Monday, 22 December 2025
కొడుకుని నమ్ముకునేకంటే...
Sunday, 21 December 2025
డిసెంబర్ 21 (Longest night) -భాస్కరదర్శనం
డిసెంబర్ 21 -భాస్కరదర్శనం
Friday, 19 December 2025
నెలగంట
Wednesday, 17 December 2025
ఏదీ నీతోడు రాదు!
ఎవరూ నీవారు కారు! ఏదీ నీతోడు రాదు!!
Friday, 12 December 2025
శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.
శర్మ కాలక్షేపం కబుర్లు-బుర్రగుంజు.
బుర్రగుంజు.
బుర్రగుంజా! ఏమిటీ ఫైలు పెట్టడం? ఏదితోస్తే అదేనా పెట్టెయ్యడం అని నిలతీసింది బుద్ధి మనసుని. బుర్రగుంజు,కొబ్బరి పువ్వు నీకే తెలుసునా? తెలిసి నువ్వేమిటి చేసావు నిన్న అనిదెప్పింది మనసు. సరే ఆ చెప్పేదేదో సూటిగా చెప్పేడు అని చిన్న సంతకం పారేసి పైలు గిరవాటేసింది బుద్ది. మనసు పైలాపచ్చీసు వయసులో వుంది,బుద్ధికి వయసొచ్చింది అదీ తేడా. బుద్ధికి మనసుకిపై అధికారినని గర్వం.
బుర్రగుంజు తాటిచెట్టునుంచి వచ్చేది. మన వాళ్ళు తాటివనాలు పెంచేవారట. రామ కృష్ణులు తాటివనంలో వుండగా,గొడవ చేస్తున్న గార్ధభాసురుణ్ణి గిరగిరా తిప్పి తాటిచెట్ల కేసి కొట్టి చంపేసేడట బలరాముడు. నిన్ను తిన్నగా బుర్రగుంజుగురించి చెప్పమంటే ఇదంతా ఎందుకు సోది అని బుద్ధి అడ్డుపడితె, మనసు, ఆగవయ్యా! ప్రతిదాంట్లో దూరిపోయి వేలెట్టుకోకు బాగోదు. నువ్విలా చేస్తే నేను పైవాళ్ళకి చెబుతానంది మనసు. నువ్వు పిచ్చిపిచ్చిగా వాగితే నీ మీద డిసిప్లినరీ ఏక్షన్ తీసుకుంటానంది బుద్ధి. చాలు చాల్లేవోయ్! నీ పవర్స్ తెలుసుకుమాట్లాడు అని గింజు కుంది మనసు. నీ పైన ఇద్దరున్నారు. చిత్తం గారు ఇష్టమైతే వెంటనే ఫైలుమీద సంతకం చేసిచ్చేస్తాడు. ఆయన కూడా కాదంటే ఆయన పై అధికారి అహంకారం గారి దగ్గరకెళితే పని మరీ సులభం. నీ గౌరవం దక్కించుకో. నీకో సంగతి చెబుతా! ఒక సారి అహంకారం గారితో గొడవైంది. ఆయన మాట్లాడితే నేను,నేను అని గుండిలకేసి చూపించి కొట్టుకుంటూ, చెబుతూ వుంటాడు కదా. ఏమండి! నేను,నేను అంటున్నారు కదా, మీరెవరని ప్రశ్నవేసాను. గురుడికి బుర్ర తిరిగిపోయింది. అది తెలియకేకదా ఈ బాధంతా. తెలిస్తే సర్వం ఒకటే. అద్వైతం చెబుతున్నావా అంది బుద్ధి. అనుకో అంది మనసు. నువ్వెవరో చాల క్లియరుగా చెప్పిందయ్యా వేదం. “పద్మకోశప్రతీకాశగ్ం హృదయంచాప్యధోముఖం! అధోనిష్ట్యా వితస్త్యాన్తేనాభ్యాముపరితిష్టతి”…….. “నీవార శూకవత్తన్వీ పీతాభా స్వత్యణూపమా!! తస్యా శ్శిఖాయా మధ్యేపరమాత్మా వ్యవస్థితః”. నేను అన్నవాడు ఎలా వుంటాడో కూడా వివరంగా చెప్పిందయ్యా! ఎలావుంటాడట! నివారి ( చాలా సన్నపాటి వరి రకంట.) వరి ధాన్యంగింజ పైన వుండె చిన్న ముల్లులా వుంటాడట. ఎక్కడుంటాడు. గుండెలో మధ్యలో వుంటాడట. ఆయనే పరమాత్మ, అదే నేను అనే నువ్వు. నీకూ పరమాత్మకీ తేడా లేదయ్యా! తెలిసిందా అంది మనసు. బుర్రగుంజు గురించి