ఎవరికంపు వారికింపు.
ఇదొక నానుడి.ఎవరు చేసినపని,చెప్పిన మాట వారికి సొంపుగానూ, ఇంపుగానూ కనపడతాయని దీని భావం.కాకి పిల్ల కాకికి ముద్దు ఇదీ ఒక నానుడే! కాకి తనపిల్లని ముద్దు చేయడంలో తభావతేముంది? కాని అదే కాకి పిల్లని మరొకరు ముద్దు చేస్తారా అన్నదే మాట. అలాగే ఎవరు చేసినపని,మాట ఎదుటివారికి కూడా నచ్చాలి.లోకంలో అందరికి అన్నీ నచ్చవు, కాని ఎక్కువమందికి నచ్చాలికదా! అలా నచ్చని దాన్నే ఇలా ఈ నానుడితో చెబుతారు.
ఈ విషయంమీద ఇదివరలో వాసన అని ఒక టపారాసిన గుర్తు.
శర్మ కాలక్షేపంకబుర్లు-వాసన
ఇంతేకాదు నిజంగానే ఎవరి కంపు వారికి ఇంపుగానే ఉంటుంది. కారణం తమదైన వాసన తమకి తెలియదు, ఎదుటివారికి తప్పించి. సైన్స్ కూడా చెబుతున్నమాటిదే. ప్రతివ్యక్తి శరీరం నుంచి తమదైన ఫెరోమోన్స్ విడుదలవుతాయి. ఇవి చెమటతో బయటికొస్తాయి. ఎవరి ఫెరొమోన్ వాసన వారిదే! ఇద్దరి ఫెరొమోన్ ఒకలా ఉండదు, ఇద్దరి డి.ఎన్.ఎ ఒకలా ఉండనట్టు. ఈ ఫెరొమోన్ వాసన పక్కవారికి మాత్రమే తెలుస్తుంది, ఎవరిది వారికి తెలియదు. ఈ ఫెరొమోన్స్ వాసన చూసే కుక్కలు నేరస్థులని పట్టుకుంటాయి ఈ ఫెరొమోన్స్ వాసన కుక్కలు గుర్తించినంతగా ఇతరులు గుర్తించలేరు. మనం ఒక ప్రదేశంలో కొంతసేపుండి అక్కడనుంచి వెళ్ళిన తరవాత కూడా మన ఫెరోమోన్స్ వాసన అక్కడ ఉంటుంది. నేరస్థులు దీనిని తొలగించాలని చూసినా సున్నితమైన ముక్కుతో కుక్కపసికడుతుంది. ఈ పెరొమోన్స్ లో ఆడ మగ తేడాలున్నాయష! వామ్మో!!
ఇంతేకాదు కొంతమంది కొంతమంది ఫెరొమోన్స్ ఇష్టపడతారట. ఏడుస్తున్న చిన్న పిల్లల దగ్గర తల్లి దుస్తులు పడేస్తే ఏడుపు ఆపుతారట. ఆ దుస్తులనుంచి విడుదలైన ఫెరొమోన్స్ వాసన తల్లి దగ్గరుందన్న భావం బిడ్డకు కలగజేస్తుంది. బట్టలు ఉతికిన తరవాత కూడా ఈ ఫెరొమోన్స్ వాసన మిగిలే ఉంటుందిట. మరి భార్య భర్త ఒకరి ఫెరొమోన్స్ మరొకరు ఇష్టపడితే జీవితమే హాయిలేహలా! వారే విడదీయలేని జంట.ఇది బహు అరుదు.
ఇక కొంతమందిని అందరూ ఇష్టపడతారు, కొంతమందిని ఎవరూ ఇష్టపడరు. కొంతమందిని కొందరే ఇష్టపడతారు. కారణం! మాట. అదెలాగో చూదాం. తినే ఆహారాన్ని బట్టి మనసు, మనసు బట్టి మాట. అలాగే తినే ఆహారాన్నిబట్టి ఫెరొమోన్స్ విడుదలవుతాయి. అదేవాసన. స్త్రీ పురుష ఫెరొమోన్స్ ఆకర్షణకి తోడవుతాయిట. అంటే మొత్తం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.
చిన్న ఉదాహరణ. పచ్చి వెల్లుల్లి తినండి, మీ నుండి విడుదలయ్యే చెమటలో వెల్లుల్లి వాసన ఉంటుంది. ప్రయత్నించకండీ! ప్రమాదం!
