నెలగంట
ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతుంది,అనగా సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశికి మారే రోజు సంక్రమణం. మూడు రోజులకితం సూర్యుడు వృశ్చికరాశి నుంచి ధనూరాశికి మారాడు. ఈ నెలకాలాన్నీ ధనుర్మాసం అంటారు.రాబోయే మాసం మకరమాసం. మకరసంక్రమణం రోజునే మనం పెద్దపండగ అంటాం. ఈ ధనుర్మాసంలో మొదటిరోజునుంచి నెల చివరి వరకు వైష్ణవాలయల్లో ఉదయం నాలుగు గంటలకి జరిగే ఉత్సవం,ఈ నెలగంట. ఉదయమే నాలుగు గంటలకి నిద్రలేచే అలవాటు చేయడమేమో! అలాగే నగరసంకీర్తనం అనగా విష్ణుభక్తికి సంబంధించి కీర్తనలు పాడుతూ నగరవీధులలో ఉదయమే నాలుగు మొదలు ఆరుదాకా చేసే ఉత్సవం.
ఎన్నెన్నో ఇటు వంటివి
ReplyDeleteఉన్నవి గుడులందు , వాటి ఉనికి కనంగన్
అన్నా ! తమ వంటి బుధులు
ఉన్నా రిప్పటి వరకు , మనోఙ్ఞము , విబుధా !
ఈ సేవ శ్రీసింహాచల వరాహలక్షీ నృసింహ స్వామి ఆలయంలో జరుగుతున్నది. ఇది మేల్కొలుపు సేవకూడా కావచ్చనుకుంటాను. దీని కొనసాగింపుగా ఈ మేళతాళాలతో అర్చకస్వామి వెండి బిందెతో పవిత్రజల సంగ్రహణకోసం నది,కాలువ,కోనేరు ఇలా ఒక చోటిదాకా వెళ్ళి అక్కడ అర్చకస్వామి స్నాన మాచరించి నామాలు దిద్దుకున్న తరవాత జలం సంగ్రహించుకుని గుడికి రావడం ఒకసేవ. చిన్నప్పుడు ఈసేవ చూసినవాడిని. ఇలాగే చాలాసేవలు జరుగుతున్నా తెలియకపోవడం ఇబ్బంది.
Deleteపెద్ద పండుగ నెల రోజులుందనగా ఇంటి ముందు ముగ్గులలో వేసే అర్ధ చంద్రాకారాన్ని "నెలగంటు" ని ఎందుకు అంటారో చెప్పగలరు
ReplyDeleteనెల అనగా చంద్రుడు
Deleteహాల్బ్ చంద్రుడు గంటు పడిన చంద్రుడు
కావున నెలగంటు
ఇట్లు
జిలేబి
శ్రీనివాస్ జీ నెలపట్టడం,నెలగంట,నెలగంటు, ఇలా విన్నవేగాని నెలగంటు గురించి చెప్పలేను,తెలియదు. ధనుర్మాసం చలిమాసం,మార్గశిరంలో చలి మంటల్లో పడ్డా తగ్గదని ఒకనానుడి. పుష్యమాసంచలి పులిలా మీదబడుతుందని సామెతలు కూడా ఉన్నాయి. ముగ్గులపండగ,కొత్తల్లుళ్ళ పండగ,గొబ్బిళ్ళ పండగఊడ్యం,సందె గొబ్బిళ్ళు) పెట్టేఆచారం.ఆడపిల్లలపండగ,శ్రామికుల పండగ. అందుకే మాసానాం మార్గశీర్షస్య అన్నారనుకుంటా.
Deleteజిలేబి,
Deleteఈ ధనుర్మాసం రెండు నెలలలో వస్తుంది అవే మార్గశిరం,పుష్య్మాసాలు. ఒకనెలలో రాదు అందునా ఒక పక్షంలో రాదు. ఒకప్పుడు,శుక్లపక్షం,మరొకసారి కృష్ణపక్షంతో మొదలవుతుంది. ఈ సారి బహుళపక్షంతో మొదలయింది.
బహూ బక్ష మనగా నేమి ?
Deleteజిలేబి,
Deleteబహూ బక్ష మనగా కోడలి చేతి పిండం. బతికుండగా కోడలు పెట్టే మూడు ముద్దలే బహూ బక్షం, తరవాత కొడుకు పెట్టేవీ మూడు ముద్దలే!
