గడచిన సంవత్సరం 2025
2019లో అనుకుంటా,రతన్ టాటా గారిని అడిగారట. 'ఈ సంవత్సరం మీరు సాధించిందేమిటీ?' అని, దానికి వారు 'ఈ సంవత్సరం బతికున్నాను,అదే ఘనకార్యం' అన్నారట. ఆ సంవత్సరంలో పెద్దవయసు వాళ్ళు చాలామంది కాలంచేసేరు,కరోనా మూలంగా. అప్పటికి ఆయన వయసు 80 దగ్గరనుకుంటా.
ఇప్పుడెందుకిదని అనుమానం రావచ్చు. నాకు తొమ్మిదో పది సమయం కనుచూపుమేరలో కనపడుతోంది. గత సంవత్సరం ముక్కుతోనో మూలుగుతోనో గడిపేసాను. రోజు గడిస్తే పండగ,బోనస్సు అనేలా గడుస్తోంది.
కుంతీ దేవి మేనల్లుడే ఐన శ్రీ కృష్ణుని ఇలా వేడుకుంటుంది.
యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి
చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ
పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న
త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
ఇందులో వేడుకోలు
అంటే, ఈ భవలతలు అనగా ఇహలోక బంధాలను తుంచెయ్యవయ్యా, ఆంటుంది.
పాండవులందు యాదవులందు మోహ విఛ్ఛేదము, ఇలా ఒక్క కొడుకులనే కాదు అటు పుట్టింటివైపు వారిమీదా తనకున్న బంధాలను తుంచేలా చెయ్యమంది. ఇలా వేడుకున్నా చివరిదాకా కుంతికి భవలతలు వదలలేదు. అలాగే నాకున్నూ ఈ భవలతలు వదలటం లేదు. ఇవి ఎంత సున్నితం అంటే సాలెపురుగు తననోటి నుంచి స్రవించిన ద్రవంతో అల్లే సాలెగూటి దారమంత సున్నితంగా కనపడతాయి. చిత్రం ఆ సాలెగూటి దారం పెనుగాలివానలకూ తెగదు. నిజo 100 కి.మీ వేగంతో వీచేగాలి దానిని తెంపలేదు.అలా నేటికిన్నీ భవలతలు కొత్తకొత్తగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నా ప్రయత్నం వ్యర్ధమవుతూనే ఉంది.
https://kasthephali.blogspot.com/2024/05/blog-post_24.html
విష్ణుమాయ దేనినీ వదలలేకపోతున్నాని తెలుసు, కాని సంపూర్ణ శరణాగతి చెయ్యలేకపోతున్నా! అదే విష్ణుమాయ. దానిని దాటడానికి మహామహుల ప్రయత్నాలే చెల్లలేదు,నేనెంత? అలా అని ఊరుకోలేకపోతున్నా! ఎప్పటికి ఆయన దయ కలుగుతుందో!
శాంతి శాంతి శాంతిః
స్వసి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహీశాం
గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యం
లోకాః సమస్తా సుఖినో భవంతు.
ఇక సెలవు
🙏🙏🙏
మన మెవరయ్యా ! అతడికి
ReplyDeleteమనసైతే దప్ప , ఇదిగొ మానేస్తా నం
చన , మాచన ! కర్తలమా ?
విను , నడిపించెడి యతండు విష్ణుం డయ్యా !
ఆయు రారోగ్య భాగ్య సౌఖ్యాల నిచ్చి
ReplyDeleteనవ వసంతంబు మిమ్ముల నడుపు గాత !
నవ నవోన్మేష సంతోష యవనికలకు
బాట లిడుగాక ! క్రొత్త సంవత్సరమ్ము .
రాజావారు,
ReplyDeleteఆంగ్ల నూతనవత్సర శుభకామనలు. నూతన వత్సరాన మీకు వేయి శుభములు కలుగుగాక.
వెంకట రాజారావు . లక్కాకుల31 December 2025 at 22:30
ReplyDeleteరాజావారు,
నిజమే! ఆలోచన,ఆచరణ చేయించడం సర్వం హరిదే! ఎలా నడిపిస్తే, అలా నడవక తప్పదు. విధి బలీయం. మీ ఆకాంక్షకు ధన్యవాదాలు.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeleteధన్యవాదాలు
Deleteఆంగ్ల నూతనవత్సర శుభకామనలు. నూతన వత్సరాన మీకు వేయి శుభములు కలుగుగాక.
తెలుగు తాతగారికి
ReplyDeleteనూతనవత్సర శుభకామనలు. నూతన వత్సరాన మీకు వేయి శుభములు కలుగుగాక.
ఆయురారోగ్యములతో మీకు ఈ వత్సరము మరియు రాబోవు కాలము లభ్యమగును.
మీరు మరిన్ని వ్రాస్తూ సర్వ జనహితాయ గా పేరొందవలె.
ఇట్లు
మీ శ్రేయోభిలా
జిలేబి
తాతకు క్రావడి యొప్పును
Deleteత్రాత యనగ తెనుగుభాష రక్షకుడు సుమా !