ఎక్కడనుంచి చెప్పమంటావు అంది మనసు. నీ ఇష్టం వచ్చినట్లు ఏడు అంది బుద్ధి. ముసలిగోల వదిలిందికదా! ఇప్పుడు చెప్పుకుందామంది మనసు. తాటిచెట్టులో మొగ ఆడ చెట్లుంటాయి. పోతుతాడి కల్లు బాగుంటుందిట. బుద్ధి మిర్రిమిర్రి చూస్తోంది ఏమీ అనలేక. ఆడతాడికి కాయలు కాస్తాయి. అవి పండుతాయి. పండి రాలుతాయి. రాలిన పళ్ళ నుంచి రసం తీసుకుని రొట్టి కాల్చుకుంటారు. ఇదీ బాగుంటుంది. తాటి కల్లు నుంచి బెల్లం వండుతారు. ఇది మందుగా ఉపయోగం. దీన్నే పాత బెల్లం అంటారు, లేదా తాటిబెల్లం అంటారు… రసం తీసేసిన టెంకలు పాతితే భూమిలోతేగలొస్తాయి. ఈ తేగల చివర టెంకలో వుంటుంది బుర్ర గుంజు. అన్ని టెంకలలో బుర్రగుంజు వుండక పోవచ్చు. అందుకే అదృష్టం బుర్ర గుంజు అంటారు. తేగలో మధ్య చందమామ ఉంటుంది. అది తింటే చదువురాదుట, పిల్లలు పుట్టరట, ఏదో చెప్పీవారు. నేను చాలా సార్లు తిన్నాను. ఒకటి మాత్రం నిజం అయింది చదువుమాత్రం రాలేదు నాకు. తేగలు తినడం ఒక కళ. తేగ ముక్కలుగా విరిచి పీచు శుభ్రంగా తీసి, పేరి, పూసలు తేరిననెయ్యిలో ముంచి, కారం అద్దుకుని తింటే నారాజా! అదుర్స్. ప్రస్తుతం పళ్ళు లేవు మరి. తేగ తిన్న తరవాత టెంక బద్దలుకొడితె, లోపలుంటుంది తెల్లగా బుర్ర గుంజు.. ఇది బలే తియ్యగా వుంటుంది. పట్నవాసం వాళ్ళకి తేగలే తెలియకపోతే బుర్ర గుంజేమి తెలుస్తుంది? ఇది ఎక్కువగా తింటే చలవచేస్తుంది. జలుబు చేస్తుంది, . జలుబు చేస్తే దగ్గు వస్తుంది, దానితో జ్వరం వస్తుంది, తలనెప్పి వస్తుంది. ఇవ్వన్నీ నాకు చెప్పి, నువ్వు, నిన్న, ఎందుకు, బుర్రగుంజు తిని, జ్వరం తెచ్చుకున్నావని బుద్ధిని, మనసు నిలతీసింది. పైవాళ్ళిద్దరూ ఆర్డరేశారో మరి, అందుకేతినమన్నాను అంది బుద్ధి. ఐతే అనుభవించు అంది మనసు.
ఎవరు అనుభవిస్తున్నారు నేనా అంది బుద్ధి. నేను నేననేవాడున్నాడుకదా ఆయననుభవిస్తాడు నాకేంఅంది. అహంకారంగారు నాకేం తెలియదు! అనుభవించేది నేనుకాదు, ఐతే మరెవరు? శరీరం. అంటే నువ్వు శరీరం కాదా. కాదు అంది అహంకారం. సరే మీరూ మీరూ తేల్చుకోండని ముడెట్టి తప్పుకుంది మనసు. ఆత్మ వేరు శరీరం వేరు అని తెలిస్తే అద్వైతం తెలిసిపోయినట్లే. తేగలు తినడానికి పళ్ళు లేవంటే బుర్రగుంజు అంట కట్టేడు తేగలమ్ముకునేవాడు. అదీ సంగతి. బుర్రగుంజు బాగుందని తింటే జలుబు చేసి జ్వరం వచ్చిందని చెప్పడానికి ఇంత తిరకాసా? దానికో పోస్టా?దానికి అద్వైతంతో లింకా?.
మనసు సంకల్ప వికల్పాలు చేస్తూ వుంటుంది. మనసు చేసే ప్రతి సంకల్పవికల్పాలను బుద్ధి తనస్వంత, ఇతరుల,చదివిన,విన్న, అన్ని విషయాల ద్వారా పోగుపడిన ఙ్ఞానం నుంచి ఆ విషయం మంచి చెడ్డలు విశ్లేషించి చిత్తానికి తెలుపుతుంది. అప్పుడు దానిపైచర్య ఉంటుంది. అహంకారం కనక అడ్డుపడితే ఈ మూడిటిని రద్దు చేసి తన ఇష్టం అమలు పరుస్తుంది. ఇది నేను అనేదానికి ప్రతీక.
