ఓటు వేసివచ్చాను.
జీవితంలో మొదటిసారిగా 1962 లో ఓటు వేసాను. ఆ తరవాత ఎన్నికల్లో ఓటు వేస్తూ వచ్చాను. వయసు 85 దాటిపోయింది. ఇదే చివరిసారి కావచ్చేమో చెప్పలేను. 2029 లో కూడా ఓటు వేయ్యాలని కుతూహలం మాత్రం ఉంది. స్కూల్లోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కల్సి వచ్చింది. అక్కడ మాత్రం ఇబ్బంది పడ్డాను. వెళ్ళగానే రిసెప్షన్ లా ఇద్దరు కూచుని ఏ బూత్ కి వెళ్ళాలో చెబుతున్నారు,అంతేకాదు First aid కోసం అవసరమైన మందులు కూడా ఉన్నాయి వారి దగ్గర. నిజంగా ఒక ఉత్సవంలా ఉందంటే!!!!
ఆం.ప్ర లో స్థానికసంస్థలకి ఎన్నికలు జరుగుతున్నాయి. M.P.T.C, Z.P.T.C. 2025 వోటర్లలిస్టు ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి, ఇ.వి.ఎం లు కాదు. ఎన్నికలు పాత పద్ధతిలో జరుగుతున్నాయి. ఓటర్ స్లిప్పులు నిన్న సాయంత్రమే పంచారు. నిన్నటిదాకా వర్షం,ఈ వేళ ఎండకాస్తోంది,తిక్కగా మాత్రం ఉంది.
ఈ రోజు ఉదయమే 8 కి బయలుదేరా పోలిగ్ బూత్ దగ్గరికి అబ్బాయి తీసుకెళ్ళేడు. దగ్గర హైస్కూల్ లో పోలింగ్ స్టేషన్, విశాలమైన ప్రాంగణం 5 బూత్ లు పెట్టేరు. పోలింగ్ చకచకా జరిగిపోతోంది,చాలా తొందరగానూ జరుగుతోంది. మేమంతా చదుకోనివాళ్ళు కావచ్చుగాని విజ్ఞత తక్కువవాళ్ళం కాదు. జనం కనపడటంలేదు,పెద్ద ప్రాంగణం కనక. చాలా ఒద్దికగా నియమబద్ధంగా, క్రమశిక్షణతో ఓటర్ స్లిప్ పుచ్చుకుని ఐడెంటిటీ చూపించి వోట్ వేసి వెళ్ళిపోతున్నారు. ఇంతమంది జనం ఉన్నా తోపులటలెక్కడా లేవు. ఇక్కడ ఒక కానిస్టేబులు ఎస్.ఐ కూచున్నారు,చేసే పని లేక. తెలియనివాళ్ళకి స్లిప్ చూసి ఇక్కడ అవును కాదు అని చెప్పి పంపిస్తున్నారు.
ఎవరు నెగ్గుతారు, అది అనవసరం,ఇప్పుడు. కాని ఈ క్రమశిక్షణ చూసి నాకు బహు ముచ్చటేసింది, ఆనందమయైంది.
పదే పది నిమిషాల్లో ఓటు వేసి తిరిగొచ్చాను.
మీ పౌరబాధ్యతను నెరవేర్చారన్నమాట, అభినందనలు 🙂.
రిప్లయితొలగించండిప్రస్తుత తుపాను వాతావరణంలో కూడా వాయిదా వెయ్యకుండా ఎన్నికలను నిర్వహిస్తున్న అధికారులను మెచ్చుకోవాలి 👏.
బ్లాగులో బహుకాల దర్శనం.
తొలగించండిధన్యవాదాలు.
వర్షంలో ఓటర్ స్లిప్పులు పంచారు, మాదగ్గర. మునిసిపల్ ఎన్నికలైతే తుఫానులో నే నిరవహించారు. చిత్రం ఓటర్లు అంత వర్షంగాలిలోనూ పోలింగ్ బూత్ లకి వచ్చి ఓట్లు వేసారు.
చాలా మార్పులొచ్చాయి...
500 ఓటర్లకు ఒక బూత్. మా ఏరియా ఎక్కుడూ మా నియోజకవర్గపు ఎన్నికను శాసిస్తుంది. ఇక్కడ 5 బూత్ లూ ఏర్పాటు చేశారు.
గేటెడ్ కమ్యూనిటీల వారడగితే అక్కడే బూత్ ఏర్పాటు చేస్తారట కూడా,ఎంతమంది ఓటర్లు అన్నది తెలియదు.
పంచిన స్లిప్పులు అందనివారు,పారేసుకున్నవారికోసం ఒక విండో ఓపెన్ చేసారు. ఓటర్ లిస్టులో వెతికి అప్పటికప్పుడు స్లిప్పులూ ఇచ్చారు.
