నీలాపనింద.
అందరికి వినాయక చవితి శుభకామనలు
నింద,అపనింద,నీలాపనింద.
ఈ నీలాపనింద నాటికాలంలో శ్రీకృష్ణునికే తప్పలేదు, సత్రాజితుని చంపి శ్యమంతకమణిని దొంగిలించేడని. నేడు భారత్ రష్యానుంచి ఆయిల్ కొంటూ యూక్రైన్ యుద్ధానికి ప్రోది చేస్తోందని అమెరికా ఆపాదించడం,దానికోసం తమ దేశానికి భారత్ నుంచి దిగుమతి అయ్యే సరుకులపై సుంకాలు పెంచుకున్నారు. సుంకాలు ఎవరిమీద వేస్తున్నారు? మీ ప్రజలమీదే! ఆ సుంకం ఎవరికి చేరుతుంది? మీకే! ఇదెలా ఉందంటే అత్తమీద కోపమొచ్చి కూతురు ముడ్డి కుంపట్లో పెట్టుకున్న కోడలు తరహాలో ఉంది. దీని వల్ల ఏమవుతుంది,భారత్ నుంచి దిగుమతి అయిన వస్తువుల రేట్లు పెరుగుతాయి, మీవాళ్ళే కొనడం మానేస్తారు,రేట్లు పెరిగినందుకు ఇబ్బంది పడతారు. మాకూ కొంత నష్టం, కొత్త వినియోగదారులు దొరికే దాకా ఎగుమతులు తగ్గుతాయి. మరో మాట, మనం ఎదుటివాళ్ళను కోపంలో కొడితే అవతలవాడికి ఎంత దెబ్బ తగిలిందో అంత దెబ్బ మన చేతికీ తగులుతుంది.
కోపమున బుద్ధి కొంచమై యుండును. కొనుక్కునేవాడు రూపాయ తక్కువధర ఉన్నచోట కొనుక్కుంటాడు,అమ్ముకునేవాడు రూపాయి ఎక్కువ వచ్చేచోట అమ్ముకుంటాడు, ఇది సార్వజనీన సత్యం.
పెద్దవాళ్ళం అనిపించుకోవాలంటే కోపం తగ్గించుకోవాలి. ఎవరి మీదనో నీలాపనిందవేసి,వారిని ఇబ్బంది పెడుతున్నామనుకుని ఇబ్బంది పడటం తెలివైనవారి పనికాదు.
శోధిని శ్రీనివాస్ గారు,
ReplyDeleteవినాయకచవితి శుభకామనలు.
ఈ రోజు, నా బ్లాగ్ కష్టేఫలి లో పబ్లిష్ చేసిన నా టపా శోధినిలో పబ్లిష్ కావటం లేదు. గమనించగలరు.
నమస్కారం.
ఈ కామెంట్ పబ్లిష్ అయింది,టపా పబ్లిష్ కాలేదు.
Deleteఇది నీలాపనింద మాత్రం కాదు సుమా! 🤣🙏
టపాల పైన టాక్సు వేసేసారేమో కట్టలేక శ్రీనివాస్ గారు డ్రాప్ చేసేసుంటారు :)
Deletesarma27 August 2025 at 09:52
Deleteశ్రీనివాస్ జీ
ధన్యవాదాలు.