Monday, 8 December 2025
మళ్ళున్నా, మాన్యాలున్నా.....
మళ్ళున్నా, మాన్యాలున్నా.....
"మళ్ళున్నా,మాన్యాలున్నా మంచెమీద మనిషుండాలి,పాడి ఉన్నా,పంటలు ఉన్నా పంచుకునే మనిషుండాలి". ఇది సినీకవిగారి మాట. నిజం. మడులు మాన్యాలు రక్షింపబడవు, మంచెమీద రక్షించే మనిషిలేనపుడు. ఆ మనిషి తనవారై ఉండాలి. లేకపోతే మిగిలేది శూన్యం. అదే మంచె మీద మనిషి కాపలా. చిన్నప్పటి నుంచి చచ్చేదాకా ఎవరో ఒకరు కాపలా కావాలి, అదే మనసు కాపలా. అదే మరో సినీ కవి "చిన్నతనాన తల్లి కాపలా,వయసున వలచినవారు కాపలా, ఏతోడూ నోచని వేళ కన్నీరేరా నీకు కాపలా" అన్నారు. అంచేత కాపలా తప్పనిసరి. లేకపోతే బతుకు ఒంటరిదే. ఒంటరితనాని కంటే భయంకరమైన శిక్ష మరిలేదు. భారతదేశంలో ఘట్టిగా ఏడవను కూడా చేతకాని వర్గం ఒకటుంది. అదే మధ్య తరగతి. ఈ కుటుంబాల ఆర్ధిక స్థితి గోచీకి పెద్ద గోణానికి చిన్న అన్నట్టు ఉంటాయి, వీరిలో భార్యాభర్తలో ఒకరు చెల్లిపోతే మిగిలినవారికి మిగిలేది భయంకరశిక్ష ఒంటరితనం. అందుకే పాడిపంటలు ఎన్నున్నా పంచుకునే మనిషి కావాలన్నారు. ఈ మనిషి మనసుపంచుకున్నవారై ఉండాలి మొదటగా! ఆ తరవాతనే ఇతరులు,బంధువర్గమైన, మిత్ర వర్గమైనా, వీరంతా ఏదో ఒక సమయంలో మనసు బయట ఉండేవారే!. మంచెమీద మనిషి కానివారెవరూ ఆత్మీయులు కాలేరు.
నెల్సన్ మండేలా గుర్తున్నారా? మనం ప్రచార యుగంలో ఉన్నాముగా! ఎలా గుర్తుంటారు. మహానుభావుడు ఈయనను 35 సంవత్సరాలు ఒంటరి కారాగారవాసం చేయించిన బ్రిటన్ ప్రభుత్వం నేడు సుద్దులు చెబుతోంది,ప్రపంచానికి. మండేలా అంత భయంకరమైన శిక్షను కూడా తట్టుకున్న మహానుభావుడు. మరో ఉదాహరణ జరుగుతున్న చరిత్ర మయన్మార్ నేత అంగ్ సాన్ సూకీ ఇప్పటికి ఒంటరి కారాగారంలోనే ఉన్నట్టు.
నేటికి మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు చెల్లిపోయాయి. అన్నీ చిన్నకుటుంబాలే. అసలు కుటుంబం అనే అవగాహనే పోతున్నట్టుంది. ఆలుమగలు అన్న భావన లేదు,ఇప్పుడున్నది స్త్రీ,పురుషులు మాత్రమే! వయసులో ఒకరి అవసరం ఒకరికి ఉన్నది కనక లివ్ ఇన్ గా రోజులు గడిపేస్తున్నారు. ఇక ముసలి ముతకని చూసేవారెవరు. నేటికి పాతకాలంలోంచి కొత్తదానికి మారుతున్న జనాభా ఇంకా తల్లితండ్రుల్ని పునరావాస కేంద్రాలలో,వృద్ధాశ్రమాలలో ఉంచుతున్నారు. వీరికి తోడెవరు? కూడా ఉన్నవారే! కుటుంబంలో అన్నాతమ్ములు,అక్కచెల్లెండ్రు, కోడుకులు కోడళ్ళు ఉన్నా అందరూ పైవారే, అందరిది ఆర్ధికపరమైన కాపలాయే. వీరెవరూ మంచెమీద మనుషులు కారు. మంచెమీద మనుషిది మనసు కాపలా!
Friday, 5 December 2025
Find out the number/Mathematical beautiful magic Flower
Find out/Mathematical beautiful magic Flower
The sum of three consecutive even numbers is 246. Find out numbers,with working and explain.
