Sunday 30 June 2024

పిల్ల చచ్చినా పురిటి కంపు పోదు.

 పిల్ల చచ్చినా పురిటి కంపు పోదు.


ప్రసవించిన స్త్రీ దగ్గరనుంచి కొద్ది వాసనొస్తుంది,దీన్ని పురిటి వాసన అంటారు. ఇది ప్రసవానికిగాను శరీరం నుంచి బయటకొచ్చే కొన్ని హార్మోన్ల ప్రభావం. దురదృష్టం కొద్ది బిడ్డ దక్కకపోయినా ఈ వాసన తప్పదు,మూడు నెలలుంటుంది.


ఎన్నికలైపోయాయి దగ్గరగా నెల కావొస్తోంది, కాని ఆనాడు ఓటేసినట్టు వేలు మీద పెట్టిన గుర్తు మాత్రం ఇంకా పోలేదు, ఎన్నాళ్ళుంటుందో చూడాలి.

అనారోగ్యంతో బాధ పడుతున్నా రాసే అలవాటు మానలేనట్టు.  :) :) :) 


2 comments:

  1. నిజమే, శర్మ గారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు వేసిన సిరా గుర్తు దాదాపు లోక్ సభ ఎన్నికల వరకు ఉంది. నువ్వు ఆల్రెడీ ఓటు వేసావని ఈ గుర్తే చెబుతోంది, మళ్ళీ వచ్చావేం అని బూత్ ఆఫీసర్ అడ్డం కొడతాడేమో అనుకున్నాను. అదృష్టవశాత్తూ లోక్ సభ ఎన్నికలకు ఓ నెల ముందర మొత్తానికి ఆ గుర్తు మాయమయ్యింది.

    ఆ సిరా మరీ చిక్కగా తయారుచేస్తున్నారేమో 😀😀?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు30 June 2024 at 12:52
      స్వాతంత్ర్యం వచ్చిన తరవాత జరిగిన అన్ని ఎన్నికలలో పాల్గొన్నాను,మొదటి మూడు ఎన్నికలూ తప్ప. మొదటిలో చుక్క పెట్టేవారు, గోరు మీద. అది చేరిపేసుకొచ్చి మళ్ళీ వోటేసేమని చెప్పుకునీవారూ ఉండేవారు.ఆ తరవాత చుక్క గోరుకి చర్మానికి మధ్య పెట్టేవారు. దీనికీ ఏదో పిల్లి మంత్రం వేసేవారట,మళ్ళీ ఓటేయడానికి. ఆ తరవాత నుంచి చుక్క బదులు గీత పెడుతున్నారు,గోరూ మరియూ చర్మం మీదకి వచ్చేలాగా. ఇది చాలా కాలం నుంచే కొనసాగుతున్నట్టుందండి. ఇంకు చిక్కబరచేరేమో చెప్పలేనండి. నెలపైన గుర్తుండిపోతోంది.పనిపాటూ లేక గుర్తిస్తున్నానేమో సుమా :)

      Delete