Friday 2 April 2021

ఫలాహారం

 




 ఫలాహారం

పలహారం

ఫలహారం

ఏది ?

అసలు మాట?


24 comments:

  1. ఏమో సర్, తెలుగు భాషా పండితులే చెప్పాలి.

    ఫలహారం అనే మాట సరైనది అనుకుంటాను ఉపాహారం అనే అర్థంలో. ఒత్తులు పలకలేని వాళ్ళు “ప” ల హా రం అని పలుకుతారేమో హ్హ హ్హ హ్హ (jk 🙂).

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు
      వాడుకలో మాటిదే

      Delete
  2. పలారం.. అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,
      బాగా అధునికులు వాడే మాటేమోనండీ :)

      Delete


  3. एदो पेट्टारु कदा तिनि पोकुंडा ई विश्लेषण लेला तातगारू :)


    ReplyDelete
    Replies
    1. అమ్మణ్ణీ,
      అవి
      దానిమ్మ గింజలు
      లంక దోసకాయ ముక్కలు
      జాంపండు ముక్కలు
      కమలా ఫలం
      ఆపిలు ముక్కలు
      ఖర్జూరం.
      ఇదే మొన్నటి ఉదయపు ఫలాహారం

      Delete
    2. The food to save my life

      Delete
    3. Any thing on earth is not costly than my life, as I am in danger.

      Delete
  4. ఫల‌+ఆహారం=ఫలాహారం. ఇదె సరైనది. అంటే ఆపూటకు పండ్లనే ఆహారంగా స్వీకరిచటం అన్నమాట. ఫలహారం అన్నది ఫలాహారానికి భ్రష్టరూపం. పలహారం అన్న పదం లేదు భాషాపరంగా. కేవలం గ్రామ్యంగా వాడుక మాత్రం ఉంది. (పలలాహారం సంగతి అడగకండి శర్మ గారూ పలలం అంటే మాంసం)

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,
      మొన్ననొక గ్రామీణ యువతి ఫలాహారం మాట వాడితే మొదలయిందీ కత. :)

      Delete
  5. ఫలాలను ఆహారము వలే భుజించే చర్య కావున ఫల+ఆహారం=ఫలాహారం. కొద్ది మొత్తంలో సేవించే ఆహారం కనుక అల్పాహారం. ఫ్రూట్స్, నట్స్ వాడి సలాడ్ లా తయారు చేసుకుని ఆరగిస్తారు కాబట్టి ఫాస్టెస్ట్ బ్రేక్, రాత్రి తిండికి, పగటి మొదటి తిండికి నడుమన గ్యాప్ ను పూర్తి చేయదల్చేది కాన పలారం. ఇది తినకుండ వేరేది తినటానికి ఉండదు. పోని అలా తినకుండా నీరసించి తరువాత తినగలిగితే అదే బ్రంచ్ లేదంటే ఔతుందదే ఉపాహారం. యాప్లీస్, దామనిపోల్, స్యాంట్రకాయ, జామ్‌గాయ కట్ పీసెస్ ఉంటే ఫ్రూట్ ప్లాటర్. ವಿಶ್ಲೇಷಣ ಸಮಾಪ್ತಮಾಯಿತು ಶರ್ಮಾಚಾರ್ಯ. ಫ್ರೂಟ್ ಸಲಾಡ್ ಬೇಕೋ ನೋದಿ ಧನ್ಯವಾದಗಳು.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      బ్రంచ్ కొత్తమాట వెయ్యండి వీరతాడు.

      Delete
  6. ఇడ్డెన్లూ దోసెలుగద !
    అడ్డెడ్డే ! వీటిని పలహార మనెదరా !
    లడ్డూ కారా పెండ్లిల
    వడ్డించి పలార మండ్రు , ఫలముల కాదే !

    ఐనా , తిని తొంగోక , క
    రోనా వేళల , ఇదేమి రోగ - మని జిలే
    బీ నళినాక్షి యడిగెడిని ,
    దీనన్ నాతప్పులేదు , దేఖో సారూ 🙏 .









    ReplyDelete
    Replies
    1. ఫలాహరం అదే లోకంలో ఫలహారం అన్న పదం యొక్క యౌగికార్ధం గురించి చెప్పాను. లోకవ్యవహారంలో ఉపాహారాన్ని ఫలయుక్తమైనా కాకపోయినా ఫలహారం అంటూ ఉండవచ్చును దానికేం.