సూర్యమానంలో ధనుర్మాసం మాత్రమే ఎందుకు పాటిస్తున్నాము? మిగతా మాసాలు ఏమయ్యాయో చెప్పగలరు.
ReplyDeleteఅరవం వారి జాడ్యమట్టేసుకుంది :)
Deleteతెనుగువారం చాంద్రమానం పాటిస్తాం కాని సౌరమానం కూడా పాటిస్తాం దీనినే అమాచాంద్రమానం అంటారట. భారతీయులు కాలాన్ని సౌరమానం,చాంద్రమానం,బృహస్పతి మానం తో కొలుస్తారు. సూర్యుడు,బృహస్పతి ఒక రాసిలో ఒకనెల ఉంటారు, కాని చంద్రుడు రెండున్నరరోజులు మాత్రమే ఉంటాడు. నిజజీవితానికి దగ్గర అని చాంద్రమానం పాటిస్తారనుకుంటా. మనిషి మనసు,స్త్రీ రుతువు పై చంద్ర ప్రభావం కలదు. సముద్రం చంద్రుని హెచ్చుతగ్గులకి స్పందిస్తుంది.
Deleteఇక సౌరమాన మాసాలలో అన్ని మాసాలని పాటించే తెనుగువారు ఉన్నారు. ఈ మాససంక్రమణం రోజు, అమావాస్య నాడు పెద్దలకి తర్పణాలు ఇచ్చేవారూ ఉన్నారు. మనపండగలలో కొన్ని సౌరమానం ప్రకారం పాటిస్తాం,అందులో పెద్దపండగ మొదటిది,అదే పెద్దలపండగ. కార్తెలు నక్షత్రమానం ప్రకారం పాటిస్తాం.
Zilebi
Deleteఐతే నక్షత్రమానం, కార్తెలు ఎవరి జాడ్యం చెప్మా! తమిళులు సౌరమానం పాతిస్తారు,గంగాతీరంవారు బౄహస్పతిమానం పాటిస్తారు. అవే సంవత్సరాలపేరు,మాసాలపేర్లు,అవేతిథులు,అవేవారాలు కదా! మరి ఇవన్నీ ఎవరి జాడ్యం చెప్పు. భారతీయ సంస్కృతి ఒకటే.
పచ్చకామెర్లరోగికి లోకం పచ్చగా ఉంటుందని నానుడి
తిథి, నక్షత్రాల సమయాలు ఒక్కొక్క కేలండర్ లో ఒకో విధంగా ఎందుకు ఉంటాయో చెప్పండి.
ReplyDeleteపంచాంగం గుణితం వేయడానికి రెండు పద్ధతులు,పూర్వ సిద్ధాంతం,దృక్సిద్ధాంతం. గుణితంల తేడా మూలంగా వచ్చే తేడాలే ఒకరు నవమి అంటే మరొకరు దశమి అనీ,అలాగే నక్షత్రాలూ ముందు వెనుకలుగా ఉంటాయి. దృక్సిద్ధాంతం మెరుగైనదిగా ఉందని అంటారు,ఐతే పూర్వ సిద్ధంతులు ఒప్పుకోరు, ఇదీ తేడా.
Deleteధనుర్మాసం అనేది వైష్ణవ సంప్రదాయం. రామానుజాచార్యుల ను అనుసరించే విశిష్టాద్వైతులు అంటే ఎక్కువగా తమిళ నాడులో కనిపిస్తుంది. సౌర మానం లో అది మార్గళి మాసం అంటారు. జీయర్ స్వామి వారి ని అనుసరించే వారు తెలుగు నాట కూడా కొన్నేళ్లుగా ఈ సంప్రదాయం వ్యాప్తి చేస్తున్నారు. ఈ మాసం లో గోదా దేవి గానం చేసిన తిరుప్పావై పారాయణం వేకువ జామున చేస్తుంటారు. స్మార్తలకు శైవులకు ఈ సంప్రదాయం లేదు. అయితే వారిలో కూడా అభిరుచి ఆసక్తి కలిగిన వారు అనుసరిస్తున్నారు. 30 పాశురాలు ఉన్న తిరుప్పావై భక్తిరస భరితంగా ఉంటుంది.
ReplyDeleteధనుర్మాసం తప్ప తక్కిన సౌరమానం లోని మాసాలకు తెలుగువారికి గణన లేదు.
