Monday 19 December 2022

ఊపిరి..

 ఊపిరి..


ఊపిరి చొరబడితే పుట్టేడంటారు.

ఊపిరి నిలబడితే పోయేడంటారు అన్నారో సినీకవి, నిజం కదా!

ఊపిరినిలబడితే ఎంతసుఖం .


ఆకలి దప్పికలు లేవు.

జర (ముసలితనం)రుజ (రోగం) లేవు.

శోకం, మోహం లేవు.

భయం సంశయం లేవు.

ఊపిరున్నవరకు భయం

రేపేం జరుగుతుందో!

దీనినుంచి ముక్తి పొందగలిగితే!!! సాధ్యం కాదే !!!

అదే పొందగలిగితే

స్వర్గం

ఎక్కడో లేదు, 

ఇక్కడే,ఇక్కడే,ఇక్కడే 

ఉంది.

24 comments:


  1. అమ్మో. ఇది చాలా లోతైన విషయం.

    అద్వైత చింతన ప్రకారం ఊపిరి లేదా ప్రాణం దగ్గరినుంచి మనస్సు, ఆలోచనలు, శరీరం, జగత్తు, పంచ భూతాలు, ఆకాశం దాకా అన్నీ జడమే.

    ఊపిరి నిలబడినా కర్మ గడచిపోదు. స్వర్గం లోనో మరో చోటో మజిలీ చేసి మళ్ళా ఊపిరి పోసుకుంటుంది.

    ఉన్నది ఒక్కటే సత్య వస్తువు. ఊపిరి ఉన్నప్పుడూ లేనప్పుడు , ఎప్పుడూ ఉంటుంది. అదే నేను అన్న భావన ఎరుక కలిగి స్థిరపడి పోవడమే ముక్తి అని చెబుతారు.

    ఎన్నో జన్మల నుంచి గట్టి పడిపోయిన అజ్ఞానం అరగదీయడం అంత తేలిక కాదు.

    ReplyDelete
    Replies

    1. Anonymous19 December 2022 at 11:05
      ఆత్మసత్యం జగత్ మిద్య, కాని ఇది అర్ధం చేసుకోలేకపోతున్నా! కనపడే జగత్తు మిధ్య అని ఎలా అనుకోను.త్రికాలలోనూ జగత్ వుంది.అన్ని అవస్థలలోనూ జగత్ వుంది.జాగృత్,స్వప్న,సుషుప్తావస్థలలో జగత్ ఉంది. ఆత్మ ఇన్ని అవస్థలలో జాగృతమయ్యే ఉంది.నా ముందూ జగత్ ఉంది, నా తరవాతా జగత్ ఉంటుంది. ఆత్మ,జగత్ రెండూ సత్యమే అనిపిస్తాయి, ఇదేనా మాయ అంటే!

      Delete
    2. ఏమిటీ ట్రాష్ మిథ్య సత్యం అంటూ ? చుక్కేసి హాయిగా బజ్జోండి అన్నీ సమసిపోతాయి

      Delete
    3. చుక్కేసి పడుకుంటే అన్నీ సమసి పోతాయి. పొద్దుటే మళ్లీ ప్రత్యక్ష మవుతాయి🕳️

      కొత్తగా మందు పుచ్చుకునే అవసరం లేదు. అజ్ఞానం మత్తు మందు ఎన్నో జన్మల నుంచి పుచ్చుకుంటూనే ఉన్నాము.

      Delete
    4. Anonymous20 December 2022 at 22:38

      ఈ పెంకు ఇప్పుడే కాలడం మొదలెట్టింది, అందుకే ఇటొచ్చింది. పూర్తిగా కాలితే గాని దీని సంగతి బోధ పడదు. కాలం పడుతుంది, కొంచం ఓపిక పట్టాలి.

      Delete

    5. Anonymous20 December 2022 at 18:28

      వచ్చెయ్! వచ్చెయ్య్!
      బుల్లెట్ బండి ఎక్కి తొక్కుకొచ్చెయ్!!
      వచ్చేటప్పుడు రెండో మూడో ఫుల్లులు పట్టుకొచ్చెయ్!
      ఆచేత్తోనే రెండు పెద్ద మసాలా కాజూ తెచ్చెయ్య్!
      మంచింగ్ కి
      సాధువులో అసాధువులో దోస్తుల్ని తోలుకొచ్చెయ్!
      కర్చంతా నాదే భయపడకు!
      ఎప్పుడో చెప్పు!
      క్రిస్మస్సా! నూ ఇయరా!!
      చిగురు కోసం కబురంపా! దొరుకుతే!!!
      ఇక జెప్పేవా!! మడతలడిపోద్ది!!!
      మందేద్దాం! మందేసి చిందేద్దాం!!
      మరి నీదే ఆలీసెం!!!!!!!!!!
      కామిగాని మోక్షకామిగాడు :)
      వచ్చెయ్య్! వచ్చెయ్య్!!

