Monday, 21 July 2025

జిలేబి-సమోసా

Courtesy:Whats app

 ఈ రోజు జాతీయ జంక్ ఫుడ్ దినోత్సవం ట.
*****

జిలేబి-సమోసా

జిలేబి-సమోసా గురించి ఏ ప్రభుత్వానికి కోపమొచ్చిందో. మనకా రెండు తెనుగు ప్రభుత్వాలున్నాయి, ఒకటి జాతీయ ప్రభుత్వం. ఈ హెచ్చరిక ఎవరిదబ్బా!
 ఈ హెచ్చరిక ఎవరు చేసినా తిట్టచ్చు,మనకి ( మంకీ అనచ్చునంట)  వాక్కు,స్వాతంత్ర్యం ఉన్నాయి గనక. పొరబాటుగా కూడా ట్రంప్ గురించిగాని, అమెరికా ప్రభుత్వం గురించిగాని మాటాడేరా!  మీ వీసా కట్టు,వీసా ఇస్తే కూడా గుడ్ బిహేవియర్ టాక్స్ కట్టాలట అదెంత? 250 డాలర్లు,మీరు అమెరికాలో అడుగెట్ట లేరు. అమెరికాలో అడుగెట్టక తప్పదుగదా మీకు, నోరు కుట్టేసుకోండి. మోడీ ని తిడితే కావలసినంత పబ్లిసిటీ,యోగీని తిట్టినా అంతే. ఇక మా రాహుల్ బాబాని తిట్టుకుంటారా! మీదే కర్మ. మరి తెనుగు రాజుల్ని తిట్టుకుంటారా? మీ చిత్తం అభిమానులు కర్రుచ్చుకుంటే నా బాధ్యత లేదు. ఔరా జిలేబీ! ఎంతకి తగుదువు, ఎక్కడ జూసినా తగువులే .🤣 

12 comments:

  1. అంతా మన మంచికే తాతగారూ

    నోరూరిందా తినొద్దని అంటే ?

    ReplyDelete
    Replies
    1. Zilebi29 July 2025 at 07:47
      నిజమే! అంతయూ మన మేలునకే!!!!
      తీపి తినడం మానేసి,నోరురడం మానేసి నలభై ఏళ్ళయింది.🤣

      Delete
  2. జిలేబి తెలుసు, సమోసా ఎవరు?

    ReplyDelete
  3. Bonagiri29 July 2025 at 12:52
    పద్నాలుగేళ్ళ బ్లాగ్ అనుభవం తరవాత నేటికి 'జిలేబి తెలుసు' అన్నవారిని మిమ్మల్ని చూసాను,జిలేబి ఎవరో చెప్పి పుణ్యం కట్టుకోండి సార్!😁🙏👌
    ఇక సమోసా ఎవరో నాకూ తెలీదు, మిమ్మల్ని నిరాశ పరచను,నేను అనేసుకోండి! సరిపోలా!!!🤣

    ReplyDelete
  4. “జిలేబి” తెలుసంటున్న బోనగిరి గారు వివరాలు వెల్లడించాల్సిందే తప్పదు. Blog lokam wants to know.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు9 August 2025 at 09:56
      నిజమే సార్!
      జిలేబి ఇంటర్నేషనల్ గూండా కదా, లోకల్ గా ఏ ఆకు రౌడీయో దొరికుంటాడు. వాడు బోనగిరి గారిని,జిలేబి గురించి చెబితే కొంప కూల్చేస్తా,ఉద్యోగం పీకించేస్తా,పిల్లల్ని కిడ్ నేప్ చేస్తా అని ఏమో ఏమో పేలి ఉంటాడు. బోనగిరిగారు భయపడరుగాని, ఈ ఆకు రౌడీతో చికాకు ఎందుకని అనుకుని చెప్పడం మానేసి,మౌనంగా ఉండి ఉంటారండి.


      బోనగిరి గారు మీ గురించి అర్ధం చేసుకున్నాం. మీ వెనక మేమున్నాం, ఆకు రౌడీ గాని,జిలేబిగాని మిమ్మల్ని ఏం చెయ్యలేరు. మీరూ కనపడక పోతే ఎలా సార్!

      Delete
    2. కథ చాలా బాగుంది.

      నివురు గప్పిన నిప్పులా వ్యాపిస్తున్న జిలేబి గురించి తాతగారు చాలా చక్కగా వివరించారు.

      కథ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగి పోయేలా కట్టి పడేశారు..


      తా, బో, వి,శ్యా‌ వార్లకు అభినందనలు.

      Delete
    3. Zilebi14 August 2025 at 04:48
      ఎక్కడి కామెంటు కొట్టుకొచ్చేసేవు? పంచపాండవులంటే తెలీదా మంచం కోళ్ళలా నలుగురే అని చెప్పి మూడు వేళ్ళు చూపించాట్ట. అలావుంది నీ అభినందనల పర్వం. ఓపిక చాలింది.కథ రాయలేక కాలక్షేపం చేస్తున్నా!

      Delete
  5. జిలేబి తెలుసు అంటే బ్లాగు ముఖంగా తెలుసు అని మాత్రమే అర్థం. అంతకు మించి ఏమీ లేదు.
    అయినా జిలేబి గురించి శర్మ గారికి తెలియని విషయాలు నాకు ఎలా తెలుస్తాయి? గతంలో వాళ్ళు ఇద్దరు కొలీగ్స్ అని కూడా రూమర్.

    ReplyDelete
    Replies
    1. Bonagiri13 August 2025 at 19:50
      బోనగిరి గారు,
      అమ్మయ్య, మీరు బ్లాగులో కనపడ్డారు. అదే పదివేలు. నాకెంత తెలుసో జిలేబి గురించి మీకూ అంతే తెలుస్నన్న మాట. జిలేబి పురమాయించే ఆకు రౌడీలని లెక్కచేయకండి, మీరు లెక్కచేయలేదనే తెలుస్తోంది. మనందరి మధ్య తగవులు పెట్టే జిలేబిది అమెరికా బుద్ధి, ఖడిద్దాం 🙏👌

      Delete
    2. భో! నగరి గారు~

      గతంలో వాళ్ళు ఇద్దరు కొలీగ్స్ అని ....

      ఈ రహస్యం మీకెలా తెలుసండీ ?


      Delete
    3. ఏమిటో! నాకు అన్నీ అలా తెలిసిపోతాయి, అంతే!

      Delete