Thursday 13 June 2024

సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.

 సామాన్యుడి సణుగుడు-శాశ్వతం.


ఏది శాశ్వతం? ఏదీ కాదన్నదే సమాధానంట.మనకి కనపడే జంగమాలు,స్థావరాలు,ఉద్భిజాలు సర్వం ఎప్పుడో ఒకప్పుడు పుట్టినవే కాలంలో. అంచేత అన్నీ కాలంలో లయం కావలసినవే! కాలమే శాశ్వతమా? కాదు. మనకి శాశ్వతంగా కనపడే కాలాన్ని కూడా లయం చేసే శక్తి ఉంది. అదే శాశ్వతం. ఏంటో దీనికి అంతులేదు,ఆదీ లేదు.


నా తరవాత నేను సంపాదించిన ఇళ్ళు,పొలాలు,,బంగారం వగైరా వగైరా ఏమవుతాయి? అసలు నేనేమవుతాను? నేను పోయిన తరవాత ఏం జరిగితే నాకెందుకు? ఏమవుతానో నాకు తెలీదు కదా? మరి దేనికి చింత? అనుకోగలిగితే కొచ్చనే లేదు.కాని అలా అనుకోదే మనసు. నా తరవాత నా పేరైనా శాశ్వతంగా ఉండాలని తాపత్రయం. ఇది నాతోనే మొదలవలేదు. అబ్బో మానవజాతి పుట్టినప్పటినుంచీ ఉంది,ఈ ఆలోచన. 


 మహరాజులు,రాణులు గుళ్ళు కట్టించారు,చెరువులు తవ్వించారు, అన్న సత్రాలు పెట్టించారు, కావ్యాలు రాయించారు, కృతులు పుచ్చుకున్నారు, ఇలా చాలాచాలా చేసేరు. పోషణకై ఆస్థులిచ్చారు.  కలిగినవారు చేశారీ పని. వేశ్య కూడా ఈ పని చేసింది. బోగందాని చెరువు పేరుండిపోయింది,ఆవిడపేరు తెలియకపోయినా!


నా తరవాత ఏం జరగాలో విల్లు రాసాను, ఆస్థులు అలా పంచుకుంటారు,తగువు లేదు, రాయకపోయినా పంచుకుంటారు, మానెయ్యరు, ఇదో చాదస్తం అంతే! ఒక రోజేడుస్తారు లోకంకోసమే! అమ్మయ్య ముసలాడి గొణుగుడు తప్పింది,చాకిరీ తప్పిందని.ఆ తరవాత మరిచే పోతారు, సహజం, నేను తాతని గుర్తుపెట్టుకున్నానా? పేరెట్టుకున్న, గనక, గుర్తు అంతే!


అతి సామాన్యులు ఐతే గుడి మెట్ల మీద పేర్లేయించుకునీవారు. మెట్టుకి పావలా పేరు లో అక్షరానికి అణా ఇలా ఉండేవి.నేటికీ కొన్ని దేవాలయాలకి మెట్లు వాడుతున్నారు, వాటి మీద నేటికిన్నీ పేర్లు కనపడుతుంటాయి. మా తాతపేరు అన్నవరం గుడి మెట్లమీదుందోచ్! అని చెప్పుకునీవారూ ఉన్నారు.


ఇంత అశాశ్వత జగత్తులో మన రాతలో లెక్కా! ఉంటే ఎక్కడో మూలుంటాయి,లేదూ కొట్టుకుపోతాయి, కాలంతో. నాబ్లాగొకదాన్ని రెండేళ్ళ కితం వదిలేసా! అప్పుడప్పుడు చూస్తుంటా,తెరుస్తా! ఉందా? పోయిందా అని! ఇంకా ఉంది, చిత్రం ఎవరికో అవసరం, రోజూ పాతికనుంచి ఏభై హిట్లుంటాయి. ఎన్నాళ్ళుంటాయి? అదే తెలీదు :) 

16 comments:

  1. ఆ యేదో ఒక రోజు పోయే వాళ్లమే కదా అని యే రోజు కారోజు బువ్వ తినకుంటామా :)

    అల్లా గే రాస్తూండండి

    బఠాణీలు నమలడానుకి రీ టైర్డు జన సం దోహదు చేసే వాళ్లూ ఉన్నాము :)



    ReplyDelete
    Replies
    1. Zilebi14 June 2024 at 04:08
      ఆహారము,నిద్ర,భయము,మైథునము సర్వ జీవులకు సమానము :)

      అప్పా! నువు గుప్పు నేను పక్కలెగరేస్తా అన్న నానుడిగా ఉందిలే!