బుచికిగారు
Deleteశివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే శ్రీ శంకర సంప్రదాయం పాటించేవారు (స్మార్తులు) తెనుగునాట ఎక్కువే. అందుకే శివాలయాలు,వైష్ణవాలయాలు సమంగా తులతూగుతుంటాయి, ఈ కార్తీక,మార్గశిర,పుష్యమాసాలు,ముఖ్యంగా ధనుర్మాసంలో. శ్రీ చినజీయర్ స్వామి వారి స్వగ్రామం అర్తమూరు (అనబడే అర్ధమూరు) మా ఊరికి బహుదగ్గర.మేము అలాకూడా ధన్యులం.
శ్రీమాన్ బుచికి గారు
Deleteతాతగారు ఒప్పకనే ఒప్పేసుకుంటున్నారు ఇది తమిళ జాడ్యము తెలుగు వారికి నచ్చేసి వచ్చేసిందని :)
మరొహటి ఈ మధ్య శ్రీమాన్ చాగంటి వారి చలవ :). ~ మా జిల్లా మీదుగా సందడేసందడి తొల్జంగమయ్యకు
పూర్వపధ్ధతి అంటే సూర్యసిధ్ధాంత కరణ గ్రంథాల ప్రకారం పంచాంగగణితం. ఈగణితం బాగానే వస్తుంది కాని కరణగ్రంథం సూచించినట్టు కొన్నేళ్ళకు ఒకసారి బీజసంస్కారం చేసుకోవాలి. చాలామంది పంచాగకర్తలు అలా చేయటంలేదు కాబట్టి అనేక తప్పుడు పంచాంగాలు విడుదల అవుతున్నాయి.
ReplyDeleteకేత్కర్ గారి దృక్ సంస్కారం కూడా చేసేవి దృగ్గణిత పంచాంగాలు. ఇవి రవి చంద్రులను మరింత సరిగా ఇస్తాయి. కేవలం ఆధునికం అనే కారణంతో కొందరు ఈసంస్కారాలు చేయటంలేదు. మూర్ఖత్వం.
ఇప్పుడు. చాలామంది పంచాంగకర్తలు ఆధునిక ఖగోళగణితం విలువలు positional astronomy cenntre నుండి తెప్పించుకొని సులువుగా కచ్చితమైన పంచాంగాలు చేస్తున్నారు. నెలల శ్రమ రోజులకు దిగటంతో ఈవిధానం అనుసరించేవారు బాగా పెరుగుతున్నారు.
సహజంగానే పాతపధ్ధతి పంచాంగాలు ఆధునికపంచాంగాలంత సరిగా ఉండవు. చాదస్తపు పంచాంగకర్తల మూలంగా ప్రజలలో గందరగోళం నెలకొంటోంది. అది శోచనీయం.
ఈపరిస్థితిని గమనించి టీవీఛానెళ్ళు రేటింగుల కోసం చర్చలను ఏర్పాటుచేసి మరింత గందరగోళం తయారు చేస్తున్నారు.
శ్యామలీయం వారు,
Deleteవిషయాన్ని విపులంగా వివరించినందులకు
ధన్యవాదాలు.
పంజాంగమనగా నేమి ?
ReplyDeleteజిలేబి,
Deleteబాగున్నావు కదా! ఏమయిపోయావో అని బెంగపడ్డా పొద్దుటినుంచీ. "జిలేబివదిన" కు వచ్చిన రోగమేంటో కనుక్కోలేవనీ,కుదర్చలేవనీ ఎప్పుడో తేలిపోయింది. సిగ్గు పడ్డావేమో అనుకున్నా! నీకూ నాకూ సిగ్గేంటీ!
అది పంజాంగం కాదు పంచాంగం అంటారు. నువ్వు పంజాంగం అని ఎందుకు అనకూడదని అడగ గలవు. తిథి,వారము,నక్షత్రము,యోగము,కరణము అనే ఐదు అంగాలను సూచించి తెలిపేది పంచాంగం. అవేంటీ అని అడగగలవు.
అవేంటి ?
Deleteజిలేబి,
Deleteఅవేంటో తెలిసినవారికి చెప్పక్కరలేదు,తెలియనివారికి చెప్పినా తెలియదు,తెలిసీ తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే అన్నారు ఏనుగుల లక్ష్మణకవి. ఈ ముగ్గురిలో నీవెవరో తెలుసుకో!చాలు.😜