Wednesday 17 August 2022

కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

 కైక రాముని వనవాసం పద్నాలుగేళ్ళే ఎందుకడిగింది?

ఈ ప్రశ్న ఎక్కడో చదివాను, సమాధానం చదవలేకపోయా! నాకు తోచిన సమాధానం ఇదీ!!!

ఈ ప్రశ్నలోకి వెళ్ళే ముందు ఆస్థులు,అనుభవహక్కులు,వాటి కాల దోషం గురించి కొద్దిగా ముచ్చటిద్దాం.

ప్రామిసరీనోటు కాలం మూడేళ్ళు, ఆ లోగా చెల్లు వేయడంగాని,తిరగరాయడంగాని, కొంత జమకట్టడం గాని జరగాలి. మూడేళ్ళు దాటిన మరునాడు ఆ నోటు చెల్లదు. నోటు చచ్చిపోయిందంటారు, దానినే కాలదోషం పట్టిందనడం, ఇంగ్లీష్ లో చెప్పాలంటే టైమ్ లాప్సు అయింది. ఇలాగే అస్థులగురించి కూడా!అనుభవహక్కులు,వాటి కాలపరిమితి వగైరాలు ఉన్నాయి. ఇవి ఏదో ఒకరోజులో వచ్చినవికావు. వేల సంవత్సరాలుగా కాలంతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవి, నేటి కాలానికి నోటు మూడేళ్ళకి కాలదోషం, ఏదేని ఆస్థిపై హక్కు నిరూపించుకునే పన్ను కట్టడం, అద్దెతీసుకోవడం, ఇటువంటివి పన్నెండు సంవత్సరాలు కనక యజమాని చేయక ఆస్థిని వదిలేస్తే, ఆ అస్థి అనుభవిస్తున్నవారి సొత్తవుతుంది. ఇప్పటికిన్నీ స్వాధీన తణఖా సమయం పన్నెండేళ్ళని నా ఎరుక. అదేగనక ప్రభుత్వ ఆస్థిని ఇరవై సంవత్సరాలు నిరాటంగా ఆక్రమించుకుని ఉంటే అది అనుభవదారుని స్వంతం ఔతుంది. ఇలా చాలా ఉన్నాయి, నేటి కాలానికి. ఇక ఇప్పుడు ప్రశ్నలోకి వెళదాం.

కైక రెండు వరాలు దశరథుని అడిగింది. అందులో ఒకటి రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చెయ్యాలి. పదునాలుగేళ్ళే ఎందుకడిగింది? ఎక్కువో తక్కువో అడగచ్చుకదా?

రామాయణం ఎప్పుడు జరిందంటే నిర్దిష్టమైన సమయం చెప్పడం కష్టం. ఆనాటికి నిలిచి ఉన్న ఆస్థి పై హక్కు కోల్పోడానికి సమయం పదునాలుగేళ్ళు. ఇది దృష్టిలో ఉంచుకునే రాముని వనవాసకాలం పదునాలుగేళ్ళుగా కైక అడిగింది. అంటే పద్నాలుగేళ్ళు వనవాసం తరవాత రాముడు మరల రాజ్యాన్ని స్వాధీనం చేసుకోలేడు, కాల దోషం పట్టింది కనక.

దశరథుడు మరణించాడు, రాముడు వనవాసంకి వెళ్ళిన తదుపరి. భరతునికి కబురంపేరు, మేనమామ ఇంట ఉంటే. వచ్చి విషయం తెలుసుకున్న భరతుడు అన్నదగ్గరకు పోయి రాజ్యం నీదే ఏలుకోమని కోరాడు. రాముడు ఒప్పుకోలేదు,పదునాలుగేళ్ళ తరవాత తిరిగివస్తానన్నాడు, ఎంత చెప్పినా. చివరికి రాముని పాదుకలు పుచ్చుకుని వచ్చి, వాటికి పట్టాభిషేకం జరిపించాడు, భరతుడు.

