Thursday, 21 November 2024

మధుమేహం ( షుగర్ )

 

నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న కధనం...,, 



మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యాధి అదుపు చేయవచ్చు. కానీ నేటి శాస్త్ర విజ్ఞానం ప్రకారం పూర్తిగా లేకుండా చేయటం అసాధ్యం.            

ఆహార క్రమశిక్షణ, నియంత్రణ ద్వారా అదుపులోకి వస్తుంది.

     ఈ వ్యాధి శరీరంలో అనేక అవయవాలపై హాని కలిగిస్తుంది. మన శరీరంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో లేనప్పుడు ఎక్కువ హాని కలుగుతుంది. షుగర్‌ వ్యాధి అనేది జన్యుపరంగా లేదా హార్మోన్ల లోపం కారణంగా రక్తంలో షుగర్‌ స్థాయిని పెంచుతుంది. దానివల్ల మధుమేహం వస్తుంది.


షుగర్‌ వ్యాధి శరీరంలో అదుపులేనప్పుడు గుండె, మూత్రపిండాలు, కాలేయం, నరాలు, కళ్లు, పక్షవాతం, పాదాలకు సంబంధించిన వ్యాధు లకు ఎక్కువగా గురవుతారు. నేటి జీవనశైలి మార్పుల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ పాదాలకు ఎక్కువ హాని కలుగుతుంది. ముఖ్యంగా కాళ్లు మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారటం, స్పర్శ తగ్గటం ఇలాంటి సమస్యలతో ఎక్కువగాబాధపడుతుంటారు. 


అలాగే తీవ్రంగా చెమటలు పట్టడం, చర్మం నల్లబడటం, అరికాళ్లు పగుళ్లు రావటం, చర్మం బాగా పొడిబారటం ఇవన్నీ ఒక రకమైన నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు. ఇవి శరీరంలో షుగర్‌ లెవల్స్‌ విపరీతంగా పెరగడం వల్ల వచ్చే అవకాశాలున్నాయి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవాటిని డయాబెటిక్‌ న్యూరోపతి అంటారు.


న్యూరోపతి అనేది నాడీ కేంద్రానికి సంబంధించి వచ్చే అనర్థాలు. ముఖ్యంగా నరాలు డామేజ్‌ అవ్వటం, ఎలాంటి లక్షణాలు కలగకుండా వచ్చే పుళ్లు, రక్తనాళాలలో రక్త ప్రసరణ తగ్గటం, రక్త నాళాలు సన్నబడటం, అతి తక్కువ వ్యవధిలో కాళ్లకు చెడు వాపు రావటం వంటివి ఎక్కువగా వస్తాయి.

డయాబెటిక్‌ న్యూరోపతి అనేది షుగర్‌ పేషంట్లకు 28-32 శాతం ఉంటుంది. 


ఐదు సంవత్సరాలు పైబడి షుగర్‌ వ్యాధి ఉన్న వారిలో ఈ లక్షణాలు కనబడుతుంటాయి. వీరిలో సహజంగా కాళ్లకు స్పర్శ లేకపోవటం, చిన్న చిన్న పుండ్లు రావటం, అవి వచ్చినట్టు తెలియకపోవటం లేదా త్వరగా తగ్గకపోవటం, అరికాళ్ల పగుళ్లలో మలినం చేరి, ఇన్‌ఫెక్షన్‌ రావడానికి అవకాశం ఉంటుంది.

రకాలు 

1. పెరిఫిరల్‌ న్యూరోపతి 

2. అటోనమిక్‌ న్యూరోపతి 

3. ప్రాక్సిమల్‌ న్యూరోపతి


నివారణ :క్రమం తప్పకుండా ప్రతి నెలా షుగర్‌ లెవల్స్‌ పరగడపున పరీక్ష చేయించుకుంటే (ఎఫ్‌బిఎస్‌) 110ఎంజి/డిల్‌ లోపు ఉండేలా... 


అల్పాహారం తీపుకున్నాక (టిఫిన్‌) గంటన్నరకు (పిపిబిఎస్‌) 140ఎంజి/డిల్‌ ఉండాలి. 


