Thursday, 21 November 2024

మధుమేహం ( షుగర్ )

 

నవంబరు 14 మధుమేహ నివారణా దినోత్సవం సందర్భంగా మధుమేహం గురించి ఓ చిన్న కధనం...,, 



మధుమేహం ( షుగర్ ) ఒక వ్యాధి కాదు అనేక వ్యాధుల సమ్మేళనం.మధుమేహవ్యాధి అదుపు చేయవచ్చు. కానీ నేటి శాస్త్ర విజ్ఞానం ప్రకారం పూర్తిగా లేకుండా చేయటం అసాధ్యం.            

ఆహార క్రమశిక్షణ, నియంత్రణ ద్వారా అదుపులోకి వస్తుంది.

     ఈ వ్యాధి శరీరంలో అనేక అవయవాలపై హాని కలిగిస్తుంది. మన శరీరంలో షుగర్‌ లెవల్స్‌ అదుపులో లేనప్పుడు ఎక్కువ హాని కలుగుతుంది. షుగర్‌ వ్యాధి అనేది జన్యుపరంగా లేదా హార్మోన్ల లోపం కారణంగా రక్తంలో షుగర్‌ స్థాయిని పెంచుతుంది. దానివల్ల మధుమేహం వస్తుంది.


షుగర్‌ వ్యాధి శరీరంలో అదుపులేనప్పుడు గుండె, మూత్రపిండాలు, కాలేయం, నరాలు, కళ్లు, పక్షవాతం, పాదాలకు సంబంధించిన వ్యాధు లకు ఎక్కువగా గురవుతారు. నేటి జీవనశైలి మార్పుల వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కానీ పాదాలకు ఎక్కువ హాని కలుగుతుంది. ముఖ్యంగా కాళ్లు మంటలు, తిమ్మిర్లు, మొద్దుబారటం, స్పర్శ తగ్గటం ఇలాంటి సమస్యలతో ఎక్కువగాబాధపడుతుంటారు. 


అలాగే తీవ్రంగా చెమటలు పట్టడం, చర్మం నల్లబడటం, అరికాళ్లు పగుళ్లు రావటం, చర్మం బాగా పొడిబారటం ఇవన్నీ ఒక రకమైన నరాలకు సంబంధించిన వ్యాధి లక్షణాలు. ఇవి శరీరంలో షుగర్‌ లెవల్స్‌ విపరీతంగా పెరగడం వల్ల వచ్చే అవకాశాలున్నాయి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవాటిని డయాబెటిక్‌ న్యూరోపతి అంటారు.


న్యూరోపతి అనేది నాడీ కేంద్రానికి సంబంధించి వచ్చే అనర్థాలు. ముఖ్యంగా నరాలు డామేజ్‌ అవ్వటం, ఎలాంటి లక్షణాలు కలగకుండా వచ్చే పుళ్లు, రక్తనాళాలలో రక్త ప్రసరణ తగ్గటం, రక్త నాళాలు సన్నబడటం, అతి తక్కువ వ్యవధిలో కాళ్లకు చెడు వాపు రావటం వంటివి ఎక్కువగా వస్తాయి.

డయాబెటిక్‌ న్యూరోపతి అనేది షుగర్‌ పేషంట్లకు 28-32 శాతం ఉంటుంది. 


ఐదు సంవత్సరాలు పైబడి షుగర్‌ వ్యాధి ఉన్న వారిలో ఈ లక్షణాలు కనబడుతుంటాయి. వీరిలో సహజంగా కాళ్లకు స్పర్శ లేకపోవటం, చిన్న చిన్న పుండ్లు రావటం, అవి వచ్చినట్టు తెలియకపోవటం లేదా త్వరగా తగ్గకపోవటం, అరికాళ్ల పగుళ్లలో మలినం చేరి, ఇన్‌ఫెక్షన్‌ రావడానికి అవకాశం ఉంటుంది.

రకాలు 

1. పెరిఫిరల్‌ న్యూరోపతి 

2. అటోనమిక్‌ న్యూరోపతి 

3. ప్రాక్సిమల్‌ న్యూరోపతి


నివారణ :క్రమం తప్పకుండా ప్రతి నెలా షుగర్‌ లెవల్స్‌ పరగడపున పరీక్ష చేయించుకుంటే (ఎఫ్‌బిఎస్‌) 110ఎంజి/డిల్‌ లోపు ఉండేలా... 


