Monday 25 December 2023

యతికుతం....

 యతికుతం....


ఆతనో యతికుతం మనిషిలెద్దురూ అంటుంటారు, అన్నీ యతికుతం బుద్ధులే.... ఈ ,యతికుతం, కి అర్ధమేంటి?


పూజ చేస్తున్నారా? కొంతపూజయ్యాకా మొదలవుతుంది.....యానికానిచ పాపాని......పాహిమాన్ కృపాయా దేవ శరణాగత వత్సల,అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ..రక్ష రక్ష....

 పాపాలు చేశాను... దేవుడా దయతో మన్నించు, మరో     దిక్కులేదు,రక్షించు,రక్షించు, అంటూ....


ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి...

నీకు ప్రదక్షణ చేసి నమస్కారం చెయ్యాలని కోరిక,శక్తి లేదు, నీవు నాలో కూడా ఉన్నావని నమ్ముతూ, నా చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నా, నీకు ప్రదక్షిణం చేసినట్టు భావించు, నమస్కారం స్వీకరించు. 


ఆపైన

 కరచరణ కృతంవా

మనోవాక్కాయజంవా చ

తవాపరాధం క్షమస్వ

......................

  చేతులు, కాళ్ళతో;మనసు, వాక్కు, శరీరంలతో చేసిన తప్పులు, నీపట్ల చేసినతప్పుల్ని మన్నించు, క్షమించు,దేవా అంటూ, చెంపలు వాయగొట్టుకుంటూ...


చివరకొచ్చేసేం....

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మయాధిప ,

'యత్కృతం' తు మయాదేవ పరిపూర్ణం....


నేను చేసిన పూజలో మంత్రాలు సరిగా చెప్పలేకపోయినా,చేసే పూజలో లోపం ఉన్నా,(పత్రి, నైవేద్యం వగైరాలు) సరిగా లేకున్నా, నీపట్ల భక్తిలేకున్నా, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణంగా భావించు...

మంత్రాలు చెప్పలేకపోయావు సరే,పూజలో లోపం అదిన్నీ సరే,భక్తి కూడా లేని నిన్ను నేను రక్షించాలా? అని భగవంతుడు అడగడు...... 


ఇంతకీ 'యతికుతా'నికి దీనికి లింకేంటని కొచ్చను కదా!

మంత్రహీనం.......లో .......'యత్కృతం'.... అనివచ్చిందిగా అదే ఇది, నేను ఎలా చేస్తే అదే సంపూర్ణం అనుకో అన్నాడుగా అలాగే నేనేది చేసిన,చెప్పినా అదే సంపూర్ణం అనే మనుషులుంటారు చూడు! అని చెప్పడానికే 'యత్కృతం'....అలా అలా నలిగి 'యతికుతం' అయింది అనుకుంటా.


ఇటువంటి వాళ్ళకి ఉదాహరణలు కావాలా?......  :)


38 comments:

  1. ఇటువంటి వాళ్ళకి ఉదాహరణలు...

    ಶರ್ಮ ಗಾರಾಂಡೀ ?

    ReplyDelete
    Replies
    1. శ్రీమతి జిలేబి కుమారి గారు.

      Delete
    2. Zilebi25 December 2023 at 09:33
      నాకూ పెద్దవారిలాగా పద్నాలుగు భాషలొచ్చని చెప్పుకోడానికి ఇలా శాఖాచంక్రమణజీవి బుద్ధులు ప్రదర్శిస్తూ ఉంటావు.
      కాని నువ్వూ తీ.తా. వని చాలమంది అనుకుంటూ ఉంటారు.నాకు నీలా భాషలురావు. నాక్కొచ్చినది తెనుగు.హిందీ లిపి గుర్తుపట్టగలను.ఇంగ్లీషు పరవాలేదు. ఇంతే నా పరిజ్ఞానం.