అలాగే హెచ్‌బిఎ1సి కూడా 5.6-6.5 శాతం ఉండవచ్చు. 


బిపి కూడా 130/80ఎంఎం హెచ్‌జిఎల్‌ లోపు ఉండాలి.


శరీరంలో కొవ్వు (చెడు కొలెస్ట్రాల్‌) టిజిఎల్‌, ఎల్‌డిఎల్‌ అదుపులో ఉంచుకోవాలి.


ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలి. (వాకింగ్‌, జాగింగ్‌, షటిల్‌).

శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. 


బిఎంఐ 21 శాతం లోపు ఉండాలి.


ఎలాంటి మానసిక ఒత్తిడికి కలిగినా, నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి.


క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలి.


ప్రతి మూడు నెలలకు హెచ్‌బి ఎ,సి, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, గుండె ఇసిజి పరీక్షలు చేయించాలి. 


అలాగే కంటికి సంబంధించిన పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాలి. 


పాదాలకు సంబంధించిన పరీక్షలు డిజిటల్‌ బయోథీసోమీటర్‌, వ్యాస్కులర్‌ డాప్లర్‌, పొడియాస్కాన్‌ (అరికాళ్ల స్కాన్‌) పరీక్షలు అవసరం.

డాక్టర్. తాడి రామ గుర్రెడ్డి.. షుగర్ వ్యాధి వైద్య నిపుణులు... అనపర్తి.. తూ,గో,జిల్లా.

courtesy: whats app

================================================

సీనియర్ పేషంట్ గా అనుభవం.

కొత్తగా సుగర్ వచ్చినవాళ్ళు డిప్రెస్ కావద్దు,టెన్షన్ పడద్దు. ఇవి మొదటి శత్రువులు.

అశ్రద్ధ,బద్ధకం ఆ తరవాత శత్రువులు.

సమయపాలన అత్యవసరం అనగా ఒకే సమయానికి తినాలి,ఒకే సమయానికి పడుకోవాలి. ఒకే సమయానికి మందులు వేసుకోవాలి.

నిద్ర లేకుండడం కూడదు. రాత్రి ఒకటి,రెండు దాకా మేలుకుని ఉండకూడదు. ఎనిమిదిగంటల నిద్ర అత్యవసరం.

బిళ్ళేసుకుంటే సరిపోతుందనుకోకూడదు. 

వ్యాయామం అత్యవసరం.

BMI ఇండెక్స్ చూసుకోవాలి. అందులో వయసు,ఎత్తు   మార్చుకోలేం. మార్చుకోగలిగినది ఒక్క బరువే,అదీ వ్యాయామంతోనే.


ఇన్ని తిప్పలెక్కడపడతాం బిళ్ళేసుకుంటామనుకుంటే నమస్కారం. 

మా డాక్టర్ గారికి నమస్కారం మరియు అభినందనలతో.


43 comments:

  1. దీనికన్నా నీచపు రోగం మరొకటుండదు.
    పైగా డాక్టర్లకు, హాస్పిటళ్ళకు, ల్యాబ్ లకు, మందుల కంపెనీలకు ఆజన్మాంత ఖాతాదారుడిని చేసేస్తుంది మనిషిని.

    పిపిబిఎస్ పరీక్ష కోసం అల్పాహారం అన్నారు. దీని మీద ఇతర వాదనలున్నాయి. ఆ పరీక్ష పేరే post-prandial (వాడుకలో post-lunch అనేస్తుంటారు) గనక మాకు తెలిసినావిడ టిఫిన్ గిఫిన్ కాదు, ఏకంగా ఫుల్ భోజనం చేసేసి, ఆ గంటన్నర ఆగి రక్తనమూనా ఇస్తుంది. 🙂. ఇదీ కరక్టేనేమో అనిపిస్తోంది. ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు21 November 2024 at 10:35
      మిగతా రోగాలు వస్తాయి పోతాయి,ఇదలాకాదు,రా యేకాని పో లేదు. పెట్టడం పెద్దలనాటినుంచీలేదు, పుచ్చుకోవడం పూర్వీకులకాలం నుంచీ ఉందనే రకం. నీచాతి నీచం.
      టెస్టులకి,డాక్టర్లు,హాస్పిటల్లు,మందులకంపెనీలకు కట్టు బానిసలా బతికేలా చేస్తుంది. దీనికి తోడు భయం. ఇంకేం చెప్పేది?

