Saturday, 10 September 2016

శర్మ కాలక్షేపం కబుర్లు-శరీరమాద్యం…..


శరీరమాద్యం.....

శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అన్నారు పెద్దలు. అంటే ధర్మసాధనకు శరీరం ముఖ్యం అనమాట. ధర్మం చతుర్విధ పురుషార్ధాలలో మొదటిది, అర్ధ,కామ,మోక్షాలు తరవాతవి. ధర్మాన్ని ఆచరించి పని చేస్తే వచ్చే సొమ్ము ధర్మార్జితం విత్తం. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనమనలేదు, నీ పని నువ్వు చెయ్యి,ధర్మమైనది, సొమ్ము అర్జించు, ఆ తరవాత ధర్మమైన కామం అంటే కోరికను తీర్చుకో అదే మోక్షానికి దారి అన్నారు. ఆ తరవాత ఆహార నిద్రా,భయ,మైధునాలు సర్వజీవులకూ సమానం అన్నారు, అంటే ఇవన్నీ శరీరాన్ని రక్షించుకోడానికి కల్పింపబడినవే! శరీరాన్ని రక్షించుకోడమే అనగా అత్మ రక్షణే ప్రథమ కర్తవ్యం. ఆ తరవాత ఆత్మవత్ సర్వభూతాని అన్నారు అంటే నీలాగే ఇతరజీవులూ, అంటే నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగే ఇతరజీవులనూ ప్రేమించమన్నారు, నీవాడైనవాడిని ప్రేమించు, కాని వాళ్ళని నరికెయ్యమని చెప్పలేదు సనాతన ధర్మం, ఆత్మవత్ సర్వభూతాని, అదీ మాట. నిన్ను నీవు రక్షించుకో, ఇతరులనూ ఆపదలనుండి రక్షించు ఇదీ మాట.

ఐదేళ్ళ కితం బ్లాగ్ మొదలెట్టి రాసుకుంటూ వచ్చాను, గత సంవత్సరంగా నా మీద దాడి జరుగుతోంది, నన్ను నా పనినుండి విరమింపజేయడానికే జరుగుతోంది, అన్ని రకాల ప్రయత్నాలూ చేసాను.  నన్ను నేను రక్షించుకోడానికిగాను ప్రైవేట్ బ్లాగ్ చేశాను. బ్లాగులోకి రావాలనుకున్నవారిని తమ పరిచయం మెయిల్ రూపంలో పంపమన్నాను, ఇది కూడా నన్ను నేను రక్షించుకోడానికేగాని మరొకందుకు కాదు. నా అభిమానులే కావచ్చు కొందరు కొన్ని అంకెలు, కొన్ని అక్షరాలతో మరికొందరు ఇలా ప్రైవేట్ బ్లాగులోకొస్తామంటున్నారు. వారికి సవినయంగా తెలియజెసేది, మీరు నా అభిమానులే కావచ్చు కాని మీరెవరో పేరు కూడా తెలియక ప్రవేశం కల్పించలేను, దయచేసి అర్ధం చేసుకోవలసినదిగా కోర్తాను. ఇప్పటికి నాదగ్గర ఇటువంటి అభ్యర్ధనలు ఆరున్నాయి, వారికిదే మనవి, మీ పరిచయం తెలియజేయండి, ఎదురు చూస్తున్నా మీ మెయిల్ కోసం.

పోస్!పోవోయ్ నీదో పెద్ద బ్లాగు! దానికింత బిల్డప్పూ! చిత్తం, తమరిష్టం, కాదని నేననలేదే! ఏ పని చేసినా ముందు కావలసినది ఆత్మరక్షణ కనక నేనీపని చేయాల్సివచ్చిందని మనవి.

పెద్దలమాట

కృషితోనాస్తి దుర్భిక్షం
జపతోనాస్తి పాతకం
మౌనేన కలహో నాస్తి
నాస్తి జాగరతో భయం

కృషి అనగా ప్రయత్నం,వ్యవసాయం చేస్తే కరువు లేదు. జపం చేస్తే పాపం లేదు, మౌనంగా ఉంటే కలహం లేదు, జాగరతతో ఉంటే భయం లేదు.
ఈ వయసులోఎందుకీ చాదస్తం? మానేయచ్చుగా రాయడం.
ఊ హు! కుదరదు అదంతే! 

