Saturday, 17 July 2021

Can you live here?

 

Photo credit: Owner.  Courtesy:Quora.com


36 comments:

  1. ఉండచ్చండీ …. Wi-fi, Internet లతో బాటు పాములు కూడా లేకపోతే 😁😁.

    ReplyDelete
    Replies

    1. విన్నకోట వారు

      మా పొలం ఊరికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడో షెడ్ వేశాను,మోటార్ కోసం, ఇలాగే ఉంటుంది. అక్కడికి సెల్ సిగ్నల్ రాదు. అక్కడికి పోవాలనిపిస్తుంది. కరంట్ ఉంది,నీళ్ళుంటాయి, కాని చికాకు భోజనం కాఫీ టిఫిన్లు ఎలా? అదొకటే సమస్య.

      ఆ సమస్య తీరితే అక్కడే కాపరం పెట్టేసేవాడినేమో :)

      పాములుండవండి. సంవత్సరానికి రెండు సార్లు పురుగు మందు కొడతాం.

      Delete
    2. శర్మ గారూ : ఒక hotplate నాలుగు గిన్నెలు చాలండి. ఒకప్పుడు ఒక గిన్నె లో కానిచ్చే వాడిని. ఎలాగో మార్చే పోయా నిప్పుడు. కాఫీ freezdried మిల్కపౌడర్ షుగర్ .

      Delete

    3. విన్నకోట వారు, Rao S Lakkaraju గారు,

      అవసరాలు కనీస స్థాయికి తగ్గించుకుని అక్కడే ఉండిపోడానికి వీలుందా అని ఆలోచనండి.

      1..రూం 12/10 వరండా 6 అడుగులు.ఒక మరుగుదొడ్డి అవసరం.
      2.రోజూ ఒక అరలీటర్ పాలు కావాలి తప్పదు.వేడి చేసుకోవడం వండుకోవడం జరగని పనులు.పంచదార,ఉప్పులు నిషేధం కనక బెడద కొంత తప్పినట్టేనా?
      3.పళ్ళు వారానికి ఒకసారి తెచ్చుకుని దాచుకోడానికి తగు ఏర్పాటు ఫ్రిజ్ అవసరం.
      4.రెండు గంటలకొకసారి ఆహారం కొద్దిగా తీసుకోవాలి కనక పళ్ళే ఆధారం, పళ్ళు మాత్రమే తిని గడిపగలమా?.
      5.కాలక్షేపానికి కొన్ని పుస్తకాలు, బస్ ఇవి చాలనుకుంటున్నా! అక్కడే స్థిరంగా ఉండిపోడానికి.
      6.వానప్రస్థం అంటే ఇదేనేమో !!!!

      Delete
    4. బాగానే ఉంది గానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం చివరికి “కౌపీన సంరక్షణార్ధం ….” అనే సామెతలాగా తయారవదు కదా 🙂?

      Delete
    5. జిలేబి మాట విన్నకోటవారి నోటవింటున్నానే :)

      Delete
    6. శర్మ గారూ: మీ కోరికలు కష్ట సాధ్యం కాదు. ఒక management expert ని నియమించుకుంటే సరి.

      విన్నకోట వారూ : “కౌపీన సంరక్షణార్ధం ….” ఆ సామెత కధ కొంచెం చెప్పండి. నేను దాని కోసం వెతుకుతున్నాను. థాంక్స్

      Delete
    7. లక్కరాజావారు,
      అంబలి తాగేవాడికి మీసాలెట్టేవాడొకడని సామెత, మరోటి కూడా కొంచం మోటుగా ఉంటుంది ఏమనుకోవద్దూ! అయ్య ఏబులం బుడ్డ పదలం.

      Delete
    8. శర్మ గారు, నేను “జిలేబి”ని కానండీ సారూ 😉🙏 .
      ---------------
      లక్కరాజు వారూ, “కౌపీన సంరక్షణార్థం” కథని శర్మ గారే బాగా చెప్పగలరు. సరే ఈ క్రింది లింకులో చూడండి.
      (లింకులోని కథను “సంసారమ్నును చేరదీసెను” వరకే చదవండి. దాని తరువాతి కథంతా ఈ రచయిత స్వంతం అని తోస్తోంది)

      https://www.acchamgatelugu.com/2014/11/koupina-samrakshanardam.html?m=1

      Delete
    9. విన్నకోట వారూ : నేను చిన్నప్పుడు విన్న సామెత “కౌపీన సంరక్షణార్ధం ............ పటాటోపః ” ఆ మధ్య లోది మరచి పోయాను. దానికి ఇంత కధ ఉన్నదని తెలియదు. థాంక్స్ .