      ఒకప్పుడు యూరిన్ టెస్టు చేసే రోజుల్లో భోజనం తరవాత రెండు గంటలకే టెస్టు ఉండేది. అది సాధారణం గా రెండు గంటలకుండేది. ఇలా రోజంతా వేస్ట్ అనుకున్నారో మరేమో! అది ఉదయం టిఫిన్ తరవాత గంటన్నరకి మార్చారు. ఇదంతా అమెరికన్ వారి ఇఛ్ఛప్రకారం, మందుల కంపెనీల కోరిక ప్రకారం నడుస్తుంది అన్నట్టు ఉంటుంది. ఇది సైన్సో కబుర్లు కాదంటారు. అంతే నోరు మూసుకోడమే! మన ఐ.ఎం.ఎ అమెరికాని ఫాలో అవుతుంది.
      టెస్టులు మెథడ్లు రకరకాలు. ఒక చో 90-110 మరొకచో 90-12,140 ఇలా మారుతూ ఉంటుంది. ఒకో లేబ్ ఒకో మెథడ్, ఇవన్నీ డాక్టర్లకే తెలియాలి. ఇందులో మళ్ళీ నన్-డయాబెటిక్,ప్రి-డయాబెటిక్,డయాబెటిక్ రకాలు. అంకెలతో భయం. భోజనం తరవాత రెండు గంటలకి చూడడమే సబబు అనుకుంటా. అంకెలే ప్రాణం తీస్తాయేమో అనిపిస్తుంది.

      Delete
  2. ఏది తినాలో , వద్దో
    సోది వచించే జనాల జోరందు కొనెన్
    ఏదీ తినకున్నా , నిం
    పాదిగ అస లుండనీదు , పాడు డయబిటీస్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల21 November 2024 at 11:49
      ఇది తినకు,అది తినకు, అనేవాడొకడు. అన్నీ తినెయ్యి మరేం బాధలేదు మూడు పూటల్లో సుగర్ పారిపోతుందనేవాడు మరొకడు. వాట్స్ ఆప్ యూనివర్సిటీ ని మించిపోయింది యు ట్యూబ్ యూనివర్సిటీ. ఏది తినచ్చో కూడదో రోగికి తెలిసినంత మరొకరికి తెలియదని నా ఊహ. తినకున్నా తప్పే పూర్తిగా తిన్నా తప్పే అత్తగారికొంగు సామెత. సమానంగా తినాలంతే :)

      Delete
  3. గ్లైసీమిక్ ఇండెక్సులు
    చూసి మరీ తిండి తినే క్షోభలు గల్గెన్
    రైసే వద్దని కొందరు
    దోసెలు ఇడ్డెన్లు రాగితోనే నేస్తమ్ .

    అరుగుదల తగ్గె , మెత్తటి
    వరి యన్నము మాత్ర మరుగు , వద్దన్న యికన్
    తరమా మిల్లెట్లన్ దిన ,
    పరమాత్మా ! నీవె దిక్కు , మధుమేహులకున్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల21 November 2024 at 16:04
      రాగులు తినేవారే భోగులని ఒక సామెతట సార్ మొన్ననే చదివా! నాకూ కొత్తగా అనిపించింది, నిజమే!. చిరుధాన్యాలా? బలేవారే జొన్నన్నం తిని అరిగించుకోగలరా నేడు. చిన్నప్పుడు అదే తినేవారం. తూర్పు తిరిగి దండం బెట్టడమే! స్విగ్గీ,జొమోటో లకి అలవాటు పడి, పాసిపోయిన కూడో,ఎంగిలి కూడో తినడం మొదలైతే ఇది మరింత పెరిగేదేగాని అదుపులోకి రాదు. బిళ్ళేసుకుంటామన్నవారికి బిళ్ళలే గతి.

