Thursday, 13 April 2023

పట్టుకో!పట్టుకుంటా!!



ఇది జిజ్ఞాసువు ప్రశ్న. దేవునిగురించి ఎవరికివారు తెలుసుకొవలసిందేగాని మరొకరు ఎఱుక పరచలేరన్నది నానమ్మిక.దీనిపై అంతులేని ప్రశ్నలు, అనంతమైన సమాధానాలూ ఉన్నట్టున్నాయి, నేడో రేపో కమే కూడా దీనిమీద సిద్ధాంతం రాసెయ్యచ్చు.


ఈ నెల రెండో తారీకు మొదలు రొంప,దగ్గు,జ్వరం నన్ను సిరి పీడించినట్టు పీడిస్తున్నాయి, వదలక. దీనికి తోడు నాలుగురోజులుగా వేడి దంచుతోంది, నలభై లెక్కన. నా కష్టాలు పరమాత్మకే ఎఱుక.ఇంతలోనూ కొంచం ఓపిక జేసుకుని..ఇది గిలికా...


పల్లెటురివాణ్ణి,చదువు లేనివాణ్ణి, మట్టిలో బతికే మనిషిని, మేధావినికాను.ఇది నా అనుకోలు, పెద్దలు మన్నించెయ్యండి,తప్పుల్ని.


ప్రశ్నలోనే ఇద్దరున్నట్టుకదా? ఇద్దరుంటే కదా ఒకరినొకరు పట్టుకోడం? ఎవరిని ఎవరు పట్టుకోవాలన్నది ప్రశ్న.


విషయంలో కెళదాం.

మార్జాలకిశోరన్యాయం, మర్కటకిశోర న్యాయమన్నవి రెండు సామెతలు, సంస్కృతంలో.

మొదటిదానిలో పిల్లి తన పిల్లను నోటకరచుకుపోతూ ఉంటుంది.పిల్లకి బాధ్యతలేదు. అంతా తల్లి చూసుకుంటుంది. రెండవది దీనికి విరుద్ధం. అందులో తల్లికోతి వీపును పిల్ల పట్టుకు ఉంటుంది.తల్లికేం బాధ్యతలేదు. పిల్లబాగోగులు పిల్ల చూసుకోవాలంతే!

ఈ రెంటినీ సమన్వయ పరచుకుంటే!ఎలా?

భాగవతం దగ్గరకెళదాం.ప్రహ్లాదోపాఖ్యానం లో ప్రహ్లాదుడు హరి నామాన్ని పట్టుకున్నాడు. ఎలా? పానీయంబులుద్రావుచున్,కుడుచుచున్,, హాస నిద్రాదులు జేయుచున్, అన్నీ చేస్తూ కూడా నామం పట్టుకున్నాడు.మర్కటకిశోర న్యాయంలా. కష్టాలొచ్చాయి, ఎంతదాకా పీకలదాకా,హిరణ్యకశిపుడు ఇలా ఏడ్చేదాకా

ముంచితి వార్ధులన్ గదలమొత్తితి .......జావడిదేమి చిత్రమో అనుకుని ఏడ్చేదాకా!  ఎవరు పట్టుకున్నారు ప్రహ్లాదుని? హరి పట్టుకున్నాడు మార్జాలకిశోర న్యాయయంలో లా. 


దీన్ని బట్టి తెలిసేదేమి? నువ్వు పట్టుకో! నిన్ను పట్టుకుంటా!! 

32 comments:

  1. వేటూరి మావ "పట్టుకో పట్టుకో నన్ను పట్టుకో తట్టుకోనంతగా....) పాట కిదన్న మాట అర్థం ! హమ్మ ఎన్నాళ్లకెన్నాళ్లకర్థమయినాది.

