Wednesday, 31 December 2025

గడచిన సంవత్సరం 2025

 గడచిన సంవత్సరం 2025


2019లో అనుకుంటా,రతన్ టాటా గారిని అడిగారట. 'ఈ సంవత్సరం మీరు సాధించిందేమిటీ?' అని, దానికి వారు 'ఈ సంవత్సరం బతికున్నాను,అదే ఘనకార్యం' అన్నారట. ఆ సంవత్సరంలో పెద్దవయసు వాళ్ళు చాలామంది కాలంచేసేరు,కరోనా మూలంగా. అప్పటికి ఆయన వయసు 80 దగ్గరనుకుంటా.
ఇప్పుడెందుకిదని అనుమానం రావచ్చు. నాకు తొమ్మిదో పది సమయం కనుచూపుమేరలో కనపడుతోంది. గత సంవత్సరం ముక్కుతోనో మూలుగుతోనో గడిపేసాను. రోజు గడిస్తే పండగ,బోనస్సు అనేలా గడుస్తోంది.
కుంతీ దేవి మేనల్లుడే ఐన శ్రీ కృష్ణుని ఇలా వేడుకుంటుంది.


యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి

చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!


శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!


ఇందులో వేడుకోలు  
 అంటే, ఈ భవలతలు అనగా ఇహలోక బంధాలను తుంచెయ్యవయ్యా, ఆంటుంది. పాండవులందు యాదవులందు మోహ విఛ్ఛేదము,     ఇలా ఒక్క కొడుకులనే కాదు అటు పుట్టింటివైపు వారిమీదా తనకున్న బంధాలను తుంచేలా చెయ్యమంది. ఇలా వేడుకున్నా చివరిదాకా కుంతికి భవలతలు వదలలేదు. అలాగే నాకున్నూ ఈ భవలతలు వదలటం లేదు. ఇవి ఎంత సున్నితం అంటే సాలెపురుగు తననోటి నుంచి స్రవించిన ద్రవంతో అల్లే సాలెగూటి దారమంత సున్నితంగా కనపడతాయి. చిత్రం ఆ సాలెగూటి దారం పెనుగాలివానలకూ తెగదు. నిజo 100 కి.మీ వేగంతో వీచేగాలి దానిని తెంపలేదు.అలా నేటికిన్నీ భవలతలు కొత్తకొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నా ప్రయత్నం వ్యర్ధమవుతూనే ఉంది.



https://kasthephali.blogspot.com/2024/05/blog-post_24.html

విష్ణుమాయ దేనినీ వదలలేకపోతున్నాని తెలుసు, కాని సంపూర్ణ శరణాగతి చెయ్యలేకపోతున్నా! అదే విష్ణుమాయ. దానిని దాటడానికి మహామహుల ప్రయత్నాలే చెల్లలేదు,నేనెంత? అలా అని ఊరుకోలేకపోతున్నా! ఎప్పటికి ఆయన దయ కలుగుతుందో!



శాంతి శాంతి శాంతిః

స్వసి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం
గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా సుఖినో భవంతు. 
ఇక సెలవు
🙏🙏🙏

50 comments:

  1. మన మెవరయ్యా ! అతడికి
    మనసైతే దప్ప , ఇదిగొ మానేస్తా నం
    చన , మాచన ! కర్తలమా ?
    విను , నడిపించెడి యతండు విష్ణుం డయ్యా !

    ReplyDelete
  2. ఆయు రారోగ్య భాగ్య సౌఖ్యాల నిచ్చి
    నవ వసంతంబు మిమ్ముల నడుపు గాత !
    నవ నవోన్మేష సంతోష యవనికలకు
    బాట లిడుగాక ! క్రొత్త సంవత్సరమ్ము .

    ReplyDelete
  3. రాజావారు,
    ఆంగ్ల నూతనవత్సర శుభకామనలు. నూతన వత్సరాన మీకు వేయి శుభములు కలుగుగాక.

    ReplyDelete
  4. వెంకట రాజారావు . లక్కాకుల31 December 2025 at 22:30
    రాజావారు,
    నిజమే! ఆలోచన,ఆచరణ చేయించడం సర్వం హరిదే! ఎలా నడిపిస్తే, అలా నడవక తప్పదు. విధి బలీయం. మీ ఆకాంక్షకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు
      ఆంగ్ల నూతనవత్సర శుభకామనలు. నూతన వత్సరాన మీకు వేయి శుభములు కలుగుగాక.

      Delete
  6. తెలుగు తాతగారికి

    నూతనవత్సర శుభకామనలు. నూతన వత్సరాన మీకు వేయి శుభములు కలుగుగాక.