      మిత్రులు బండి వారికి నమస్సులు,మన్నింపుకోరుతూ...
      ఏసేద్దాం! మందేసెద్దాం!!
      మందేసి చిందేద్దాం!!

      Delete
    6. అయ్ బాబోయ్ శర్మ గారు, మీలో చాలా చాలా సరుకుందండే!. పాట అదర గొట్టేసారు అంతే 👌.

      పైగా “చిగురు” కూడా అంటున్నారు, ఇక చెప్పక్కర్లేదు 🥃🥃🙂.

      Delete
    7. చుక్క గురించి చెబితేనే ఒల్లు గగుర్పొడిచే కవితవం వస్తోందంటే మీరు వేసేస్తే ఎంచక్క రాస్తారో:)

      Delete
    8. విన్నకోట నరసింహా రావు21 December 2022 at 09:50
      చుక్క మాట మహాత్మ్యం షార్! ఇద్దరు పాట మిత్రుల వాసనకండీ!! సావాసదోసమేమో సుమా!

      Delete
    9. Anonymous22 December 2022 at 07:42
      ఇది ఒళ్ళు గగుర్పొడిచే కవిత్వమా!వామ్మో!!

      చుక్కెయ్యాలని ఉంది చుక్కలేదు
      చుక్కతో పక్కెయ్యాలనీ ఉంది చుక్కలేదు.

      తాగాలని ఉంది తాగలేను
      చుక్కలేదు, చిగురు దొరక లేదు
      చిగురేసి చిందెయ్యాలనుంది! వెయ్యలేను

      "చిగురేసి మొగ్గేసి సొగసంతా పూతపూసి
      ఇవ్వాలని లేదా ఏమీ
      ఓసిరిపాపా! ఎన్నాళ్ళూ దాస్తావేమీ". ఒక సినీ కవి మాట.

      ఇదంతా వయసు ముచ్చట బాబూ!ఇప్పుడు చుక్కాలేదు, చుక్కతో పక్కా లేదు! వైద్యుడు చుక్కమాటంటే ఇంకిదేదారి అంటున్నాడు బాబాయ్!

      Delete
  2. గీతలో భగవానుడు జగత్తు అంతా తనలో కేవలం ఒక అంశ మాత్రమే అంటాడు. మనం జగత్తును పంచేంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాము. పంచేంద్రియాలకు అందే జగత్తు సంపూర్ణం కాదు. అందనిది ఎంతో ఉంది. ఉదాహరణకు గబ్బిలాలు కళ్ళు లేకపోయినా ఎదుట ఉన్న వస్తువులను గుర్తించగలవంటే మనకు లేని వేరే ఇంద్రియశక్తి ఉన్నదనే కదా. మనకుగల ఇంద్రియాలు వేరు జీవులలో అధికసామర్ధ్యంతో ఉండటం తెలిసిందే. కొన్ని నక్షత్రాలకాంతి మనభూమిని ఎప్పటికీ చేరలేదు. అందుకే మనకు అందరాని జగత్తు అనంతంగా ఉన్నది. అదీకాక జగత్తు నిత్యపరిణామశీలి. దాని స్థిరత్వం అల్పం. కాని ఈజగత్తుకు కారణమైన బ్రహ్మం శాశ్వతం సనాతనం. ఆబ్రహ్మము నుండి సృష్టి ఏర్పడి అందే లీనమౌతుంది. అశాశ్వతమూ భ్రమతో కూడినదీ ఐన సృష్టినీ దానిలోని వస్తువిషయాలనూ శాశ్వతమూ సర్వమూ సత్యమూ అనుకొనేటటట్లు చేసేదే మాయ.