      Delete

    3. bonagiri25 December 2023 at 10:06
      బలే చెప్పేరండీ :)
      తనో తీ.తా అని ఎవరికి తెలీదనుకుంటూ ఉంటుంది, జిలేబి. :)
      తనకి పద్నాలుగు భాషలొచ్చని డబ్బా కొట్టుకోడానికి ఎవరు దొరుకుతారండి? నా లాటి అర్భకులు తప్పించి. ఏమీ తెలియని నా దగ్గర చెప్పుకుంటూ ఉంటుంది. అది నిజం కాబోలని నమ్మేస్తుంటానండి :)

      Delete
    4. టీ టా అనగా నేమి ?

      Delete
    5. Zilebi25 December 2023 at 12:32
      అది టీ.టా కాదు తీ.తా
      తీ.....తా;తీ....తా :)

      Delete
    6. internetలో లభ్యమయ్యే వివిధ భాషల online keyboard ఉపయోగించి తెలుగు వాక్యాల్ని టైప్ చేసి (transliteration) , కామెంట్లలా కాపీ చేసినంత మాత్రాన ఎవరూ పధ్నాలుగు భాషల పారంగతుడు అయిపోరండీ. భాష తెలియనంతవరకూ, జిలేబీ ఏ భాషలోనైనా జిలేబీయే.
      https://youtu.be/re9cwL2OMKY?si=gIuB7T2UrKBWZOIz&t=105

      Delete
    7. मी पाटि విన్నాణం ಕೂಡಾ तातगारु உபயோகிம்சக போவடமு ಹಾಶ್ಚರ್ಯಮು ಗಾ ಉನ್ನದಿ.

      Delete
    8. కాంత్25 December 2023 at 21:50
      జిలేబి అంతా డొల్లేనా! ఇదంతా పాండిత్యం అనుకున్నా సుమండీ! ప్రొఫెసర్ సిప్పు అని చెప్పుకుంటుంది. :) ఇదంతా సిప్పు పాండిత్యమా!

      Delete

    9. Zilebi26 December 2023 at 01:58
      డొల్ల కంపెనీయా!

      Delete
    10. Zilebi26 December 2023 at 11:00
      జిలేబి డొల్లగానే ఉంటుంది. పాకం పడేస్తేనే అది పీల్చుకుని ఉబ్బి తియ్యగా ఉంటుంది. జిలేబి డొల్లకంపెనీకాదా? :) జిలేబి పేరెట్టు కున్నావు అదీ తెలియదా? :)

      Delete
  2. -

    యతికుత మనన్ జిలేబీ
    అతివాగుడె యత్కృతమ్మె నహొ జనులారా
    హితులార! తాత పలికిరి
    సుతిమెత్తగ స్తోత్రపు టొరసుగొనుచు సుమ్మీ :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi25 December 2023 at 10:14
      ”తుమ్ముకుని” "చిరంజీవి", అనుకోడం మామూలే తమకు. :)
      ఇదీ ఒక నానుడే! :)

      Delete
    2. -

      తుమ్ముకుని చిరంజీవిని
      సుమ్మీ అనుకోవడమ్ము సుదతి జిలేబీ
      కిమ్మగు చర్యయె మనమో
      బొమ్మాళి పలుకుల వినుచు బుర్రూపుటయున్


      జిలేబుల్స్

      Delete
    3. Zilebi25 December 2023 at 12:14
      బతికించేవు :) అదేంటన్నావు కాదు :)
      తీ.....తా :)

      Delete
    4. -
      ఓ తాత! యేమిటయ్యా
      తీ.తా యని ప్రశ్న వేసె దెప్పుచు బీలే
      జీ తీరున్ గోప్యముగా
      స్తోత్రము చేయగ జిలేబి సుతిమెత్తగనే!


