Thursday 20 June 2024

సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

 సామాన్యుడి సణుగుడు-ఇదీ మనరాత కత!

nmrao bandi14 June 2024 at 05:47

''అవును గురూజీ నేనూ అనుకుంటూ ఉంటాను, నేను పోయినా నా బ్లాగు ఇలాగే ఉంటుంది కదా అని. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు - అలా నా వెనక!? దేవుడికే అది ఎరుక, తెలిసేది లేదు కనక!! మనం ఎగిరెళ్ళిపోయినా బ్లాగు చూసే మిగిలున్న వాళ్ళకి ఆ విషయం తెలీదు కనక! ఓ విధంగా ఆ విధంగా సజీవులమే కొన్నాళ్ళు, ఇంకొన్నాళ్లు - అదెన్నోళ్ళో మరి! ఇది కన్నోళ్ళు విన్నోళ్ళు ఏమంటారో మరి? ఔనంటారా సరి! రామ్మా, పజ్జెమేసుకో బామ్మా :)''




మిత్రుని వ్యాఖ్యకి సమాధానం రాయబోతే టపా అయ్యేలా ఉందని వెనకబెట్టేను. ఈ రోజుదయం సింహాసనం ఎక్కి రాయడం మొదలు పెట్టేటప్పటికి కరంటు పుటుక్కున పోయింది. అయ్యో! అనుకుంటూ వచ్చాకా మొదలెడితే మళ్ళీ పోయింది.(వారం కితం మాట)  ఎన్నిసార్లు లెక్కేయడం మానేసా! విసిగి రాయడమే మానేసాను! మొదలెట్టిన ప్రతిసారి కొత్త ఆలోచన, ఆలోచనలు ముసిరి,విషయం పక్కకి పోయి,చిందరవందరైపోతే! మొత్తం ఎత్తి కట్టేసాను! రాత్రి మొదలెడితే, అనుకుంటే వేడి రాత్రికీ దిగలేదు. మొదలెట్టేనుగాని వేడి భరించలేక మానేసాను. తెల్లవారుగట్ల మొదలెడదామని! (ఇదంతా నాలుగురోజుల కితం మాట) వేడి ఇంకా దంచుతోనే ఉంది,చినుకులు అక్షంతల్లా పడ్డాయి.


ఎక్కడ మొదలెట్టాలి? సమస్య అలాగే ఉండిపోయింది. ఎక్కడో ఒకచోట మొదలెట్టాలిగా! అని ఇలా!

మొదటగా ఆకాశం వ్యక్తమయింది. దానినుంచి గాలి, గాలినుంచి అగ్ని,అగ్నినుంచి నీరు,నీటి నుంచి భూమి. వీటన్నిటి సంయోగంతో సర్వసృష్టి వ్యక్తమయ్యాయని మన తత్త్వం చెబుతోంది,సయిన్సూ చెబుతోంది. ఆకాశం ఎక్కడినుంచి పుట్టిందీ? మహత్తు నుంచి అంటోంది భారతీయ తత్త్వం, అదే శక్తి అనికూడా అంటోంది,సయిన్సూ. ఆశక్తినే మనవారు లలితా దేవి అనికూడా అన్నారు. లలితా సహస్రనామాలో ఒక నామం ”వియదాది జగత్ప్రసూః” అని అంటే వియత్తు అనగా ఆకాశం మొదలుగా,వియదాది, జగత్ ప్రసూః అనగా సర్వజగత్తునూ కన్న తల్లి అని. అనగా ఆకాశం మొదలుగా పంచభూతాలను వ్యక్తపరచిన శక్తి అని అర్ధం. ఇలా సర్వజగత్తునూ వ్యక్తం చేయడం మరలా అవ్యక్తం, తనలోకి తీసుకోవడం చేయడం అనేది, ఈ శక్తి ఎక్కడా? అంటే! భాగవతం 'లోకంబులు లోకేశులు,లోకస్థులు దెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుంగు'.... అంటుంది ఆ శక్తిని వర్ణిస్తూ! అక్కడే పోతనగారు 'ఒకపరి జగముల వెలినిడి,ఒకపరి లోపలికి గొనుచు నుభయము తానై' అంటూ చెబుతారు. సయిన్స్ చెప్పే,మన తత్త్వం చెప్పే ఈ ఎవల్యూషన్,డివల్యూషన్ రెండూ పక్కపక్కలే జరిగిపోతుంటాయి.ఒక్క సారిగా అన్ని వ్యక్తం కావు అన్నీ ఒక్కసారిగా అవ్యకతమూకావు, కాలంలో వచ్చి వెళుతుంటాయి. మొత్తం ఒక్క సారిగా ప్రళయం సంభవించి అన్నీ ఏకమవుతాయి. అప్పటిదాకా ఈ రెండూ జరుగుతూనే ఉంటాయి. అన్నీ కాలంలో వచ్చి కాలంలో వెళుతుంటాయి. అందుకే దీనిని జగత్ అని అంటారు. జాయతే గఛ్ఛతే ఇతి జగత్, వచ్చేది,వెళ్ళేది. అన్నీ కాలంతో పాటివే! కొన్ని, కొన్ని క్షణాలే ఉంటే కొన్ని వందల సంవత్సరాలుంటే, మరికొన్ని వేల సంవత్సరాలు ఉంటాయంటున్నారు. సముద్రం లో వేల సంవత్సరాలుండే జీవులున్నాయని సయిన్స్ చెబుతోంది. కాలం మాత్రం ఆ శక్తికిలోబడి ఉంటుంది, దానినే ,కాలాతీత శక్తి, అని అంటాం.చెప్పుకుంటే చాలా ఉంది. ఇక్కడికాపుదాం. 