      పళ్ళూ,కళ్ళూ లేనివాళ్ళు బఠానీలు నములుతారష :)

      Delete
  2. అవును గురూజీ నేనూ అనుకుంటూ ఉంటాను, నేను పోయినా నా బ్లాగు ఇలాగే ఉంటుంది కదా అని. ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు - అలా నా వెనక!? దేవుడికే అది ఎరుక, తెలిసేది లేదు కనక!! మనం ఎగిరెళ్ళిపోయినా బ్లాగు చూసే మిగిలున్న వాళ్ళకి ఆ విషయం తెలీదు కనక! ఓ విధంగా ఆ విధంగా సజీవులమే కొన్నాళ్ళు, ఇంకొన్నాళ్లు - అదెన్నోళ్ళో మరి! ఇది కన్నోళ్ళు విన్నోళ్ళు ఏమంటారో మరి? ఔనంటారా సరి! రామ్మా, పజ్జెమేసుకో బామ్మా :)

    ReplyDelete
    Replies

    1. nmrao bandi14 June 2024 at 05:47
      మిత్రమా! సమాధానం రాయబోతే టపా అయ్యేలా తోచింది, టపా వేస్తాను, ఆలస్యానికి మన్నించాలి.

      Delete
  3. వినరా వారు కనిపించుటలే
    దేశాంతరం వెళ్లేరా లేక మోడీని కలిసి గవర్నర్ పదవి కైవసానికై ....

    ReplyDelete
    Replies
    1. ప్రమాణస్వీకారాల అట్టహాసం నుంచి ఇంకా కోలుకోలేదు.

      Delete

    2. విన్నకోట నరసింహా రావు14 June 2024 at 07:24
      అభిమానులనుకున్నా గాని మరీ ఇంతనుకోలేదుసుమీ! :) (సరదాకే సుమీ!)

      Delete
    3. అయ్యో శర్మ గారు, మీకలా అర్థం అయిందా 😒?

      నాయకుల యొక్క విజన్ మీద, పట్టుదల మీద, పని సామర్థ్యం మీద వరకే సోకాల్జ్ “అభిమానం”. వాళ్లు చేసే వృధా “షో” మీద, హంగుల మీద కాదు - ముఖ్యంగా ప్రమాణస్వీకారం సందర్భంలో.

      కేంద్రంలోనూ, మీ రాష్ట్రం లోనూ మొన్న జరిగిన ప్రమాణస్వీకారాల హంగామా, ఆడంబరం చూసి, వెగటు పుట్టింది నా మటుకు నాకు (అందుకే ఇంకా కోలుకోలేదు అన్నాను). పొరుగు దేశాల నుంచి / పొరుగు రాష్ట్రాల నుంచి నాయకులను ఆహ్వానించడమేమిటి, వాళ్ల కోసం అంతంత భారీ ఏర్పాట్లు (చెయ్యాలిగా తప్పదు), బహిరంగ మైదానాల్లో ఆ వేదికలు, ఇసకేస్తే రాలనంత జనం వగైరా వగైరా - అబ్బో చెప్పనలవి కాని పటాటోపం. ఒకప్పుడు రాష్ట్ర గవర్నర్ గారి రాజభవన్ లో జరిగేది కార్యక్రమం. పరిమితంగా ఆహ్వానించే వారు, సింపుల్ గా జరిగేది. నాకు గుర్తున్నంత వరకు N T రామారావు గారి రాకతోటే మొదలయింది ఈ హడావుడి. నా ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేస్తాను అంటూ కార్యక్రమాన్ని L B స్టేడియో కు తీసుకువచ్చాడు ఆయన. ఒకరు ఒక వరవడి మొదలెట్టిన తరువాత అది వేలంవెర్రిగా తయారవుతుంది కదా. అదే జరిగింది - పార్టీలకతీతంగా. ఇదంతా “ఎవడబ్బ సొమ్మని” ?

