Tuesday, 19 August 2025

ఎర్ర డబ్బా


 ఎర్రడబ్బ మళ్ళీ నెల 1 నుంచి కనుమరుగవుతోందని వాట్స్ అప్ మిత్రులంతా బాధపడుతున్నారు. ఉపయోగంలో లేనిది ఏదైనా నశిస్తుందని అందరికీ తెలిసిందే. మనమే పేపర్ లెస్,పేపర్ లెస్ అని వాడడం మానేశాం,ఎర్రడబ్బ చరిత్రలో కలిసిపోతుంది.

వార్తలు తరచయ్యాయి మనసులు దూరమయ్యాయి,మనుషులు దూరమైపోయారు.మన చరిత్ర మనం రాసుకోం,అదే మనలవాటు.ఎర్రడబ్బ తో అనుబంధం తల్లి పేగులాటిది.అది తెగింది,మిగిలింది చరిత్ర.

4 comments:

  1. ఇంకా అమెరికాలో కనుమరుగవలేదు ఎందుకో ! దానివల్ల ఇంకా ఏదో ఉపయోగం ఉందల్లే ఉంది !

    ReplyDelete
    Replies
    1. Rao S Lakkaraju19 August 2025 at 18:37
      భారతీయులు మార్పును ఆహ్వానిస్తారు,తొందరగా తమలో కలిపేసుకుంటారు,చరిత్ర మరచిపోతారు. అవశేషాలను మిగుల్చుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ. స్ట్రౌజెర్ అనే ఏలక్ట్రో మెకానికల్ ఎక్ష్చేంజిలు అన్నిటిని భారత్ లో డిజిటల్ చేసేసేరు. ఎక్కడా స్ట్రోవ్జర్ ఎక్స్చేంజిలను అన్నిటిని బ్రిటన్ కూడా డిజిటల్ చేసుకుంది,కాని బకింగ్ హాం పేలస్ లో ఉన్న పదివేల లైన్ల స్ట్రౌజర్ ఎక్స్చేంజిని మార్చలేదు, నాకు తెలిసిన కాలంలో.చిత్రం బ్రిటన్ రాజుగారి ఫోన్ కూడా ఇందులో ఉంది. మరి భారత్ లో ఎక్కడా ఇప్పుడు చూదామంటే పనిచేస్తున్న ఆ ఎక్స్చేంజ్ లేదు.
      ఇలా చాలాచాలా మార్పులు నేను పని చేసినవి ఇన్స్టాల్ చేసినవి నా చేత్తో నేనే మూసేసేను, అంత మార్పు చాలా తొందరగా వచ్చేసింది.

      Delete
  2. ఆ ట్రింగు ట్రిగు అని‌ డయలు త్రిప్పడాలు పోయేయి
    ( ఆ బీయెస్సెన్లో మీ రంతా యెంత బడాయి పోయేరో ఓ మారు గుర్తు చేసుకోండి :)) మో బయళ్లు వచ్చేక అలాగే ఇప్పుడు ఎర్ర డబ్బా ఆ పై మో బయిళ్లు కూడా హుష్ కాకీ అయిపోతాయేమో :)

    ReplyDelete
    Replies
    1. Zilebi20 August 2025 at 08:55
      తిప్పడాలు కి ముందు నంబర్ ప్లీస్ ఉండేది,నువ్వెరిగుండవు,అప్పటికి నీకు ఫోన్ పట్టుకునే అర్హత లేదు🤣. ఇది పోయి తిప్పుకునేదొచ్చింది. ఎలా ఒక చిన్న కత,జరిగిందేలే! నీలాటి వాడే ఒక స్టాక్ బ్రోకర్ న్యూయార్క్ లో, లేడి ఆపరేటర్లని తిట్టేవాడు,నోటికొచ్చిన బూతులతో. అతణ్ణి ఎవరూ ఏమీ చెయ్యలేకపోయారు,బూతులు మితిమీరిపోయాయి,సహించలేకపోయారు. ఆపరేటర్లంతా కలిసి ఒక్కమాటగా ఇతనికి సమయానికి లైన్లు కలనివ్వకుండా చేసేరు,దాంతో కుదేలైపోయి,దివాలా తీసేడు, అతని పేరు స్ట్రోవ్ జర్. ఆపరేటర్లు మీద ప్రతీకారం కోసం ఎలక్ట్రో మేగ్నటిక్ సెలక్టర్ కనిపెట్టేడు. అతని పేరుమీదనే ఆ ఆ సిస్టం ని పిలిచేవారు. అదే రింగ్,రింగ్ తిప్పుకునేది. దాని తరవాతొచ్చినదే డిజిటల్,ఆపైది సెల్ ఫోన్. దీని తరవాత ఏమొస్తుందో చెప్పలేను.
      బి.ఎస్.ఎన్.ఎల్ లో బడాయిపోడానికేం లేదు,అదంతా డాట్ అనాటి మాట. వైభవం వెళ్ళబోసింది అప్పుడూ.

      Delete