పదునాలుగేళ్ళ వనవాసం తరవాత వస్తాను, రాజ్యం ఏలుకుంటానని చెప్పినా. భరతుడు ఇలా ఎందుకు చేశాడు?

రాముని దగ్గరకు తిరిగి రమ్మని చెప్పడానికి కొంతమందే వెళ్ళేరు, ఇక్కడ ఏమి జరిగినదీ ప్రజలకి తెలియదు. పాదుకలు తెచ్చి వాటికి పట్టం కట్టకపోతే, పదునాలుగేళ్ళ తరవాత రాముడు కనక రాజ్యం తీసుకుంటే, రాముడు భరతుని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడని ప్రజలనుకోవచ్చు. అందుకే పాదుకా పట్టాభిషేకం, ప్రజలకి రాజ్యం రామునిదే అని చెప్పడానికి భరతుడు చేసినది. అలా అనుకోకుండడానికే భరతుడు పాదుకలు తెచ్చి పట్టం కట్టడమే కాక అయోధ్యలో కాక నంది గ్రామంలో ఉండి రాజ్య పాలన చేశాడు. భరతుడు రామునితో నీవు గనక పదునాలుగేళ్ళు దాటిన మరునాటికి అయోధ్యకి రాకపోతే నేను సన్యసిస్తానని చెబుతాడు. అందుకే రాముడు సమయానికి రాలేక హనుమతో వస్తున్న కబురు ముందుగాపంపినది.

మరొక సంగతి కూడా చర్చకు రావచ్చు అది భారతంలో  పన్నెండేళ్ళవనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది పందెం.ఎలాగైనా ఉండచ్చు. కాని ఇందులో కూడా పదమూడేళ్ళు అన్నది ఆ కాలంనాటి కాలదోష సమయం అనుకుంటున్నా.ఇవి వేల సంవత్సరాలలో ఆస్థి, అనుభవ హక్కుల్లో వచ్చిన తేడాలు.రామయణ కాలానికి కాలదోష సమయం పదునాలుగేళ్ళు, భారత కాలం నాటికి అది పదమూడేళ్ళయింది. నేటికి కాలదోష సమయం పన్నెండేళ్ళని చెప్పుకున్నాంగా. కాలదోష సమయం ఇలా తగ్గుతూ వచ్చింది.

26 comments:

  1. భారతం విషయంలో మీ తర్కం తప్పేమో. పాండవులు తమ ఆస్థుల్ని అప్పటికే జూదంలో కౌరవులకి కోల్పోయారు.

    ReplyDelete
    Replies
    1. Chiru Dreams17 August 2022 at 07:42
      /భారతం విషయంలో మీ తర్కం తప్పేమో. పాండవులు తమ ఆస్థుల్ని అప్పటికే జూదంలో కౌరవులకి కోల్పోయారు./

      పాండవులు అప్పటికే ఆస్థులు కోల్పోయారా లేదా అన్నది ఇక్కడ చర్చ కాదుగదా! పన్నెండేళ్ళ వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడేళ్ళు అన్నది కాలదోషాన్ని దృషిలో ఉంచికుని చేసిన పందెం నిర్ణయమని నా ఊహ. రామాయణకాలం, భారత కాలనికంటే ముందుది. రామాయణ కాలంలో పదునాలుగేళ్ళు ఉన్న కాలదోషం భారతకాలానికి పదమూడేళ్ళయింది, అదికూడా పన్నెండు+ఒకటిగా, అదేకదా నేడు కాలదోషం పన్నెండుకు చేరింది.

      కాదు మీ తర్కం తప్పంటారా? అస్తు!

      Delete
    2. చిరు గారూ. కొంచెం పొరబడ్డారు. జూదం ద్వారా వచ్చిన లబ్ధిని దృతరాష్ట్రుడు రద్దుచేసి జూదానికి పూర్వం ఉండిన పరిస్థితిని పునరుధ్ధరించాడు. పాండవుల సిరిని అపహరించాలని మరొకప్రయత్నం చేసారు దుష్టచతుష్టయం. దాయాదులకు నో అననని ధర్మరాజు ఒట్టువేసుకొని ఉండటం వలన పునర్ద్యూతం జరిగి, వనవాసమూ అజ్ఞాతవాసమూ నెత్తిన బడ్డాయి పాండవులకు.

