Thursday 20 January 2022

ఒమిక్రాన్-2 (జరుగుతున్న కథ)

 

భయం లేదు, ఉత్సాహంగా ఉండండి.


ఒమిక్రాన్-2 (జరుగుతున్న కథ)

సార్ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా........అంటే ఒక అనుభవం ఉన్న డాక్టర్ గారి మాట.

ఇదెవరిని వదలదండీ. మొన్నటి దాకా పల్లె చల్లగా ఉంది, పండక్కి పట్నవాసం నుంచి వలస వచ్చారు. ఎవరూ మాస్క్ లు వేసుకోడం లేదు. తిరునాళ్ళు, తీర్థాలు, కోడి పందాలు గడిపేసేరు. ఇది స్వయంకృతం.
ఎవరిని ఎందుకు వదలదో చెబుతా.

గత రెండేళ్ళుగా అందరికి ఎంతో కొంత ఇమ్యూనిటీ పెరిగింది, సాధించుకున్నారు. దానితో ఈ ఒమిక్రాన్ కి ఎక్కువ ఇబ్బందులు లేక, ఎవరు పాసిటివ్ తెలీదు.లక్షణాలు కనపడితేనే పరిక్ష జరుగుతుంది కదా! ఇలా లక్షణాలు లేనివారు దీనిని వ్యాప్తి చేస్తున్నారు, అంతే కాక ఒక రోజు జ్వరం,మరొకరి ఒకరోజు రొంప, తలనొప్పి, వీరికి కూడా సామాన్య మందులేసుకుంటే తగ్గిపోతున్నాయి కాని వీరూ పాసిటివే. టెస్ట్ జరగదు, బాధలు లేవు గనక.అందుచేత, టీకా వేసుకున్నవారు, వేసుకోని వారు,బూస్టర్ డోస్ తీసుకున్నవారికి రావచ్చు.ఇంతకు ముందు వచ్చి తగ్గినవారిలో నూ రావచ్చు. 

.  
మరో మాట, ఇప్పుడు ఒమిక్రాన్ వచ్చిన వాళ్ళంతా అదృష్ట వంతులే, ఎందుకంటే వీరిలో ఇమ్యూనిటీ సహజంగా ఏర్పడింది, టి సెల్స్ కూడా పెరుగుతాయి, అలాగని అశ్రద్ధ వద్దు,జాగ్రత్తలు మానద్దు, వస్తే అనుభవించక తప్పదు,ఇప్పుడు వేరియంట్ కి ప్రమాదం కలిగించే లక్షణాలు లేవు, భయపడద్దు అని ముగించారు

https://timesofindia.indiatimes.com/life-style/health-fitness/health-news/coronavirus-14-omicron-symptoms-ranked-from-most-to-least-prevalent/photostory/88973282.cms


పై లింక్ లో వార్త నెట్ లో రెండు గంటలు మాత్రమే ఉంది. ఏం? ఇది సంచలనం కలిగించేది కాదు, అక్కడ వంద, ఇక్కడ వెయ్యిమందికి వచ్చిందని భయపెట్టేది కాదు, అందుకీ వార్త నిలబడలేదు. ఇటువంటి ధైర్యం కలిగించేవార్తలని ఎందుకు ఉంచుతారూ?

6 comments:

  1. ఇక్కడ అమెరికా లో కూడా, దాదాపు అందరినీ వదలకుండా ఈ వేరియంట్ వస్తుంది. ముఖ్యం గా స్కూళ్ళు నుండి బాగా వ్యాపిస్తోంది. ఒకరకం గా రావటం మంచిదే ముఖ్యం గా vaaccine తీసుకొన్నవారికి ఇది వచ్చినా ఆసుపత్రి లలో చేరే అవసరం రావటం లేదు. వచ్చిన తరువాత రెండో రోజు, మూడవ రోజు మాత్రం వళ్ళు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి బాగా ఉంటున్నాయి. అయిదవ రోజు నుండి లక్షణాలు తగ్గుతున్నాయి. కొందరికి తగ్గిన తరువాత 2,3 వారాలకు గాని అరుగుదల, ఆకలి సహజ స్థితి కి రావటం లేదు.
    దురదృష్టవశాత్తు ఇక్కడ మతపరమైన, రాజకీయ పరమయిన కారణాలవలన సగం మంది వరకు వాక్సిన్ తీసుకోకపోవటం వలన, వారు హాస్పిటల్స్ చేరాల్సిన అవసరం ఎక్కువుగా వస్తుంది, దానివలన హాస్పిటల్స్ అడ్మిషన్స్ పెరిగి, మిగతా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇది సడన్ గా అందరికీ రావటం వలన, స్టాఫ్ లేక ఒక్క విమానయాన సంస్థలే కాక, హాస్పిటల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి.
    ఇక ఇది వచ్చిన వారికి ఇమ్యూనిటీ పెరగటం నిజమయినప్పటికీ అది ఎంత కాలం నిలబడి ఉంటుంది అనేది ఇదమిద్దం గా తెలియదు. అవును ప్రభుత్వాలు, డాక్టర్స్ దీనివలన herd ఇమ్మ్యూనిటీ పెరుగుతుంది అన్న ఆశావాదం లో ఉన్నారు అనేది నిజం.

