Solve:-
Answer within 20 seconds
3-3*6+2 = ?
తాత తాగినబోలి...
🍁.నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్🍁.
నాన్న వయస్సు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీన పడిపోయింది. గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసర మవుతోంది. తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి.
నా భార్యకు అది చిరాకు. తరచూ నాతో చెబుతోంది గోడలు మురికిగా కనిపిస్తున్నా యనేది ఆమె కంప్లయింట్. ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు. అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద.
నా భార్య నామీద అరిచింది. నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను. నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను. గాయపడ్డట్టుగా తన కళ్లు… నావైపు అదోలా చూశాడు. నాకే సిగ్గనిపించింది. ఏం మాట్లాడాలో ఇక తెలియ లేదు.
ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను. ఓరోజు బ్యాలెన్స్ తప్పి మంచం మీద పడిపోయాడు. తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు.
నాలో అదే దోష భావన. ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది
నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా.
కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించు కున్నాం. పెయింటర్స్ వచ్చారు. తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు... అరిచాడు.
ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా.
మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం. వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం సరేనా అని సముదా యించారు.
అలాగే చేశారు. ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం. ఆ డిజైన్‌ను మా ఇంటికొచ్చిన వాళ్లు అభి నందించే వాళ్లు… వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించు కునేవాళ్లో.
కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది.
నాకూ వయస్సు మీద పడింది. శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు. నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది.
నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది.
ఎందుకని పించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తు న్నాను.
ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు. గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతావ్ అని మందలించాడు.
మనవరాలు వచ్చింది. నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా అంది ప్రేమగా.
నాలో దుఖం పొంగుకొచ్చింది. అసలే తండ్రిని నేనే పోగొట్టు కున్నాననే ఫీలింగు. అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు.
నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ.
నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది.
తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది. గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్‌లో గీసింది. టీచర్ బాగా అభి నందించిందని చెప్పింది. ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద.
నా గదిలోకి వచ్చి పడుకున్నాను. మౌనంగా రోదిస్తున్నాను. నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను.
తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది. ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు. నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది.
(ఓ మిత్రుడు పంపించిన ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు అనువాదం ఇది…)🙏🙏🙏
Courtesy:What's app
మేము అరవై లో ఇరవై
పచ్చగా మెరిసే పండుటాకులమే గాని
చప్పుడు చేసే ఎండుటాకులం కాదు
కలలు పండినా పండకపోయినా
మేము తలలు పండిన తిమ్మరుసులం
కొరవడింది కంటి చూపు గాని
మందగించలేదు ముందు చూపు
అలసిపోయింది దేహమే గాని
మనసుకు లేనే లేదు సందేహం
ఎగిరి అంబరాన్ని అందుకోకున్నా
ఈ భూమికి కాబోము భారం
అరవై లో ఇరవై కాకున్నా
అందని ద్రాక్ష కై అర్రులు చాచం
కుందేళ్ళమై పరుగులు తీయకున్నా
తాబేళ్లమై గెలుపు బాట చూపగలం
చెడుగుడు కూతల సత్తా లేకున్నా
చదరంగపు ఎత్తులు నేర్పగలం
సమయం ఎంతో మాకు లేకున్నా
సమయమంతా మీకు సమర్పిస్తాం
అనుకోకుంటే అధిక ప్రసంగం
అనుభవ సారం పంచుకుంటాం
వాడిపోయే పూవులమైనా
సౌరభాలు వెదజల్లుతాం
రాలిపోయే తారలమైనా
కాంతి పుంజాలు వెదజల్లుతాం
DEDICATED TO SENIOR CITIZENS.
Courtesy: What'sapp
Cry of a police officer
నా పేరు శ్రీను నాయక్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
అనపర్తి పోలీస్ స్టేషన్
తల్లిదండ్రులకు చేతులు జోడించి 🙏 నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా
****
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.
తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.
క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.
పిల్లలకి బడిలో భయంలేదు.
ఇంట్లో భయం లేదు.
అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది.
వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు.
అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.
ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టులలో శిక్షలకి గురవుతున్నారు.
గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది.
ఇది నిజం.
గురువంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?
కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు!
5వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగిన జీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళే వారిని వచ్చే వారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.
దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లి దండ్రులే మావాడు చదవకున్నా ఏమి కాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.
ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు.
పెన్ను ఉంటే పుస్తకం ఉండదు,
పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు.
భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం.
ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.
కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తుందా...?
భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట!
అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.
స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్ట కూడదు, కనీసం మందలించ కూడదు ప్రేమతో చెప్పాలట.
ఇదెలా సాధ్యమ్?
మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?
మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.
తల్లిదండ్రులకు నా మనవి. పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయుల తోనే జరుగుతుంది. ఎక్కడో ఒకటో అరో ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు.
90 శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు.
ఇది యదార్ధం.
ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.
మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు.
అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు.
మా బాగు కోసమే అని అనుకునేవారు.
ముందుగా తల్లి దండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.
తల్లి తండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిషత్ పై ఆలోచించండి..
పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60 % , కానీ 40% మాత్రం తల్లి దండ్రులే..!🙏
పిల్లల్ని గారాబం శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది.. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢ నమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు.
ఇప్పుటి తరం 70% పిల్లలు..
👉తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం మంటే తుడవరు.
👉మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు.
👉లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు.
👉కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు.
👉రాత్రి 10 గంటలలోపు పడుకుని, ఉదయం 6 లేదా 7 గంటలలోపు నిద్ర లేవరు.
👉గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడి సమాధానం చెబుతారు.
👉తిడితే వస్తువులను విసిరి కొడతారు. ఎప్పుడయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ , నూడుల్స్, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు.
👉 మైనర్ పిల్లలకి బైక్‌లు ఇవ్వడం
వారు ఆక్సిడెంట్లకు చేయడం
కేసులలో ఇరుక్కోవడం
👉ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు.
👉ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి.
👉అతిథులు వస్తే కనీసం గ్లాసేడు మంచి నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనలేని అమ్మాయిలు కూడా ఉన్నారు.
👉20 సంవత్సరాలు దాటినా చాలామంది ఆడపిల్లలకు వంట చేయడం రాదు.
👉బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడలేని కోపం వీరికి.
👉కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింత పోకడలు.
👉వారిస్తే వెర్రి పనులు.
👉మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు.
పై వాటికి కారణం మనమే. ఎందుకంటే మనకు అహం,పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి.
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి. రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం.
గారాబంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి.
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు.
ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వలన కొందరు యువత 15 ఏళ్లకే ప్రేమ - దోమ అనటం,సిగరెట్స్, మందు, బెట్టింగ్, డ్రగ్స్, దొంగతనాలు, రేప్ లు, హత్యలు చేస్తున్నారు.
మరికొంతమంది సోమరిపోతులా తయారవుతున్నారు..
అభినయాలు కనపడడం లేదు, అణకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లి దండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..
భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్లాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..
మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం. కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం.
👉కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు.
గర్భవతులైన తరువాత వారి బాధలు వర్ణనా తీతం. టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి. అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
03వ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు.
05వ తరగతి వారికి అల్సర్, బీపీలు.
10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలొస్తున్నాయి..
వీటన్నికి కారణం మనం. మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచక పోవడమే. అందుకే తల్లి దండ్రులు మారాలి.
రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?
కేవలం గుడికి , దర్గా లకు వెళ్లి పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము. అది మాత్రమే కాదు.
సాంప్రదాయం అంటే అలా అనుకోవడం కొంత పొరపాటు..
పిల్లలకు..👇
👉 బాధ్యత
👉 మర్యాద
👉 గౌరవం
👉 కష్టం
👉 నష్టం
👉 ఓర్పు
👉 సహనం
👉 దాతృత్వం
👉 ప్రేమ
👉 అనురాగం
👉 సహాయం
👉 సహకారం
👉 నాయకత్వం
👉 మానసిక ద్రృఢత్వం
👉 కుటుంబ బంధాలు
👉 అనుబంధాలు
👉 దైవ భక్తి
👉 దేశ భక్తి
కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..
