పెరటి మామిడిచెట్టు-లే...దు.
పచ్చటి చెట్టు తీసేస్తున్నారే ఒకరి ఓదార్పు.
మామిడాకులకి మరెక్కడికిపోవాలో మరో ఇల్లాలి వేదన.
పళ్ళు కాయలుబాగుండేవి,తీసేస్తున్నారేంటో మరొకరివగపు.
శ్రావణమాసం వెళ్ళనివ్వకపోయారా? మరొకరి మాట.
ఇలా అన్న ఈ నోళ్ళే ఒకప్పుడు చెట్టు తీసెయ్యండి,దోమలొస్తున్నాయి,చీమలొస్తున్నాయి,పాములొస్తున్నాయన్నవే! నేటికిన్నీ అవశేషాలు పూర్తిగా తొలగింపబడలేదు.
ఇదెలా జరిగింది?
చెట్టు తీసెయ్యమన్న మాట ఈనాటిదికాదు,దశాబ్దం పైగా ఉన్నదే. చివరికి ఇల్లాలి ఆరోగ్యానికి కూడా లింక్ పెట్టి భయపెట్టడమూ జరిగింది. కాని నేనూ ఇల్లాలూ కూడా ఏకవాక్యంగా ఖండించడం జరిగింది. ఈ మధ్య ఈ మాట కొంత ఊపుతీసుకున్నది. అబ్బాయి నాతోనే చెట్టు తీసేద్దాం అన్నాడు. ఏదో చెప్పాను,ఎందుకు తీసేద్దాం అంటే కారణాలు చెప్పలేకపోయాడు. ఆకులు రాలితే ఎత్తించుకోండని సలహా చెప్పి ఊరుకున్నా. ఆ తరవాత కొంత కాలానికి కుటుంబ సమావేశంలో మరలా చర్చకు వచ్చింది. చివరిమాటగా నేనున్నంత కాలం ఉంచండి,ఆపై మీ ఇష్టం అని వీటో చేసేసేను.
మరోసారి చర్చకు వచ్చింది. నిరుడు కాయలేదు,ఈ సంవత్సరం కాస్తుంది,పై సంవత్సరం తీసేద్దామన్నా. అయిష్టంగానే ఊరుకున్నారు.
కాలం గడిచింది,మొన్ననొక రోజు ఎండ మాడుస్తోంది. మధ్యాహ్న భోజనం తరవాత కునుకు తీసి లేచేటప్పటికి కరంటు పోయింది. ఎప్పుడు పోయిందని వాకబు చేస్తే మీరు పడుకున్న అరగంటకన్నారు. ఏమయిందిట అడిగితే మన ఎదురుగానే 11 కె.వి వైర్ తెగింది. కబురు చెప్పేరట,వస్తామన్నారు. వేడికి తెగి వుంటుందన్నా. కాదు వెనక పెరటిలోని పెద్ద ఉసిరి చెట్టు వేళ్ళతో సహా గాలికి లేచిపోయి, లైన్ మీద పడిందని నెమ్మదిగా చెప్పేరు. ఈ సారి మరలా కుటుంబ సమావేశంలో మన మామిడి చెట్టుకూడా ఆ రోజు ఊగింది,అదౄష్టం మన చెట్టు నిలిచింది అన్నారు. ఆపై మన చెట్టుకూడా ఇలా ప్రమాదం కొనితెస్తుందేమో, బిల్డింగుల మధ్య ఉన్నది, అని భయం పాదుకొలిపేరు. ఆపై మనచెట్టు తీసేద్దాం అన్నారు,మూకుమ్మడిగా, వీటొ చేయలేకపోయాను. అంతేకాదు. నేటికాలం వారిది,వారి ఆలోచనలు,అవసరాలు వేరు,వాటిని కాదని ఎదురు చెప్పడం మంచిదికాదనే జ్ఞానజ్యోతి వెలిగింది,దానితో ఇష్టం లేకనే తీర్మానానికి తలొగ్గేను. అంతే నిమిషాల్లో పురమాయింపులైపోయాయి. శుక్రవారం సాయంత్రం నెట్ వైర్ దింపి పట్టుకుపోయాడు. శనివారం పొద్దుట పని ప్రారంభించారు. శనివారం ఉదయమే చెట్టు దగ్గరకు చేరి ఇలా ప్రార్ధించాను.
"ఓ వృక్షరాజమా! ఇంతకాలం నీవు మాకు నీడ,ఇచ్చావు. మా శభం కోరి ఆకులిచ్చావు,కాయలిచ్చావు,పళ్ళు తిన్నాం. నేడు నీవా 40 అడుగులపైన పెరిగావు,శాఖలతో బాగా విస్తరించావు. ఒక వేళ గాలికి జరగరానిది జరిగితే అనే భయంతో నిన్ను తీసేస్తున్నాము,మరో చోట పెంచడానికి ప్రయత్నం చేస్తాను. నిన్ను కంటికి రెప్పలా కాచి చూచుకున్న ఇల్లాలు గతించింది,నేనా గత ఎనిమిదేళ్ళుగా నీ మంచి చెడ్డలు చూడలేదు,ఇక చూడలేను. నన్ను క్షమించు, అని నమస్కారం చేసి ఒకసారి మనసారా కావలించుకుని కన్నీటితో వీడ్కోలు చెప్పేను."
ఆపై ప్రతిరోజూ పని పూర్తి ఐన తరవాత మాత్రమే చూసాను. నలభై ఏళ్ళు పెంచినచెట్టు నాలుగురోజుల్లో భూమట్టానికి చేర్చేసేరు.
