Wednesday 26 January 2022

అమ్మో నొప్పి!

 అమ్మో నొప్పి!


అమ్మో! నొప్పి,ఒళ్ళంతా నొప్పులే, నోరు చేదు, పంచదార, కారం కూడా చేదుగా ఉన్నాయి. కడుపులో వికారం, లేస్తే తూలు,నిద్దర పట్టటంలేదు, ఆకలి లేదు చెప్పుకొచ్చారు, మనవరాలు, అబ్బాయి, జమిలిగా.విన్నాను, నేనెవరితో చెప్పుకోను అని మనసులో అనుకుని వీళ్ళని ఏమార్చాలని పిట్ట కత చెప్పేనిలా!


కర్ణాటక సంగీత కచేరీ చూశారుగా, అందులో గాయకుడు, అతనితో పాటు మృదగం, వయొలిన్, కంజీరా, ఘటం,మోర్సింగ్ వాయించేవాళ్ళూ ఉంటారు. సభ ప్రారంభం చేస్తూనే గాయకుడు పాడితే వయొలీన్,మృదంగం అనుసరిస్తాయి. రాగ ప్రస్తారం తరవాత గాయకుడు పాట అపుతాడు, అక్కడినుంచి వయొలిన్, ఘటం, కంజీరా, డొలక్,మోర్సింగ్ ఈ పక్క వద్యాలన్నిటికి సమయంఇస్తాడు. అందరూ పాట మొత్తాన్ని ఒకసారి పాడి వాయించి సభ ముగిస్తారు. మేం అడిగినదానికి మీరు చెప్పేదానికి అన్వయం కుదరలేదు తాతా అంది మనవరాలు. చెబుతా విను అనిమొదలెట్టా. 

గత పదిరోజులుగా ఒమిక్రాన్ అమ్మవారు మన ఇంట సభ జరిపింది కదా! ఆవిడతో పాటు జ్వరం,దగ్గు,రొంప కూడా వచ్చాయిగా, పక్క వాద్యాలలాగా. ఆవిణ్ణి శాంతింపజేయడానికి, మందులువాడేం.అవి మరికొన్ని పక్క వాద్యాలు.ఆవిడ పాట పాడి ఆపింది, ఇకపై పక్క వాద్యాలు ప్రతాపం చూపుతున్నాయి, కొన్ని రోజులు బాధలు తప్పవని ముగించాను.


2 comments:

  1. Replies

    1. లక్ష్మీ'స్ మయూఖ
      కరోనా తగ్గించుకోడానికి మందులు, ఆమందుల విలక్షణాలను తగ్గించుకోడానికి మందులు, ఇదొక శృంఖల. ఎక్కడో ఒక చోటతెగ్గొట్టుకోవాలి. కొన్ని మల్టి విటమిన్లు మింగుతూ ఇతరత్రా ఆరోగ్యం వృద్ధి పరచుకోవాలి.వెంటనే ఏం చేయలేక పిట్ట కత చెప్పి వాళ్ళ మనసు మళ్ళించానంతేనండి.

      ఆకటి వేళల అలపైన వేళల
      ఓపినంత హారినామమే దిక్కు మరిలేదు
      సంకెలబెట్టిఅవేళ, చంపబిలచినవేళ
      ఓపినంత హారినామమే దిక్కు మరిలేదు

      Delete