సాంవత్సరికము.
అంటే ప్రతి సంవత్సరమూ వచ్చేదంటోంది ఆంధ్రభారతి, ఇంకా తద్దినము అని కూడా చెప్పేసింది. తద్దినము అంటే ఆ రోజు అని అర్ధంట. ఆ రోజు ఏరోజు? అదిగదా కొచ్చను? అదే పెద్దలు కాలంచేసినరోజు అన్నారు. వార్ని తద్దినం అంటే ఇంత తిరకాసా!
నా దత్త తల్లి తండ్రులిద్దరికి నేనంటే బహు ప్రేమ,అందుకే కూడబలుక్కుని సంవత్సరాలు తేడాగా శ్రావణ,భాద్రపదాల్లో,ఒకటే పక్షంలో,ఒకటే తిథిలో కాలం చేసేరు,నేను మరచిపోకుండా ఉండడానికే ఐ ఉండచ్చనిపిస్తుంది. ఒకటి కిందటి నెలలో గడచిపోయింది, మరొకటి తొందరలోనే వచ్చేస్తోంది. ఇదొక సాంవత్సరికం.
భాద్రపదమాసం,బహుళపక్షాన్ని పితృ పక్షం అంటారు. ప్రతి సంవత్సరం ఈ పక్షంలో పెద్దలను తలచుకుని తర్పణం ఇవ్వడం,శ్రార్ధం చేయడం అలవాటు. మరి ఇద్దరూ ఒకటే తిథిలో కాలం చేయడంతో, రెండు తద్దినాలు ఒకరోజు రావడంతో ఇంట్లోవాళ్ళు అంతా ఇబ్బంది పడిపోయేవారు,కార్యక్రమాలు పూర్తి ఐ భోజనాలు పూర్తి అయ్యేటప్పటికి చుక్కలు కనపడేవి. అన్న శ్రార్ధం చేయడం మానేసి ఆమ శ్రార్ధం చేయడం మొదలుపెట్టా, అంతసేపు ఉండలేక. ఇది సాంవత్సరికమే, రేపటినుంచే పితృపక్షం మొదలు. ఇదీ ఇప్పుడే వచ్చేసింది,ఇదొక సాంవత్సరికం.
సంవత్సరానికి ఒకసారి నేనింకా బతికున్నానని ఒక సర్టిఫికట్ ఇవ్వాలి,దాని కాలమూ పూర్తయిపోయి ఇప్పటికప్పుడే రెండు రిమైండర్లు వచ్చేయి. ఈ సాంవత్సరికము ఇప్పుడే వచ్చేసింది.
ఇంతతో అయిందా! ప్రతి సంవత్సరము అర్ధ సంవత్సర బేంకు ఆర్ధిక నిలవలు చూసే సమయమూ ఈ నెల చివరికి వస్తుంది. దీనితో పాటే చివరి పనిచేసే మూడు రోజులూ దేశం మొత్తం మీద బేంకు సిబ్బంది సమ్మె చేసే సాంవత్సరీకాల కాలమూ వచ్చేసింది.
ఈనెల చివరంతా సాంవత్సరీకాల సీజన్ నడుస్తున్నట్టుంది,నాకు.
దేశం మొత్తం మీద బేంకు సిబ్బంది సమ్మె చేసే సాంవత్సరీకాల కాలమూ వచ్చేసింది.
రిప్లయితొలగించండిఅబ్బ యెంత హాయి! బ్యాంకులు మూతపడి పొలో మని వచ్చే కాల్ సెంటరు జబర్దస్తీ కాల్సూ రాక జీవితమే మధురముగా గడిపేయొచ్చు :)
"పుట్టినప్పటినుంచి పుల్లిగాడే మొగుడా?" అనేదొకనానుడి..
తొలగించండిబేంకులు లేనప్పుడు యాపారాలు జరగలేదా? అప్పుడేటయింది? అందుకే బేంకులు, అదే రూపాయల బేంకు (RBI) తో సహా అన్నీ మూసేస్తే ఈ సమ్మెలు వగైరా గోలుండదు కదా! "బేక్ టొ స్క్వేర్ వొన్"" Back to square one"పేరుతో పుస్తకం రాసెయ్యి,రాయల్టీ అడగనులే, I don"t want money. నేనే రాసిపారేద్దును,నాకు కట్ పేస్టుదో మరోటో పి.హెచ్.డి లేదుగా! ఏటంటావు?