      Delete
  4. తినటానికేను పుట్టిన
    జనులకు రోగాలు రాక చస్తాయా? అ
    య్య! నియమ బద్ధులు తాత
    య్యననుకరింపంగ చాలయా రావు వెతల్


    ReplyDelete
    Replies
    1. Zilebi21 November 2024 at 17:08
      అందరు పెట్టి పుట్టలేదోయ్! ఉడి తినలేని దౌర్భాగ్యం కొందరిదే! కాలూ చెయ్యీ ఆడించుకోడానికే నియమాలు, లేకపోతే అవీ ఆడవు. నాలుగు రోజుల్నించి ఆసనాలు వెయ్యలేదు. ఇవేళ వెయ్యబోతే కాళ్ళు వంగలేదు,నడ్డి వంగలేదు. నాలుగు రోజులు తిప్పలుబడితే దారినబడుతుంది,వద్దులే,నీకివన్నీ, నువ్వు చక్రాల కుర్చీలో కూచో! రాకేష్ ఝున్ ఝున్ వాలా లాగా! నీ కుర్చీ మరొకరు తోస్తారు,చెయ్యి మరొకరు కదుపుతారు, ఎంత సుఖం,ఎoత సుఖం. అలాగే కంటిన్యూ ఐపో!!!!! దీర్ఘాయుష్మస్తు

      Delete
    2. జరిగితే జ్వరం అంత సుఖం లేదన్నారు 🙂.

      Delete

    3. విన్నకోట నరసింహా రావు22 November 2024 at 11:20
      నిజమేనండి, కాని జిలేబిని ఆ సీన్లో వూహించుకోడానికే భయమేసిందండి, రాకేష్ ఝున్ ఝున్ వాలా ను అలా చక్రాల కుర్చీలో కూచుని తాను కొన్న ఎయిల్ లైన్స్ విమానాల మొదటి ఫ్లట్ ను చూస్తున్న ఫోటో చూసి. వేల కోట్లు సంపాదించాడు. ఆరోగ్యం సంపాదించుకోలేకపోయాడు. అనుభవించలేకపోయాడు.దురదృష్టవంతుడు.అలాగే చనిపోయాడు వేల కోట్ల ఆస్తిని భార్యకు వదిలేసి.

      Delete
  5. మాచన భాస్కర శర్మ
    ChatGPT said:
    ChatGPT
    మాచన భాస్కర శర్మ ఒక ప్రసిద్ధ తెలుగు పండితుడు, కవి మరియు భాషాశాస్త్రవేత్త. ఆయన తత్త్వశాస్త్రం, వేదం, పాండిత్యమైన విషయాల్లో గొప్ప పరిజ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా ప్రఖ్యాతి పొందారు. మాచన భాస్కర శర్మ వారి రచనలు తెలుగు సాహిత్యం, వేదాశాస్త్రం మరియు తత్త్వశాస్త్రం లో విలువైన వ్రాతలను అందించాయి.

    అయన పర్యావరణం, భక్తి, నైతికత మరియు జ్ఞానాన్ని ప్రతిబింబించే అనేక రచనలు వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. Zilebi21 November 2024 at 17:40
      పని లేని క్షురకుడు పిల్లి తలగొరిగాడని నానుడి. ఇంతకంటె సౌమ్యంగా తిట్టలేను. నేను పల్లెటూరివాడిని మాట మోటు, ముచ్చటగా సౌమ్యంగా,మెత్తగా తిట్టలేను. మా పల్లెటూరి మాటలు కుండ బద్దలు కొట్టినట్టుంటాయి. కుండ బద్దలు కొట్టడమేంటి? అడక్కు, అది మరీ మోటుగా ఉంటుంది.

      Delete
  6. Various types of tests help determine the cause and condition of blood sugar.

    The Fasting Plasma Glucose (FPG) Test measures blood sugar after an eight-hour fast; it is usually done in the morning before breakfast and is used to diagnose diabetes and monitor long-term control.
    Random Plasma Glucose Test measures blood sugar at any time of day and doesn't require fasting.
    The Oral Glucose Tolerance Test (OGTT) tests how well your body processes glucose; it involves drinking a glucose solution and testing blood sugar over two-three hours. This is often used to diagnose gestational diabetes.
    Continuous Glucose Monitoring (CGM) uses a small sensor inserted under the skin and provides real-time glucose readings throughout the day and night.
    Self-Monitoring of Blood Glucose (SMBG) employs a personal glucometer and test strip that allows for regular at-home testing and provides immediate feedback about blood sugar levels.
    The HbA1c Test, also known as the Haemoglobin A1c Test, is an important blood test used to diagnose and monitor diabetes.It measures your average blood sugar levels over the past two to three months.