    ఆయురారోగ్యములతో మీకు ఈ వత్సరము మరియు రాబోవు కాలము లభ్యమగును.
    మీరు మరిన్ని వ్రాస్తూ సర్వ జనహితాయ గా పేరొందవలె.


    ఇట్లు

    మీ శ్రేయోభిలా
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తాతకు క్రావడి యొప్పును
      త్రాత యనగ తెనుగుభాష రక్షకుడు సుమా !
      ఏతా వాతా తమరును
      ఈ తీరున తెలుగు భాష కేడుగడ కదా !

      Delete
    2. జిలేబి,
      నూతన సంవత్సర శుభాకంక్షలు. నూతన వత్సరం మీకు వేయి శుభములు కలగజేయుగాక.

      జ్యోతిషం చెబుతున్నావా? శని మీనంకి రాబోతున్నాడు.😂 ఇంకా పేరు? ఇంక కొత్తగా రాదులే!!😜
      సంవత్సరం మొదటి రోజుల్లోనే......బావోదని.

      Delete
    3. రాజావారు,
      క్రావడి కుదరదేమోనండీ. త్రాతా భవ జనార్దన.
      నిజం సార్! జిలేబి తెనుగు భాషకు కీడుగడ కదా శాంతం పాపం (కేడుగడ)ఏడుగడ,ఏడు గడయే కదా. తెనుగు భాష తెనుగునాట ఎక్కడుందీ? తెనుగు చదవగల ఆడపిల్ల కనపడటం లేదు. టెలుగూ డొంట్ అండర్ స్టాండ్. కెనాట్ రీడ్ అంటున్న అమ్మలున్న కాలం. ఇప్పుడు తెనుగు సింగపూర్ లోనూ అమెరికా బర్కిలీ లోనూ ఉందష. మాదే తెనుగు,మేమే నిక్కచ్చి తెనుగువారం అని చెప్పుకుంటున్నారు కాదా!

      Delete
  7. తాతా వారు గురువరుల్
    తోతావరి తీపి సరి హితోక్తులకున్ బ్లా
    గ్గీతాచార్యుల్ వ్రాయుట
    యే తడవు జనాళి వత్తురెగిరెగిరి గదా

    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      ములగచెట్టు ఎక్కించెయ్యకు 😂. అది తోతావరి కాదు తోతాపురి మామిడి రకం. పెద్ద తియ్యగా ఉండదు,దీనిని మేము కలక్టర్ కాయ అంటాం. ఉన్నజానలని తోలేసేవు బ్లాగులనుంచి...ఇంకా పరుగెట్టుకొస్తారా? వామ్మో!!

      Delete
    2. మీ ఇద్దరి సరసం భలే ఉంటుందండి!

      Delete
    3. బోనగిరిగారు,
      సునిసిత హాస్యం,కొద్ది వ్యంగ్యం కలసిన వెంట వెంటనే చెప్పే జవాబు సంభాషణను రక్తికట్టిస్తుందని వేరుగా మీలాటివారికి చెప్పగలనా!

      బ్లాగుల్లోకొచ్చిన కొత్తలో నా సంభాషణ మరీ కటువుగా ఉండేది. (కట్టె విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడతారేం అనేది ఇల్లాలు) నిజం చెప్పద్దూ! జిలేబి మొహం చూస్తే చాలండి అన్నీ నిజాలే తన్నుకొచ్చేస్తాయి,కక్కు తన్నుకొచ్చినట్టు😜.

      ఇది జిలేబి దగ్గరనుంచి నేర్చుకున్నదే సార్!

      Delete
  8. శనియేడున్నర గా దో
    చెనుగా తండ్రీ యటంచు చెంత గృహమునం
    దనివారగ శుభముల దా
    ననుగ్రహము సేయ వలదన వలదు త్రాతా


    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      శని రెండున్నర ఏళ్ళు ఒకరాశిలో ఉంటాడు. జన్మ,ద్వాదశ,ద్వితీయాల్లో ఉన్నప్పుడు ఏల్నాటి శని అనేది ఒక మతం(ఆలోచనా విధానం)అదే ఎక్కువగా తెనుగునాట అనుసరిస్తారు. ఇలా రాశి చక్రం తిరిగిరావడానికి శనికి 30 ఏళ్ళు పడుతుంది. ఏవరికైనా మూడో సారి ఆవౄత్తి పూర్తి కాదు. కొందరికది నాలుగో సారి కావచ్చు. అటువంటి వాళ్ళకి జన్మతోనే శని ఆ మూడు రాశుల్లో ఉండడం జరుగుతుంది. ఇంక జీవితం చివరలో ఒనగూర్చే శుభం ఒక్కటే! శని కర్మాధికారి.