మనకతలో కొస్తే!


న+క్షరం='అక్షరం', అనగా నశింపు లేనిది. మనం రాసే ఈ అచ్చరాలెంతకాలముంటాయన్నదే ప్రశ్న. రామాయణం రాస్తూ వాల్మీకి, ''ఈ కావ్యం, నదులు పర్వతాలు ఉన్నంత కాలం ఉంటుంద''న్నారు. ఇటువంటి మాట ఆ తరవాత కవుల్లో ఎవరూ అనలేకపోయారు,నేటిదాకా.  ప్రకృతిలోకి వ్యక్తమయ్యేది ప్రతిదీ, కాలం తో ముడిపడి ఉన్నట్టే మన అచ్చరాలూ ముడిపడి ఉన్నాయి.   ప్రతిజీవికి కాలం ఉన్నట్టే  అచ్చరాలకీ కాలం ఉంది. కాలం తరవాత మరుగునపడతాయి,నశించవు. అక్షరాల సమూహానికో త్రాణ,త్రాణని బట్టి కాలం, కాలమే ప్రాణం. అది ఎంత? అదిగదా ప్రశ్న,సమాధానం లేని ప్రశ్న.  


 ఒకప్పుడు అచ్చరానికి మాధ్యమం శ్రవణం, కాలం మారి, అనేకరూపుల్లో పుస్తకాలొచ్చి చాలా మార్పొచ్చింది. ఇప్పుడు పుస్తకాన్ని ముట్టుకునే ఓపిక,తీరిక ఎవరికిన్నీ లేదు. అంచేత మరలా శ్రవణానికే మారిపోతున్నకాలం.


ఇక ఎలక్ట్రానిక్ యుగంలో మార్పులు చాలా తొందరగా వస్తున్నాయి. ఈ మాధ్యమాలు మనం చూస్తుండగా పుట్టాయి,పెరిగాయి, కొన్ని మరుగున పడిపోయాయి. ఈ అచ్చరం రాసే అలవాటున్నవాళ్ళు కొద్ది. చదివేళ్ళూ వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. మాధ్యమాలు వెనకబడితే, రాసేవాళ్ళు వెనకబడితే,చదివేవాళ్ళు వెనకబడితే అన్ని మరుగున పడతాయి. అదెంతకాలం? అదీ పెద్ద కొచ్చను.????


11 comments:

  1. ఏల యీ సుత్తి :)


    ReplyDelete
    Replies
    1. Zilebi20 June 2024 at 09:00
      సుత్తో,స్తుతో తెలిసిందా?

      Delete
    2. ఆయ్ తెలి సొచ్చిందండి
      సుత్తియే అని శ్రీమాన్ రాముడు గారు క్రింది వ్యాఖ్యలో ఉద్ఘాటించి యున్నారు.


      ఇట్లు
      జిలేబి

      Delete
    3. Zilebi1 July 2024 at 04:07
      గతీ/మతీ/సుతీ/స్థితీ తప్పిన అపర మేధావివి కదా!
      యద్భావం తద్భవతి

      Delete
    4. శృతిని వదిలేసినట్టున్నారు ? :)


      Delete
    5. Zilebi1 July 2024 at 12:18
      శ్రుతి---ప్రకృతి.
      సుతి--- వికృతి.

      Delete
    6. మరీ వికృతమై పోయేరు :)
      నెనరులు శ్రుతి ఇంకా తప్పలే :)


      Delete
    7. Zilebi2 July 2024 at 08:56
      గతి తప్పితే తరవాతన్నీ తప్పుతాయి. మతీ/సుతీ అన్నది వాడుక. అప్పుడన్నీ వికృతులే :)

      Delete
  2. ఏదైనా అనాచారమో, పొరబాటో జరిగితే ఓర్వలేని మనిషి తన ఆక్రోశాలన్ని ఏదో రకంగా వెలిబుచ్చుతాడు. ఇక్కడ జరిగిందంతే!!

    ReplyDelete
    Replies
    1. raamudu29 June 2024 at 01:58
      అక్షరాల్లో, ఆలోచన,ఆవేదన,ఆవేశం,ఆక్రందన,ఆక్రోశం, ఆనందం వెలిబుచ్చుకోడమే కదండీ! నిజానికి అశక్త దుర్జనత్వం :)

      Delete
  3. -
    ఏదైనననాచారం
    బేదైనా‌ను పొరబాటు పెద్దగ లేపున్
    వేదాంతపుటాక్రోశము
    ఖేదంబల్లుకొను మేలు కేల్మోడ్చుటయే!



    ReplyDelete