      Delete
    3. ఇది నాకు తెలియని కొత్తవిషయం. రిఫరెన్స్ ఇవ్వగలరా?

      Delete
    4. వెతికి పట్టుకోవోయ్ అంతా అరటిపండు ఒలిచి యిస్తే తినేసే రకంగా వున్నారే

      Delete
    5. అల్రెడీ వెతికిపట్టిన మీలాంటి పండితోత్తములుండగా.. మాలాంటి అర్భకులకు వెతకాల్సిన అవసరమేమి గురువర్యా?

      Delete
    6. శ్యామలీయంలో వ్రాసాను చూడండి.

      Delete
    7. రిఫరెన్సు అడిగాను. దానిగురించి చెప్పండి. అంతేగానీ.. ఫలానా గ్రంధంలోవుంది అంటే పై అనామక పండితులుగారి వ్యాఖ్యలాగే వుంటుంది.

      Delete
    8. చిరు గారు,

      మీరు శ్యామలీయంలో ఇచ్చిన వ్యాసాన్ని చదివారని భావిస్తున్నాను. నేనే ప్రస్తావించినది వ్యాసభారతం లోని సంగతి అని గ్రహించారని కూడా భావిస్తున్నాను.

      వ్యాసులవారి మూలమే మనకు రిఫరెన్సు. గీతాప్రెస్ వారు మూలం తెలుగులిపిలో తాత్పర్యాలతో ముద్రించారు. అవి చూడండి.

      Delete
    9. కొంత అస్పష్టంగా అనిపించి మిమ్మల్ని మరలా ప్రశ్నించవలసివస్తున్నది. మీరుచెప్పిన విషయం మహాభారతంలో ఎక్కడవ్రాయబడివున్నదనే నేను అడిగాను. ఎందుకంటే నాకున్న స్వల్పజ్ఞానంతో చదివినప్పుడు అది కనబడలేదు.

      Delete
    10. ఈ వ్యవహారం అంతా సభాపర్వంలోనికి వస్తుంది. కథా సందర్భం తెలుస్తోంది కదా వెదుకటం కష్టం కాకూడదు.

      Delete
    11. ఏ లైనో ఎన్నో పేజీయో చెబ్తే ఏమన్నా సొమ్ములు పోతాయా ? అంతా పండితుల పైత్యం కాదా యిది?

      Delete
  2. యుగానికి యుగానికీ ఆయుఃప్రమాణాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి కదా సారూ 😁.

    అసలు విషయానికొస్తే ప్రస్తుత కాలదోష పరిమితి పన్నెండేళ్ళు కాబట్టే తనఖా రుణాల అర్జీతో పాటు గత 13 సంవత్సరాల ఎన్-కంబ్రెన్స్ సర్టిఫికేట్ (Encumberance Certificate - ఈ.సీ. అని వాడుక పదం) సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు నుంచి తీసుకు రమ్మని బ్యాంకుల నిబంధన అని మీకు తెలిసిన విషయమే.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు!

      అవును కదా!
      నేటికున్న చట్టాలు పాతకాలంలో సంఘంలో ఉన్న ఆచారాలనికూడా ప్రతిబింబిస్తుంటాయి. చట్టం చేసేటపుడు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకుంటారు, చట్టం చేయడం అంత తేలికైన సంగతికాదు కదా!
      ఇ.సి పదమూడేళ్ళకే ఎందుకు తీసుకుంటారో చాలామందికి తెలియదు. అసలు ఇ.సి అంటే కూడా తెలియదేమో!పదమూడేళ్ళ ఇ.సిలో తొంబైతొమ్మిది సంవత్సరాల లీజులాటివి ఉండవనుకుంటానండి. విషయం తెలియదు.కాలం మారిపోతోంది కదండీ :)

      Delete
  3. మహాభారతం గురించి పైన జరిగిన చర్చలో అంశాల గురించి … నేను “పండితుడను” కాను గానీ … నా వైపు నుంచి ఒకమాట. సంబంధిత పద్యాల రిఫరెన్స్ ఇక్కడ చదువరుల సౌలభ్యం కోసం ఇచ్చే ప్రయత్నం.