ఇక తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది? వాటి రకాలు. సాత్విక,రాజస,తమో గుణాహారాల మూలంగా మూడు గుణాలు ఏర్పడతాయి.అవే సత్వ,రజస్, తమో గుణాలు. ఈ గుణాల మూలంగానే మనసు, దాన్నిబట్టి మాట అలాగే విడుదలయే ఫెరోమోన్స్ ఉంటాయి. అయ్యో! నన్నెవ్వరూ పట్టించుకోటం లేదని బాధవద్దు. సాత్విక ఆహారం తీసుకోవడం ప్రారభిస్తే మార్పువస్తుంది, దీనికి కాలం తీసుకుంటుంది, మార్పు ఒక్క రోజులో రాదుకదా! అసలు ఇష్టం అనేదొకటుందికదా! ఆహారం తీసుకోవడం లో, దాని మాటేమీ? సాత్విక,రాజస,తామసాహారాలలో ఏవి ఎక్కువ ఇష్టమో అది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఏర్పడతాయి.
ఇంత పెద్ద విషయాన్ని మనవారు ''ఎవరికంపు వారికింపు'' అని చిన్న మాటలలో చెప్పేసేరు.
హేవిటో సాత్వికమంటూ అందరూ ఒహటే గోల హాయిగా ఎంచక్కా చికెనూ , ఫిష్షూ , మటనూ, ప్రాన్లూ తినే యోగాన్ని వదిలి పెట్టేసుకుని ఇలా కూరా నారాలతో సరిబుచ్చుకోవటాలు.
ReplyDeleteరాజసం తగ్గిపోయి అందరూ భిక్షాందేహీ అంటూ మారి పోవాలి కామోసు
జిలేబీ మాంసాహారి నా ? ద్యావుడా 🤔
DeleteZilebi28 April 2023 at 14:41
Deleteబుజ్జమ్మా!
తమరేంతిన్నాబాధలేదుగాని, కనపడ్డవాళ్ళందరి మెదళ్ళూ తినద్దూ!! అదేపదివేలూ.. :)
Anonymous28 April 2023 at 23:00
Deleteఏ హారి ఐనా బాధలేదుగాని కనపడ్డవాళ్ళందరి మెదళ్ళూ హరీ కాకుంటే చాలు :)
శర్మ గారు జిలేబీ అయిపోయినట్టున్నారు :)
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteSri[dharAni]tha28 April 2023 at 22:56
Deleteబాగున్నారా? అలవాటుగా వేసే పిచ్చి ప్రశ్న.
లోకోభిన్నరుచిః ఇదే ఎప్పటికీ నిలిచేది. ఆ తారవాతదే జివహ్వకోరుచి పుఱ్ఱెకో బుద్ధి, నానుడి, అనేది తెనుగుమాట. మనం ఆశించినట్టూ, అనుకున్నట్టూ జనులుండరన్నది జగమెరిగిన సత్యం. ఎంత సొమ్మెట్టి కొనుక్కున్నా కారుని బయటే వదిలేస్తాం! పడకగదిలో పెట్టుకోం! అలాగే ఎన్ని వేలెట్టి చెప్పులుకొన్నా గడప బయటే వదిలేస్తాం!!! తప్ప్దదు,అదంతే! అలాగే ఎంతటి దగ్గరవారైనా వారిని మనసులోకి చేరనివ్వకపోవడమే తప్పదు. ఇటువంటివారితో కూడా జీవితం గడపవలసిరావచ్చు. చెప్పలేము కదా! అలా గడిపెయ్యడమే జీవితం, మార్పురానిది, మార్చుకోలేనిది. ఎక్కువయిందా!! :) మీకిదంతా తెలియనిదికాదు, మరోసారి గురుచేయడమే స్మీ!
హా.. చాన్నాళ్ళ తరువాయి మరల ఇలా రావటం జరిగింది ఆచార్య. బాగున్నాను.. బాగున్నాము.. మీరు కూడా క్షేమమని తలుస్తున్నాను . ఐదేళ్ళ తరువాయి కూడా మారని పరిస్థితులు. ఐతే ఆశ సజీవంగా ఉంటుందనేది నా నమ్మకం. ఏదైతేనేమి.. గిల్లి కజ్జాలు సహజమే ఐతే మితి మీరితేనే అభాసు.
DeleteSri[dharAni]tha30 April 2023 at 21:37
Deleteహద్దే ఎప్పుడూ ముద్దు :)
బ్లాగుకి కూడాఅలా వాసనుంటాదా? వ్యాఖ్యలకి?