    రామరామ


    బిలేజి

    ReplyDelete
    Replies
    1. Zilebi13 April 2023 at 10:57
      మావ మాట ఇప్పటికర్ధమయిందా? తమరు స్లో టు ఆపరేట్ అనుకుంటా :)
      కిశ్న,కిశ్న

      Delete
  2. ఇద్దరెక్కడా? ఉన్నదొకరే!
    ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని మరువకండి
    ఎవరు హరి? ఎవరు ప్రహ్లాదుడు?
    ప్రహ్లాదశ్చాశ్మి దైత్యానాం అన్నాడుగా కృష్ణుడైన హరియే.

    ReplyDelete
    Replies
    1. అంతా ఒకరే అయితే ఈ రామకీర్తనల జోరెందుకండీ ?

      Delete
    2. ఇంకా ప్రహ్లాదస్థితి కలుగలేదు కాబట్టే కదటండీ?

      Delete
    3. ప్రశ్న అడిగిన అమ్మాయి ఉత్సుకతతో అడిగిన ప్రశ్న. మొదటిరోజే అద్వైతం,ద్వైతం అంటూ మొదలెడితే ఆధ్యాత్మిక అంటేనే బెదిరిపోతారు. అందుకు విషయం తగ్గించాను.
      అసలు తండ్రి కొడుకుల తగువెక్కడ?
      ఆహం బ్రహ్మస్మి.ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేవాటికి అర్ధం చెప్పడం లో తేడా కదా!
      పొరపాటితే మన్నించండి. చదువుకోనివాణ్ణి కదా.పొరబాటుగా అర్ధం చేసుకున్నానేమో!

      Delete
    4. శర్మ గారు,
      “అన్నమయ్య” సినిమాలో అన్నమయ్య తల్లి గారు చాలా విషయాల మీద పరిజ్ఞానంతో మాట్లాడి, చివరిలోనో మొదట్లోనో “లోకజ్ఞానం లేని దాన్ని” అంటూ ఉంటుంది లెండి. అలాగుంటుంది మీ వ్యవహారం.

      మీరు చెప్పదల్చుకున్నది సాధికారంగా సోదాహరణంగా చెప్పేసి, “చదువుకోనివాణ్ణి” అనో “పల్లెటూరివాణ్ణి” అనో తగిలిస్తుంటారు చివర్లోనో మొదట్లోనో. గడుసువారండీ బాబూ. ఎంతయినా గోదావరి నీళ్ళు. 🙂🙂

      Delete
    5. గోదారి నీళ్లోసుకున్నోళ్ళంతా అజ్ఞానులేనండి :)

      Delete
    6. విన్నకోట గారు. అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. పల్లెటూరి వాడిని, చదువుకోని వాడిని అని పదే పదే చెప్పడం చిరాకు తెప్పిస్తుంది.

      Delete

    7. విన్నకోట నరసింహా రావు14 April 2023 at 11:42
      అన్నమయ్య సినిమా చూడలేదండి.ప్రస్థుతంలో నేను అనుకున్నదేంటో చెప్పేను.చదువుకోనివాడిని గనక నా అవగాహన తప్పేమో అన్నా! నిజాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటానెప్పుడు!పొరబడుతున్నామేమోనని ఆచి తూచి అడుగులేస్తానండి.ఇక గోదారి నీళ్ళకి తెలివి తేటలెక్కువని మీ మాటకి ఒప్పుకుంటా. మా వాళ్ళంతా తెలివైనవాళ్ళేనండి, అందులో నేనే లొక్కని గుర్తుచేసుకుంటుంటాను. మా వాళ్ళందరి తరఫున మీకు ధన్యవాదాలు.

      Delete
    8. Anonymous14 April 2023 at 14:45
      చదువుకోనివాళ్ళం చికాకు పడమండి. తమరు చదువుకున్నవారు,పట్టణవాసులనుకుంటా చిరాకు పడతారు. సహజం కదండీ మా లాటి పల్లెటూరి వాళ్ళంటే మీకు చిరాకే!