    ద్యూతక్రీడ మహాభారతం సభాపర్వం లోని చివరి ఘట్టం (దాని తరువాత అరణ్యపర్వం మొదలవుతుంది కదా). ఇక్కడ నేను పేర్కొనే అంశాలన్నీ కూడా టిటిడి వారి ప్రచురణ కవిత్రయం (నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ) వారి “శ్రీమదాంధ్ర మహాభారతము” సభాపర్వం సంపుటి లోనివి.

    డౌన్ లోడ్ చేసుకోవడానికి 👇
    https://ebooks.tirumala.org/downloads/maha_bharatham_vol_3_sabha_parvam.pdf
    ——————
    సభాపర్వం ద్వితీయాశ్వాసం
    పద్యాలు 257 - 267 ; ముఖ్యంగా పద్యం 264
    పేజీ 370 -373
    ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలివ్వడం, పాండవులను దాస్యవిముక్తులను చెయ్యడం, జూదంలో పోగొట్టుకున్న రాజ్యసంపదను తిరిగి వారికిచ్చెయ్యడం.
    -------
    పద్యాలు 274 - 275 (పేజ్ 376)
    రెండోసారి జూదానికి రమ్మని ధృతరాష్ట్రుడు కబురంపితే … తండ్రి ఆజ్ఞ అని ధర్మరాజు రెండవసారి జూదానికి వెళ్ళడం.

    (పైన “శ్యామలీయం” గారు చెప్పిన ధర్మరాజు “ఒట్టు” ప్రస్తావన కవిత్రయంలో లేదు. మూలమైన వ్యాసభారతంలో ఏమన్నా ఉందేమో మరి?)
    -------------
    పద్యం 278 క్రింద “విశేషం" అనే పేరాలో రెండోసారి జూదం, దాని పందెం (వనవాసం, దాని తరువాత అజ్ఞాతవాసం) వెనకనున్న ప్లాన్ వివరణ.
    పేజ్ 378
    ------————-

    శర్మ గారి ఈ బ్లాగ్ పోస్ట్ భావం … ఎంత కాలం దూరంగా ఉంటే ఆస్తి మీద హక్కు కాలదోషం పడుతుందో, అది ఒక యుగానికీ ఒక యుగానికీ ఎంత మారిందో … వివరించడమే అని నా అభిప్రాయం.

    ReplyDelete
  4. విన్నకోటవారూ! మనం ఇక్కడ మాట్లాడాల్సింది వ్యాసుడు రచించిన మూలగ్రంధంనుంచి. అనువాదాలెప్పుడూ.. ఆయావ్యక్తులు తమకనుకూలంగా మార్పుచేసుకున్నవేవుంటాయి.

    ReplyDelete
  5. Chiru గారు,
    // “ అనువాదాలెప్పుడూ.. ఆయావ్యక్తులు తమకనుకూలంగా మార్పుచేసుకున్నవేవుంటాయి.” //

    అదేమో నాకు తెలియదు గానీండి ఆంధ్ర మహాభారతానికి కవిత్రయ విరచితమే ప్రామాణికం అని పెద్దలు అంటారు.

    మీకు మూలగ్రంథం నుంచే కావాలి అంటే దాని మీద “శ్యామలీయం” గారో బ్లాగ్ పోస్ట్ వ్రాసినట్లున్నారు కదా. మూలగ్రంథ ప్రతులు నా వద్ద లేవు.

