస్తంత యైన

    " మాతృపిండం దదామ్యహ " మన్న మాత్ర
    ఋణము తీరదు  _  ముదిమి పైకొనిన నాడు
    కాచి కడతేర్చ   తీరు  _   నీ ఘనత  మరచి 
    ఎన్ని పిండాలు పెట్టిన నేమి ఫలము ?

    ReplyDelete
    Replies
    1. తల్లితండ్రులను బిడ్డలకంటే ఎక్కువా ఆదరించే కొడుకులూ, తల్లికంటే ఎక్కువగా ఆదరించే కోడళ్ళూ ఉన్నారండి. కాని మంచి నీళ్ళు కూడా పోయని సంతతి పెరుగుతున్న కాలం, కలికాలం,ఆకలి కాలం. అందుకు అందరిని అలాగే అనేస్తారు కదండీ!

      బతికుండగా ఆదరించలేనివారు ఆతరవాత ఎన్ని పిండాలు పెట్టినా నిష్ఫలం.

      Delete


    2. పిండములను చేసి పితరుల తలపోసి
      ........


      ఇంతకు మించి రాస్తే జనాలు వాయగొడ్తారు కాబట్టి‌ ఇవ్వాళ్టికి ఇంతే. :)

      వెల్కం బెక బెక


      జిలేబి


      Delete
    3. చదువది యెంతగల్గిన రసజ్ఞత ఇంచుకజాలకున్న నా
      జదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
      బదునుగ మంచి కూడు నలపాకము జేసినయైననందు నిం
      పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

      Delete
    4. గురువుగారు, మీరు మళ్ళీ మెల్లగా మనుషుల్లోకి వచ్చారు. అంతే చాలు.

      Delete
    5. చదువులు పెక్కు , పల్కుల రసఙ్ఞత లూరు , హితుల్ ' భళా జిలే
      బి ధగ ధగల్ ' యటంచు గడు పేర్ములు గూర్తురు , పాండితీ ప్రభన్
      బుధులు బొగడ్త లిచ్చిరి , ప్రపూర్ణ కళోధ్ధత మూర్తిమత్వముల్ ,
      బొదవిన వారి ' పేరు ' విని , బొందు యదృష్టము మాకు గల్గునా ?

      Delete
    6. 'చదువది యెంత గల్గిన ...'
      'చదువులు పెక్కు, పల్కుల ...'

      ... యదృష్టము మాకు గల్గెనే !

      యెంత లయ బద్దంగా,
      విన మధురంగా వ్రాశారు ఇరువురూ ...
      సాష్టాంగ ప్రణామా లిరువురకూ ...
      ఘన బుధ గురువులకూ ...
      __/\__ ...

      Delete
    7. సార్ ,ఱావు గారూ ,
      నే రాసింది జిలేబీ ముసుగు పండితుల స్తోత్రమండీ ,
      అప్పుడపుడూ వారి స్తోత్రం చెయ్యనిదే నాకు ఏదో
      వెలితిగా ఉంటుంది . మిత్రులు కదా ! .....

      Delete

    8. తానా అంటే తందానా :) చైం చిక్ జాల్రా అంటే బండివారిదే :)

      ఒకరిది కట్ పేష్టు
      మరొకరిది బుర్ర పేష్టు :)


      జిలేబి

      Delete
    9. @ వెంకట రాజారావు.లక్కాకుల ...

      అవును గురువు గారు. మీ స్తోత్రం లోని ముసుగు తెలియక చేసిన పొగడ్త కాదది. ఆ స్తోత్రం లో
      పలికించిన గాత్రపు సొగసుకి పల్కిన జేజే.
      ఇకపోతే పండితుల స్తోత్రాలకు జిలేబి దర్బారులో ఆదరణకు కోదవేముందండీ!
      పామరుల స్తోత్రాలకే ... తప్పని సవరణలూ ... నెగ్గని వివరణలూ ... దక్కని వితరణలూ ...
      సుమండీ!
      గదండీ!
      :)

      Delete
    10. మరొకరు బ్లాగ్ ఘోస్టు ...
      మరెపుడూ బుర్ర రోస్టు ...
      :)

      Delete
    11. చదువది నేర్తురే కృతమతుల్, పదునుగ నెంచ ఇతరుల ఎఱుకలేమి
      అదనుగ వెలిగి , తమ తమ మెళకువల తళుకు బెళుకు మెరియ, ఇం
      పొదవుదురే శిశువుల గేలి జేసి, యా పద కీర్తుల మురిసి,
      చిదానందముగ ఇవ్విధముల ఇలను మురిసి, మా తలల తరచి !

      Delete
    12. రావుగారు,
      కొత్త అక్షరం g జేర్చేసేరా :) ఇప్పటిదాకా host అనుకున్నాసుమండి. ఇంక roast అంటారా? పాపం అయ్యరువారు

      Delete
  4. Sharma garu, it's good to see you come back. Hope everything is fine and your health is good.

    ReplyDelete
  5. శర్మ గారూ, వీలయితే / దొరికితే / ఇదివరకే చదివేసుండకపోతే ... గొల్లపూడి మారుతిరావు గారు వ్రాసిన "సాయంకాలమైంది" అనే నవల చదవండి.

    అమెరికాలో ఉంటున్న కొడుకు తన తండ్రి (నవలలోని ప్రధాన పాత్ర) చనిపోతే భారతదేశం వచ్చి కర్మకాండ మొదలుపెడతాడు. కర్మ ఆఖరిరోజు సాయంకాలానికే తన తిరుగుప్రయాణం టికెట్ కొనుక్కుని వస్తాడు. ఆఖరిరోజున అతని చూపంతా ఓ పట్టాన రాని కాకి కోసమే.

    (మనసంతా విమానం మీద ... ఆలస్యమైతే తప్పిపోతుందేమోనని. విమానాశ్రయం పక్క పట్టణంలో ఉంది మరి. ముందు అక్కడి వరకు కారులో వెళ్ళాలి. పూర్తిగా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకున్న బాపతన్నమాట)

    ReplyDelete
    Replies
    1. చదవలేదండి, కాని అనుభవాలు చూసినవే ఉన్నాయి.ఒక చిన్న ఉదాహరణ చూసినది.
      ఆర్ధికంగా చిన్న కుటుంబం,తల్లితండ్రులు కష్టపడి పెంచారు,చదువూ చెప్పించారు.ఉద్యోగం వచ్చింది, పెళ్ళి చేయించా, అమెరికా ఎగిరిపోయాడు.తండ్రి కాలం చేశాడు, చెబితే నాకు శలవు దొరకదు, వచ్చి వెళితే ఇద్దరికి పదివేల డాలర్ల ఖర్చు, సొమ్ము పంపుతాను, ఖాళీగా రోడ్లు కొలుస్తున్నవాడున్నాడుగా రెండోవాడు, వాణ్ణి తరవాత కార్యక్రమాలు ఘనంగా చెయ్యమనండి, డాలర్లు పంపుతా అన్నాడు, ఏమనాలో ఆ తల్లికి మాకూ కూడా నోరు రాలేదు. చెప్పినట్టేచేశాడు. పుస్తకం దొరికితే చదువుతానండి.

      Delete
  6. జిలేబీ పైకూలు వినిపిస్తే కాకులు పిండాలు వదిలేసి తుర్రోతుర్రు.

    ReplyDelete
    Replies
    1. జిలేబి అంటే ఇంత భయమా?

      Delete

    2. ఉండదా మరి :)

      ఏ మూల నుంచి వచ్చి ఎట్లా వాయిస్తుందో ఎవరికెరుక :)


      జిలేబి

      Delete