అల్పాహారం తీపుకున్నాక (టిఫిన్‌) గంటన్నరకు (పిపిబిఎస్‌) 140ఎంజి/డిల్‌ ఉండాలి. 


అలాగే హెచ్‌బిఎ1సి కూడా 5.6-6.5 శాతం ఉండవచ్చు. 


బిపి కూడా 130/80ఎంఎం హెచ్‌జిఎల్‌ లోపు ఉండాలి.


శరీరంలో కొవ్వు (చెడు కొలెస్ట్రాల్‌) టిజిఎల్‌, ఎల్‌డిఎల్‌ అదుపులో ఉంచుకోవాలి.


ప్రతిరోజూ క్రమం తప్పకుండా 30-40 నిమిషాలు వ్యాయామం చేయాలి. (వాకింగ్‌, జాగింగ్‌, షటిల్‌).

శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. 


బిఎంఐ 21 శాతం లోపు ఉండాలి.


ఎలాంటి మానసిక ఒత్తిడికి కలిగినా, నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి.


క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలి.


ప్రతి మూడు నెలలకు హెచ్‌బి ఎ,సి, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, గుండె ఇసిజి పరీక్షలు చేయించాలి. 


అలాగే కంటికి సంబంధించిన పరీక్షలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాలి. 


పాదాలకు సంబంధించిన పరీక్షలు డిజిటల్‌ బయోథీసోమీటర్‌, వ్యాస్కులర్‌ డాప్లర్‌, పొడియాస్కాన్‌ (అరికాళ్ల స్కాన్‌) పరీక్షలు అవసరం.

డాక్టర్. తాడి రామ గుర్రెడ్డి.. షుగర్ వ్యాధి వైద్య నిపుణులు... అనపర్తి.. తూ,గో,జిల్లా.

courtesy: whats app

================================================

సీనియర్ పేషంట్ గా అనుభవం.

కొత్తగా సుగర్ వచ్చినవాళ్ళు డిప్రెస్ కావద్దు,టెన్షన్ పడద్దు. ఇవి మొదటి శత్రువులు.

అశ్రద్ధ,బద్ధకం ఆ తరవాత శత్రువులు.

సమయపాలన అత్యవసరం అనగా ఒకే సమయానికి తినాలి,ఒకే సమయానికి పడుకోవాలి. ఒకే సమయానికి మందులు వేసుకోవాలి.

నిద్ర లేకుండడం కూడదు. రాత్రి ఒకటి,రెండు దాకా మేలుకుని ఉండకూడదు. ఎనిమిదిగంటల నిద్ర అత్యవసరం.

బిళ్ళేసుకుంటే సరిపోతుందనుకోకూడదు. 

వ్యాయామం అత్యవసరం.

BMI ఇండెక్స్ చూసుకోవాలి. అందులో వయసు,ఎత్తు   మార్చుకోలేం. మార్చుకోగలిగినది ఒక్క బరువే,అదీ వ్యాయామంతోనే.


ఇన్ని తిప్పలెక్కడపడతాం బిళ్ళేసుకుంటామనుకుంటే నమస్కారం. 

మా డాక్టర్ గారికి నమస్కారం మరియు అభినందనలతో.


2 comments:

  1. దీనికన్నా నీచపు రోగం మరొకటుండదు.
    పైగా డాక్టర్లకు, హాస్పిటళ్ళకు, ల్యాబ్ లకు, మందుల కంపెనీలకు ఆజన్మాంత ఖాతాదారుడిని చేసేస్తుంది మనిషిని.

    పిపిబిఎస్ పరీక్ష కోసం అల్పాహారం అన్నారు. దీని మీద ఇతర వాదనలున్నాయి. ఆ పరీక్ష పేరే post-prandial (వాడుకలో post-lunch అనేస్తుంటారు) గనక మాకు తెలిసినావిడ టిఫిన్ గిఫిన్ కాదు, ఏకంగా ఫుల్ భోజనం చేసేసి, ఆ గంటన్నర ఆగి రక్తనమూనా ఇస్తుంది. 🙂. ఇదీ కరక్టేనేమో అనిపిస్తోంది. ఏమంటారు?

    ReplyDelete
  2. ఏది తినాలో , వద్దో
    సోది వచించే జనాల జోరందు కొనెన్
    ఏదీ తినకున్నా , నిం
    పాదిగ అస లుండనీదు , పాడు డయబిటీస్ .

    ReplyDelete