Friday, 26 September 2014

రెండెడ్ల గూడు బండి (1880)




                                       రెండెడ్ల గూడు బండి 1880

Courtesy: old indian photos.in

6 comments:

  1. ఆ.వె. బండి వంకజూడ బహుముచ్చటగ నుండె
    బాట వంకజూడ భయము గలిగె
    ప్రక్కటెముక లకట బయటకు గనిపించు
    బక్క యెడ్లజూడ బాధ కలిగె

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,
      మంచి పద్యం చెప్పేరు
      నెనరుంచండి.

      Delete
    2. పవన్ జీ,
      మంచి పద్యాన్ని మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు.
      నెనరుంచండి.

      Delete
  2. ఇది 1880 చిత్రమైనా ఈ గూడుబండి వాడకం 1970 ల ప్రాంతంవరకూ ఉండింది. అప్పటికి బస్సులు పెద్దగా అందుబాటులో లేకపోవటం వలన చుట్టాల దగ్గరకు వెళ్ళాలన్నా, తీర్థ యాత్రలకు వెళ్ళాలన్నా ఈ బండ్లే శరణ్యం. వర్షం, ఎండా తగలకుండా ఇలా బండికి ఇంద్రధనస్సులా కట్టెలు కట్టి వాటిపైన ఈతచాపాలు లాంటివి కట్టేవారు. వాటిపైన కూడా అందంగా ఉండటానికి బట్టలు కూడా కట్టేవారు. మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవటానికి నా చిన్నపుడు మా నాన్నవాళ్ళు ఇలాంటి ఒక పది బండ్లు కట్టుకుని హైదరాబాదు నుండి శ్రీశైలం పర్వతం పైకి వెళ్లి వచ్చారట. ఇలా ప్రయాణం చేయటం వలన అందరూ మనసు విప్పి ఎన్నో మాటలు చెప్పుకునే వీలుండేది. ఇప్పుడు అరగంట ప్రయాణాలు-రణగొణ ద్వనుల మద్య, వాంతులు, వికారాలు, తలతిప్పడాలు తప్ప ఏ సుఖమూ ఉండట్లేదు. చిత్రంలోని ఈ ఎడ్లను మా ప్రాంతంలో బక్కలు (బక్కన్నలు) అంటారు, ఇవి ఎంత తిన్నా బక్కగానే ఉండేవి, బాగా పరిగెత్తటం చాలా ఎత్తుగా ఉండటం, ఎవరినైనా ఎదిరించటానికి కొమ్ములు ముందువైపు వంగి కోసదేలి ఉండటం వీటి విశేషం కూడా. మంచి చిత్రం పెట్టారు.

    ReplyDelete
    Replies
    1. స్వామీ జీ,
      మీరన్నమాట నిజం. కొత్త సాధనం వస్తే పాత వాటిని పూర్తిగా విస్మరించడం మనవారి అలవాటు. ఇప్పుడు బండి కనపడటం లేదు.
      నెనరుంచండి.

      Delete