Thursday 18 April 2024

ఎండలు మండుతున్నాయి

 ఎండలు మండుతున్నాయి


వాట్సాప్ లో మీటింగెట్టేరు మావాళ్ళు.


ఎండలు మండుతున్నాయన్నాడు మా సుబ్బరాజు.


ఎండలు మండవో! మంటబెడతాయి, అన్నాడు మా సత్తిబాబు.


కోసట్టుకున్నావుగాని.ఎండలకి నీళ్ళు లేక బెంగళూరు సగం ఖాళీ అట, ఎడారి దేశంలో వరదలట.వరుణజపం చేస్తే వర్షాలు కురుస్తాయటగా? ఏంటయ్యా ఇదీ!


నీళ్ళు లేక బంగళూరు ఖాళీ అవుతోంది,ఎడారి దేశంలో వరదలూ నిజమే! నువ్వంటే నువ్వనుకుని నీళ్ళు లేకుండా చేసారు. ఎడారిదేశం వాళ్ళు టెక్నాలజీ ఉపయోగించి వర్షం కురిపించుకుంటే అదెక్కువై వరదలొచ్చేయి. మనకి టెక్నాలజీ ఉన్నా ఉపయోగించుకునేది లేదు. వరుణ జపాలమీద నమ్మకమూ లేదు. యతోభ్రష్ఠః తతో భ్రష్ఠః మనమింతేలే అనేసేడు సత్తిబాబు.


చైనాలో సింగపూర్ లో ఎండలు లేవంటగా అడిగాడు సుబ్బరాజు.


అవున్లే! భక్తులకట్టనే ఉంటదబ్బయా!


మనకీ ఎండలెక్కువగానే ఉన్నాయి 40,42,43,44,45 అంటున్నారు అన్నాడు సుబ్బరాజు.


కరువుబాబుగారు కుర్చీ ఎక్కుతాడు దానికి సూచనే ఈ ఎండలని చెప్పుకుంటన్నారులే వాళ్ళోళ్ళే. ఎల్తా! అన్నాడు సత్తిబాబు. 


ఓ! నిమిషం కూచోవో అడిగాడు సుబ్బరాజు.


నీది కడుపు నిండినబేరం. ఎండనబడి ఎవడో ఒకడి జండా భుజానవేసుకుపోకపోతే నాకు డొక్కాడదు. వస్తా అనెళ్ళేడు మా సత్తిబాబు. 


16 comments:

  1. // “ అవున్లే! భక్తులకట్టనే ఉంటదబ్బయా! “ //
    అహ్హహ్హ 😄😄 … భక్తులు 😄😄
    ————————
    “బెంగల ఊరు” ది స్వయంకృతాపరాధం. అడ్డూ ఆపూ లేకుండా కార్పొరేటాధముల్ని రానిస్తే ఆ స్వార్థపరుల సామాజిక / పర్యావరణ బాధ్యతారాహిత్యం వల్ల ….. ఒకప్పుడు సుఖవంతమైన నివాసయోగ్యంగా ఉండిన చక్కటి సుందరమైన ఊరు నాశనం అయింది.
    ఈనాడు నీళ్ళో రామచంద్రా అంటూ ఊరు వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి దాపురించింది.

    అదే ప్రగతి అనే భ్రమలో కొట్టుకుంటున్న ఇతర నగరాలు (వాటిల్లో హైదరాబాద్ ఒకటి) ఇకనైనా జాగ్రత్త పడకపోతే కష్టం. అభివృద్ధినంతా ఒకే ఊరికి పరిమితం చేసే ప్రభుత్వాలు కూడా ఇప్పటికయినా మేలుకుని ఈ వేలంవెర్రిని ఆపి, రాష్ట్రంలో తతిమ్మా ఊళ్ళకు వికేంద్రీకరణం చెయ్యడం శ్రేయస్కరం.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు18 April 2024 at 12:01
      అంతే కదండీ! ఇష్టమైనవాళ్ళికి కష్టమైన చోటైనా ఇష్టంగానే ఉంటదండి!!