ఓటింగ్ సమయంలో పదనిసలు...
వరుసలోకాక ముందుకెళ్ళిపోయా. ఏవరూ ఆపలేదు కూడా. మొదట కూచున్నామె ఎదురుగా నిలబడ్డా. అప్పటికే ఒకరి సంగతి చూస్తున్నదేమో,ఈమె వనక నిలబడు అని కొంచం విసుక్కున్నది. చేసింది తప్పేగా మాటాడక వెనక నిలబడ్డా. నాకేసి ఫోటో కేసి ఎగా దిగా మూడు సార్లు చూసింది,ఏజంట్లకేసి చూసింది,లిస్టులోనూ చూసుకుని,వాళ్ళు తలఊపితె ఈడి కార్డ్ చూపని చూసి ముందుకు నడవమంది. అక్కడ మరొకామె చుక్కపెడుతోంది. ఎడమచేతి వేళ్ళు చాపమని చూపుడు వేలు మీద గోరు మీంచి మొత్త అంగులం మేర నామంలా పెట్టేసింది. పెట్టుకో తల్లీ,నువ్వు మళ్ళీ వచ్చి ఓటెయ్యి అని అడిగినా రాలేను అంటే నవ్వేసింది. ముందుకెళితే ఒకాయ వేలి ముద్దరలేయించుకుని రెండు బేలట్లు ఇచ్చాడు,చివరగా మరొకాయన ముద్దర ఇంకులో ముంచి చేతికిచ్చి బుత్ దగ్గరకి పొమ్మనాడు. ఒక నిమిషం అయోమయం ఐ పోయింది. తమాయించుకుని ముద్దర రెండు బేలట్ ల మీదా వేసి పట్టుకొచ్చి డబ్బాలో వేసి ముద్దర ఇచ్చి తిరిగొచ్చా.
మరి పౌరునిగా బాధ్యత నెరవేర్చినట్టే కదండీ.
ఎంత కనాకష్టం పడ్డేరండి !!!
రిప్లయితొలగించండికదా మరి!
తొలగించండిఈ వయసులో బూత్ కి వెళ్ళి ఓటు వేసిరావడం గొప్పకదూ!!
తొమదరలోనే గ్రామపమచాయతీ ఎన్నికలున్నాయి దానికి తప్పనిసరిగా ఓటెయ్యాలి!!!
కష్టమే తప్పదు మరి!!!!
తాతగారండి మీ కష్టం చూసి నేను కూడా కొంత కష్టపడి మీ కోసం ఓ సరిక్రొత్త బ్లాగ్మంజరి తయారు చేసేమండి :) pl check and let me know your views
రిప్లయితొలగించండిhttps://blogmanjari.pages.dev/
బ్లాగ్-మంజరి చూసాను. చప్పట్లు.👍 మంచిపని చేసావు,సంతసం. కష్టం ఎవరిది? అమ్మాయా? మనవడా?? మొదటిరోజే వంకలు చెప్పడం బాగోదుగా!పూర్తిగా చూడాలి.
తొలగించండితాతగారు వంకలు చెప్పకుంటే తాతగారెలా అవుతారండీ :)
తొలగించండిPl feel free to comment give suggestions for improvisation ( if too lengthy write a post ( celebrating this new dedication to blog tatagaru :)
మునిమనవడి దాష్టీకమ్ :)
ఉన్నవంకలే చెబుతా! లేనివి చెప్పను. 🤣ఏదో ఒక మంచిపని చేసావని మెచ్చుకున్నా!👍 ఆ పై మొదటిరోజు కదా,పూర్తిగా చూడనూ లేదు ఇప్పుడే వంకలు చెప్పడం బాగోదన్నా తప్పించి,ఉన్నవంకలు చెప్పనన్నానా?🤣
తొలగించండిఎవరో తెలియనివారే ఒక చిన్న అగ్రిగేటర్ (సందడి) తయారు చేస్తే దానిని అందరికి దృష్టికీ తెచ్చిన వాడిని, మా జిలేబి 😁😊ఒక మంచిపని చేసి పూర్తి అగ్రిగేటర్ (మంజరి) (పేర్లు గుర్తుండటం లేదు) తయారు చేసి తెనుగువారికిస్తే టపా రాయకుండా ఎలా ఉంటాననుకున్నావు. ఐనా మనవి శిఖపట్ల గోత్రాలు కదా! 🤣
బిట్వీన్ ది లైన్స్ అంటుంటారు మీ చదుకున్నోళ్ళంతా, కాని మాటలో అంతరార్ధం గుర్తించలేకపోతివే