    ReplyDelete
    Replies
    1. క్రిష్ణ గారు,

      ఈ వేరియంట్ అందరికి సోకి తీరుతుంది,ఎవరిని వదలదన్న మాటలో భేదాభిప్రాయం లేదనే అనిపిస్తుందండి. ఇది అందరికి సోకుతూనే ఉంది, జరుగుతున్నదానిని బట్టి చూస్తే.మా దగ్గర స్కూళ్ళనుంచి వ్యాప్తి చెందటం లేదండి. పద్దెనిమిది లోపువారికి ఈ నెలలోనే వేక్సిన్ ఇచ్చారు. అది కూడా పండగ ముందు ఇచ్చారు, ఆ తరవాత శలవు లిచ్చారు.

      మా దగ్గర, జ్వరం,రొంప, దగ్గు ముఖ్యంగా కనపడుతున్నాయండి. గొంతు నొప్పి కూడా తక్కువే. ఇతర లక్షణాలు బాగా తక్కువ. ఇక్కడ శీతకాలంలో, ఇవి అతి సామాన్య లక్షణాలు, అందుకు పొరబడే సావకాశాలే ఎక్కువ.హాస్పిటల్ లో చేరవలసిన అవసరం కనపడటమే లేదు.ఈ లక్షణాలు కూడా ఒకటి, రెండు రోజులే కనపడుతున్నాయి, ఆ తరవాత తగ్గిపోతున్నాయి. ఇక ఆకలి, నిద్ర వగైరాల గురించిన వివరాలు లేవు.మా దగ్గర మతపరంగా, రాజకీయ పరంగా వేక్సీన్ వేయించుకోకపోవడం అన్నది లేదు.ఉత్తరాదిలో మొదటిలో కొంత ఈ రకపు హడావుడి జరిగినా ఆ తరవాత అంతా వేయించుకుంటూనే ఉన్నారు. కొద్ది రోజుల్లో ఇళ్ళకి వచ్చి వెతికి వెతికి వేక్శిన్ వేసే రోజు దూరంలో లేదనుకుంటా.

      ఇది సోకడం మూలంగా ఇమ్యూనిటీ పెరుగుతుందన్న మాటలో కూడా రెండవ మాట లేదండి. ఇలా హెర్డ్ ఇమ్యూనిటీ పెరగడమే మంచిదనిపిస్తుంది నాకూ.ఇలా వచ్చిన ఇమ్యూనిటీ నిలబడి ఉంటుంది. నాఉద్దేశ ప్రకారం మొదటి డోస్, టెస్ట్ డోస్, తరవాతిచ్చేది, అసలు డోస్. వీటి కాలం ఆరు నెలలనిపిస్తుంది. టికా ఒక సారిచ్చాకా బూస్టర్ డోస్ ఎందుకు? ఇమ్యూనిటీ లేకే కదా! ఇది నా అభిప్రాయం మాత్రమే సుమా! పొరపాటూ కావచ్చు.

      హెర్డ్ ఇమ్యూనిటీ పెరగాలని నా అభిప్రాయం, సవివర వ్యాఖ్యకి
      ధన్యవాదాలు.

      Delete
    2. మొత్తం ప్రపంచ జనాభా 1 మ్మిలియన్ అయ్యేవరకు కరోనాని పోనివ్వరు దాన్ని తయారు చేసి వదిలిన వాళ్ళు.అది వస్తే ఇమ్యూనిటీ పెరగడం అనేది అబద్ధం.ఇమ్యూనిటీ ఉన్నవాడు బతికితే దాన్ని చూసి అది వస్తే ఇమ్యూనిటీ పెరుగుతుందనడం ఏంటి - మీరు మరీను!

      Delete
    3. You have to say be negative.

      Delete