      Delete
    2. రాజావారూ,
      అంతే అంతే

      Delete
  7. ఆంధ్రభారతి నిఘంటువులో చూసాను

    అల్పాహారము : ఉదయము తిను ఇడ్లీ వంటి కొద్దిపాటి తిండి, నాస్తా.

    ఉపాహారము: చిఱుతిండి-అల్పాహారము.

    ఫలహారీ : సంస్కృత-ఆంధ్ర నిఘంటువు (వ్యుత్పత్తి, నిర్వచన సహితంగా) (ముదిగంటి గోపాలరెడ్డి) 2019 - [ఫల+హృ+ణిని+ఙీప్, ఫలం హరతి] ఫలమును హరించునది. కాళికాదేవి.

    ఫలహారము:
    ఉపాహారము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 - చిఱుతిండి, నలితిండి, ఫలహారము.

    శ్యామలీయం గారు: ఈ రోజులలో బ్రాహ్మలతో సహా అందరునూ పలలములు తినుచుంటిరని వినియున్నాను. విశ్వామితృలవారే గ్రామసింహపు పలలము తినిరని యొక కధ కలదు. దీని విషయమై వివరణ ఈయగలరు - మీకు తెలిసినచో.

    శ్రీధరులు - బ్రంచ్ అనగా - బ్రేక్ఫాస్ట్ + లంచ్ - ఆ రెండు మాటలూ కలిపి బ్రంచ్ అందురు. రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయముననే పదకొండు గంటలకి కానీ నిద్రలేవని జాతులకి ఇవి వర్తించును. మీరునూ ఒక పదము తయారు చేయవచ్చును - బ్రంచిన్నర్ అనుచు - బ్రేక్ ఫాస్ట్ + లంచ్ +డిన్నర్. ఇది రోజుకి ఒకేసారి తిను జనులకు వర్తించుకోవచ్చును.

    శుభం భూయాత్ - ప్లవ నామ సంవత్సర "చైత్ర మాసం" శుభాకాంక్షలు ;-)

    ReplyDelete
    Replies
    1. డీజీ గారు, మీ ప్రతి స్పందనకు ధన్యవాదాలు. మీకూ కూడా కోవి"ప్లవ" నామ ఉగాది కి ముందస్తు శుభాకాంక్షలు.
      శార్వరి లో కోవిడ్ వచ్చింది భారతావనినా.. దాని వినాశనానికై విప్లవ టీక కనుగొనిన వేళ కోవిడ్+ప్లవ=కోవిప్లవ ఐనాది.

      Delete
  8. పేరు "కోవిప్లవ" బాగానే నప్పింది కానీ టీకా వచ్చింది శార్వరి లోనే కదా? ప్లవ ఇంకా రాలేదండి. మరో వారం ఉంది. శార్వరి అంటే చీకటి అని అర్ధంట. పేరు సార్ధకం చేసుకుంది దరిద్రపు సంవత్సరం. పీడా విరగడైంది లెండి. మరి ప్లవ అంటే అంటే ఏమిటో అది ఏమి పట్టుకొచ్చి మన నెత్తిమీద రుద్దుతుందో పండితులు చెప్పాలి. తాతగారు, ఈ శార్వరి ఇలా తగలబడింది. అరవై ఏళ్ల క్రితం వచ్చిన శార్వరి కూడా ఏదైనా విపత్తు తీసుకొచ్చిందాండి? మీకు తెలిస్తే చెప్పగలరు. నమస్తే

    ReplyDelete
    Replies
    1. DG గారు,
      కాలం మారలేదు, మనుషుల బుద్దులు మారేయి, పెడతోవ పట్టేయంతే :)

      Delete
  9. కోవిప్లవ పేరు బాగానే ఉంది. కానీ ఏదైనా విప్లవం రాదు కదా🤔?

    ReplyDelete
    Replies
    1. Immunization Revolution Raavochchu, VNR Aachaarya, Because, we of a mixed generation did not even think of such a pandemic that could run over span of thirteen months.

      Delete
    2. // “ a pandemic that could run over span of thirteen months.” //

      అయినా ముగింపు కనుచూపుమేరలో లేదు, శ్రీధరా 😒.

      Delete