5, నవంబర్ 2026, గురువారం

ఓటు వేసివచ్చాను.

 ఓటు వేసివచ్చాను.


జీవితంలో మొదటిసారిగా 1962 లో ఓటు వేసాను. ఆ తరవాత ఎన్నికల్లో ఓటు వేస్తూ వచ్చాను. వయసు 85 దాటిపోయింది. ఇదే చివరిసారి కావచ్చేమో చెప్పలేను. 2029 లో కూడా ఓటు వేయ్యాలని కుతూహలం మాత్రం ఉంది.  స్కూల్లోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కల్సి వచ్చింది. అక్కడ మాత్రం ఇబ్బంది పడ్డాను.  వెళ్ళగానే రిసెప్షన్ లా ఇద్దరు కూచుని ఏ బూత్ కి వెళ్ళాలో చెబుతున్నారు,అంతేకాదు First aid  కోసం అవసరమైన మందులు కూడా ఉన్నాయి వారి దగ్గర.  నిజంగా ఒక ఉత్సవంలా ఉందంటే!!!! 


ఆం.ప్ర లో స్థానికసంస్థలకి ఎన్నికలు జరుగుతున్నాయి. M.P.T.C, Z.P.T.C. 2025 వోటర్లలిస్టు ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయి, ఇ.వి.ఎం లు కాదు. ఎన్నికలు పాత పద్ధతిలో జరుగుతున్నాయి.  ఓటర్ స్లిప్పులు నిన్న సాయంత్రమే పంచారు. నిన్నటిదాకా వర్షం,ఈ వేళ ఎండకాస్తోంది,తిక్కగా మాత్రం ఉంది.       

 

ఈ రోజు ఉదయమే 8 కి బయలుదేరా పోలిగ్ బూత్ దగ్గరికి అబ్బాయి తీసుకెళ్ళేడు. దగ్గర హైస్కూల్ లో పోలింగ్ స్టేషన్, విశాలమైన ప్రాంగణం 5 బూత్ లు    పెట్టేరు. పోలింగ్ చకచకా జరిగిపోతోంది,చాలా తొందరగానూ జరుగుతోంది.  మేమంతా చదుకోనివాళ్ళు కావచ్చుగాని విజ్ఞత తక్కువవాళ్ళం  కాదు. జనం కనపడటంలేదు,పెద్ద ప్రాంగణం కనక. చాలా ఒద్దికగా నియమబద్ధంగా, క్రమశిక్షణతో ఓటర్ స్లిప్ పుచ్చుకుని ఐడెంటిటీ చూపించి వోట్ వేసి వెళ్ళిపోతున్నారు. ఇంతమంది జనం ఉన్నా తోపులటలెక్కడా లేవు.  ఇక్కడ ఒక కానిస్టేబులు ఎస్.ఐ కూచున్నారు,చేసే పని లేక.    తెలియనివాళ్ళకి స్లిప్ చూసి ఇక్కడ అవును కాదు అని చెప్పి పంపిస్తున్నారు. 


ఎవరు నెగ్గుతారు, అది అనవసరం,ఇప్పుడు. కాని ఈ క్రమశిక్షణ చూసి నాకు బహు ముచ్చటేసింది, ఆనందమయైంది.  


పదే పది నిమిషాల్లో ఓటు వేసి తిరిగొచ్చాను.      

1 కామెంట్‌:

  1. మీ పౌరబాధ్యతను నెరవేర్చారన్నమాట, అభినందనలు 🙂.

    ప్రస్తుత తుపాను వాతావరణంలో కూడా వాయిదా వెయ్యకుండా ఎన్నికలను నిర్వహిస్తున్న అధికారులను మెచ్చుకోవాలి 👏.

    రిప్లయితొలగించండి