Saturday 24 December 2022

అయినవల్లి-క్షణ ముక్తీశ్వరం

అయినవల్లి-క్షణ ముక్తీశ్వరం


 యినవల్లి-క్షణ ముక్తీశ్వరం, రెండూ కోనసీమలో ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు.దగ్గర్లోనే పుట్టి పెరిగి జీవించినా, ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు. ఏప్పటికెయ్యది తథ్యమో ఎవరికెరుక? స్వామికి నేటికి కరుణకలిగింది దర్శనం ఇవ్వాలని అంతే! 


కోనసీమ ముఖద్వారం. 


వృద్ధగౌతమి పై రెండు వంతెనలు. 
మొదటి వంతెనచుట్టూ ఎన్ని జ్ఞాపకాలో 

ముక్తికాంతా క్షణముక్తీశ్వరస్వామి స్థలపురాణం


సజీవంగా ఉన్నట్టు కనపడ్డ బసవయ్య

ముక్తికాంతా క్షణముక్తీశ్వరస్వామి

రాజరాజేశ్వరీ సహిత ముక్తికాంతా క్షణముక్తీశ్వరస్వామి

మనవరాలు అయినవల్లి వెళదామంటే బయలుదేరాం! తను కాలేజివారు తీసుకెళితే, పదోతరగతి పరిక్షలముందు దర్శనం చేసింది. మళ్ళీ దర్శనం చేయాలని, నా చేత దర్శనం వేయించాలనుకుని బయలుదేరదీసింది.తొమ్మిదికి అయినవిల్లి చేరాం. ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించాం. చిన్న విగ్రహం, ఆనందమయింది. గుడి తిరిగాం. ఇక్కడ నిత్య అన్నదానం ఉన్నదని తెలిసింది. ముక్తీశ్వరం ఎంత దూరం వాకబు చేశా! ఎంతోనా ఒక కిలోమీటరే అన్నారు. ఓహ్! బ్రహ్మానందమయింది. బయలుదేరి క్షణముక్తీశ్వరం చేరాం. ఆలయానికి వెళ్ళాం. ప్రదక్షిణాలు చేశాం. అప్పుడు గుర్తొచ్చింది. శివాలయంలో ప్రదక్షిణాలు ఇలా కాదుగా చేయడమని. అప్పుడు మళ్ళీ అందరికి శివాలయంలో ప్రదక్షణ ఇలాకాదని దగ్గరుండి. సోమసూత్రం దాటకుండా ప్రదక్షణలు చేయించేను.మాలో ఒకమ్మాయి కేరళాలో కొన్నేళ్ళు ఉన్నది, ఆమె చెప్పింది. అక్కడ శివాలయంలో సోమసూత్రం దగ్గర అడ్డు కట్టేస్తారూ, అని. అప్పుడు మిత్రులు విన్నకోటవారు చెప్పినమాట గుర్తొచ్చింది. గుడిలోకి దర్శనానికెళ్ళేం. అభిషేకం జరుగుతూంది.అంతరాలయంలోకి వెళ్ళిన తరవాత ఆశ్చర్యం ఆలోచనలన్నీ శూనయమైపోయాయి. ఒక్కటే ఆలోచన, స్వామికి సాష్టాంగ నమస్కారం చేయాలని. అంతే మూడు సార్లు సాగిలబడ్డా. మరో ఆలోచనేలేదు. అంతప్రశాంతత అనుభవించలేదు ఇదివరలో! దర్శనం తదుపరి బయటికొస్తేగాని మళ్ళీ ఆలోచనే కలగలేదు! గుడికెదురగా మరో గుడి అదీ క్షణముక్తీశ్వరస్వామిదే! ఇలా ఎందుకు రెండు ఆలాయాలున్నాయి? తెలియలేదు, చెప్పగలవారు దొరకలేదు. ఆ ఆలయానికెళ్ళేం అది తాళం వేయబడి ఉంది. అర్చకస్వామి బయాటికెళ్ళేరేమో తెలీదు. ఇలా కటాలలోంచి ఫోటో తీసుకుని బయటనుంచే దర్శించుకుని వచ్చేశాం.  