ReplyDeleteAnonymous29 April 2023 at 02:26
Deleteఈ కొచ్చనుకి వాసనలేదూ :)
Deleteజిలేబీ వాసన అక్కడక్కడా బ్లాగుల్లో వస్తోంటూంది
Anonymous29 April 2023 at 14:19
Deleteరంగూ,రుచీ,వాసనా లేనిదే జిలేబి కదా!
జిలేబీ శ్యామలీయం గారి పై వికటమైన పద్యాలతో ఆగమాగం చేస్తుంది. ఒక్క తీర్గ లొల్లి పెడుతుంది. ఇదేమన్న ముచ్చట.
ReplyDeleteAnonymous29 April 2023 at 18:24
Deleteతెలిసి తెలియని నరుదెల్ప బ్రహ్మదేవుని వశమే :)
వచ్చుట, గిచ్చుట, హెచ్చగు మాముచ్చట మా ఎచ్ఛుల బామ్మకు,
ReplyDeleteఇచ్చటి అచ్చూ, రొచ్చూ, కచ్చలు, మెచ్చని ముచ్చు బచ్చాల కిదె
హెచ్చరిక, రచ్చ నచ్చని చిచ్చా గాండ్లిక పోవచ్చునెహె, పిచ్చాపాటి నాపి,
బొచ్చూ,పెచ్చూడి, చచ్చక మునుపె, కొచ్చిన్ పోవ, కిచ్చా సుదీపు తోడన్ ...
jf / jk :)
(మనవడు బచ్చా :)
బామ్మ కు తీసిపోని మనవడి పద్య పిడక.
Deleteబండి వారు,
Deleteమీరూ మొదలెట్టారూ పద్యాలు?
ఇంతకీ “రచ్చ రంబోలా” అంటారు “జిలేబి” గారిని? ఆ విషయంలో డౌటే లేదు లెండి.
"బామ్మ కు తీసిపోని మనవడి పద్య పిడక"
Deleteబామ్మనవడికి బహు పసందైన ప్రశంస
మంగిడీలు మంగిడీలు ... :)
(తడికెలు మీవి పిడకలు మావి)
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
Delete"వినరా గారికి ...
Deleteమా బామ్మ పద్య పిపాసకు పండు ముదుసలులు కూడా ఉపాసకులై పద్య రచనా కాంక్షతో రగిలి, పగిలి, పిగిలి పోతున్నారు. వినబడటం లేదా బ్లాగ్లోకంలో మారుమ్రోగుతున్న రణగొణ, బడబడ కుళాయి చిందుల బిందెల రవళులు !?
present trending tags :
పుట్టలో వేలెడితే కుట్టనా ... పక్క నెళితె నే పద్యం కట్టనా
అందాల బొమ్మకు నడకందం ... కందాల బామ్మకు పిడకందం
బామ్మది పద్యం ... కుమ్ముడు తధ్యం
తడికెలు మీవి... పిడకలు మావి
తంపులో దంపు ... బంపులో సొంపు
గుంపులో కంపు ... గంపలో నింపు
(తదుపరి సంచికలో మరిన్ని ... :)
nmrao bandi29 April 2023 at 19:58
Deleteమెచ్చినా,గుచ్చినా,గిచ్చినా,వచ్చినా,చచ్చినా !! బామ్మ మారదు అంతే!
చిన్న కరక్షను ఏమనుకోవద్దూ :)
తవికలు మీవి పిడకలు మావి.
పుట్టలో వేలెడితే కుట్టనా ... పక్క నెళితె నే పద్యం కట్టనా
అందాల బొమ్మకు నడకందం ... కందాల బామ్మకు పిడకందం
సూపరస్యః సూపరు.
మీ కరెక్షన్ కి, అబ్జెక్షనా - నెవర్ యువర్ ఆనర్ ...
Deleteటాగ్స్ మీకు నచ్చినందుకు మొగాంబో ఖుష్ హోగయా ...
ఇది కూడా సూడుండ్రి ...
ఉడతా ఉడతా ఊచ్ పద్యం కొడతానోచ్
or (నచ్చక పొతే)
ఉడతా ఉడతా ఊచ్చి కొడతా పద్యం ఈడ్చి
:)
nmrao bandi1 May 2023 at 15:50
Deleteపనసతొనలు,సపోటాపళ్ళు ఎదురుగా పెట్టి ఏదొ ఒకటే అంటే ఎలా సారూ!