మంది కోసం బ్రతకద్దు మన ఆరోగ్యం, మన ఆనందం కోసం బ్రతుకుదాం.
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..
భావితరాల పిల్లల కోసం ,పిల్లలను మార్చే బాధ్యత మన అందరిపై కలదు.
🙏చదివిన వారందరి విన్నపం...
దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి
ఈ మేసేజ్ చదివి అందరూ మారిపోతారు అని నేను అనుకోవడం లేదు....
కనీసం ఒక్కరు అయిన మారుతారని ఉద్దేశంతో ఈ మేసేజ్ పెడుతున్నాను
ఇట్లు
*మీ శ్రీనివాస నాయక్
సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అనపర్తి🙏🙏🙏*
Courtesy:Whats app
నా గోల:- టూకీగా మనం మారం,ఎవరు చెప్పినా.ఇంతే.
వసంత పంచమి.
పలుకులమ్మతల్లి పుట్టిన రోజు,శుభాకాంక్షలు.
ఆందోళన జీవి.
ఎలుక ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది, లేకపోతే చచ్చిపోతుంది. ఎలుక బతకాలంటే ఏదో ఒకటి నిత్యం కొరుకుతూనే ఉండాలి. ఎందుకలా ఇది గదా కొచ్చను.
ఎలుక దేన్నీ కొరకకుండా ఉండిపొతే పళ్ళు పెరిగిపోతాయి,ఎంతలా? దాని దవడలను పుళ్ళు పడేటంతగా. ఐతే ఏమవుతుంది? పుళ్ళు పడితే,పళ్ళు పెరిగితే ఏమీ తినలేదు,చనిపోతుంది, అందుకు నిత్యం ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది. ఎలక కొట్టని వస్తువు లేదు.
దీనికీ ఆందోళన జీవికి ఏంటి లింకు?
దుఃఖ భాగులు ఆరుగురు తెలుసుగా. ఇందులో నిత్య శంకితుడు,నిస్సంతోషి అనేవారిద్దరున్నారు. వారి కలయికతో పుట్టినవాడే ఆందోళన జీవి. ఈ ఆందోళన జీవి ఏదో ఒక దానిగురించి ఎప్పుడూ సంశయం వెలిబుచ్చుతూనే ఉండాలి,ఏదో ఒకదాని గురించి ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? ఈ కుళ్ళు అంతా మనసులో పేరుకుపోయి ప్రమాదానికి దారి తీస్తుంది.
అందోళన జీవి ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడేనా నవ్వినా పెద్దప్రమాదం తనకో,గ్రామానికో,జిల్లాకో,రాష్ట్రానొకో,దేశానికో వచ్చి తీరుతుంది. అందువలన,అందుచేత,అందుకొరకు ఆందోళనజీవి ఎప్పుడూ ఏడుస్తూనే,అరుస్తూనే ఉండాలి. అస్తు!
స్వస్తి!
లోకాః సమస్తాః సుఖినోభవంతు!
సలహా!
అమితమైన కష్టంలో కావలసినవారు ఆసుపత్రిలో ఉండి,విషయం చెప్పినపుడు చేయగలదేమి ఉంటుంది?
జాగ్రత్త అనా?
ఆసుపత్రిలో జేర్చిన తరవాత మరి జాగ్రత్తలేం తీసుకోగలరు.
విని ఊరుకోవడమా?
కాదే! వారెందుకు చెబుతున్నట్టు?
మనం ఆత్మీయులమని తలచి కదా సంగతి చెబుతున్నది. ఏం చేయాలి?
జరిగేది జరుగుతుంది,నిశ్చింతగా ఉండమనా?
అదే పరిస్థితులలో మనమున్నపుడు అలా చేయగలమా?
మరేం చేయాలి? ఇది నిజంగా అందరిని వేధించే ప్రశ్న.