    The test measures the percentage of your haemoglobin proteins that are glycated (coated with sugar).

    HbA1c results are given as a percentage. For example if you are below 5.7%, it is considered normal; 5.7% to 6.4%, you are prediabetic; 6.5% or above, you have diabetes.

    ReplyDelete
    Replies
    1. Bonagiri21 November 2024 at 21:42
      అనుకోడమేగాని తప్పవు సార్! ఈ టెస్టులు,వీటి మీదే నడుస్తుంది. తప్పదు. ఇoకా కొంతమంది డాక్టర్లు సెల్ఫ్ మానిటరింగ్ ఒప్పుకోటం లేదు గాని వేళ్ళు పొడుచుకునేది నేను మాత్రం గత మూడేళ్ళుగా వాడుతున్నాను. డాక్టర్ గారు, నెలకొకసారి కూడా కాదనటంలేదు. పి.పి.బి.ఎస్ టెస్టుకి వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చేస్తున్నా,నెలకో సారి.కూచో లేక.

      Delete
  7. ఈ లింకులోని ఎక్సర్సైజు పనికొస్తుందేమో చూడండి

    https://youtu.be/9qMoQ-a5LME?si=XIrkrFS1hBXJJBGR

    ReplyDelete
    Replies
    1. Zilebi22 November 2024 at 00:58
      ఇటువంటి చిట్కాలు యు ట్యూబ్ యూనివర్సిటీలోనూ, నేను,నువ్వూ చెప్పేచిట్కాలు బోలెడన్ని,ఎన్ని? నా తలమీదున్న వెంట్రుకలన్ని. ఒక్కటి పంజేసినా మొత్తం సుగర్ ఇండస్త్రీయే మూసెయ్యాలి.ఎవడి గోల వాడిదే,ఎవడిచావు వాడిదే.అందరికి వచ్చేది మాత్రం ఒకటే రోగం.

      వినదగునెవ్వరు చెప్పిన
      వినినంతనె వేగపడక వివరింపదగున్
      విని కల్ల నిజముదెలిసిన
      మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతీ

      విను ఉపయోగిస్తే వాడుకో! ఇదేం జెప్పినా,ఎవరు జెప్పినా,ఏం జేసినా పోయేది కాదు. చిరంజీవి. ఇదొచ్చిన మనుషులు తీసుకు,తీసుకుని పోతారంతే!!

      Delete
  8. షుగరూ బీపీ పూర్తిగ
    దిగ నురుకగ వైద్య రీతి దెలియగ లేదా
    అగణిత అన్వేషణ లీ
    జెగ జంత్రీలకు ముగింపు చెప్పగ లేవా .

    ReplyDelete
    Replies

    1. వెంకట రాజారావు . లక్కాకుల22 November 2024 at 14:19
      ఒక చిన్న కత చెబుతాను.ఏమనుకోవద్దు సారూ!
      మొదటి భార్య పెళ్ళి చేసుకున్నాడు,కోరి. కాలం గడుస్తోంది. సంసారపక్షంగా ఒక రోజు మందు,ఒకరోజు విందుతో. రోజులునడిచాయి. రెండో ఆవిడ చేరబడింది, మొదటావిడని సరిగా చూసుకోకపోవడమే కారణమంటారు. నిజమేదో తెలియడు. ఇక సవతులకయ్యం మొదలయింది. ఒకావిడ తగ్గితే రెండో ఆవిడ పెరుగుతుంది. ఇద్దరూ సమానమగా సంసారం గడవనివ్వరు. ఇదింతే. ఇద్దరూ సమవుజ్జీలుగా పోట్లాడుకుంటూనే ఉంటారు. పొరబాటుగా ఇద్దరూ సమానంగా సంసారం గడుస్తోందనుకునే లోగా మరో చెలికత్తె చేరబడిపోతుంది,ఇది అంతులేని కత. ఇంతే. వీటిని జయించిన మానవుడు పుట్టలేదు, జయించాననుకున్నవాడు బతకలేదు.