      Delete
  9. ఆహా ! జిలేబి సారుకు
    మోహము తెను గన్న , అందుమూలముగా , ఆ
    దాహము తీరే దాకా
    ఓహో ! యన తెలుగుభాష కున్నతి దెచ్చున్ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      ఆడో,మగో తెలియని అరవ,తెనుగు మనిషి, తెనుగుకు ఏడుగడ అనుకోమంటారా? అంచేత పొగిడేద్దాం అంటారా? వద్దు సార్!

      Delete
    2. -

      గూడారమ్మున గుమ్మడి
      మాడా వీధిరమణీయమైన జిలేబీ
      ఆడో మగరాయుడకో
      ఏడ నివాసమ్మొ ? టెల్గు కేడుగడయకో?

      Delete
  10. ణిసిధాత్వర్థపు హేలల
    నసిధారావ్రతముగా మన తెలుగు కవనాం
    భసి మధియించి మధుఝరుల్
    విసురు జిలేబీ ఘనులకు వేల నమస్సుల్ 🙏

    ReplyDelete
  11. నలుగురు నవ్విన నేమిటి
    తెలుంగు నే నేర్చుకొందు తీరుగ పద్య
    మ్ముల వ్రాయుట విడువను నా
    పలుకులు నిలుచు నెపుడు కవివరుల కుఱగలిన్


    ReplyDelete
  12. నవ్వగ నేలా మిము గని ?
    నివ్వటిలెడు ఘనత గలదు , నేర్పు గలదు , మీ
    మవ్వపు వైదుష్యము గని
    అవ్వారిగ గౌరవంబు లందింతు సదా ! 🙏

    ReplyDelete
  13. నూతన వత్సరములో
    అంతయూ నిశ్శబ్ధము గా యున్నది
    తాతగారూ మా అనపర్తి లో చలి బావుందాండి ?

    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      పుష్యమాసం చలి పులిలా మీదబడుతుందని సామెత. చలి,చలికి బద్ధకం,తోడు జరలోరుజ,ఇల్లు దులుపులు కడుగులు,సద్దుకోడాలు,పండగ హడావుడి కదా!
      చెప్పుకోడానికేం మిగిలుంది గనక.😂😂
      మీ అనపర్తిలో చలి బాగానే ఉందండి,మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది😜

      Delete
    2. అడిగిందా ? అడగకుండా ఉంటుందా ?
      హలో అని‌ చెప్పొచ్చాము కదా కూడలి దాకా వచ్చి :)

      Delete
    3. జిలేబి,
      మొన్న కనపడినపుడు చెప్పింది,నాలురోజులుంటానని, చినుకులు తోడు తెచ్చుకుంటానని కూడా చెప్పింది 😜 సూరిబాబు గారు పూర్తిగా శలవు తీసుకున్నట్టే వుంది. పొద్దుటినుంచీ కనపడనే లేదు,సాయత్రంలోగా కనపడే సావకాశాలు ఉన్నట్టనిపించడంలేదు. చలిదే రాజ్యం. 😢

      మా అనపర్తి అంటున్నావు, ఇక్కడ పుట్టేవా?,పెరిగావా?ఇల్లు కట్టేవా?పన్ను కట్టేవా? పచ్చగా కనపడ్డది ప్రతిది నాదంటే కుదరదు. నాగులకోకలు కట్టినవాళ్ళంతా నా పెళ్ళాలే అన్నాట్ట ఒకదు,ఇదో నానుడి. దీన్ని రాక్షస ప్రవృత్తి అంటారు. బాగున్నదాన్ని ఆక్రమించుకోవాలని చూడకు, మంచిది కాదు, నీకు చెప్పి ఉపయోగం లేదులే! 😎

      Delete
    4. అబ్బో!/ అనపర్తిని మీరేమన్నా స్థాపించేరా ఏదో మీ సొంత ఎవర్ లాస్టింగ్ ఆస్థి లా కట్టేసుకుంటున్నారు ?

      Delete
    5. జిలేబి,
      తానున్నవూరు,తాను పుట్టిన ఊరు, తాను బతికిన వూరుని నావూరు అని చెప్పుకుంటారు విజ్ఞులు. తాను పుట్టి పెరిగిన దేశాన్ని నాదేశం అనీ చెప్పుకుంటారు. అంతలో వారు దేశాన్ని ఊరుని,కొనేసినట్టా? పచ్చగా ఉన్న ఊరుని దేశాన్ని కొనేస్తా అనగలవు,దేశం వదలి పారిపోయిన నీకేం తెలుసు దేశం విలువ?