      బెంగలవూరైనా మరో మంగలవూరైనా కార్పొరేట్లెక్కడికీ పోవండి. ప్రపంచం మొత్తం మీదున్నాయి,ఉంటాయి. కావాలని తెచ్చుకోటం లేదూ? కార్పొరేట్లని అదుపుచేయాల్సినవారు వారితో షరీకైతే ఇట్టనే ఉంటది.

      దీనిమీద అంటే కార్పొరేట్లు పార్టీలమీద మా సత్తిబాబు చెప్పింది చెప్పాలండి ఒకసారి.

      Delete
    2. తప్పకుండా చెప్పండి.
      కార్పొరేట్లు necessary evil అయ్యారండి. కాబట్టి అసలు రాకుండా తరిమెయ్యమనడం లేదు కానీండి అన్నింటినీ ఒకే ఊళ్ళో పోగేసుకు కూర్చోకుండా ఒక్కోదాన్ని రాష్ట్రంలో ఒక్కో ఊరికి తోలెయ్యమంటున్నానండి.

      Delete
  2. అవునూ, శర్మ గారు - సుబ్బరాజు గారు, సత్తిబాబు గార్లు కూడా మీరేనని నాకెందుకే గట్టి అనుమానం. కాదంటారా? అన్నీ మీరే మాట్లాడినట్లు వ్రాస్తే monologue లాగా ఉంటుందని ఇతర పాత్రలను తెర మీదకు తెచ్చి వాళ్ళ చేత చెప్పిస్తున్నారంటాను, ఏమంటారు ? 😎

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు18 April 2024 at 12:07

      నా బ్లాగు పుస్తకంలో అభిమానుల పర్వంలాగా అపోహలూ,అనుమానాలూ, పర్వం పెద్దదేనండి. భారతంలో ఉద్యోగపర్వం,రామాయణంలో కిష్కింధకాండ అంతటిదండి.

      నేనే సత్తిబాబూ అని బ్లాగు మొదలుపెట్టిన కొత్తల్లోనే బి.వెంకటరావు అనే బ్లాగరుగారు అనుమానపడి దానికేదో పేరు కూడా చెప్పేరు. ఆలిటర్ ఈగో నా అని అనుమానమూ పడ్డారు. ఆ తరవాత కత మీకు తెలియంది కాదు. ఇప్పుడు మీరు సుబ్బరాజును కూడా చేర్చేసేరు,అంతే తేడా! వీళ్ళిద్దరూ నేనీ ఊరొచ్చింది మొదలు స్నేహితులండి. వాళ్ళు చెప్పేదంతా రాసెయ్యలేను. మా సత్తిబాబు ఋణధృవం, సుబ్బరాజు ధన ధృవం. సత్తిబాబునడిగా నీకింత తెలుసుకదా ఏదో పార్టీలో చేరి పోటీ చెయ్యచుగా అని, దానికి ఆ ముచ్చటా అయిందండి, ఏదో ఒక జండా బుజాన వేసుకునే కన్నా,జండా పుచ్చుకుని కబుర్లు చెప్పి సొమ్ములు చేసుకుని బతికడమే మంచిదని చెయి కాలేకా అర్ధమయిందండి. అప్పటినించి ఇంతే అన్నాడు. ఇద్దరూ చెప్పినవి వింటుంటే నిజాలు,తన్నుకొస్తుంటాయండి. ఏడిట్ చేస్తుంటా. నా మాటల్లో చెపుతుండటంతో ఈ అనుమానాలనుకుంటానండి.

      అన్నీ తెలిసిన మీలాటివారే అలా అనుకుంటే నేనేదేవుడితో మొరపెట్టుకోను.

      తగునా ఇది దోస్తూ
      తమరే ఇటు తలచదగున
      తగునా ఇది దోస్తూ!!!!
      నమస్కారం

      Delete
    2. అలాక్కానివ్వండి. ఈ సారి మీ ఊరు వచ్చినప్పుడు వారిద్దరినీ కూడా మాకు పరిచయం చేసి, వారి దర్శనభాగ్యం కలిగించాలండి 🙏. .

