Friday, 28 January 2022

రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?

 రాబోయే వేరియంట్ కప్పాయా? గామాయా?


కరోనా మరో variant  ప్రపంచం మీదకి రాబోతోందని WHO మాట.ఇది ఇప్పటివాటికంటే చాలా తొందరనూ అందరికి సోకుతుందని వార్త.


ఇప్పటిదాకా కరోనా వచ్చి తగ్గినవారికి, ఏ వేరియంట్ ఐనా, ఇమ్యూనిటీ ఉంటుందా?


ఇప్పటికి టీకా వేసుకున్నవారు,బూస్టర్ తీసుకున్నవారికి ఇమ్యూనిటీ కొనసాగుతుందా?

 ఇప్పటికి తీసుకున్న బూస్టర్ టికా రాబోయే వేరియంట్ ని ఎదుర్కోగలదా?


కొత్తగారాబోయే వేరియంట్ తొందరగా సోకుతుంది సరే, దీని లక్షణాలేంటి?


ఎప్పటికి దీనినుంచి విముక్తి?


సమాధానం లేని రాని ప్రశ్నలు.


8 comments:

  1. గ్రీకాల్ఫాబెట్ ప్రకారమైతే శర్మాచార్య α, β, γ, δ, ε, ζ, η, θ, ι, κ, λ, μ, ν, ξ, ο, π, ρ, σ, τ, υ, φ, χ, ψ, ω ఉండాలి. మరి ఈ వెరియెంట్లను చూస్తే వాటి తీర్వత ప్రకారం పెంపంచ ఆరోగ్య సంత పెట్టి ఉంటుందని అనుకుంటున్నా.. VOC ఐతే α, β, γ, δ, ο. VOI ఐతే λ, μ లు వస్తాయట.

    https://www.who.int/en/activities/tracking-SARS-CoV-2-variants/

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!

      ప్రస్థుతానికి ఒమిక్రాన్ సబ్ వేరింయంట్లే ప్రపంచాన్ని కుదుపుతున్నాయని హు వారి మాట

      Delete
  2. కప్పా అయినా గామా అయినా, కామా కాకుండా ఫుల్ స్టాప్ అయితే బాగుంటుందండి.

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు,
      ఒమిక్రాన్ మరియు సబ్ వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తాయని, మిగిలిన వాటికి తావు రాదని ఆశావాదుల మాట, కాదు నెయో కోవ్ ఒక్క వేరియంట్ దూరంలో ఉంది, ఇది మానవాళిని తుడి చేస్తుంది, పదికి ముగ్గురు మిగిలితే గొప్పే అనే నిరాశావాదులు, వణికిస్తూ భయపడుతున్నారు. ఇంతతో ఇది వదిలితే పెద్ద పండగేనండి. కాలం నిర్ణయించాలి.

      Delete
  3. వీరేదో చెప్తున్నారు మరి
    https://youtu.be/yeqCMJ14Hoc

    ReplyDelete
    Replies
    1. చంద్రిక గారు,
      ధన్యవాదాలు.

      Delete
  4. // "ఇది మానవాళిని తుడి చేస్తుంది, పదికి ముగ్గురు మిగిలితే గొప్పే అనే నిరాశావాదులు, ......." //

    ఎవరు శర్మ గారూ, TV చానెల్సా ? 😉

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,

      తెలుగు ఛానల్స్ కి అంత సీన్ ఉందనుకోనండి, ఏదో సంసారపక్షంగా స్కై లాబ్ మీద పడుతుందన్నదాకా! తప్పించి. :) ఇది ఉహాన్ సైంటిస్టుల ఉవాచ. సార్!

      Delete