    ReplyDelete
    Replies
    1. బాగా వివరించారు🙏

      Delete
  3. జగత్తు కనబడుతోంది అంటున్నారు. నిజంగా మీరు చూస్తున్న ప్రాణివస్తుచయం అంతా గతకాలంలోనిదే! కాంతి ఒక సెకనుకు మూడులక్షల కిలోమీటర్ల దూరం పోతుంది. ఒక అడుగు అంటే 30సెం.మీ దూరం పోవటానికి ఒక నానోసెకను పడుతుంది కాంతికి. అంటే మీకు ఎదురుగా అడుగు దూరంలో కనిపించే వస్తువు ఒక నానో సెకను క్రిందటిది. మీరు చూస్తున్న క్షణంలోనిది కాదు! మీరు ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు కొన్నిటి కాంతి భూమి పుట్టక ముందుది! మనం వర్తమానం అనుకునే సమయం అంతా రకరకాల గతస్థితుల్లోని వస్తుచయానిది. కాన మనకు తక్షణం అనిపించటం అందమైన మాయ సుమండీ.

    ReplyDelete
  4. శ్యామలీయం20 December 2022 at 13:16
    శ్యామలీయం20 December 2022 at 13:37

    జగత్ మిధ్య అన్నది నిజం.ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉన్న నక్షత్రాన్ని నేడు చూస్తున్నామంటే అది నేటి రూపు కాదు.జగత్ పరిణామశీలం కలిగినది కనుక దీన్ని మిధ్య అనచ్చు కాని ఆత్మ సత్యం ఎలా? నా ముందు ఉన్నది తెలీదు,నా తరవాత ఉన్నదీ తెలీదు, ప్రస్తుతం నాతో ఈ ఉపాధిలో ఉన్నది.ఈ ఉపాధి నేను అనే ఆత్మకాదు,అది నిజం. నేను జన్మించకముందు, నా మరణాం తరవాత ఉన్నదో లేదో తెలియనిదాన్ని సత్యమని ఎలా నమ్మడం? EPROM అనుకోవచ్చా?

    ReplyDelete
    Replies

    1. నా ముందు నా తరువాత అనే వాక్యం లో 'నా 'అనేది ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారు?

      సుషుప్తి అవస్థకు ముందు తరువాత కూడా ఆత్మ లేక consciousness ఉన్నట్లే జననానికి ముందు మరణం తరువాత కూడా ఆత్మ నిలచి ఉంటుంది. నిజానికి ఉన్న వస్తువు ఆత్మ ఒక్కటే. తక్కిన దంతా ఆభాస అని అద్వైతం చెబుతున్నది. అయితే అద్వైత తత్వ విచారణకు చాలా వ్యవధి అవసరం. జగత్తును అద్వైతం నిరాకరించదు. జలము - తరంగాల వలె ఆత్మ - చరాచర సృష్టి సంబంధం చెప్పారు. తరంగాలు ఆనేకం పుట్టి గిడుతూ ఉంటాయి. జలం నిలిచే ఉంటుంది. జలం లేకుండా తరంగానికి అస్తిత్వం లేదు. జలం సత్యం. శాశ్వతం. తరంగం తాత్కాలికం ఆభాస.

      ఈ లింక్ విని చూడండి.
      https://youtu.be/5Igc6_WqnsU

      Delete

    2. Anonymous20 December 2022 at 20:37

      ఏంటో! అంతా తెలిసినత్తె ఉంది కాని ఏం తెలియలేదు :)

      Delete
    3. అవును. జిలేబీ పద్యం లాగా అర్థం చేసుకోవడం కష్టం.

      Delete
    4. జిలేబీ గిద్యంలాగా అనండి :)

      Delete
    5. "జించిక్ జాల్రా :)

      Delete
    6. ఏంటో ఆ "జిలేబకావళి"ని మర్చిపోవడం మా కష్టంగా ఉంది :)

      Delete
    7. జిలేబకావళి- 👌👌.
      జిలేబీ గిద్య పిడకలు, ఇనుప గారెలు మరచిపోలేము.

      Delete

    8. Anonymous22 December 2022 at 20:19
      Anonymous22 December 2022 at 21:21
      అంత మరచిపోలేకపోవడానికేం ఉంది జిలేబి దగ్గర, అసూయ,ద్వేషం తప్ప.

      Delete
  5. Anonymous22 December 2022 at 18:08
    Anonymous22 December 2022 at 19:34
    అది అద్వైతం. సూపర్ సైకాలజీ! అది అర్ధమైపోతే ఇంకేం! అర్ధమైనట్టే ఉంటుంది, అంతలో మాయలో పడిపోతుంటాం!! జిలేబి పద్యానికి అద్వైతానికి పోలికా! తప్పుతప్పు!

    ReplyDelete
  6. Anonymous22 December 2022 at 20:16
    జిలేబిని అనుకరించకండి

    ReplyDelete