Sunday 16 June 2024

సామాన్యుని సణుగుడు- దిన దిన గండం

 సామాన్యుని సణుగుడు- దిన దిన గండం నూరేళ్ళ ఆయుస్సు.

గండం అంటే ప్రాణ ప్రమాదం. దినదినమూ ప్రాణప్రమాదమే కాని వందేళ్ళూ బతుకుతాడని భావం.ప్రళయం అంటే లయం, అనగా కలిసిపోవడం.ప్రాణులన్నిటికి నిద్ర నిత్య ప్రళయం,తప్పనిదిన్నీ! అలాగైతే నూరేళ్ళెలా బతుకుతారని కదా!బతుకుతారు అదే చిత్రం. దినదినమూ నిద్రపోతారు, మేల్కొంటారు. ప్రళయం గడుస్తుంది. ఇలా అలావాటైన నిత్య ప్రళయాన్ని ఎవరూ లెక్క చెయ్యరు. ఎప్పుడో ఒక రోజు నిద్ర లేవరు అంతే!!! అందుకే దాన్నే దీర్ఘనిద్ర న్నారు. అదీ ఈ నానుడి భావం.








ఎవరు తప్పుకున్నా ప్రభుత్వం పడిపోదని తెలిసినవారి మాట. ప్రభుత్వంతో ఉన్న పార్టీలకి బి.జె.పి కి పరస్పరాశ్రయ న్యాయం వర్తిస్తుందిట. వీరవసరం వారికుంది,వారవసరం వీరికుంది. ఎవరూ విడిచిపోయేవారు లేరు. ప్రతిపక్షంలోనే చీలికలొచ్చే సూచనలు కనపడుతున్నాయి.

జగన్ మాకు 15 మంది ఎమ్.పి లు ఉన్నారు. మా బలమేం తగ్గలేదు, దేశావసరాలు,రాష్ట్ర అవసరాలని బట్టి అవసరం మేరకు ప్రభుత్వాన్ని బలపరుస్తామన్నారు. మహారాష్ట్రలో లకలుకలు బయలు దేరాయి ప్రతిపక్షంలో!! దినదినగండం నూరేళ్ళాయుస్సే!!!!


5 comments:

  1. తాత గారి అనాలిసిస్ పెరాలిసిస్ భేషు :)

    ఎలచ్చన్ల ముందర అనాలిసిస్సు
    తరువాయి అనాలిస్సు
    ఆ తరువాయి ఉంటుందో ఊడుతుందో
    అనాలిసుస్సు

    దిన దిన ఖండన మండన నూరేళ్లు టీఆర్పీ పెరుగు :)


    ReplyDelete
    Replies
    1. Zilebi18 June 2024 at 04:06
      చింతకాయలకి ఆజ్ఞగాని గుటకలకి ఆజ్ఞా? అన్నది ఒక నానుడి.
      నాలుగొందల సీట్లొస్తాయనుకున్నవాళ్ళకి వచ్చాయా?
      రేపు మాదే ప్రభుత్వం అనుకున్నవాళ్ళేమయ్యారు? ఇ.వి.ఎం ల వెనకపడ్డారా?
      జనం అనుకుంటారు. జరగచ్చు జరక్కపోవచ్చు. దానికేం? ఎవరి చిత్తం వారిది :)

      ఖండన మండనలు ఐదేళ్ళే! తరవాత "రాజెవరో రెడ్డెవరో?" ఇదొకనానుడిలే!

      Delete
    2. చింతకాయలకి ఆజ్ఞగాని గుటకలకి ఆజ్ఞా?

      ఈ నానుడి‌ గురించి విశదీకరిస్తారూ ప్లీజ్ అండీ :)

      Delete

    3. Zilebi18 June 2024 at 12:16
      ఒక చిన్నకత!

      నీలాటివాడికో చింతచెట్టు, అది విరగ్గాసింది. నాలాటి నిర్భాగ్యుడుకి చింతకాయలు తినాలని ఆశ. కోసుకునే సావకాశమే లేదు. యజమాని చెట్టుకిందే ఉన్నాడు గనక. అందుకు దూరంగా నిలబడి గుటకలు మింగడం ప్రారంభించాడు. అది చూచిన చెట్టు యజమాని గుటకలు మింగుతున్నావేమని గద్దించాడు. అప్పటికి కాస్త తెలివి తెచ్చుకున్న గుటకలు మింగేవాడు, చింతకాయలు కోసుకోవాలంటే నీ ఆజ్ఞ కావాలిగాని నేను గుటకలు మింగడానికి నీ ఆజ్ఞ ఎందుకని ఎదురు తిరిగాడు.

      నాలుగువందల సీట్లొస్తాయని గుటకలు మింగడం తప్పేం కాదు. సీట్లిచ్చేవాళ్ళ ఆజ్ఞలేక సీట్లు రావు గనక వారి ఆజ్ఞ కావాలి.

      ప్ర్తభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పుకోడానికి,గుటకలు మింగడానికి ఎవరి ఆజ్ఞ అక్కరలేదు, కాని సీట్లు మెజారిటీ కావాలంటే ప్రజల ఆజ్ఞ కావాలి.
      తెరియమా? సమజ్ గాలే!!

      Delete
    4. వామ్మో వామ్మో తాతగారెక్కడికి యెక్కడ లింకులు దొరుకుతాయో !!!

      Delete