సందడి
తెనుగులో రాసేవాళ్ళూ, తెనుగు చదివేవాళ్ళూ కరువైపోతున్న కాలంలో ఒక కొత్త చిగురు కనపడి మనసు 'సందడి ' చేసింది.
తెనుగు బ్లాగులు ఎండిపోయాయి,ఒకప్పుడు ఉధృతంగా పారిన నది నేడు పిల్లపాయలా కూడా కనపడక ఎండిపోయింది. బ్లాగులకోసం ఎన్నో ఆగ్రిగేటర్లు ఉండేవి,ఒకప్పుడు. అవి నెమ్మది నెమ్మదిగా వెనకబట్టేసేయి. నేటికి మిగిలింది ఒకటే ఒక్కటి అదే 'శోధిని 'మరొక చిన్న అగ్రిగేటర్ గా జిలేబివదన కొనసాగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో జిలేబి దానిమీద దృష్టి పెట్టలేదు, అందుకు అదీ కుంటుతూ ఉంది.
ఇదిగో ఇటువంటి కాలంలో కొత్త అగ్రిగేటర్ చిన్నదే అనుకుంటా, ఇంకా నిర్మాణంలో ఉన్నదనుకుంటా కనపడింది,అనుకోకుండా. అదే ఈ కొత్త చిగురు. చూడండి.
https://telugublogsandadi.blogspot.com/
రిప్లయితొలగించండిసందడి వారికో మాట.
తెనుగు బ్లాగులకోసం చిన్నదో పెద్దదో ఒక అగ్రిగేటర్ తయారు చేసారు, ఆనందం.
చిన్న టైపో ఉంది. సూచన:"చూచన" సరిచెయ్యగలరు. సరి చేస్తే మహదానందం.
తమరెవరో ఊరు,పేర్లు చెబితే పరమానందం. కాదు మేమూ జిలేబీ లాటి వాళ్ళమే అంటే ఆనందం పరమానందం.
మీరిది చూసి జవాబిస్తే బ్రహ్మానందం.
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానని అనుకుంటే," వెంపాటారి దయ్యంలా నావెనక పడ్డావని" తిడితే ఆనందం, పరమానందం,బాలకృష్ణుని లీలలు చూడగ భక్తకోటికి బ్రహ్మానందం,ఆనందం పరమానందం.