      Delete
    9. ఎందుకీ ఇన్ ఫీ రి యా రి టీ కామ్ ప్లె క్సు ?

      Delete
    10. Zilebi14 April 2023 at 12:57
      ఈ పెద్దవయసులో నీళ్ళోసుకుంటే ప్రమాదమేమో సుమీ!

      Delete
    11. Anonymous14 April 2023 at 16:03
      అలా అర్ధం చేసుకున్నారా! :)

      Delete
  3. ఎందుకో ఇలా అనిపిస్తోంది. బ్లాగు లోకం లో ఒక సీనియర్ బ్లాగర్ కు జిలేబీ బాగా ఆత్మీయ వ్యక్తి అనిన్నీ. ఆ వ్యక్తి స్థానం లో సీనియర్ బ్లాగర్ పరకాయ ప్రవేశం చేసి జిలేబీ పునరాగమనం జరిగింది అనిన్నీ. ఇది ఒక ఊహ మాత్రమే.

    ReplyDelete
    Replies
    1. ఊహలు గుసగుస లాడె ... :)

      Delete

    2. Anonymous14 April 2023 at 10:30
      జిలేబిని కర్చురాసేసినట్టేనా ????
      నిన్నటిదాకా జిలేబి చావు వివాదం, నేడు బతుకు వివాదం.అసలు జిలేబియే వివాదం.కొందరు పరకాయప్రవేశమంటారు, కొందరు కమే అంటారు,

      Delete
    3. ఖచ్చితంగా మా బామ్మ ఇప్పటికి చిరంజీవే. ఆ రాతల్లోని విరుపు, చరుపు, కరుపు, spontaneity మరొకరివల్ల కానే కాదు. She's very much alive and the proceedings we're receiving all are surely casted live. I'm happy that the blog world is very much abuzz with her power presence, once again.

      Delete
    4. nmrao bandi14 April 2023 at 23:21
      మిత్రులు బండివారు,
      బామ్మ ఎప్పటికీ చిరుజీవే :) ఆ కరుపు,చరుపు,విరుపు వారికి కాక మరెవరి సొంతం? ఆ తరవాతేదో చెప్పేరు, బామ్మ భాషలో. అస్తు! అస్తు!! ఈ సారి బెజవాడ లెనిన్ సెంటరే!!!బామ్మ కాదు కమే అనుకునేవారు, పరకాయ ప్రవేశం అనుకునే వారు లెనిన్ సెంటర్ కి రావచ్చు,బామ్మనీ చూడచ్చు. గుప్తంగా తిరిగే బామ్మని!!! పికూలు, పైకూలు వారికి కాక మరెవరికి సాధ్యం? :) పొద్దుటే వాకింగ్ ట్రేక్ మీద రాలిందో పిడక పజ్జం. ఇక ముందీ పిడక పజ్జాలు రాలుతూనే ఉంటాయి. అస్తు! అస్తు!! అస్తు!!! సర్వే జనాః దుఃఖినో భవంతు

      Delete



    5. చిరుజీవియె బామ్మెప్పటి
      కి! రుసరుసలబుసబుసల వికీరించు సదా
      మురుకులు చుట్టు జిలేబీల్
      గరగర కష్టేఫలి యని ఖర్మకొలదిగా :)


      జిలేబి

      Delete
    6. శర్మ గారు,
      ఏమిటి, “జిలేబి” గారు తన సంతాప సభకు కూడా వస్తారంటారా? వారు ఎంతకైనా సమర్ధులే గానీ ఇది కాస్త భయం కలిగించేలా లేదూ?

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. పెద్ద గురువు గారూ, సభకు రావచ్చన్న ఆహ్వానమైతే ఇచ్చారు గానీ మేమొచ్చినా ఆవిణ్ణి గుర్తించలేం. గుర్తించినా మీకు వర్తించనట్లు, "పట్టుకో" అంటారు, "పట్టుకుంటాను" అంటారు తప్ప, మీరేమో పట్టించుకోకుండా ప్రక్క చూపులు చూస్తారు, ఏం విధి, తట్టి చావడం లేదే!?