      Delete
    6. వెన్నెల చల్లదనంలా ఎంత కమ్మగా వుంది వ్యాఖ్య :)

      Delete
    7. జిలేబి,
      తెనుగులో ఒక వాక్యం అర్ధవంతంగా రాయడం నేర్చుకో.

      అన్నట్టు, ఇది కొట్టుకొచ్చిందా(cut paste) పట్టుకొచ్చిందా (copy paste)అనుమానం!.

      నిన్న మా గ్రూప్లో ఒకటపా చదివేను,రాసిందెవరబ్బా! అని చూస్తే కాస్త తెలిసిన మొహమే! బాగారాసారండీ అన్నా!మీరు రాస్తారా? అన్నా! అప్పుడప్పుడు అని మొహమాట పడ్డాడు.రాస్తూ ఉండండి తరచుగా అని ప్రోత్సహించాను. తీరా చూస్తిని కదా,అది పదిహేనేళ్ళకితం, బ్లాగ్ మొదలుపెట్టిన కొత్తల్లో రాసిన నాటపా! ఆయనకి నేను బ్లాగ్ లో రాస్తానని తెలియదు పాపం.

      ఇవన్నీ చాలా సహజంగా జరిగిపోతున్నాయనుకో! మొదటిలో బాధపడేవాడిని,ఇప్పుడు నీలాటి జనాలని చూసి నవ్వుకుంటున్నా!

      Delete
    8. మీకు సంకోచాలు లేవు, భేషజాలు లేవు, వర్గాలు లేవు, వర్గప్రయోజనాలు లేవు. టపాలను చదువుకుంటూ, ‘ఆహా ఇక్కడ చాలా బావుంది’ అని అంటారు, మరు క్షణం అరే!/ఇది నాదేకదా అనుకొని బావులే ఇలా కాపీ చేయకుండా ఉండాల్సింది ‘అని కూడా అనుకుంటారు :)

      మీలాంటి సాహిత్యరత్న, పరీక్షకుడు ఇప్పటి కాలానికి ఎంతో అవసరమైనవారు.


      మీ పట్ల గౌరవాన్ని పెంచడంతో పాటు మీ టపాలన్నీ కాపీ కొట్టేయాలనిపించిందేమో వారికి :)

      .

      Delete
    9. నేను చెప్పేదేదీ నీకీ జన్మకి అర్ధం కాకపోవచ్చు.ఇదెక్కడనుంచి ఎత్తుకొచ్చావు? ఎందుకీ ఎత్తిపోతలు?
      భగవాన్! ఎందుకు నాకీ శిక్ష!

      Delete
    10. దేవుడు కరుణామయుడని
      భావింపుడు శిక్షవేయువా డన నేలా
      యీ వెర్రిచర్చ లొల్లమి
      నీవిధమగు బాధ కలుగు టేమియు లేదే

      Delete
    11. శ్యామలీయంవారు,
      ప్రజల్లోకి రండి,వచ్చినందుకు ఆనందం.
      దైవం ఎప్పుడూ కరుణచూపేదే! ఐతే మన్మ్ చేసుకున్న కర్మ అనుభవింపక తప్పదు కదండీ! అదన్నమాట సంగతి.
      చేసిన ధర్మము (కర్మము)చెడని పదార్ధము చేరును నీవెంటా !!!! అది సార్. ఏమనుకోవద్దూ!

      Delete
    12. -

      వచ్చిరి గురువులు భళిభళి
      మెచ్చిరి తాతయ్యగారు మిన్న జిలేబీ
      వచ్చెను చట్టని పద్యము
      గ్రుచ్చెను వెల్కమ్మటంచు రూఢిగ నిదిగో

      Delete
    13. జిలేబి,
      సంక్రాంతి శుభకామనలు.
      ఏం చెప్పేవో పద్యంలో బోధపడలా! ఐనా పండగపూటా క్లాస్ పీకక తప్పటం లేదు ఏం గుచ్చేవు? గుప్పెను అనుంటే కొంచం తెలిసేదేమో!

      Delete
  14. నాగుల కోకలు అంటే?

    ReplyDelete
    Replies
    1. బోనగిరి గారు,
      నాగులచవితినాడు,సంతానార్ధం,వ్రతం చేసేటపుడు,స్త్రీలు కట్టుకునే,నల్ల,తెల్ల చారల చీర. ఇది చెప్పుకోడమేగాని చూడలేదెప్పుడూ

      Delete
  15. విన్నకోట విబుధు లన్న మనోఙ్ఞము
    బ్లాగు లందున కనబడమి గాంచ
    కాస్త కొఱత యౌట కనుపట్టె , వారిని
    గూర్చి తెలియ బరుచ కోరుకొందు .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      విన్నకోటవారు బ్లాగుల్లోకి రావడం లేదు, కారణం తెలియదు, అడగలేదు.మీరే అడగచ్చు.