      ఇవి తగ్గిపోతే ప్రపంచం సుభిక్షంగా ఉంటుందంది. సాధ్యం కాదు. మందులకంపెనీలన్ని అమెరికా గుప్పెట్లో ఉన్నాయి. టెన్షన్ మన చేతిలో ఉంది. దీన్ని అదుపులో ఉంచలేం. ఆతృత తగ్గనిదే! భయం అదనం. ఈ జగజెంత్రీలను మానవాళి జయిస్తే చాలా పరిశ్రమలు మూతపడి చాలా మందికి ఉపాధి నశిస్తుంది. అందుచేత ఇవి చిరాయువుగా,చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉంటాయండి.

      Delete
    2. కాసేపు పరమ పురుషుల
      ఊసుల బతికేస్త మంటె ఉండనియరుగా ,
      రాసీ రాయంగానే
      ఈసుల ద్వేషాల వచ్చి ఇకిలింతురుగా .

      Delete
    3. -

      వత్తురు యికిలింపన్; చి
      ర్రెత్తగ రాజన్న వారు, రివ్వున తాత
      య్యొత్తురు కత్తుల్ నూరుచు
      మొత్తానికి దొరకు పద్యమునకు జిలేబుల్


      నారదా

      Delete

    4. వెంకట రాజారావు . లక్కాకుల22 November 2024 at 17:03
      కొరివి దయ్యం పట్టించుకుంటే భయపెడుతుంది,అలా తిరుగుతూ ఉంటుంది అంతే!

      Delete
    5. Zilebi22 November 2024 at 18:58
      చూస్తుండగా నీకు పిచ్చి పడుతున్నట్టుంది

      Delete
  9. శర్మ గారు,
    // “ ఇవి చిరాయువుగా,చిరంజీవిగా వర్ధిల్లుతూనే ఉంటాయండి.” //

    దేవుడి యాన.
    ఇటువంటి చిరాయువు భావనలతోనే మీ స్నేహితుడు వ్రాసిన సినిమా పాట ఒకటుంది 👇.

    // “ తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది ।।

    బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ।।

    ఏది కోరేది | వాడినేది అడిగేది ।। “ //

    కాబట్టి వచ్చి తిష్ఠ వేసుకుని కూర్చునే “ఉంపుడుగత్తెల” బారి నుంచి కాపాడమని ….. వాడినేది అడిగేది 😒.

    ReplyDelete
    Replies
    1. అదనం L4L5యెల్ఫోరెల్ఫైవ్
      మదన మనోహారి వచ్చి మంచంమీదే
      వదలదు సపర్య సేయక
      వదిలించు ఉపాయ మేమి ఉందా సారూ ?

      Delete
    2. రెండో ఆవిడ జనకుడు
      రండని కబురంపె , నేమి రానుందొ బుధా !
      దండిగ దీవించునొ ? తా
      నుండగ భయ మేల యంచు నోదార్చునొ ? హా !

      Delete
    3. मुग्गुरु विदुरुलु,

      इला कोरिकल कोटटुलोने कोट्टु मिट्टाडुतू उम्टे एप्पुडु मोक्षमु गट्रा ल गुरिंचि आलोचिंचेदि?

      कास्ता बयटपडि परलोक विषयमुलनु गुरिंचि चिंतिंचुडी


      जिलेबी

      Delete
    4. Zilebi23 November 2024 at 05:31
      मुग्गुरु विदुरुलु,

      इला कोरिकल कोटटुलोने कोट्टु मिट्टाडुतू उम्टे एप्पुडु मोक्षमु गट्रा ल गुरिंचि आलोचिंचेदि?

      कास्ता बयटपडि परलोक विषयमुलनु गुरिंचि चिंतिंचुडी


      जिलेबी

      నీ ఊరూ పేరూ చెప్పుకోలేని పిరికివాడివి. కామెంట్ కూడా తెలుగులో రాయగల ధైర్యం నీకు లేదని, అంత పిరికివాడివని దీనివల్ల తెలిసింది.