      ఇక ఈ విషయంలో నన్ను వెన్ను తట్టి, చెయ్యి పట్టి నడిపించాల్సిన విధి ఇది 'విన్న'కోట వారిదే.

      Delete
    9. -

      తన సంతాపసభకు తా
      ను నడచి వచ్చునకొ లేక నూత్నవిధముగా
      తను భూతమై కనబడునొ
      వినినంతనె భయము కలిగె విపరీతముగా !


      జిలేబి భూతాత్మ :)

      Delete
    10. నా భావం బాగా గ్రహించారు “జిలేబి” గారు.
      బండి వారు మాత్రం నన్ను నడిపించండి అంటున్నారు.

      Delete
    11. -

      పెద్ద గురువు గారు పేదరాశి జిలేబి
      యిరువు రొకరి నొకరు యెన్ని మార్లు
      తగువు లాడుకున్న తస్స దియ్య విడిచి
      పెట్టుకొనరు గాక పెట్టుకొనరె!

      జిలేబి

      Delete
    12. విన్నకోట నరసింహా రావు15 April 2023 at 17:17
      nmrao bandi15 April 2023 at 19:51

      వెరైటీ సార్! వెరైటీ :)

      బామ్మని గుర్తించడం కష్టంకాదండి! చాలామందీ బ్లాగర్లని ఎరుగుదును,ప్రత్యక్షంగానే! దగ్గరగా ఇరవై మందిని గుర్తుపట్టగలను. చూడనివారు విన్నకోటవారు, బండివారు, లక్కాకులవారే! ఆడవారిలో చాలామందిని ఎరుగుదును, ఎలిమినేషన్ లో కందమ్మ దొరికే!లేదంటే మిత్రులు బండివారు కలుపు,విరుపు,పొలుపు,మలుపు,సలుపు, ఇలా కొన్నిపదాలతో ప్రసంగిస్తే జిలేబి ఆగగలదా? పిడకపజ్జం విసరక!
      భూతమైతే అనికదా అనుమానం. దెయ్యాలకి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయట, చిన్నప్పుడు చదువుకున్నా,దెయ్యాలకతల్లో.ఇంకా చాలా అవిడియాలున్నాయండి, తరవాత చెబుతా!

      Delete

    13. Zilebi15 April 2023 at 22:18
      // తస్స దియ్య విడిచి
      పెట్టుకొనరు గాక పెట్టుకొనరె!//
      అదంతే! కుందమ్మా!! కొన్నిటికి కారణాలుండవు :)

      Delete
    14. కలుద్దామండి, శర్మ గారు, కలుద్దాం ఎండలు కాస్త తగ్గాక.

      ఇక పాదాలు వెనక్కు తిరిగున్నాయా లేదా చూడాలంటే అసలు సదరు వ్యక్తి ప్రత్యక్షమైతే కదా? అదేం జరగకపోవచ్చు లెండి, లోకంలోని కొన్ని అపరిష్కృత వింతల్లో “జిలేబి” గారొకరుగా మిగిలిపోతారేమో?

      Delete

    15. ఎండలు తగ్గేక లిసెద
      మండీ కలిసెదము మిమ్ము ; మామి జిలేబీ
      మొండిఘటపు కాళ్లు తిరిగి
      యుండునొ గమనించుటకిక యుక్తి కలదకో ?

      జిలేబి

      Delete
  4. శర్మ గారు విజయవాడ అంటున్నారు, జిలేబి జపాన్ టైము జోనులో ఉన్నట్టున్నారు.

    ReplyDelete
    Replies

    1. bonagiri15 April 2023 at 12:14
      టైమ్ జోన్ చూసి మోసపోకండి సార్!!

      Delete