    ReplyDelete
  6. వ్యాసులవారి మహాభారతం తెలుగులిపిలో గీతాప్రెస్ వారి వద్ద లభిస్తుంది. ఈమాట ఇప్పటికే చెప్పినట్లు గుర్తు. కవిత్రయం తమ ఆంధ్రీకరణలో ఉద్దేశించిన ప్రయోజనం గురించి నావ్యాసంలోనే సూచించాను. వారికి సనాతనధర్మప్రయోజనం మీద తప్ప స్వప్రయోజనం పైన దృష్టి లేదు. ఆవ్యాస విషయం ఏదన్నా ఆక్కడే ప్రస్తావించమని చదువరులకు నా విన్నపం.

    ReplyDelete
  7. అందరికీ కవిత్రయాన్ని చదువమని నాసూచన. ఆతరువాత వీలైతే విశేషాంశాలను మూలం నుండి గ్రహించండి. లేదా తెలిసిన వారి నుండి గ్రహించండి. మేము ఏమీ చదువుకోము. కాని ప్రశ్నలు వేస్తాము. అన్నిటినీ వినికిడి కథల (సినీమాలూ నాటకాలూ బుర్రకథలూ బాలల బొమ్మల పుస్తకాలూ టీవీ సీరియళ్ళూ వగైరా) మాధ్యమాల ఆధారంగా చర్చలు చేస్తాం అంటే ఎలాగు?

    మీరు నమ్ముతారో లేదో కాని, శూర్ననఖ రాముడి చెల్లెలు కదా అన్న వారినీ ఒక చర్చలో చూచాను నేను.

    ReplyDelete
    Replies
    1. >>మేము ఏమీ చదువుకోము. కాని ప్రశ్నలు వేస్తాము. అన్నిటినీ వినికిడి కథల (సినీమాలూ నాటకాలూ బుర్రకథలూ బాలల బొమ్మల పుస్తకాలూ టీవీ సీరియళ్ళూ వగైరా) మాధ్యమాల ఆధారంగా చర్చలు చేస్తాం అంటే ఎలాగు?

      బాబూ శ్యామలీయం! నువ్వు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వడూ ఏమీ చదవడు అనే కుతినుబంచి బయటకురా ముందు. సమాధానం చెప్పలేక దాటేసేవేశాలు నీదగ్గర, నీలాంటోల్లదగ్గర చాలా చూశాం.

      Delete
  8. వ్యాసభారతం తెలుగులిపిలో లభ్యమైనప్పటికీ భాష సంస్కృతమే కదా. కాబట్టి సంస్కృతం రానివారు మీరన్నట్లు తెలుగులో కవిత్రయాన్ని చదవడం ఉత్తమం. లేదా పురిపండా అప్పల స్వామి గారు వ్రాసిన వచనభారతం ఉంది. మహాభారత కథ గురించి అవగాహన వస్తుంది.

    ReplyDelete
  9. చిరు గారు, నేను సమాధానం చెప్పలేక దాటవేయటం ఏమీ చేయలేదే? మీ సౌలభ్యం కోసం విపులంగా ఒక టపాయే వ్రసానే మీ సందేహనివృత్తి కోసం? ఇంక దాటవేయటం అన్న మాటకు తావేముంది? అంత వివరంగా చెప్పినా మీరు అదెక్కడ ఉన్నదీ అని అడిగితే మరలా చెప్పాను కదా సభాపర్వంలో ఉంటుందీ అని. మీరు మాటతూలటానికి నాకైతే కారణం కనిపించటం లేదు. అది మీ ప్రవృత్తి కాబోలు. ఐతే ఒక్క విషయం. మీసందేహాన్ని గురించి సమాధానం వ్రాయటం ఇంకా మరికొందరికి కూడా ఇటువంటి అనుమానం ఉంటే ఉపకరిస్తుంది అన్న దృష్టితోనే‌. ఐతే అనంతమైన చర్చలకూ, నిరుపయోగమైన చర్చలకూ, సభామర్యాద పాటించని వారితో చర్చలకూ నాకు వీలుపడదు. కాబట్టి ఈమాటలతో విరమిస్తున్నాను. (మీరు అమర్యాదగా నన్ను సంబోధించినంత మాత్రాన మీకు కొత్తగా కలిగే గౌరవమూ నాకు కొత్తగా కలిగే అగౌరవమూ ఏమీ ఉండదు. నేను ఎప్పటిలాగే సముదాచారాన్ని మీరకుండానే మీకు సమాధానం వ్రాసాను - గమనించగలరు)