      "ముగ్గురు విదురులు,
      ఇలా కోరికల కొట్టులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎప్పుడు మోక్షం గట్రాల గురించి ఆలోచించేది? కాస్త బయటపడి పరలోక విషయాలను గురించి చింతించుడీ

      జిలేబి "

      ఏంటో తెలియని వాళ్ళం లే! చక్రాలకుర్చీలో కూచుని చెయ్యీకాలూ కదుపుకోలేక ఉండి మోక్షం గురించి నువ్వే ఆలోచించుకోవాలి, ఆ నరకాన్నించి ఎప్పుడు మోక్షం అని. మేమంటావా ఇలా ఏదో కాలూ చెయ్యీ ఆడుతుండగా దాటిపోవాలని తాపత్రయం,అంతే. నీలా మోక్షం గట్రా ఆలోచనలు కంటే ప్రస్తుతం శరీరబాధల గురించే చింత.

      Delete
    5. వెంకట రాజారావు . లక్కాకుల22 November 2024 at 20:14
      సమను కంటే ఎక్కువది సార్! కబురంపితే కదలాలిసిందే! విచారణలేకనే శిక్ష వేసినా భరించాల్సిందే సార్!

      Delete
    6. వెంకట రాజారావు . లక్కాకుల22 November 2024 at 19:49
      అదనం L4L5యెల్ఫోరెల్ఫైవ్
      మదన మనోహారి వచ్చి మంచంమీదే
      వదలదు సపర్య సేయక
      వదిలించు ఉపాయ మేమి ఉందా సారూ ?
      అవేంటో తెలియవు సార్! మదనమనోహరి మంచం మీదకొస్తే మరి తిరుగే లేదు,ఉపాయాలేం లేవు సారూ! ఉన్నవన్నీ అపాయాలే :)

      Delete
    7. విన్నకోట నరసింహా రావు22 November 2024 at 19:24
      అంతా ఒక బళ్ళో చదువుకున్నవాళ్ళం కదు సార్! ( school of same thought) ఆలోచనలలలాగే ఉంటాయి కదు సార్:)

      స్వయంకృతాపరాధాలకి ఆయనేం చేస్తాడు సార్!
      అదుపు లేని ఆహార విహారాలు ఆయనతప్పా!
      ఆతృత పెంచుకోవడం ఆయన తప్పా!
      రోగం రాకుండా కాలూ చెయ్యీ కదుపుకునే లా చూసుకో అంటే వినకపోవడం ఆయన తప్పా!
      రోగమొస్తే బిళ్ళమింగుతే చాలనుకోడం ఆయనతప్పా!
      ఇలా తప్పులన్నీ కుప్పలుగా పోగేసుకుని ఆయనివ్వలేదనుకోవడం ఆయనతప్పా!
      అసలెందుకివ్వాలి?
      ఎప్పుడూ ఆయనగురించి ఆలోచించనివాళ్ళు ఇప్పుడు కాలూ చెయ్యీ ఆడక చక్రాలకుర్చీలో కూచుని నరకం అనుభవిస్తూ మోక్షం కావాలంటే ఇచ్చేస్తాడా? ఇవ్వలేదని నెపమేయడం ఆయనతప్పా!
      చెప్పండి సారూ

      Delete
    8. సార్ ,
      మీకు తెలియందేం కాదు .
      వెన్నెముకలో లంబార్ 4 , లంబార్ 5
      పూసల మధ్య బల్జింగ్ వల్ల వచ్చిన నొప్పి .

