Tuesday 25 January 2022

పెద్దమ్మ-చిన్నమ్మ.

 

పెద్దమ్మ-చిన్నమ్మ.

పెద్దమ్మ ఇంటి నుంచి బయటికి వెళుతుంటేనూ చిన్నమ్మ బయటినుంచి లోపలికొస్తుంటేనూ ఆనందం అంటారు.

వివరించండి.


5 comments:

  1. పెద్దమ్మ అంటే దరిద్రదేవత కదా.
    చిన్నమ్మ అంటే లక్ష్మి కదా.
    కాబట్టి పైన మీరు చెప్పిన నానుడి వచ్చుంటుంది.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు,

      పాల కడలి చిలికినపుడు మొదటగా హలాహలం పుట్టింది, ఆ తరవాత పెద్దమ్మ,ఆపై చిన్నమ్మ, చివరికి అమృతం పుట్టేయి. అంటే కష్టపడితే కాని ఫలితం దక్కదు.

      ఇక కరోనా అనారోగ్యం పెద్దమ్మ వదలిపోతున్నపుడు ఆనందం, అలాగే ఆరోగ్య లక్ష్మి తిరిగొస్తుంటే ఆనందం కదండీ!

      Delete
  2. పెద్దమ్మ డెల్టా, చిన్నమ్మ ఓమిక్రాన్. పెద్దమ్మ వెళ్తోంది అంటే ఆనందం ఎందుకంటే తీవ్రత తగ్గిపోతోంది కాబట్టి. చిన్నమ్మ వస్తుంటే కూడా ఆనందం, ఎందుకంటే తీవ్రత లేదు దానికి తోడు సామాజిక సంక్రమణం జరగడానికి చిన్నమ్మ సహాయపడుతుంది మరి.

    ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది నా వివరణ.

    ReplyDelete
    Replies
    1. స్వరూప్ గారు,
      అన్వయం బాగుందండి

      Delete
  3. ఓహో, కరోనా & దాని వేరియంట్ల గురించా మీ పొడుపుకథ, శర్మ గారు? అయితే నా వివరణ ఇక్కడ వర్తించదు.

    ReplyDelete