వీలైతే వెళ్ళి ఒక సారి చూడాలి. మనిషి సాయం అవసరమైతే చేయాలి. నిబ్బరంగా ఉండమని నెమ్మదిగా చెప్పాలి. సొమ్ము అవసరమేమో కనుక్కోవాలి. ఇదీ నాకు తోచినది.
అన్నీ చేస్తాంగాని ఆ ఒక్కటీ అడక్కు అనుకుంటాం. అంతే! ఇదే వింత లోకం. అంతా విష్ణుమాయ అనుకుంటాం.
వయసొస్తే
వయసొస్తే వంకరకాళ్ళు కూడా తిన్నబడతాయి.
వయసులో గాడిదపిల్ల కూడా అందంగానే ఉంటుంది.
గుర్రాన్ని నీళ్ళ దాకా బలవంతంగానైనా తొలుకెళ్లగలవు కానీ నీరు తాగించలేవు.
ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయలేదని నానుడి.
(అను)రాగ, ద్వేషాలు రెండూ దుఃఖ కారకాలే!
అనురాగం మొదటనవ్వించి తరవాత ఏడిపిస్తే, ద్వేషం ఎప్పుడూ ఏడిపించేదే! ఇంతే తేడా!!
మనసు--సమస్య
మనసు సమస్యను సృష్టించుకుంటుంది. సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది. సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు.
ఎలా? అన్నది ప్రశ్న.
ఒక పని కావాలని తలపెట్టేవు,కావటం లేదు. సమస్య అనుకున్నావు, సమస్య పరిష్కారం కావటం లేదని బాధపడుతున్నావు. మనసును కట్టడి చేస్తే సమస్యలేదు కాదు పుట్టదు.నువు బాధ పడినంతలో సమస్య పరిష్కారం అవుతుందా? కాదు, కానేకాదు. ఆ పని పరిష్కారానికి నీవు చేయవలసినది చేయి, అదే పురుష ప్రయత్నం. ఫలితం పరమాత్మకి వదలిపెట్టు. అప్పుడు నీ మనసుకు బాధ లేదు. నీకు అనుకూలంగా పరిష్కారం కావాలని దైవం (అదే విధి)తలిస్తే అలాగే జరుతుంది. శంకరులు చెప్పినట్టు ''మూకం కరోతి వాచలం'',''పంగుం లంఘయతే గిరిం'' (మూగవాడు ధారాళంగా మాటాడగలడు, కుంటివాడు పర్వతాలు దాటేస్తాడు.) అనుకూలంగా పరిష్కారం కాలేదు,బాధపడవు, అది దైవ నిర్ణయం కనుక. మనం బాధపడినంతలో దైవ నిర్ణయం మారదు. జరగవలసినది జరిగి తీరుతుంది. దానిని మనం మార్చలేం.
తెనుగువారి పండగలు.
మన పండగలు తిథి ప్రకారం చేసుకుంటాం. తిథి చంద్ర గమనాన్ని లెక్కించేది. కొన్ని పండగలు సూర్యుని గమనాన్ని బట్టి చేసుకుంటాం. అందుకే అవి అదే నెల అదే తేదీలలో వస్తుంటాయి,సంక్రాంతి,తమిళుల ఉగాదిలాగా!
పాడ్యమి సంవత్సరాది పాడ్యమి.
విదియ భాను విదియ.
తదియ ఉమాచంద్రోదయామా వ్రతం అనే అట్లతద్ది.
చవితి వినాయక చవితి.
పంచమి ఋషి పంచమి.
షష్టి సుబ్బారాయుడు షష్టి
సప్తమి రథ సప్తమి.
అష్టమి కృష్ణాష్టమి
నవమి శ్రీరామ నవమి
దశమి విజయ దశమి.
ఏకాదశి భీష్మైకాదశి.
ద్వాదశి చిలుకు ద్వాదశి.
త్రయోదశి శని త్రయోదశి.
చతుర్దశి నరక చతుర్దశి, అనంత పద్మనాభ చతుర్దశి
అమావాస్య దీపావళి అమావాస్య.
పున్నమి కార్తీక పున్నమి.