తమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!!!
పార్టీ అధికారంలో ఉన్నపుడు-నాయకులు
ఎప్పుడు సంపద గల్గిన
యప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్
దెప్పలుగ చెరువు నిండిన
గప్పలు పది వేలు చేరు గదరా సుమతీ!
సంపదలు కలిగినప్పుడు అందరూ బంధువులే, ఎక్కడెక్కడినించీ పుట్టుకొచ్చేస్తారు, ఎలా? చెఱువు నిండితే,నీటితో, కప్పలు పదివేలు చేరాతాయన్నట్టు.
పార్టీ వదిలేసిన నాయకులు
కమలములు నీటబాసిన
కమలాక్షుని రశ్మిసోకి కమలిన భంగిన్
దమతమ నెలవులు దప్పిన
తమమిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ
కమలం నీటిలో ఉన్నంతకాలం నవనవలాడుతూ ఉంటుంది. అదే కమలాన్ని నీటిలోంచి తీసేసి బయట పడేస్తే వాడిపోతుంది, ఎందుకు? కమలాక్షుని రస్మిసోకి, అంటే సూర్యుని కాంతికి వాడిపోతుంది. అలాగే ఎవరి స్థానాలలో వారున్నంత కాలం సవ్యంగానే ఉంటుందంతా, కాని తమతమ నెలవులు దప్పిన మిత్రులే శత్రువులైపోతారోయ్!
అధిష్టానం-పార్టీ వదిలేసిన నాయకులు
కూరిమిగలదినములలో
నేరములెన్నడుడును గలుగ నేరవు మరి యా
కూరిమి విరసంబైనను
నేరములే దోచుచుండు నిక్కము సుమతీ!
స్నేహం కలిగినన్నాళ్ళు తప్పులేం కనపడవు,కాని ఈ స్నేహం కనక చెడితే అన్నీ తప్పులే కనపడుతూ ఉంటాయ్! జాగర్తా!!!
గొడ్డు గోతిలో తలో బెడ్డా వేసేరని.
గొడ్డు చాలా బలమైనది, అవసరం లేకపోయినా ఒక నమస్కారం పెట్టి తప్పుకున్నారు, అది బయట ఉన్నకాలంలో తప్పుకు తిరిగేరు. కాని అది కాలవశాన గోతిలో పడింది, ఇక అందరూ వీరులే,అందరూ తలో బెడ్డా విసిరేవారే!!!
లోకంబాబూ!!! లోకం!!!
నాకెప్పుడూ ఆశ్చర్యం కలిగించే విషయం మన వాళ్ళు అంత పాత కాలంలోనే అంత గొప్ప సూక్తులు - ముఖ్యంగా మనిషి మనస్తత్వం మీద - చెప్పగలిగారే అని 👏👏🙏🙏.
ReplyDeleteమనిషి అనేవాడు మారానని చెప్పుకుంటాడు. నిజానికి హిరణ్యాక్షుడి కాలం నుంచి ఇప్పటివరకూ మనసు అనేది అలాగే ఉంది. కోటానుకోట్ల సంవత్సరాలు తర్వాత కూడా అలాగే ఉంటుంది. పుట్టినవాడికి మరణం తప్పదు మరణించినవాడికి జన్మము తప్పదు అని చెప్పేసేడు కదా నల్లాయన? అదే మనసు కుళ్ళుతూ నిక్కుతూ నీలుగుతూ కోటాను కోట్ల జన్మలు ఎత్తాక 'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు...' అంటూ అనడం నేర్చుకునే రోజు వచ్చేవరకు అంతే. హిరణ్యకశిపుడు బాణం, గద, తపస్సూ వాడి లోకాలని ఏడిపించాడు ఇప్పుడు లాప్ టాప్ లు వాడుతున్నాం అంతే తేడా. అప్పట్లోనూ జాతకాలు చెప్పేసి ఇదిగో అదిగో అంటూ ఏడిపించేవారు. ఇప్పుడూ అంతే విక్టోరియా పుట్టక ముందు ఇది, చచ్చాక అది అని. రామకృష్ణులు అంటారు - ఓరి నాయనా నువ్వెందుకు పుట్టావో అది ఆలోచించు; మామిడి తోటలోకి వెళ్ళాక పళ్ళు తినడం మానేసి వెధవ లెక్కలు ఎందుకూ అని. అంతే ఈ లోకం అలాగే ఉంది, ఉంటోంది, ఉండి తీరుతుంది.
Deleteనిజానికి ఆశ్చర్యం కలగవల్సింది ఎన్ని కోటానుకోట్ల సంవత్సరాలైనా ఈ మనస్సనేది అంత కంట్రోల్ లో పెట్టలేనిది గా ఎలా ఉంటోంది అని. ఇదంతా నేను ఉవాచ. మీరు పట్టించుకోనక్కర్లేదండోయ్! :-)
స్వస్తి.
విన్నకోటవారు,
Deleteమనవారు ఆ కాలంలోనే మానవ మనఃస్తత్త్వాన్ని కాచి వడబోశారని నా నమ్మిక. ఏ కాలంలోనైనా ఏదేశంలోనైనా మార్పు చెందనిది మానవ మనఃస్తత్త్వం కదండీ. ఇప్పటివారికివి నచ్చవనుకోండీ! వానాకాలం చదువులు కదండీ నావి, అందుకు ఇవే గుర్తుకొస్తాయి,ఏమనుకోకండీ!
ఏ. తె. బతుకులుగల దినములలో
ReplyDeleteజాతకములెన్నండు బయటకి రానీయరు మరి యా
రాణులు నిర్జీవులైనను
గతయుగములలో జన్మలు జ్ఞప్తికొచ్చు నిక్కము కోహినూర్
(ఏ. తె అనగా ఏమో తెలియదు. వివరాలకు ఈ కధ చదవగలరు - https://eemaata.com/em/issues/201611/9467.html)
SDగారు,
Deleteఒక్క ముక్కర్ధమైతే ఒట్టు :) జిలేబిగినా కనపడితే అడగాలి. :)
ఆస్థాన జ్యోతిష్యుల వారి బ్లాగ్ చదివి రండి. అంతా అర్ధం అయిపోద్ది. రాముడు పదివేల ఏళ్లపైన రాజ్యం చేసాట్ట కదా? ఎప్పటి త్రిజట?
DeleteSD గారు,
Deleteనమస్కారం.
నేను పల్లెటూరివాణ్ణి,చదువుకోనివాణ్ణి కూడా! నా మాటలు మొరటుగా,కటువుగా ఉంటాయి,ఈ మాట, ఈ మధ్య, పదేపదే చెప్పాల్సి వస్తూంది. మన్నించాలి.
నా బ్లాగులో ఇతరులగురించి,ఇతర బ్లాగుల గురించి చర్చ అనుమతించను.
నేను జిలేబి కాదు సుమా :)