Saturday 1 October 2022

మొండివాడు రాజుకంటే బలవంతుడు.

  మొండివాడు రాజుకంటే బలవంతుడు.


ఇది పాతకాలం మాట, కాని నేటికీ వర్తిస్తుంది. ఏం? ఏలా?

రాజుకి కొన్ని నియమాలుంటాయి, అవి దాటితే కౄరుడు అన్నమాట పడిపోతానని, ఇతరులు ఏమనుకుంటారోనని,ప్రజలేమనుకుంటారోనని, భయపడతాడు, ఎంతో కొంత. కాని మొండివాడో? అటువంటి శసభిషలేం ఉండవు. ఎవరేమనుకున్నా ఈ మొండివానికి బాధాలేదు, భయమూ లేదు.తనకి ఎంతతోస్తే అంతే! మరి నేటికాలానికెలా వర్తింపూ అనికదా కొచ్చను :)


నేడు సోషల్ మీడియా అన్నదో కోతికి కొబ్బరికాయ దొరికిన చందమైయింది. వాక్స్వాతంత్ర్యం అన్నది  రాజ్యాంగం

 ప్రసాదించింది,ఇంకేం కావాలి? ఏదైనా అంటాం! ఎవరినైనా అంటాం!! ఇదీ నేటి వరస. సుప్రీం కోర్ట్ కూడా వాక్స్వాతంత్ర్యానికి కూడా హద్దులుంటాయంటోంది. కాని వినేవారే కనపట్టం లేదు. సోషల్ మీడియాలో యుట్యూబ్, ఒక పెద్ద సాధనమయింది. ఏంతోస్తే అదే షూట్ చేసి పెట్టెయ్యడమే! బాధితులు కొంతకాలం సహిస్తారు. అందరూ సహించరుగా!! కోర్టే కినుక వహిస్తే జైల్లో పారేస్తే, ప్రభుత్వం ఉద్యోగం పీకేస్తే, నిరాహారదీక్ష... 


దీనికితోడు మరోటి, గాంధీగారు చచ్చి ఏలోకాన్న ఉన్నాడోగాని, దేశం లో అలవాటు చేసినది మరొకటి నిరాహారదీక్ష. సరే ఇందులో రకాలనుకోండి. ఇక నిరవధిక నిరాహారదీక్ష. దాని అర్ధమైనా తెలుసునో లేదో, చేసేవారికి, తెలియదు. ఆపై దీని గురించి మీడియావారి హడావుడి, ఇక చెప్పేదేముంది? అసలే కోతి, కల్లు తాగింది,ముల్లు గుచ్చుకుంది, దయ్యం పట్టింది, మరేం కావాలి? 


మొండివాడు రాజుకంటే బలవంతుడు కాదా?  

5 comments:

  1. మరి రాజే మొండివాడైతే ??
    సోషల్ మీడియా వీరులే కాదండి, పేరుకి ప్రజాస్వామ్యమే అయినప్పటికీ మొండితనంగా వ్యవహరిస్తున్న
    నవీన రాజులు కొంతమందిని చూస్తున్నాం కదా? మొండితనంలో మొండివాడికి ఏ మాత్రం తీసిపోరు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు … అని పూర్తిగా నమ్మిన బాపతులాగా అనిపిస్తారు. .

    ReplyDelete
    Replies

    1. విన్నకోటవారు,
      రాజే మొండివాడైతే, మొండివాడే రాజైతే, రెండూ ఒకటేనాండి :)

      రాజే మొండివాడైతే ఆ ప్రజలదేనండి అదృష్టం.

      Delete
    2. ఏ రాయయితేనేం సారూ 😧.

      - విన్నకోట నరసింహారావు

      Delete
  2. Another thing Gandhi made popular was non-cooperation. While this was a useful technique during the foreign rule, it does not make sense to continue it indiscriminately for every silly cause, in the form of bandhs, hartals, etc. It disrupts the life of common man without getting any lasting benefits.

    ReplyDelete
    Replies
    1. Anonymous,

      ఇదేనండి నాగరికతంటే :)

      Delete