Friday 16 December 2022

గడ్డం

  గడ్డం

గడ్డమా? గెడ్డమా? ఏది సాధువు? కొచ్చను. సాధువుకే గడ్డం ఉంటుంది, అసాధువుకి ఉండదన్నాడు మా సత్తిబాబు. ఏదైతేనేంగాని, గడ్డానికో చరిత్రే ఉండి ఉంది..గడ్డానికి చరిత్రేటి అడిగాడు మా సుబ్బరాజు. పెళ్ళిలో బెల్లమ్ముక్కటుక్జొచ్చి గెడ్డం కిందెట్టి బతిమాలేడు బామ్మర్ది, బెల్లం ముక్కలాటి నా చెల్లి/అప్పతో సంసారం చెయ్యవోయ్,సుకపడిపో, అని. దానికి పడిపోయి బెల్లమ్ముక్కలాటి వాడి చెల్లి/అప్పని కట్టుకుంటే, బెల్లం తిని తిని సుగర్ తెచ్చుకున్నట్టయింది. అక్కడితో అయిందా? కళ్ళుపోయాయి, కాళ్ళుపోయాయి. తింటే ఆయాసం తినకపోతే నీరసం,. ఇది జరుగుతున్నది. పోనీ బెల్లం ముక్క మిగిలిందా? లేదు తనుకరిగిపోయి వెళ్ళిపోయింది, తిరిగిరాని లోకాలికి,ఇంకేం మిగిలింది, మిగిలింది చింతేలే అని పాడుకోమంది. చెలియలేదు,చెలిమిలేదు, వెలుతురే లేదు. ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేలే మిగిలింది నీవేలే అనుకోడానికేం లేదు. గతము తలచి వగచేకన్న సౌఖ్యమేలేదు అన్నాడో సినీ కవి. మరచిపోలేను అని వగచాడు మరో కవి. గడ్డం ఎక్కడికి తీసుకుపోయింది?


గడ్డం పెంచడం ఇప్పుడు కొత్త ఫేషను. రాహుల్ గడ్డం అడవిలా పెరిగిపోయింది, బూచాడులా ఉన్నడన్నడో రాజకీయుడు, మరొకడు ఉండగా ఉండగా గాంధీ ఫేసు సద్దాంలా టుర్నింగ్ ఇచ్చుకుంటోందే అని జోకేడు. ఇది జోక్ కాదురా అని గోకేరు కొంతమంది. రాహుల్ కి మద్దతుగా గడ్డం పెంచడం మొదలెట్టా. మావాళ్ళంతా బలవంతం చేసి గీయించేసేరు, ఈ నిరవాకానికి గెడ్డమొకటా, అని.ఇంతోటి అందానికి వీసేబులం పసుపా అని నానుడి. అదేంటొ అందరూ మద్దతుగా నడుస్తున్నారు కాని గడ్డం ఒకడూ పెంచటంలేదు.ఇంతకీ మా రాహుల్ బాబు గడ్డం పెంచుతున్నాడుగాని ప్రధాని అవుతాడా, మిలియన్డాలర్ కొచ్చను.

మాయలపకీరు ప్రాణం చిలకలో ఉంటే, మంత్రాలు గెడ్డంలో ఉన్నాయట. సాహసం శాయరా ఢింభకా! రాజకుమారి లభిస్తుందిరా! అని పదే పదే చెప్పిన పకీరుకి,  సరసానికి  గడ్డమెందుకు అడ్డం అనడంతో రాజకుమారి వరిస్తుందని గడ్డం గోక్కుంటే, చిలకలో ప్రాణం గుటుక్కు మనిపించాడు. 


మోడి గడ్డం పెంచితే, పెరిగిపోయిన గడ్డం మీద జోకులేసేరు.మొక్కేడేమో అన్నారు.ఇది కరోనా కాలం మాట.  ముంబై నుంచి ఒక అంబష్టుడు ( మంగలి అనకూడదట)వందరూపాయలు మనీ ఆర్డర్ చేసేడు, గడ్డం ట్రిం చేయించుకోడానికి. అంటే గడ్డం ట్రిం చేయించుకునే ఖర్చు వందా అని నిర్ణయం చేస్సేడు. 


పాతకాలం గడ్డం పెచితే ఏం? మీ ఆవిడ కడుపుతో ఉందా? అడిగేవారు. లేకపోతే తిరపతి ఎంకన్నబాబు మొక్కా? అనేవారు.ఇప్పుడు పెళ్ళాం కడుపుతో ఉండడంతో గడ్డం పెంచుకునేవాళ్ళున్నారా?ఏమో! ఇంతకీ ఇది గడ్డమా? గెడ్డమా? ఏది సాధువో తెల్వదు.

19 comments:

  1. మీరీ పోస్టుని మీ “గడ్డం” నిమురుకుంటూ వ్రాసారా, శర్మ గారు 🙂🙂? చాలా మేథోమథనం చేసినట్లున్నారు 👏.

    “గెడ్డం” అనే పదం నిఘంటువులో కనిపించడం లేదు. గడ్డం అని మాత్రమే చూపిస్తోంది మరి.

    ఎందుకొచ్చిన “కొచ్చెన్లు”, సింపుల్ గా సాధువులకు గడ్డం, అసాధువులకు గెడ్డం రిజర్వ్ చేసేస్తే పోలా 😁😁?