      దీనికి తోడు ప్రైవేట్ మీడియా వచ్చిన తరువాత తామేదో “డిఫరెంట్” గానూ “వెరైటీ” గానూ చెబుతున్నామనుకునే భ్రమలో “పట్టాభిషేకం”, “కొలువుదీరడం” అంటూ రాచరికపు పదాలను ప్రయోగించడం మొదలెట్టారు. అందుకే వార్డు కౌన్సిలర్ కూడా తానేదో ఆ ఏరియాకు రాజుని అని నమ్ముతున్నారు. ఎటు పోతున్నాం!

      Delete
    4. > ఎటు పోతున్నాం!
      వెనుకకే కదుటండీ. అనుమానం లేదు.
      చంద్రబాబు గారు "రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉంది" అని ఒక డైలాగ్ చెప్పేసి రాజభవన్ లోపల ప్రమాణస్వీకారం కానిచ్చి ఉంటే నిజంగా బాగుండేది. వారికి నచ్చాలీ వీరు మెచ్చాలీ అనుకుంటూ ప్రజాధనం దుబారా చేయకుండా ఉంటే బాగుండేది. ఆకార్యక్రమాన్ని ఎలాగూ ప్రత్యక్షప్రసారం చేసేవారు కాబట్టి జనం మిస్ అయ్యేది ఏమీ ఉండేది కాదు. ప్రజలు కూడా జగన్మోహనంగా దివాళాతీసిన రాష్ట్రంలో ఇలా జరగటం తప్పేమీ లేదు మంచిదే అని మెచ్చేవారు. ఏంచేస్తాం రాజకీయులకు అంత విజ్ణత లేకపోయింది.

      Delete
    5. అవును శ్యామలరావు గారు. అలా చేసి ఆదర్శవంతంగా ఉండే అవకాశాన్ని పోగొట్టుకున్నారు చంద్రబాబు గారు.

      Delete
  4. అంతా అశాశ్వతమే కదండీ.కాని మానవప్రయత్నంగా చేయవలసినది ఉంటే చేయటానికి ప్రయత్నం చేయాలి ఫలాపేక్ష లేకుండా. నాబ్లాగులో వేలాది టపాలున్నాయి. అక్కడ వర్గాలుగా ఉన్నా పాఠకులకు మరీ అంత సౌకర్యం లేదు. అందుకే అదంతా పుస్తకరూపంలోనికి తేవాలని కసరత్తు చేస్తున్నాను. దైవానుగ్రహం ఉంటే అది తప్పక త్వరలోనే జరుగుతుంది. ఆపైన అది ఎంతగా జనోపయోగి అవుతుంది అంటే అదీ దైవేఛ్ఛయే.

    ReplyDelete
    Replies

    1. శ్యామలీయం15 June 2024 at 10:08
      ఏదీ శాశ్వతం కాదు కాలంలో ఉనికి సాపేక్షం అంతే :)
      ఏదీ శాశ్వతం కాదు కాలంలో ఉనికి సాపేక్షం అంతే :)
      ఏదీ జరగక ఆగదు. పుస్తక రూపం అనందకరమైన వార్త! సొమ్ములతో పని, చూసుకు దూకండి! ఉ.బో.స. :)

      Delete
    2. విన్నకోట నరసింహా రావు15 June 2024 at 15:21
      జనాలకి ఆ మాత్రం జాయ్! ఎంజాయ్మెంటూ ఉండద్దండీ! నాలుగురోజులనుంచి సమయం సందర్భం లేకనే కరంటు పోతోంది. ఏమంటే పైనే పోతోందని జవాబు. మిత్రుడితో అంటే కరువు సూచనలోయ్ అన్నాడు, అర్ధం కాలా!!!!!

      Delete
    3. // “కరువు సూచనలోయ్” //
      ఆ అపప్రథ పోవడానికేగా వర్షాలు మొదలయ్యాయి 🙂. .

      Delete
    4. విన్నకోట నరసింహా రావు17 June 2024 at 12:12

      అలా అనుకోమంటారా? :)

      అతివృష్టి, అనావృష్టి రెండూ కరువుకి కారణాలట సార్. మొదటి దానితో శ్రమకూడా దండగ. మీ పట్నవాసాల్లో బాగా కురుస్తున్నట్టుందండి. మా పల్లెలలో చుక్కలేదు. అదృష్టం మీదో మాదో! మీరే చెప్పాలి. :)

      Delete
    5. విన్నకోట నరసింహా రావు17 June 2024 at 12:12
      మంగలంలో లా వేయించి,మాకూ నాలుగు చినులులు పడ్డాయండి, చల్లబడలేదంతే !!!

      Delete