Thursday 29 September 2022

చెఱపకురా చెడేవు.

 చెఱపకురా చెడేవు.


ఎవరికీ చెడ్డకోరకూడదు. అదే మనకు తిరిగొస్తుందంటారు. 

"చేసిన ర్మము చెడని పదార్ధము చేరును నీ వెంట" తత్త్వం, తెలిసి చేసినా తెలియక చేసినా, నిప్పులో చెయ్యి పెడితే కాలి తీరుతుంది కదా! అంతే మరి, చెడ్డ చేస్తే ఫలితమూ చెడ్డగానే ఉంటుంది. చెడు ఎలా చేస్తాం? ఎలా చేస్తామో చెబుతుందీ శ్లోకం,

కరచరణ కృతంవా
మనోవాక్కాయజం వా చ
తవాపరాధం క్షమస్వ
మహా దేవ దేవ శంభో!
కాళ్ళూ చేతులతో, మనసు,వాక్కు, కర్మలతో చేసే సర్వ అపరాధాలనీ క్షమించమని వేడుకోలు. వేడుకున్నంతలో ఫలితం ఉండదు, ప్రతిఫలమూ తప్పదు. అందుకే మనవాళ్ళు "ఎప్పుడు చేసిన కర్మో! ఇప్పుడిలా కట్టికుడుపుతోంద"ంటారు.మరో మాట కూడా చెబుతారు, "నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలం అనుభవిస్తావ"ని. "Karma returns" today saying.  అబ్బే! జాంతానై! గురువూ నై!! దేవుడూ నై!!!,నేటి మాట అస్తు! అస్తు!!


చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు.


చెట్టు పాడవడాన్ని "పుల్ల విరిగింద"ంటాo, మా పల్లెటూరీ భాషలో. చెట్టు కాని, పాదుకాని కాపు పూర్తయి, ఇక ముందు కాయదు అనడానికి సంకేతంగాను, ఇక ముందు చనిపోతుందని సంకేతంగా  ఇటువంటి పిందెలు దిగుతాయి. వీటిని కుక్కమూతి పిందెలంటారు. ఇలాగే మనుషుల్లో కూడా, పిదపకాలపు బుద్ధులు పుడతారంటారు. 


4 comments:

  1. మాండవ్య ముని (అణి మాండవ్య) కథ దీనికొక ఉదాహరణ …. Karma catches up అనే దానికి …. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.

    Ignorance of the law is no excuse అని తెల్లవాడు కూడా ఓ legal principle గా ఉద్ఘాటించాడండోయ్.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      చేసిన పాపం చెబితే పోతుందంటారు కాదు శిక్ష అనుభవింపక తప్పదు, మీరు చెప్పిన అణిమాండవ్యుడు శిక్ష అనుభవించాడు, చిన్నపుడు, తెలియక చేసినా!

      Delete
  2. చేసిన dharmamu చెడని పదార్ధము చేరును నీ వెంట" ani unDaali.

    ReplyDelete
    Replies

    1. అనామకా!
      ధన్యవాదాలు

      Delete