పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వం పునర్లభ్యం
న శరీరం పునః పునః
కోల్పోయిన విత్తం మరల సంపాదించచ్చు, విడిపోయిన మిత్రుడిని మళ్ళీ కలవచ్చు. భార్యపోతే మరొకరినీ సంపాదించుకోవచ్చు.భూమినికోల్పోతే మరలా సంపాదించచ్చు. కాని శరీరం ఒక సారిపోతే మళ్ళీ మళ్ళీ పొందలేం, తిరిగిరాదు.
ఇంతెందుకు అని, ఒక్క మాటలో చెప్పేసేరు. అదే ''శరీరమాద్యం ఖలు ధర్మసాధనం''.ఏం చెయ్యాలన్నా శరీరం ముఖ్యం,దాన్ని కాపాడుకో అన్నారు. నేనేంటి ఉక్కు ఉక్కు అన్నవాళ్ళు తుక్కు తుక్కు ఐపోయారు, కోవిడ్ దెబ్బకి . కొందరు చచ్చి బతికేరు. కోవిడ్ మళ్ళీ పుంజుకుంటోంది. ఒక సారొచ్చింది మళ్ళీ రాదనుకోవద్దు. వాక్సీన్ వేసుకున్నా జాగరత అవసరమే. దీనికి తోడు H3N2 Flu variant బలంగా వ్యాపిస్తోంది. ఇమ్యూనిటీ కొనుక్కుంటే దొరకదు, ఇమ్యూనిటీ పెంచుకునే చర్యలు తీసుకోండి. యోగా చేయండి, వయసుతో నిమిత్తంలేదు,దీనికి. నడవండి. ఇప్పుడు ఎండలు జోరుగా ఉన్నాయప్పుడే, 40,41,42 ఇలా వేడి పెరుగుతోంది.(Heat wave sweeping) వేడి 45 దాకా చేరచ్చంటున్నారు. వడదెబ్బ తగలచ్చు, ఎండలో తిరగద్దు. జాగర్తా!
పుట్టింది మొదలు గిట్టే దాకా మనతోడు మన శరీరమే, తల్లితండ్రి,భార్య,పిల్లలు,బంధువులు,మిత్రులు ఊపిరినిలబడితే ఎవరూ తోడుండరు.శరీరాన్ని కాపాడుకోవాలి.వయసు ముదిరితే చెయ్యీ కాలూ ఆడకపోతే హాస్పిటల్ లో పారేస్తారు, చాకిరీ ఎవరూ చెయ్యలేరు. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే,ఇక్కడే,ఇక్కడే పొంచిఉంది.జాగర్త. ఎల్లకాలం ఎవరూ ఉండరని మిట్ట వేదాంతం చెప్పద్దు, ఉన్నంతకాలం చెయ్యీ,కాలూ ఆడాలి మరచిపోవద్దు, జాగర్త..
కోల్పోయిన విత్తం మరల సంపాదించచ్చు, విడిపోయిన మిత్రుడిని మళ్ళీ కలవచ్చు. భార్యపోతే, కొత్తవారు ఆ భార్య స్థానాన్ని భర్తీ చెయ్యొచ్చేమోగాని, పోయిన భార్య తిరిగి రాదు. శరీరం ఒక సారిపోతే, ఆ శరీరం మళ్ళీ పొందలేకపోవచ్చు. కాని మరు జన్మలో కొత్త శరీరం పొందొచ్చు. మరు జన్మ లేకపోతే ఇక శరీరమే అక్కర్లేదు. ఈ శ్లోకంలో ఎక్కడొ, ఏదో లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తోంది.
ReplyDeleteకాంత్20 April 2023 at 23:07
Deleteఈ శ్లోకం రాసినవారు యదార్థవాది. మనం మీలాజిక్ అనుసరించేద్దాం!
ఆయన యదార్థవాదే. ఆయన నీతిలో యదార్థం ఉండొచ్చు. కాదనను. కాని ఈ శ్లోకానికి మనం చెప్పుకొనే అర్థం యదార్థం కాదనుకుంటాను. మీరు "కోల్పోయిన విత్తం, విడిపోయిన మిత్రుడు, భార్యపోతే, భూమినికోల్పోతే" అని అన్నారు. శ్లోకంలో ఇలా కోల్పోవడం, విడిపోవడం, (చని)పోవడం అని ఇన్ని రకాలుగా లేవే? విడిపోయిన భార్యని తిరిగి పొందవచ్చు అనే అర్థం ఎందుకు తీసుకోకూడదు (రామాయణం)? భార్యపోతే మరొకరినీ సంపాదించుకోవచ్చు అని ఎందుకు అర్థం చెప్పుకోవాలి?
Delete
Deleteకాంత్21 April 2023 at 20:01
మీరు చెప్పినట్టు అందులో చనిపోవడం వగైరాలు లేవుటండి. నేనలా అర్ధం చేసుకున్నా సుమండీ! ఎలా అర్ధం చేసుకోవాలో చెబితే ఆనందం కదండీ!
ReplyDeleteహేవిటో ఈ వ్యామోహాలు నశ్వర శరీరం పైన ఏదో మనమే దానికి అధికారుల మను కుంటూ :)
జిలేబి
Zilebi21 April 2023 at 20:53
Deleteశరీరం నశ్వరమే బుజ్జమ్మా! దానిమీద మమత పెంచుకోవద్దన్నారుగాని అలాగని చెప్పి అనారోగ్యం పెంచుకోమనలేదు. కాదంటావా? నీ చిత్తం హాస్పిటల్ లో పడుకుంటే....నీ మాటే అలాగేకానీ :)
// “ న శరీరం పునః పునః” //
ReplyDeleteభజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే ॥
🙏