Thursday 25 April 2024

ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ప్రజలను ఆకర్షించు విద్యలు.

 ఉచ్చై రధ్యయనం, చిరంతన కథా:, స్త్రీభి: సమాలాపనమ్,

తాసా మర్భక లాలనం, పతినుతి:, తత్పాక మిథ్యాస్తవమ్
మిథ్యా దాన, మభూత పూర్వ చరితం, సాముద్రికం, జ్యోతిషం
వైద్యం, గారుడ మంత్రజాల మధికం భిక్షాటనే ద్వాదశ

గట్టిగా చదవటం,
ఎక్కడెక్కడివో గాథలు చెప్పటం,
స్త్రీలతో సక్కగా మాట్లాడటం,
వారి బిడ్డలను ముద్దుచేయడం,
పై అధికారిని పొగడడం,
వండిన వంటను మెచ్చుకోవడం,
దానం చేసినట్లు కనిపించడం,
లేని కథలు అల్లి చెప్పడం,
హస్తసాముద్రికం,
జ్యోతిషం,
వైద్యం,
పాము తేలు మంత్రం
- అనేవి ఇతరులను ఆకర్షించు విద్యలు.
Courtesy:http://sahitinandanam.blogspot.in/


నేటికీ రాజకీయులు ఉపయోగిస్తున్న ట్రిక్కులు ఇవేనేమో సుమ్మీ/సూవె/సుమా! 

12 comments:

  1. అకటా, ఈ “విద్యల” గురించి ఉద్యోగంలో జేరిన కొత్తలో తెలిస్తే బాగుండేది కదా 😕.

    ReplyDelete
    Replies
    1. ఆ కాలంలో తెలియలేదు కదు సార్! :)

      Delete
    2. అవును సార్, తెలియలేదు, అదేగా ఇప్పుడు బాధ. పని చేసి మెప్పించడమే అనుకున్నాం గానీ ఇతర మార్గాల ద్వారా కూడా చంకెక్కవచ్చని ఊహించలేదు 😏. అదంతా ఇప్పుడు గతజల సేతుబంధనం 😒.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు26 April 2024 at 10:33
      కాకాపట్టేవాళ్ళు,సబ్బు కొట్టేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉండేవారు కాని,చేతకాలేదేంటో

      Delete
  2. వానప్రస్థాశ్రమంలో చింతచెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని “చింతలు” కలగక తప్పదండీ. కృష్ణా రామా అని ఎంతసేపు జపం చేయకుండా ఇవన్నీ ఎందుకండీ

    అని ఈ మధ్యెవరో ఓ పెద్దాయన మా బ్లాగులో రాసే రండీ తాతగారు మీ గురించేలాగుందనిన్ను మీరు చూసి చదవాలనిన్ను వారి కోరికేమో సుమండీ

    ReplyDelete
    Replies
    1. Zilebi26 April 2024 at 10:50
      భజగోవిందం భజగోవిందం
      గోవిందం భజ మూఢమతే

      ..........
      బాల్యస్థావత్ క్రీడాఅసక్త
      తరుణస్థావత్ తరుణీసక్త
      వృద్ధస్థావత్ చింతాసక్త

      ...........
      భజగోవిందం భజగోవిందం
      గోవిందం భజ మూఢమతే
      ..........
      ఇన్నేళ్ళొచ్చినా తమరే అవస్థలో ఉన్నారో

      Delete
    2. శ్లోకం లో చిన్న సవరణ.

      బాలస్తావత్ (బాల:+ తావత్) క్రీడాసక్తః,

      తరుణస్తావత్ తరుణీ సక్తః |

      వృద్ధస్తావత్ చింతాసక్తః

      పరమే బ్రహ్మణి కో పి ( कः + अपि) న సక్తః || ......

      Delete
    3. బుచికి27 April 2024 at 22:17
      పొరబాటు సరి చేసినందుకు
      ధన్యవాదాలు.

      Delete
    4. తాతగారికే దగ్గులు నేర్పు తు న్ నా రాం డీ బుచికీ గారండీ ?

      Delete
  3. నెయ్యి గిన్నె పట్టుకుని ఇక్కడకొచ్చారా “జిలేబి” గారు?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు26 April 2024 at 13:06
      జిలేబి నేతిగిన్ని హాట్ గానే ఉన్నట్టుందండి.

      Delete
  4. అమ్మ పెట్టే బువ్వ తినాలన్న నెయ్యి కావాలి కదండీ ???

    ReplyDelete