ఓడిపోతే సిగ్గు పడను,ప్రయత్నం మానను, రాయడమూ మానను.


వీటన్నిటిలో మొదటి మూటినీ గత సంవత్సరంగా పాటిస్తున్నాను, చివరిదైన జాగరతే ఇప్పుడు కర్తవ్యం. 

Admission to the private blog is restricted to invitees or to those who requested to participate. Those who wish to parcipate in the private blog https://kaste phale.wordpress.com should send their request to sarmabc@gmail.com with a profile of introduction, the 1.Name,2.Sex. 3.Age. 4.Profession,5.Social status, 6. Place of normal living, village/town/city/ metropolis,state and country. 7.Any other information, wish to share. Please don’t approach with false profiles. The concept of a private blog itself in Telugu blogging word is new. 

To those who wanted to be viewer of the private blog

At the outset let me thank you for your wish to be viewer of my private blog https://kastephale.wordpress.com. (కష్టేఫలే)

I am not having your mail address, send me mail to my mail address with profile and I will send you the invitation. Please accept that invitation, that is done. you can log into the private blog.

This is the first time in Telugu blogging world to maintain a private blog :)

Some people are sending requests even without a name and such requests are not accepted and will not be accpted.Sofar I am having a strenth of 60 people wishing me sucess.

4 comments:

  1. బాబాయి గారూ!బావున్నారా?నాబోటి వాళ్ళకు ఏమీ అర్థం కావడం లేదు.మీరు పోస్ట్ పెట్టగానే నాకు మెయిల్ వచ్చేది, ఇప్పుడు రావడం లేదు. ఈ కామెంట్ అయినా మీకు చేరుతుందో లేదు మరి?

    ReplyDelete
    Replies
    1. అమ్మాయ్!నాగరాణి
      కులాసాయేనమ్మా!మీరంతా కులాసా కదా!! కొత్తిల్లు బాగుంది కదమ్మా,సౌకర్యంగా..

      కష్టేఫలే బ్లాగును ప్రైవేట్ చేయడం పెద్ద కత, ఒక టపా రాస్తా!

      1.కష్టేఫలే బ్లాగులో రాస్తున్నాను. రెండు రోజులకో టపా వేస్తూనే ఉన్నా!
      కష్టేఫలే ప్రైవేట్ బ్లాగ్ కదా! దానిలోకి ఇప్పటికే మీకు అనుమతి ఉంది. లాగిన్ అయి టపాలు చదువుకోవచ్చు. భారత,భాగవతాలూ డవున్ లోడ్ చేసుకోవచ్చు.

      2.ఒక్కడుగు ముందుకేసి మళ్ళీ ఈమెయిల్ ఫాలో చేసుకుంటే మళ్ళీ టపాలు మెయిల్ కొస్తాయి. ప్రైవేట్ బ్లాగ్ చేయడం మూలంగా కలిగిన ఇబ్బంది.

      3.కొత్తగా కష్టేఫలే(పునః ప్రచురణ) బ్లాగు మొదలు పెట్టేను. దానిలో గత ఐదేళ్ళలో ప్రచురించిన పాతటపాలు రోజూ ధారావాహికగా ప్రచురిస్తున్నాను.

      4. ఈ బ్లాగులో ఇలా ఫోటో లు వగైరా!
      ఇదమ్మా సంగతి. కొంత కాలం కనపడక, తికమక,అంతే
      ధన్యవాదాలు.

      Delete
  2. Super తాతయ్య గారు....

    ReplyDelete
    Replies
    1. Anonymous11 February 2023 at 19:42
      ఆరేళ్ళ కితం టపాకదు తల్లీ!నాటి పరిస్థితి అదీ!! ఓపికగా చదివినందుకు, వ్యాఖకు
      ధన్యవాదాలు.

      Delete