ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది.. అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. ' చదువు సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!' అన్న ఒక్క ఆలోచన ఆమెలో ఆశాదీపం వెలిగించింది. అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది. మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు,ఏభై,కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది. కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరి కొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత నిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్ లు నెలకొల్పగలిగింది. ప్రస్తుతం " Sandeepa Chain Of Restaurants " అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల రు.50 లక్షలు. 1982లో కేవలం 50పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు రు.50లక్షలకు చేర్చిన ఆమె విషాదగాథకు ప్రత్యక్ష సాక్షి 'చెన్నై మెరీనాబీచ్'. 2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు '' పెట్రి శ్రియ నారాయణ్ ''. తినడానికి తిండిలేని నిర్భాగ్యస్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమయిపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేలమందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితగాథలే కదా మనకు స్ఫూర్తి!. శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం. అలాగే మనసు నీరస..
courtsy:whatsapp.
ఇది పెద్దలు,పిన్నలూ కూడా చదవ వలసిన గాథ, ఇటువంటివాటినుంచి స్ఫూర్తి పొందాలి. కుశంకలు లేవదీసేవారూ ఉంటారు. దీని నుంచి నేర్చుకోవలసినదేమి?
1) కష్టాలు చుట్టు ముట్టినపుడు చావు పరిష్కారం కాదు. కష్టాలతో పోరాడి గెలవాలి. దీనికి మగ,ఆడ తేడాలేదు. ఆడవారికి ఆడతనం అదనపు శత్రువు కావచ్చు.
2) విజయానికందరూ చుట్టాలే!
3) కష్టంలో ఆదుకునేవారు అరుదు. స్వయం కృషినే నమ్ముకోవాలి. చదివిన చదువును సార్ధకం చేసుకోవాలి.
4) ఒక్కరోజులోనే ఎవరూ కోటీశ్వరులు కారు,కాలేరు. పెరుగుదల క్రమంగానే ఉంటుంది.
5) చేసేపనిలో నిబద్ధత,నిజాయితీ ముఖ్యం.
6) విజయానికి పొంగిపోకూడదు, కష్టానికి కుంగిపోకూడదు.
7) శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం అలాగే మనసు నీరస పడితే విజయగాథలే తరచి చూడాలి.
8) ఈమె కష్టాలు పడి ఉండదా? శంక. ఇలా ఎదగడానికి ఆమె పడిన కష్టాలు ఊహించుకోడమే కష్టం, అందునా స్త్రీగా.
తీరిగ్గా తరచి ఆలోచిస్తే నేర్చుకోవలసినవి మరెన్నో!
కథను బాగా మలచినారు సోషల్ మీడియా వాండ్రు :)
ReplyDeletehttps://yourstory.com/2016/08/patricia-narayan
Zilebi27 November 2024 at 16:30
Deleteనీపేపరు పచ్చపూస! నీకివి నచ్చవులే!! నీది పుచ్చిపోయిన బుర్ర!!!
మొక్కవోని ధైర్యం 👏.
ReplyDeleteఅవును, అటువంటి వారి జీవితాల నుంచి నేర్చుకోవలసినది చాలా ఉంది 👌.
విన్నకోట నరసింహా రావు27 November 2024 at 18:19
Deleteమొక్కవోని ధైర్యం ఒక్కటి చాలండి.
కట్.పేస్టు ప్రొఫెసర్ నుంచి నేర్చుకోవలసిందేం లేదాండి?😁
// “ కథను బాగా మలచినారు సోషల్ మీడియా వాండ్రు :) “ //
ReplyDeleteఅంటే మీ భావమేమిటి, “జిలేబి” గారూ? మీరేం చెప్పదలుచుకున్నారు ?
విన్నకోట నరసింహా రావు27 November 2024 at 18:21
Deleteజిలేబినడిగారా? అందుకే కనపడకుండా పోయింది రెండు రోజుల్నుంచి. లేదా ఆసుపత్రిలో పారేసేరో!
తాతగారి ఆశ యెపుడు తీరేనో :)
Delete
DeleteZilebi2 December 2024 at 10:27
నేను కనపడలేదనుకో! ఉన్నానో పోయేనో చెప్పేందుకు మనుషులున్నారు. నువ్వు కనపడలేదనుకో! రెండు రోజులపైగా ఉన్నావో! పోయేవో! ఆసుపత్రిపాలయిపోయేవో! లేదా అసుపత్రిలో పారేసేరో ఎలా తెలుస్తుంది? నువ్వెవరో ఎవరికి తెలీదు,నీ వెనకున్నవాళ్ళూ తెలీదు. నువ్వు కనపడితే ఉన్నట్టు లేకపోతే కర్చురాసినట్టే!
నాకోరికేం లేదు. ఆశా లేదు,నువ్వు పోవాలని. కొరివిదయ్యం లా నువ్వు పదికాలాలపాటు చల్లగా ఉండాలనే నా కోరిక,ఆశ. పోయేవని తెలిస్తే ఒకసారి ఏడుస్తా! అంతే!
:)
Deleteనరస రాయలకు తెలియని వారు లేరు
DeleteZilebi2 December 2024 at 11:03
నరసరాయలు గారికి తెలిస్తే నాకు తెలిసినట్టే! నీలా దాపరికాలేం లేవు వారి దగ్గర.
ఏమో ! ఏ ..
Deleteలో పాముందో ? ఎవరికెరుకా ?
Zilebi2 December 2024 at 11:41
Deleteఏ పుట్టలోనూ ఏ పామూ లేదు. నీ పుట్టలోనే అన్ని పాములూ ఉన్నాయి,చూసుకో!
“జిలేబి” గారు (2 Dec 2024 at 11:03)
Delete// “ నరస రాయలకు తెలియని వారు లేరు” //
———————
మీ ముసుగు పోరాటాల్లో నన్ను involve చెయ్యకండి.
*Disclaimer* :: మీరెవరో నాకు తెలియదు. తెలియదంతే.
Deleteవిన్నకోట నరసింహా రావు3 December 2024 at 09:36
అయ్యో!జిలేబి సంగతి తెలియనిదా? కొరివి దయ్యం,అన్నీ ఇటువంటి బుద్ధులేగదా!
అలాగే ఉంది చూస్తుంటే.
Deleteతాతగారిది ముసుగు పోరాటమంటున్నారా వినరా వారూ ?
Deleteనేనన్నది మిమ్మల్నుద్దేశించి, మీ ముసుగుల గురించీనూ, “జిలేబి” గారూ.
Deleteమధ్యలోకి శర్మ గారిని లాగుతారెందుకు ?
మీకు వక్రభాష్యకారుడు / వక్రభాష్యకారి అనే బిరుదు సరిగ్గా సరిపోతుంది.
విన్నకోట నరసింహా రావు3 December 2024 at 17:49
Deleteగప్పున వెలిగి గుప్పున ఆరిపోయే కొరివి దయ్యం గురించి ఎందుకు సార్! చింత?
This comment has been removed by the author.
ReplyDeleteఅతనికి ' మెంటలా ' విబుధ ! అందరి మాటలు ' పట్టి ' పద్యముల్
ReplyDeleteసతమతమౌచు పేర్చెడిని , చక్కని భాషయు రాదు , అర్థ మౌ
గతమయి చావ , దంతట వికారము లుండు , వివేక శూన్యతా
వ్రతమును బూనినాడ ? వినరాద ? తమంతటివారు జెప్పినన్ .
వెంకట రాజారావు . లక్కాకుల2 December 2024 at 15:47
Deleteఅనుమానమేం లేదుసార్! అన్నీ నిక్కచి నిజాలు.