చేరి మూర్ఖులమనసు రంజింపరాదు.
చలి పెరిగిందన్నారు మిత్రులు ఉదయమే!
చలి పెరిగింది,మూర్ఖుని బలంలా. అంటే చలిపెరిగితే ఉష్ణం తగ్గిందని ఉష్ణ చలన సూత్రం చెబుతోందిట. అలాగే మూర్ఖుని బలం పెరిగితే అన్యాయానికి బలం పెరుతుంది అనగా న్యాయం బలం తగ్గుతుంది.
ఇది అన్యాయం కదా!
పిచ్చి మాట.
లోకం లేదుటయ్యా! నవ్వదూ.
మరో పిచ్చిమాట.
లోకం నిన్ను చూసి నవ్వడమే కాదు నిన్ను న్యాయాన్ని గుర్తించవు.
అదేం!
చలికి ఉష్ణం తలవంచలా! అలాగే మూర్ఖుని బలానికి అనగా అన్యాయానికి న్యాయం తలవంచక తప్పదు.లోకం నిన్నుచూసి నవ్వుతుంది,మూర్ఖునికి మారాడదు.
హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు చెప్పినట్టు ఎవరూ చెప్పరు.
వైరులెవ్వరు? చిత్తంబు వైరిగాక
చిత్తమును నీకు వశముగా జేయవయ్య!
మదయుతాసురభావంబు మానవయ్య!
యయ్య! నీ మ్రోల మే లాడరయ్య! జనులు.
ఇదే లోకరీతి.
-
ReplyDeleteచేరి మూర్ఖుల ప్రముఖులు చేయ రాదు
వారు చేసెద రెన్నెన్నొ భాషణలను
మనము రంజింప వారలు మాను లెక్కి
మనల వాయింతు రయ్యొ సమాజమందు
DeleteZilebi20 November 2024 at 02:13
శేషప్ప కవిగారు చాలా ఏళ్ళకితమే వీరి గురించి చెప్పేసేరు, ఒక్కపద్యంలో. అధిక విద్యావంతులప్రయోజకులైరితో మొదలు పెట్టి ఇందులో ఎవరెవరో!
అధిక విద్యావంతు లప్రయోజకులైరి
పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
వదరుబోతుల మాట వాసికెక్కె
ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
పరమలోభులు ధనప్రాప్తులైరి
పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !!
వారే బలవంతులని చెప్పేరు.
శేషప్పాజీ ఆనాటి కాలపు అనాలిసిస్ పెరాలిసిస్ సుడిగుండములో తగులుకొని కొట్టుమిట్టులాడి వుంటారు :)
Delete
DeleteZilebi20 November 2024 at 09:34
శేషప్ప కవిగారే ఏమి? లోకోత్తరులను,పుట్టించిన దేవుని కూడా వదలని దురహంకారమనుకుంటున్నారు,అంతా
అట అట అంటూ మీరే కల్పిస్తున్నారు మల్లే ఉందిస్మీ :)
Deleteశర్మ గారు,
ReplyDelete// “ చలి పెరిగిందన్నారు మిత్రులు” //
అవును కదా మరి. భాగ్యనగరంలో నిన్నటి కనిష్ఠ ఉష్ణోగ్రత 15.8 C డిగ్రీలు ⛄️.
విన్నకోట నరసింహా రావు20 November 2024 at 12:20
Deleteమా దగ్గర 17-18 మధ్యలో ఒక్కసారి వేడిమి తగ్గడంతో మాకూ చలనిపించింది. ఈ రోజూ అలాగే ఉంది. మరో రెండు రోజులలా ఉంటుందని సూచన
శీతాతపాలు పృధివీ
ReplyDeleteజాత భ్రమణాల వల్ల జనియించు , నదే
చేతన్ గల యధికారమె
భూ తలమును మార్చు ననుచు మూర్ఖుడు దలచున్ .
వెంకట రాజారావు . లక్కాకుల20 November 2024 at 13:42
Deleteతిత్తిరి పక్షి ఆకాశం పడిపోదని తనకాళ్ళతో ఆపుతున్నానని వెల్లకిలా కాళ్ళు పైకి జాపుతూ ఎగిరిందట. అలా మూర్ఖుడు భూభ్రమణం తో కలిగే శీతాతపాలు తన అధికారంవల్లే జరుగుతున్నాయని మిడిసిపడటం నేటి కాల లక్షణం కదు సార్!