      జిలేబుల్స్

      Delete
    5. Zilebi25 December 2023 at 18:16
      తెలియనిది తెలియదని చెప్పలేని గొప్ప నీది. :)
      ********************************
      నవ్వడం భోగం
      నవ్వించడం యోగం
      నవ్వలేకపోవడం రోగం
      అన్న తెనుగు సునిసిత హాస్య చక్రవర్తి తెలుసా? ఒక గొప్ప సినిమా దర్శకుడు,రచయిత.........
      సునిసిత హాస్యానికి చిరునామా ( నీలా అపహాస్యం కాదు) ఇది ఒక క్లూ,చెప్పుకో చూద్దాం!! :)

      Delete
    6. Zilebi25 December 2023 at 12:14
      sarma25 December 2023 at 11:11
      తుమ్ముకి తమ్ముడున్నాడు ఆవులింతకి అన్న లేడు.
      ఇదొక నానుడి. ఏంటో చెప్పుకో!

      Delete

    7. Zilebi26 December 2023 at 11:00
      టపాకై ఎదురు చూడాలి.

      Delete
  3. Replies

    1. Zilebi26 December 2023 at 11:01
      జంధ్యాల

      Delete
    2. శర్మగారూ, ఇంతకీ ఇక్కడ జంధ్యాలగారి గురించి ప్రస్తావన ఎందుకో? చెప్పారు కాదు

      Delete
  4. తెలియదు తెల్వదంచు సుదతీమణి వెక్కసమైన ఆర్తితో
    వెలువడు భాష్పముల్ బొరలి వేసడమై దిగజార నక్కటా !
    కలువల కండ్లు వాచె , నిటు కష్టము బెట్టుట న్యాయమేన ? ఓ
    బలియుడ భాస్కరా ! విబుధ ! పాపము గాదె ! జిలేబి పాపలన్ ?


    ReplyDelete
    Replies
    1. చైంచిక్ :)

      న్యాయంబేనకొ మాచనా? తనకు విన్నాణమ్ము లేదంచు హ
      య్యో! యాక్రోశము తోడు తెల్వదని కుయ్యోమొర్రొ యంచున్ జిలే
      బీయమ్మణ్ణి తెలీదు తెల్వదన ప్రావీణ్యమ్ము తో దెప్పుటే
      లా! యావత్తు జనాళి మీదపడి వేళాకోళమే? తప్పు సార్!



      జిలేబుల్స్

      Delete
    2. "జిలేబి పాపలన్ ?", "వెలువడు భాష్పముల్ బొరలి వేసడమై దిగజార నక్కటా !
      కలువల కండ్లు వాచె ,"
      వాటిని చూడాలని ఉంది.

      Delete
    3. కళ్ళలో కళ్ళుపెట్టి యా :)

      Delete
    4. -

      కళ్లలోన కళ్లెట్టుచు కలువ కండ్ల
      గాన వాపును కోరిక గల్గె రాజు
      గార్కి త్వరితము గ్లిజరిను కండ్ల కిడుము
      గార బాష్పాంబువుల్ నయగారమగుచు

      జిలేబుల్స్

      Delete
  5. రెటమతం, ఇదీ ఒకటేనాండి?

    ReplyDelete

  6. వెంకట రాజారావు . లక్కాకుల26 December 2023 at 14:44
    కళ్ళువాచేలా ఏడ్చిందా!
    కరువుతీరేలా ఏడవనివ్వండి సార్!

    ReplyDelete
  7. కాంత్26 December 2023 at 20:58
    సునిసిత హాస్యానికి చిరునామా కదండీ!

    ReplyDelete
  8. bonagiri26 December 2023 at 20:37
    అనుమానమాండీ :) అన్నీ ఒకటే!

    ReplyDelete
    Replies
    1. అనుమానమండి! అన్నియు
      మనకొకటె జిలేబి తీత మాదిరి సుమ్మీ
      కనుకొలకులలో కన్నీ
      ళ్లను చూచి మదిని కరుగవలదు బోనగిరీ!

      Delete