ఏతా వాతా తమరును
ఈ తీరున తెలుగు భాష కేడుగడ కదా !
జిలేబి,
Deleteనూతన సంవత్సర శుభాకంక్షలు. నూతన వత్సరం మీకు వేయి శుభములు కలగజేయుగాక.
జ్యోతిషం చెబుతున్నావా? శని మీనంకి రాబోతున్నాడు.😂 ఇంకా పేరు? ఇంక కొత్తగా రాదులే!!😜
సంవత్సరం మొదటి రోజుల్లోనే......బావోదని.
రాజావారు,
Deleteక్రావడి కుదరదేమోనండీ. త్రాతా భవ జనార్దన.
నిజం సార్! జిలేబి తెనుగు భాషకు కీడుగడ కదా శాంతం పాపం (కేడుగడ)ఏడుగడ,ఏడు గడయే కదా. తెనుగు భాష తెనుగునాట ఎక్కడుందీ? తెనుగు చదవగల ఆడపిల్ల కనపడటం లేదు. టెలుగూ డొంట్ అండర్ స్టాండ్. కెనాట్ రీడ్ అంటున్న అమ్మలున్న కాలం. ఇప్పుడు తెనుగు సింగపూర్ లోనూ అమెరికా బర్కిలీ లోనూ ఉందష. మాదే తెనుగు,మేమే నిక్కచ్చి తెనుగువారం అని చెప్పుకుంటున్నారు కాదా!
తాతా వారు గురువరుల్
ReplyDeleteతోతావరి తీపి సరి హితోక్తులకున్ బ్లా
గ్గీతాచార్యుల్ వ్రాయుట
యే తడవు జనాళి వత్తురెగిరెగిరి గదా
జిలేబి,
Deleteములగచెట్టు ఎక్కించెయ్యకు 😂. అది తోతావరి కాదు తోతాపురి మామిడి రకం. పెద్ద తియ్యగా ఉండదు,దీనిని మేము కలక్టర్ కాయ అంటాం. ఉన్నజానలని తోలేసేవు బ్లాగులనుంచి...ఇంకా పరుగెట్టుకొస్తారా? వామ్మో!!
శనియేడున్నర గా దో
ReplyDeleteచెనుగా తండ్రీ యటంచు చెంత గృహమునం
దనివారగ శుభముల దా
ననుగ్రహము సేయ వలదన వలదు త్రాతా
జిలేబి,
Deleteశని రెండున్నర ఏళ్ళు ఒకరాశిలో ఉంటాడు. జన్మ,ద్వాదశ,ద్వితీయాల్లో ఉన్నప్పుడు ఏల్నాటి శని అనేది ఒక మతం(ఆలోచనా విధానం)అదే ఎక్కువగా తెనుగునాట అనుసరిస్తారు. ఇలా రాశి చక్రం తిరిగిరావడానికి శనికి 30 ఏళ్ళు పడుతుంది. ఏవరికైనా మూడో సారి ఆవౄత్తి పూర్తి కాదు. కొందరికది నాలుగో సారి కావచ్చు. అటువంటి వాళ్ళకి జన్మతోనే శని ఆ మూడు రాశుల్లో ఉండడం జరుగుతుంది. ఇంక జీవితం చివరలో ఒనగూర్చే శుభం ఒక్కటే! శని కర్మాధికారి.
ఆహా ! జిలేబి సారుకు
ReplyDeleteమోహము తెను గన్న , అందుమూలముగా , ఆ
దాహము తీరే దాకా
ఓహో ! యన తెలుగుభాష కున్నతి దెచ్చున్ .
రాజావారు,
Deleteఆడో,మగో తెలియని అరవ,తెనుగు మనిషి, తెనుగుకు ఏడుగడ అనుకోమంటారా? అంచేత పొగిడేద్దాం అంటారా? వద్దు సార్!
-
Deleteగూడారమ్మున గుమ్మడి
మాడా వీధిరమణీయమైన జిలేబీ
ఆడో మగరాయుడకో
ఏడ నివాసమ్మొ ? టెల్గు కేడుగడయకో?
ణిసిధాత్వర్థపు హేలల
ReplyDeleteనసిధారావ్రతముగా మన తెలుగు కవనాం
భసి మధియించి మధుఝరుల్
విసురు జిలేబీ ఘనులకు వేల నమస్సుల్ 🙏
నలుగురు నవ్విన నేమిటి
ReplyDeleteతెలుంగు నే నేర్చుకొందు తీరుగ పద్య
మ్ముల వ్రాయుట విడువను నా
పలుకులు నిలుచు నెపుడు కవివరుల కుఱగలిన్
నవ్వగ నేలా మిము గని ?
ReplyDeleteనివ్వటిలెడు ఘనత గలదు , నేర్పు గలదు , మీ
మవ్వపు వైదుష్యము గని
అవ్వారిగ గౌరవంబు లందింతు సదా ! 🙏
నూతన వత్సరములో
ReplyDeleteఅంతయూ నిశ్శబ్ధము గా యున్నది
తాతగారూ మా అనపర్తి లో చలి బావుందాండి ?