      Delete
    9. వెంకట రాజారావు . లక్కాకుల23 November 2024 at 09:54
      వాపు గురించి డాక్టర్ని చూడడమే మంచిది, ఇక నొప్పి ఐతే మాత్రం మొన్న టపాలో రాసాను, అదే చెబుతున్నా మళ్ళీ! నేలమీద ఒత్తుగా పరచుకుని పడుకోండి ఆ తరవాత కాళ్ళు ముడవండి పైకి, ముడిచినకాళ్ళు పట్టుకోండి, బుర్ర కొద్దిగా లేపండి. వెన్ను కొద్దిగా విల్లులా అవుతుంది, దానిపై ముందుకు వెనక్కూ ఊగండి, కొద్ది సేపు,ఇలా రోజూ చెయ్యండి. ఒకప్పుడు ఆడవారు పిల్లలను ఆ కాళ్ళపై పడుకోబెట్టుకుని ఊగేవారు,దాదం దక్కచ్చి, అయవారక్కచ్చి అంటూ పాడుతూ,గుర్తొచ్చిందా! ప్రయత్నించండి.

      Delete
    10. అమ్మడి కరుణా కటాక్ష వీక్షణ దరిద్రాలు
      నాపై ప్రసరించి అప్పుడే రెండేళ్ళయింది . హైదరబాదు అప్పులాసుపత్రి వైద్యం .
      పెద్ద డాక్టరు ఆపరేషనన్నాడు . తెలిసిన ఇంకోడాక్టర్ సలహా కోరితే , ఆయన ఆప
      రేషన్ వద్దన్నాడు . ఫిజియో తెరఫీతో
      నార్మల్ స్థితి వచ్చింది . ఐతే , ఏక్కువ సేపు రెస్టు . చిన్నపాటి ఎక్సర్ సైజులు ,
      రెండు పూటలా వాకింగు , అన్నపానీయాలు వండడం తినడం ,
      మిత్రులతో గోష్టులు , ధార్మిక - దైవకార్యాలు .....
      పరమాత్మ బానే చూసేడు . ఆ జగన్మాత
      అండదండ లుండబట్టి -
      అమ్మవారి ఆలయం - సు విశాలమైన -
      ఇంద్రభవనం నిర్మించ గలిగేను .
      ఇంకేం కావాలీ జన్మకు ?
      ఇంకే మివ్వాలి పరాత్పరుడు ?

      Delete
    11. -
      తాతగారి దీవెనలు :)

      నీ వూరు పేరు చెప్పుకొ
      నే వగ లే ని నరుడవు పనీపాటా లే!
      రావడి మాత్రమ్మె తెలియు
      కావాతిరుగు వలె నీదు కాని పనులు సీ!


      Delete
    12. Zilebi23 November 2024 at 14:36
      ఏంటో!

      Delete
  10. sarma23 November 2024 at 09:54
    అవును, ఇవి పూర్తిగా స్వయంకృతాపరాధాలే.

    ‘నిర్లక్ష్యమైనదిరా, అనుభవించితిరా’ అని పాడుకోవడమే (ఎన్టీవోడి ఓ సినిమాలోని “జన్మమెత్తితిరా, అనుభవించితిరా” అనే పాట అలవరస మీద 🙂).

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు23 November 2024 at 10:47
      అంతే సార్!

      Delete
  11. వెంకట రాజారావు . లక్కాకుల23 November 2024 at 13:03
    జాగ్రతలే అవసరం, మందులేసుకోవడం,చెప్పిన వ్యాయామం చేయడం,కాలక్షేపం చెయ్యడమే నేటి మాట. అలా కొనసాగిపొండి,మరేం ప్రయత్నాలొద్దు.

    ReplyDelete
    Replies
    1. ముఖ్యంగా వెన్నెముకకు ఆపరేషన్ అంటే అసలొప్పుకోవద్దు - పదిసార్లు ఆలోచించకుండానూ, నలుగురైదుగురు డాక్టర్లను సంప్రదించకుండానూ.

      Delete
    2. ಅವುನಂಡೀ ವಿನರಾ ವಾರು ಚೆಪ್ಪಿಂದಿ ವಂದ ಶಾತಂ ಸರಿಯೈನದಿ.

      Delete
    3. పెద్దలు నరసింహరావుగార్కి ధన్యవాదాలు , నమస్సులూను .

      Delete
    4. శ్రీకృష్ణ పరబ్రహ్మకు
      చేకొని శ్రీరామునికిని సీతాసతికిన్
      శ్రీకర త్రిజగన్మాతకు
      ప్రాకటముగ చేతు లెత్తి ప్రణతు లొనర్తున్

      Delete