Private blog (New posts)
https://kastephale.wordpress.com/ (కష్టేఫలే)
Public working blogs added in aggrigators
https://kastephali.wordpress.com/ (Old posts published daily) (కష్టేఫలి)
http://kasthephali.blogspot.in/ (Photos etc) (కష్టేఫలి)
మా ఊరు చుట్టుపక్కల పదికిలోమీటర్ల దూరం పరిధిలో బైక్ పేచ్ పడి ఆగితే, అక్కడికే వెళ్ళి పేచ్ వేసే పని చేస్తాడొకతను. ఇతనొక పర్యావరణ ప్రేమికుడు కూడా. వినాయకచవితి సందర్భంగా ౩౦౦ మట్టి వినాయక ప్రతిమలూ, పత్రితో తన వ్యాపారం గురించి ముద్రించిన సంచిలో అందరికి పంచిపెట్టేడు, సంచి కూడా నూలు సంచి. స్వామి కార్యం స్వకారం అంటే ఇదే!!!పర్యావరణ ప్రేమికుడు పంచి పెట్టిన మట్టివినాయక విగ్రహం, పూజా సామగ్రి.
మెచ్చుకోదగిన వ్యక్తి మీ ఊరి సత్తిబాబు గారు.
ReplyDeleteమీకు మీ కుటుంబానికీ, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
విన్నకోట నరసింహా రావుగారు,
ReplyDeleteమావాళ్ళు వినూత్నంగా ఆలోచిస్తారు. కొత్తని, మంచిని వెంటనే అందిపుచ్చుకుంటారు.మా సత్తిబాబు అటువంటివారు.
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభకామనలు
ధన్యవాదాలు.
వినాయక చవితి వచ్చిందంటే కార్టూన్లకి కొదవేముంది!
ReplyDeleteఇప్పుడే i news టీవీ ఛానెల్లో ఓ కార్టూన్ చూపించారు (కార్టూనిస్ట్ ఎవరో చెప్పలేదు) - వినాయకుడికి పైన సలహా ఇస్తుంటారు "భూలోకంలో ఎక్కడికైనా వెళ్ళు కానీ హైదరాబాద్ మాత్రం వెళ్ళద్దు ; వర్షం పడితే లైవ్ నిమజ్జనం అయిపోతావు". 😀😀
ఈ మధ్యకాలంలో నేను చూసిన కార్టూన్లలో నేనయితే దీనికే మొదటి స్ధానం ఇస్తాను. 👍
విన్నకోట నరసింహా రావుగారు,
Deleteపార్వతమ్మే సలహా ఇచ్చిందిటండి, నాయనా భూమ్మీద ఎక్కడకెళ్ళినా భయంలేదుగాని హైదరాబాద్ మాత్రం వెళ్ళకూ, అని. అక్కడున్న మేన్ హోల్స్ నిన్ను కూడా నిమజ్జనం చేసెయ్యగలవు వర్షమొస్తే అందట. :) మీరు చెప్పిన జోక్ అదే టి.వి. వారి జోక్ నిజమే :)
మిత్రులు శర్మ గారు,
Deleteవినాయకుణ్ణి చూసి బుఱ్ఱతక్కువగా చంద్రుడు ఒకా వెఱ్ఱినవ్వు నవ్వి శాపం పొందాడు. ఐనా ఆ గణపయ్యను ఒక హాస్యవస్తువుగా స్వీకరించి బొత్తిగా భయమూభక్తీ లేకుండా జోకులు వేసుకుంటున్నారే జనం! ఇదేమన్నా బాగుందా అని ఆశ్చర్యం కలుగుతుంది.
శ్యామలీయంగారు,
Deleteఈయనేమో భోళాశంకరుడుగారి పెద్దబ్బాయి, పాపం చాలా దయగలవాడు,విద్యా ప్రదాత, ప్రేమగలవాడూనూ. అందుకని పిల్లలు ఎలా జోక్ లు వేసుకున్నా కాదనడు. హైదరాబాద్ మేన్ హోల్స్ ఆయన్నే సజీవంగా నిమజ్జనం చెయ్యగలవని కార్టూనిస్ట్ భావం మరి. :)
ధన్యవాదాలు.
వినాయక చవితి సందర్భంగా చంద్రుడికి శాపం కరక్టే గానీ శ్యామలీయం గారు, ఆ శాపం వల్ల చంద్రుడి కన్నా ఎక్కువ బాధపడేది (నీలాపనిందలు వగైరా) ఇతరులేనని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది 🙂🙂
ReplyDeleteవిన్నకోట నరసింహా రావుగారు,
Deleteమిత్రులు శీతకన్నేశారు, చెప్పలేదు, నాకు తోచింది చెబుతా...
నీ మొహం చూడ్డమే పాపంరా అంటుంటారు గుర్తుందా? :)
కతలోకొస్తే
గణపతి కష్టంలో ఉంటే చూసి చంద్రుడు నవ్వేడు. గణపతి నీ మొహం ఎవరు చూసినా పాపమే అని శాపమిచ్చాడు. అంటే నిన్ను ఎవరూ పలకరించరు, నీ దగ్గరకి రారు, నిన్ని చూస్తేనే పారిపోతారన్నాడు. ఇది భయంకర శాపం, చంద్రుడికి, ఇంతకు మించినది లేదు.
చంద్రుడు బాబోయ్ ఈ శాపం భరించలేనని ఏడిస్తే, గణపతి క్షమించి, ఈ శాపం మూలంగా ప్రజలకి జరుగబోయేది ఊహించి శాపాన్ని సవరించాడు. భాద్రపద శుక్ల చవితి రోజున నిన్ను చూస్తే నీలాపనిందలు కలుగుతాయని. చంద్రుని కోరిక మీద మళ్ళీ సవరించాడు, శాపాన్ని. ఈ సారి నా వ్రతం చేసుకుని కత విన్నవారికి, అక్షతలు నెత్తిన చల్లుకున్నవారికి ఈ దోషం అంటదూ అని. అందుచేత ప్రజలకి కలిగేబాధను గణపతి తొలగించారు, సవరణల ద్వారా!
నీతి:-కష్టం లో ఉన్నవాడిని చూసినవ్వకు, చేతనైన సాయం చెయ్యి, లేదా నోరు మూసుకుని ఊరుకో. నోటికొచ్చినట్టువాగితే జరిగేదేంటో చెప్పేదే ఇది.
అమ్మో! ఇదే టపా ఐపోయిందండి, తీరుబడిగా రాస్తే బాగుండేదేమో :)
ధన్యవాదాలు
సూక్ష్మం వివరించినందుకు ధన్యవాదాలు శర్మ గారు.
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు
ReplyDeleteగారు,
ఆ మాట చెప్పడానికి సావకాశం ఇచ్చిన మీకే
ధన్యవాదాలు.