      Delete

      Delete
    3. దారిని పోయే యిద్దర్ని నిలబెట్టి వీరే వారంటే సరి‌ :)

      Delete
    4. తగునా ఇది బామ్మా తమరే ఇట పుల్లలెట్ట
      తగునా ఇది బామ్మా తమరే సరి జెల్ల కొట్ట
      తగునా ఇది బామ్మా అరెరే ఇట పొగను బెట్ట
      తగునా ఇది ఏమ్మా కిరికిరితో లాగి కొట్ట
      పదవే ఇక బామ్మా దులిపెయ్ నీ కంద తట్ట
      ... ఇంకో పద్యాన్ని కొట్ట ... తాతయ్యకు దురద పెట్ట
      న మస్కారం బామ్మో ... 🙏🙏🙏🙏 ☺️ ... జేక్/ఓక్

      Delete
    5. nmrao bandi19 April 2024 at 21:35
      సూపర్ మిత్రమా!

      పుఱ్ఱెతో పుట్టిన బుధ్ధి కదా నిన్ను ....అని కూడా అనేస్తే బాగుంటదేమో!!!
      సింగపూర్ లో హీట్ వేవ్ చల్తీ హై ఎ.సి లో ఉండక నాకేంకిటి ఉక్కు ఉక్కు అంటే తుక్కైపోద్ది.... :)

      Delete
    6. విన్నకోట నరసింహా రావు19 April 2024 at 12:00
      అలాగే సార్!

      Delete
    7. ఈ అలాగే సార్ అన్న భరోసా నేనన్న దానికి సరిపోతోంది :)

      Delete
    8. అందరూ మీలాగే ఉంటారు అనుకుంటే ఎలా “జిలేబి” గారూ?

      Delete
    9. ఏమోనండీ ఆ పై‌ మీ ఇష్టం‌;) చెప్పవలసినది‌ చెప్పివేసినాము

      Delete
  3. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్న వారికి కొత్త ఐడియా వచ్చి వారిని ఎక్కడ గెలిపిస్తే అక్కడ దుబాయి లాగా కృత్రిమ వర్షాలు కురిపిస్తాము సింగపూర్ లాగా ఎండలు తగ్గిస్తాం అని హామీలు ఇచ్చినా ఇస్తారేమో.

    ReplyDelete
    Replies
    1. బుచికి18 April 2024 at 23:01
      అయ్యా! ఇది వాగ్దానలతో కుదరదండి. గొంతెండి పోతోంది, నీళ్ళుకావాలి అర్జంటు. రేపుపోస్తా అంటే పీకపిసికి రక్తం తాగేసి దాహం తీర్చుకుంటాడు, మానడు, మానవుడు.
      చీమ మొదలు బ్రహ్మదాకా అందరికి ఇప్పుడు నీళ్ళు కావాలి. భానుడి ప్రతాపం అలా ఉంది.

      చెబితే నమ్మకపోవచ్చు. ఒక డొక్కుతో నీళ్ళు పెడతా రోజూ నిండా! గోడ మీద, ఫిబ్రవరి మొదలు. కొంత ఆహరమూ వేస్తా! చిన్న జీవులు నిండుగా లేకపోతే తాగలేవు, నీళ్ళలో పడిపోతాయి,వాటికోసం దిగి.మర్నాటికి సగానికి నీళ్ళు తరుగుతాయి, పక్షులు,చీమలు,సాలీళ్ళు,ఉడుతలు సర్వ చిన్న జీవులూ, నీళ్ళు తాగుతాయి.చిత్రం ఆహారం ఒక్క గింజ ముట్టుకోవు. నీళ్ళకోసం కొట్టుకుపోతాయి.

      సింగపూర్ లో ఎండలేం తక్కువాగా లేవండి, మండిపోతోంది,మంట పెడుతోందని వార్తలు. ఇష్టమైనవాళ్ళకి అది వెన్నెలలా ఉంటదండి

      Delete