మరోసారి వృక్షరాజానికి మనఃపూర్వక నమస్కారం తెలుపుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.









చెట్టు పుట్ట గుట్ట లెట్టివి మనుజుడు
రిప్లయితొలగించండిపుట్టు మనుటవలన పుట్టచున్నె?
పట్టుబట్టి మనిషి వాటిని తొలగించ!
పరమధూర్తజాతి నరులజాతి.
ఆ ధూర్తజాతిలో నేనూ ఒకడినండి,40 ఏళ్ళు పెంచి తీసేసేను,మరో చోట పెంచడానికి ప్రయత్నం.
తొలగించండిఇంత పెద్ద చరిత్ర కలిగిన చెట్టును నరికేసారా !!!
రిప్లయితొలగించండిఓహ్ మై మథర్ ! ఫర్ గివ్ దీజ్ పీపుల్ ఫార్ దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్ !
చరిత్ర ఉన్న చెట్టే! చెట్టు పడిపోతే కలిగే నష్టంకంటే వేళ్ళు లేచిపోవడం మూలంగా కలిగే నష్టం ఎక్కువది,వేళ్ళు ఇంటిని కూడా లేపెయ్యగలవు. అందుకే తీసెయ్యక తప్పలేదు. చెట్టు, పుట్ట; కొండ,కోన;వాగు,వంక ఇలా ప్రకృతి మీద మమకారం పెంచుకునే మట్టి మనుషులం. మీలా నేలకి దిగకుండా, విమానాల్లో తిరిగే వాళ్ళమేం కాదు.నిజమే చెబుతున్నాం విమానాన్ని ఎక్కడం మాట దేవుడేరుగు, విమానాన్ని నేలమీద కూడా చూడని జీవులం,బొమ్మల్లో తప్పించి విమానమే చూడలేదు జన్మలో.
రిప్లయితొలగించండితాతగారూ కుశలమేనా?
రిప్లయితొలగించండిబామ్మ గారికి కూడా తాత గారేనా?
తొలగించండిజిలేబి,
తొలగించండిఉన్నాను.🤣 అమ్మదయతో బండి నడుస్తూ ఉంది.
ఒక పల్లెటూరి అనామకుడు,అమాయకుని పై మీ అభిమానానికి వందనాలు.
అది తెలిపినందుకు ధన్యవాదాలు.
నేనెప్పుడూ బాగున్నానని అనుకుంటా,అది నా జన్మలక్షణం,కష్టంలో కూడా సుఖముందనుకునేవాడిని.
బోనగిరి సారూ!
తొలగించండిమీసాలబామ్మ సార్!
మీ , సాల బామ్మగారన్నారా ?
తొలగించండిమొగసాల బామ్మ గారన్నారా ?
మోసాల బామ్మగారన్నారా ?
సమోసాల బామ్మగారన్నారా ?
:)
జిలేబి,
తొలగించండిమీ సాల బామ్మగారంటే, మీ ఇంటి బామ్మా అని అర్ధంట,అవునా బోనగిరి సారూ?❤
మొగసాల బామ్మగారంటే,మొగసాల అనగా కచేరీ,కోర్టు కు ఎక్కినబామ్మగారా? మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కిందని ఒకనానుడి. నేనలా అనలా!🤣
మోసాలబామ్మ గారన్నమాట పాక్షికంగా నిజమేగాని సందర్భం కాదు కదా! అనలేదు.😒
సమోసాలబామ్మగారన్నారా? తిండిపోతుబామ్మ అనలేదు. 👌సమోసా సరిగావేయడం వచ్చిఉండి వ్యాపారం చేసుకుంటే,మంచి పట్టణ సెంటర్ చూసుకుని,(సమోసాలో కూరలోఉప్పు సరిగా వేయగలిగితే రుచి బ్రహ్మాండం,ఒకటి తినేవాడు,నాలుగు తింటాడు) ఇంతకంటే మంచి స్టార్టప్ లేదు. అనలేదు. ఈ యాపారమే చెప్పనుగాక చెప్పను.
ఇక మీసాలబామ్మగారన్నాను.మీసాలు తాతలకేనా ఉండేది? బామ్మలకుండకూడదా? ఎవరు చెప్పేరు?ఎక్కడ రాసుంది?🤣 టెస్టోస్టిరాన్ దండిగా ఉన్నవాళ్ళకెవరికేనా మీసాలుండచ్చట,తప్పుకాదన్నారో తమలాటి ప్రొఫెసర్ గారు.
దోసమంచెరింగియు పెంచినారమీ మీసలు అన్నారు చెళ్ళపిళ్ళవారు. మీసాల అన్నది ఇంటి పేరుంది,తెలుసా? నాటికాలంలో వీరులకు మీసాలండేవిట,అందుకు మీసాల పౌరుషనామం ఇంటిపేరుగా స్థిరపడిపోయింది,కొందరికి. అవును నేనన్నది మీసాలబామ్మగారే! 😍
తాతగారికి తెలియని తాజుబ్బులు గలవా తామరసనేత్ర:)
తొలగించండిజిలేబి,
తొలగించండిమరీ పచ్చి తాటాకులు కట్టెయ్యకు.🤣
అసలు మనది ఆ స్కూల్ కాదుకదా!😒
ఎదుటివాళ్ళని మెచ్చుకోవడం మన డి.ఎన్.ఎ లో ఉన్నట్టులేదు.👍
అన్నట్టు మనం తెలుగోళ్ళమనుకుంటాను! 😊