ఉదయం 9.15 నుంచి 10.35 లోపు తప్పు చేసేనేమోనని నాలుగుసార్లయినా అన్ పబ్లిష్ చేసి మళ్ళీ పబ్లిష్ చేసా! ఉహు! పని కాలేదు. ఇంకిది పనికాదని ఒక కామెంట్ వేసా ఆ టపా కిందనే. ఇది వెళుతుందా శోధినిలోకి చూసా! వచ్చింది. అప్పుడు రెండో కామెంట్ వేసా! ఆ తరవాత 10.30 దాటేకా అన్ పబ్లిష్ చేసి మళ్ళీ పబ్లిష్ చేసి ఊరుకున్నా! మనకింతే ప్రాప్తం అనుకుని🤣 🙏
Zilebi27 August 2025 at 11:44
Deleteఅదేం కాదుగాని, కొన్ని కొన్ని సంఘటనలు జరగబోయే ముందు సూచనలుంటాయి,వాటిని మనం లెక్కచేయం. ఇదీ అటువంటిదేనని నా మాట. ఇక చాలు అనేదానికి ఇది తొలి సూచన కావచ్చు 🤣🙏
శర్మా జీ... ఎందుకు అలా జరిగిందో తెలీదు.. ఇప్పుడైతే టపా కనపడుతోంది... అవునా
Delete@Zilebi మీ వరూధిని ఏమైంది... కామెంట్లు తప్ప పోస్టులు పెట్టే ఆలోచన లేదా?
Deletesrinivasrjy27 August 2025 at 21:36
Deleteఎప్పుడు చూసానో గుర్తులేదు,టపా శోధినిలో. చూసాకా ధన్యవాదాలు కామెంట్ వేసాను.
sarma27 August 2025 at 18:35
చర్య తీసుకున్నందుకు ధన్యవాదాలు. తెనుగులో శోధిని మాత్రమే మిగిలి ఉన్న ఆగ్రిగేటరు.
srinivasrjy27 August 2025 at 21:44
Deleteవరూధిని చక్కహా ఉందండి. వరూధినిని నడపాల్సిన జిలేబి బుర్రలో గుంజు ఎండిపోయి చాలా కాలమయింది లెండి. ఇంక టపాలు రాయలేదు అభిమానం,పౌరుషమన్నవి లేవు లెండి. 🤣
దీని వల్ల తేలిన దే మనగా
Deleteఅభి మానము + పౌరుషమ్ము గట్రా ఎగస్ట్రాస్ అనులోమ పాతములో గుంజు కు నిండుగా వుండును :(
Zilebi29 August 2025 at 04:39
Deleteతెనుగులో దానిని అనుపాతం అంటారు, అనులోమానుపాతం,విలోమానుపాతం.
ఇన్వర్స్ స్క్వేర్ లా తెలుసుగా అదీ విలోమానుపాతం. నువ్వు చెప్పింది ఎప్పుడూ విలోమానుపాతంలో లోనే ఉంటుంది. 🤣
పాపం జిలేబి కి ఎప్పుడూ నీలాపనిందలే!
Deletebonagiri30 August 2025 at 08:47
Deleteఏంటి సార్ అలా అనేసేరు. జిలేబికి నీలాపనిందలా? బలేటోరే! నిత్యము వినాయక వ్రతం చేసుకుని అక్షింతలు తలపై వేసుకుని నీలాపనిందలు మనమీద జల్లదూ! అది సార్ సం గతి.
అమెరికా వాళ్ళు తింగరి వాడిని ఎన్నుకున్నందుకు మొత్తం ప్రపంచానికి ట్రంపుడు కష్టాలు మొదలయ్యాయి.
ReplyDeleteBonagiri27 August 2025 at 21:58
Deleteప్రపంచానికి ట్రంపుడు కష్టాలు తప్పవు, ఇవన్నీ డీప్ స్టేట్ కష్టాలు. పాపం అమెరికా ప్రజలకి కొత్త కష్టం. అమెరికాలో పెద్దపెద్ద సిటీలన్నిటిలోనూ సైన్యం తుపాకులు పుచ్చుకుని కాపలా కాస్తోంది,ప్రజలు ఇదేంటి? సైన్యం పహరా ఎందుకు? అని అడుగుతున్నారు. మనలాటి ప్రజాస్వామ్య దేశమే కదండీ వారి దేశంలో జరుతున్న వింతలు విశేషాలు మనమూ చూస్తున్నాం. మనం వారిలా అడగలేదు,అడగం కూడా.