****
Mathematical beautiful magic Flower
Cliff Pickover on X: "Mathematics. "Magic flower." Each line segment sums to 123. Example: 6 + 37 + 80 = 123. Each numerical entry, from 1 to 81, is depicted only once in the figure. By Miguel Angel Amela, personal communication, used with permission. https://t.co/i4QpySNibr" / X https://share.google/5aKpYfUefNZWL08OH
Courtesy:Author and Owner.
Contribution by Syamaliyam.
Wednesday, 3 December 2025
అరటాకివ్వకపోతే ఆపద తప్పదా?
అరటాకివ్వకపోతే ఆపద తప్పదా?
ఉదయమే 4 కి లేచి పెరటిలోనే నడిచే అలవాటు,నిద్ర పట్టదుగా😂. ఆ తరవాత అక్కడే తూర్పు వరండాలో కూచుని ప్రాణాయమం,యోగా చేయడం అలవాటు 😂 .😂 ఆరోజు దశమి, ఉదయమే నడక తరవాత వరండాలో కూచుని ప్రాణాయామం చేస్తున్నా! ప్రాణాయామ సమయంలో కళ్ళు మూసుకోడం మరో అలవాటు.
ఎప్పుడు దూరేడో కాని కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా కత్తి పుచ్చుకుని ఒక చిన్న కుర్రోడు ఐదు ఆరేళ్ళవాడు నిలబడి ఉన్నాడు. నీకు నేను చేసిన అపకారమేంటి నాయనా, ఉదయమే కత్తి పుచ్చుకొచ్చేవు. ఐనా నీకు అన్యాయం చేయడానికి గాని మరెందుకూ ఓపిక లేక ఉన్నవాడిని. ఎందుకు పొద్దుటే నన్ను పొడవడానికి కత్తి పట్టుకొచ్చావు? అనుకున్నాగాని మాట గొంతు దాటి బయటకు రాలేదు. పక్కనే ఉన్న కర్ర పుచ్చుకుని ఒక్కటేయచ్చు కాని వాడి చలాకీ చూస్తే నా ప్రయత్నం ఏం సఫలం కానట్టే ఉంది. ఎర్రతేలులా, కోల మొహం, రెండడుగుల ఎత్తు,మోకాళ్ళు దిగిన చొక్కా,దానికింద అది పఠాన్ డ్రస్సు అనిపించింది. మనదేశం లోకి బుల్లి ఉగ్రవాదులు కూడా కత్తులు పుచ్చుకు తిరుగుతున్నారా అని సందేహమూ వచ్చింది.
ఏంకావాలి? ఎందుకొచ్చేవు? ఎవరు నువ్వు? ఏమిటని? కొన్ని ప్రశ్నలు సంధించేననుకున్నా! వాడు అలాగే కత్తి పుచ్చుకు నిలబడే ఉన్నాడు, పెదవి విప్పి మాటలేదు. వాడు మాటాడితే నాకు వినపడలేదో! ఈ సారి కొంచం గట్టిగానే అడిగా. ఇంతలో కోడలమ్మాయి బయటికొచ్చి, అరటాకు కోసం కత్తి పట్టుకొచ్చాడు,ఇక్కడ రెండవ అపార్టు మెంట్లో ఉంటారు, అని చెప్పింది. దాంటో కొంత సద్దుకున్నా! వాడు మాత్రం ఆకు ఇస్తావా! చస్తావా! అన్నట్టె నిలబడ్డాడు. తలెత్తి చూస్తిని కదా ఆకులన్నీ మొన్న తుఫానుగాలికి చిరిగిపోయి ఉన్నాయి, ఉన్నవి రెండే చెట్లు,మిగిలినవి పీకి పారేయించా. ఏం చేయాలో తోచక అరటి చెట్ల చుట్టూ తిరిగి చేతికి అందనంత ఎత్తులో సగం చిరిగిన ఆకును గుర్తించి,వణుకుతున్న చేతులతో వాడి కత్తి పుచ్చుకుని, అందని ఆకును కర్రతో కష్టపడి వంచి, ముక్కు కూడా తెగని ఆ బండ కత్తితో ఆకు కోసి వాడి చేతిలో పెట్టి,బతుకు జీవుడా అనుకున్నా! అబ్బే వాడు కదిలితేనా? చెయ్యి చాపేడు అప్పుడు గుర్తొచ్చింది, వాడి చేతిలో కత్తి నాచేతులో ఉందని,ఆ కత్తి వాడికిచ్చి,ఇంతకంటే చిరగని ఆకులు లేవని చెప్పి చూపించి పంపేటప్పటికి బ్రహ్మ ప్రళయమయ్యింది.