    ReplyDelete
    Replies
    1. మర్యాదలు ఇచ్చినతర్వాతే పుచ్చుకోవాలి. "వ్యాసభారతమే అసలైంది అదితప్ప మిగితావేవీ పనికిరావు" అని ఎన్నోచోట్ల మాట్లాడి, రిఫరెన్సూడిగ్తే నేనింతకుముందు "వేరెచోటరాశానూ వెల్లి చదుకో" అని కప్పదాటుమాటలెందుకు? ఎవడికైనా తనునమ్మినదానిమీద అభిమానముండడం సహజం. నేనుతప్ప ఇంకెవ్వడూ చదవలేదనే మూఢనమ్మకతో అవతలివాడ్ని దెప్పిపొడిచి "నాకు మర్యాదలేదూ. మీకు సభామర్యాద తెలీదూ" అని జంపైపొయ్యే చావుతెలివితేటలు ఎన్నోచోట్ల చూశాను. అస్సలువ్యాసమహాభారతం చదవకుండానే.. ఏదేదో ఇరికింపులతో మనంచేసిన ఎధవపనులుకప్పిపుచుకునే పిట్టకథలు అవన్నీ అని ఇలాంటి బుకాయింపులుచూసే నమ్మాల్సొస్తుంది.

      Delete
  10. చిరు గారు, మర్యాదను ఉల్లంఘించి ఏకవచనంలోనికి దిగినది మీరే కాని నేను కాదు. వ్యాసభారతం కాని ఇతర భారతాలు పనికిరావు అనలేదు - కవిత్రయం ముందుగా అధ్యయనం చేయమనే చెప్పాను. నేరుగా కల్పితగాథలకు నెలవుగా ఉండే వాటిని వదలమన్నానంతే. ఇంతకు ముందే వ్రాసాను చదువుకొమ్మన లేదండీ - మీ‌ప్రశ్న తరువాతనే నాటపాను వెలువరించాను - ఒక చిన్న వ్యాఖ్యలో ఇమడదు కాబట్టి. ఇంకెవ్వరూ చదవరనో చదువలేరనో అనలేదే - మిమ్మల్ని దెప్పిపొడిచిందీ లేదే - సభామర్యాదను మీరుతున్నారని చెప్పానంతే. ఇరికింపులూ - బుకాయింపులూ - పిట్టకథలూ అంటూ ఏవేవో అంటున్నారు -వ్యాసభారతమూ కవిత్రయమూ అటుంచి కనీసం మహాభారతకథని గురించి మీకు కనీస అవగాహన కూడా ఉన్నట్లు తోచదు - అటువంటి మీరు నన్ను ఎందుకు తప్పుపడుతున్నారు? పోనీయండి ఇక వాదన వద్దు. నేను మీకోసమే‌ కాక ఇతరుల సౌలభ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వ్రాసిన టపా గురించి మీతో సుదీర్ఘంగా అనవసరమైన చర్చను కొనసాగించలేను.

    ReplyDelete
  11. మిత్రులు శర్మ గారు, చిరు వంటి అసమంజసులతో నిష్కారణమైన మాటలు పడుతూ ఉండటం అవసరం కాదని అనిపిస్తోందండీ. తివిరి ఇసుమున దైలంబు తీయవచ్చు అన్న పద్యం గుర్తుకు వస్తోంది. మీరు ఇటువంటి వారిని దేవిడీమన్నా చేస్తారో లేదో మీయిష్టం. నేను మాత్రం దేవిడీమన్నా చేస్తున్నాను.

    ReplyDelete

  12. వాద ప్రతివాదాలకు నా బ్లాగు వేదిక కాదు. ఇప్పటివరకు సహించాను. ఇకముందు వాదప్రతివాదాలు ఇక్కడ కుదరవు.

    ReplyDelete