    ఏదో మన బోటి పాతకాలం 10% మినహా, ఈ “ఆధునికుల” కాలంలో 90 శాతం మంది గడ్డం పెంచుతున్నవాళ్ళే - భార్య కడుపుతో సంబంధం లేదు. ఆటగాళ్ళు, పాటగాళ్ళు, మోడళ్ళు, సినిమాలు సీరియల్స్ వాళ్ళు, నాయకుళ్ళు — ఒకరనేమిటి నానారకాల బవిరి గడ్డాలు, అరగుళ్ళూనూ. చూడడానికే కంపరం పుడుతోంది. చివరకు వీళ్ళంతా చేసిందేమిటంటే క్షురకుల బతుకుతెరువు మీద దెబ్బ కొడుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు16 December 2022 at 14:26
      మా వాళ్ళు గడ్డం తీయించేసిన కోపంలో రాసినదండి. మీరు బలే కనబెడతారు :) (జిలేబి స్టయిల్)
      అవునండి. సాధువులకే గడ్డాలుంటాయి, అసాధువులకుండవుట, మా సత్తిబాబు చెప్పేడండి :)
      ఇప్పటి ఫేషనే గడ్డం పెచడం సారూ! ఎంత బూచాళ్ళా కనబెడీతే అంత గొప్ప మేధావని అనుకోవాలని :)

      Delete
    2. మేధావా మట్టిగడ్డలా.
      ఫాషన్ అనే మాయాజాలంలో పడి గిలగిల్లాడుతున్న వెర్రిమొర్రితనం.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు17 December 2022 at 23:02
      ఏమో సారూ! నేడు నడుస్తున్నదదే!!!

      Delete
    4. ఒకప్పుడు గడ్డం చక్రవర్తి ఒకడే ఉండేవాడు, ఇప్పుడు అందరూ గడ్డం బాబులే...

      Delete
    5. bonagiri19 December 2022 at 20:45
      ఇది గడ్డాల సీజన్ లా ఉంది సారూ!

      Delete
  2. గడ్డమో గెడ్డమో ఏదో గాని మీ టపా మాత్రం డ్డం డ్డమ్ డ్డమ్ లాడించేరు

    ReplyDelete
    Replies
    1. Anonymous16 December 2022 at 21:19
      ఏం డమ్ డమ్ లో గాని మారాజా! నెల గడ్డం తీయించేసేరు. మీ రాహుల్ బాబా ప్రధాని అయ్యేదీ లేదు, ఈ జన్మకీ అనేసేరు. నెలగడ్డానికే దురద! గోక్కోడానికే సరిపోయేది సుమండీ!ఎంతన్యాయం! ఎంతన్యాయం!! చెప్పండి. ఇంతకీ మా రాహుల్ బాబా ప్రధాని అవుతాడంటారా?

      Delete
    2. అవుతారండీ. మోడీ గారి తరు వాత, అమిత్ షా గారి తరు వాత.

      Delete
    3. Anonymous18 December 2022 at 06:04
      ఎప్పుడు బాబూ!
      మోడీ మరో ఐదేళ్ళు
      ఆపై అమిత్ మరో పదిహేనేళ్ళు
      ఆ పై యోగి మరో పదిహేనేళ్ళు
      అప్పటికుంటానా?
      రాహుల్ ని ప్రధానిగా చూసే యోగం లేదంటారు, అంతేగా
      రాహుల్ బాబు త్రిదశుడు కదా!

      Delete
  3. జిలేబీ సాధువా అసాధువా ?

    ReplyDelete
    Replies
    1. మహాదుష్టు :)

      Delete
    2. జిలేబీ ఎప్పుడూ సాధుజీవిగా లేదు నాకు తెలిసి. ఎప్పడూ అసాధువే. కాని చాలాకాలంగా కనబడుట లేదు. సాధువుల్లో కలిసి ఉండవచ్చును.

      Delete
    3. శర్మ‌ గారే జిలేబియా ?

      Delete
    4. Anonymous19 December 2022 at 04:06
      అయ్యో! అపోహ బాబూ!! తెలిసినవారెవరూ అనుకోరు

      Delete

    5. శ్యామలీయం19 December 2022 at 00:21
      జిలేబి ఎప్పుడూ అసాధువుననే చెప్పుకుంది, తెలియలేదా?
      సాధువులకు గడ్డాలుంటాయి, అసాధువులకుండవుగదా!
      తను గడ్డం ఉన్న అసాధువు.
      తెరియమా :)

      Delete
    6. Anonymous18 December 2022 at 06:05
      మీరెవరో కన్యాశుల్కం నాటికలో లుబధావధానుల్లా ఉన్నారే :) ( ఏమనుకోవద్దూ సరదాకే సుమా)
      ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదుటండీ!!
      సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
      నబ్రూయత్ సత్య మప్రియం

      Delete
  4. 2004 లో వాజపేయి గారు ఓడిపోతారని ఎవరైనా అనుకున్నారా?
    ఏమో, రాహుల్ త్వరలో ప్రధాని అయినా అవ్వొచ్చు.

    ReplyDelete
    Replies
    1. bonagiri19 December 2022 at 20:20
      సారూ, ఆశపడటం తప్పు కాదు కద సార్! కాని కాలం కలిసొచ్చేలా లేదే అన్నదే పాయింటు కదా!

      Delete