తిరిగి అయినవిల్లి ఆలయానికి చేరి అన్నప్రాసాదానికెళ్ళేం. చాలా శుభ్రంగా ఉంది. అన్నప్రసాదంలో ఆరోజు మామిడికాయపప్పు, బంగాళాదుంప,టమేటా కూర,కొబ్బరికాయపచ్చడీ,సాంబారు, మజ్జిగ. స్వామి ప్రసాదం పూర్తిగా తినేశా. సుగర్ పెరుగుతుందిలే అనుకుంటూ. మెతుకు వదిలితే ఒట్టు. పదార్ధాలు అంత రుచిగా ఉండిఉన్నాయి.ఇంటికొచ్చిన తరవాత సుగర్ చూసుకుంటే ఉన్నది 111, ఏమని చెప్పను!
పునర్దర్శనానికి వెళ్ళాలి, స్వామి అనుగ్రహంతో!

6 comments:

  1. 🙏 అవును శర్మ గారు, కేరళలో శివాలయాల్లో సోమసూత్రం దగ్గర అడ్డు ఉంటుంది.

    // “ కటాలలోంచి ఫోటో తీసుకుని ….. “ // మీ అదృష్టం. ఆ అర్చకస్వామెవరో మంచివారన్నా అయ్యుండాలి లేదా తొందర్లో అయినా ఉండుండాలి. గుడి వేళలు మించి పోయిన తరువాత గుడికి చేరుకున్న మేము చాలా చోట్ల కటకటాల వెనక కర్టెన్ కూడా వేసేసి ఉండడం గమనించాము - అంటే వేళ అయిపోయిన తరువాత ఏ రకంగానూ విగ్రహం భక్తులకు కనబడకూడదనేమో బహుశః 😁😁?

    భోజనానంతరే చక్కెర రీడింగ్ 111 …. అంటే అదుపులో ఉన్నట్లేగా సారూ? ఆనందం కదా 🙂.

    పైన మీరు పెట్టిన ఫొటో “కోనసీమ ముఖద్వారం” ఏ ఊరి దగ్గర ఉందండి? వంతెనలు ఇంకా పడక ముందు కాలపు కోనసీమ వాసిని లెండి నేను.

    ReplyDelete
    Replies
    1. ముక్తీశ్వరం గుడి పురాతనమైనదే కాని చండీశ్వరును విగ్రహం సోమసూత్రం దగ్గర లేదు.
      ఒక గుడి పురాతనమైనది, మరొకటి కొంత ఆధునికంగా కనపడింది. భద్రతకోసం కటకటాలు వేసివుండచ్చు, అర్చకస్వామి. పల్లెటూరి వాసనలు పూర్తిగాపోలేదిక్కడ.
      భోజనానంతరే మూడుగంటల తరవాత, రీడింగ్ అది Random blood sugar అనుకోవచ్చేమో!
      కోనసీమముఖద్వారం కట్టడం రావులపాలెంలో నేషనల్ హైవే నుంచి అమలాపురం కాలవగట్టు రోడ్డుకు వెళ్ళే మొదటిలో ఉన్నది.ఒకప్పుడు కోనసీమ ముఖద్వారం అంటే బొబ్బర్లంక, కాలంతో మార్పులొచ్చాయికదా!

      Delete
  2. కటకటాల రుద్రయ్య :)

    ReplyDelete
  3. శర్మ గారు,
    కటకటాల తలుపులు పెట్టినందుకు కాదండి నా బాధ. నా బాధల్లా గుడి మూసేసేటప్పుడు ఆ కటకటాలకు తాళం వేసుకుని వెడతారు కదా, ఆ కటకటాల వెనకనున్న కర్టెన్ ను కూడా అడ్డంగా లాగేసి (మూసేసి) వెడతారు. భద్రతకు దీనికి సంబంధం లేదు కదా.

    గుడి వేళ అయిపోయిన తరువాత వచ్చినవారు సాయంత్రం తిరిగి గుడి తలుపులు తెరిచే వరకు వేచి ఉండలేనివారు కనీసం ఆ కటకటాల్లో నుంచైనా దేవుడి విగ్రహాన్ని చూసి వెళ్ళే వెసులుబాటు కూడా లేకుండా చేస్తున్నారు. అదీ నా ఘోష.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు25 December 2022 at 17:59
      మీరన్నది పాయింటే కాని వారి చిక్కులేంటో తెలీదు.
      కారణం లేని కార్యం ఉండదు కదా!

      Delete