      Delete
  16. అమేరికా లో వున్నారు

    ReplyDelete
  17. ఆయు రారోగ్య భోగ భాగ్యాలు మరియు
    శాంతి సౌఖ్యాలతోడ సంక్రాంతి శోభ
    వెల్లి విరియంగ దేవుని వేడుకొందు
    ఘనముగా ' మీకు ' మకర సంక్రమణ వేళ .

    ReplyDelete
  18. రాజావారు,
    భోగి,మకర సంక్రమణ,కనుమ శుభకామనలు. ప్రతి సంవత్సరం భోగి 13 న వచ్చేది,ఈ సారి 14న, సంక్రమణం 15న వచ్చేయి. ఇది కాలంలో జరిగే మార్పనుకుంటా. నాకు శుభాకాంక్షలు తెలిపిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. Makar Sankranti for the next 69 years will fall on 15th January, not 14th.

      It is simply a function of precession of equinoxes.

      Also, it is important to understand that Ayana is understood from the tropical position of the Sun, not Sidereal.

      So, Sankranti is no longer co-terminus with Uttarayan. The reason is the same - precession.

      Copy paste.

      Delete
    2. బోనగిరిగారు,
      మీరు పట్టుకొచ్చినది సరుకున్నదే అనుకుంటున్నా!👍👍

      అర్ధమయినట్టూ ఉంది,అర్ధము కానట్టూ ఉంది,మొత్తానికి అర్ధం కాలేదన్నది పిండితార్ధం .🤣

      69 సంవత్సరాలకొకసారి సంక్రమణం ఒక రోజు ముందుకు జరుగుతుందంటారా? అలాగైతే 69 సంవత్సరాల కితం సంక్రమణం 13వ తారీకున చూసి ఉంటాను,అంతేనంటారా?🙏

      Delete
    3. -
      బోనగిరిగారు ! అర్థము
      కానట్టూ కాస్త అర్థ మయినటులన్ వుం
      దే!నా వరకైతే కా
      లా! నాకిదె పిండితార్థమయ్యా స్వామీ


      ఏమి రుబ్బిన ఈ పిండి వచ్చును .?



      Delete
    4. జిలేబి,
      బుర్ర రోట్లో వేసి రోకలితో దంపితే(కుళ్ళబొడిస్తే) వస్తుందీ పిండి,🤣అనేది పిండితార్ధం అనే పండితార్ధం.😜

      Delete
    5. During the third battle of Panipat, Sankranti was on the 10th, as the war was happening on that tithi. Also, Swami Vivekananda was born on 12-Jan-1863 and it was Sankranti on that day.

      Every year, the time taken by Sun to enter makara rashi shifts by 20 minutes. So it takes 72 years (24x60/20) to shift by one full day. You can check Sankranti date over the years...it matches.

      Delete
    6. బోనగిరి సార్!
      ఈ సారి పూర్తిగా అర్ధమయింది.👍 నాకోసం మీరు తీసుకున్న శ్రమకి నమస్కారం,🙏
      ధన్యవాదాలు

      అంటే నా జీవితంలో ఇటువంటి సంఘటన చూడడం రెండో సారనమాట. నా 12,13 ఏళ్ళ వయసులో జరిగి ఉండచ్చు. ఆవిధంగా అదృష్టవంతుడినే❤
      మరోసారి ధన్యవాదాలు
      దీర్ఘాయుష్మాన్ భవ

      Delete
  19. సూర్యుడు డిసెంబర్ 21 నాటికి, భూమి మీద గీయబడ్డ ఊహారేఖ మకరరేఖకు చేరుకుంటాడు. మకరరేఖకు చేరే తేదీ మకరరాశి ప్రవేశ తేదీలు మధ్య ఎడముంటుంది. అదీ గుర్తెరగాలి. ఐతే మకర రేఖ వేరు,మకర రాశి వేరని గుర్తించాలి. సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభంగా సనాతనులం భావిస్తాం. ఇది మనం చెప్పుకున్నట్టు జనవరి 12,13,14,15 ఇలా తేదీలు మారుతూ ఉంటుంది. మకర రాశి ప్రవేశం వేరు,మకరరేఖకు చేరడం వేరని గుర్తించాలి. ఈ రెండిటి మధ్యా తేడా తెలియకపోవడం గండరగోళానికి కారణం.

    ReplyDelete