      Delete

    10. విన్నకోటవారు

      జిలేబి ఖబర్ ఏమైనా తెలిందాండీ

      Delete
    11. లక్కరాజావారు,

      కౌపీన.....కథ పాతదే! అనుశ్రుతంగా వస్తున్నదిన్నూ, నా మాటల్లొ చాలాకాలం కితమే చెప్పేను, వీలుంటే చూడండి. Please see link below.
      https://kastephale.wordpress.com/2014/09/22/%e0%b0%b6%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae-%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b1%87%e0%b0%aa%e0%b0%82%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-280/

      Delete
    12. చూశారా మరి లక్కరాజు వారూ? ఇలాంటి సామెతలు వాటి వెనకనున్న కథలు శర్మ గారయితే బాగా చెప్పగలరని నేను చెప్పలే?

      Delete
    13. శర్మ గారు,
      ఏమిటి తెలిసేది ? “జిలేబి” హారి వ్యవహార శైలి మీకు తెలిసినదే కదా. భోగట్టా ఏమీ తెలియడం లేదు.

      తోచిన ప్రయత్నాలు చేశాం. ఇంకేం రకమైన ప్రయత్నాలు చెయ్యాలో బోధపడడం లేదు.

      “జిలేబి” గారు తన వివరాలు మరీ … మరీ…. గోప్యంగా ఉంచుకోవడం వలన వచ్చిన ఇబ్బంది ఇది. ఆన్-లైన్ మాధ్యమాల్లో స్వంత వివరాలు మరీ పూర్తిగా బయట పెట్టుకోకూడదన్న సూత్రాన్ని నేనూ ఒప్పుకుంటాను. కానీ “జిలేబి” గారు కనీసం తన అసలు పేరు సహితం వెల్లడించ లేదు. అలా చెయ్యడం వారికి సరదాగా అనిపించిందేమో గానీ దాని మూలాన వారి గురించి ఏమైనా వాకబు చెయ్యాలన్నా అది వీలు పడని పనిగా పరిణమించింది. ఎందుకంటే ఫలానా వారు నీకు తెలుసునా అని అడిగితే పేరేమిటి ఊరేమిటి అడ్రసేమిటి వయసేమిటి అని ఎదుటివారు మనల్ని తిరిగి అడుగుతారు, అది సహజం కూడానూ. మనకేమో “జిలేబి” గారు ఆడో మగో కూడా తెలియదు.

      “జిలేబి” గారు తిరిగి తనంతట తనే బయటకు వచ్చేటంత వరకు వారి క్షేమ సమాచారాలు మనకు చిక్కుప్రశ్న గానే ఉండిపోతాయి. అంత వరకు అంతా కుశలమేనని ఆశిద్దాం.

      ఈ మధ్య నేనొక పద్ధతి అనుసరించడం మొదలు పెట్టాను.
      నా స్నేహితులను తమ రెండో ఫోన్ నెంబర్ కూడా ఇవ్వమని అడిగి తీసుకుంటున్నాను (తమది అంటే తమ కుటుంబ సభ్యులెవరిదైనా అని). ఏవైనా అవాంఛిత కారణాల వల్ల నా స్నేహితుడి సమాచారం తెలియక పోతున్నప్పుడు ఆ రెండో ఫోన్ నెంబర్ కైనా ఫోన్ చేసి వాకబు చెయ్యడానికి వీలవుతుందని, కనీసం సమాచారం తెలుస్తుందనీ నా ఆలోచన.

      Delete
    14. జిలేబి క్షేమమే కదా! కంగారు ఎందుకు పడుతున్నారు? నిక్షేపంగా వున్నట్టున్నారు :)

      Delete
    15. శర్మగారూ, విన్నకోట వారూ. థాంక్స్ . నాకు కావాల్సింది దొరికింది. కొపీన సంరక్షణార్ధాయ అయం పటాటోపః

      Delete
    16. సన్నాసి కాకపోతే ఇసలు ఆ సన్యాసి ఒక గోచిని ఎలకలు కొట్టేసినప్పుడు మరొక గోచీ కుట్టించుకుంటే సరిపోయేది, ఇంత లంపటం తగిలించు కోకుండా. Simple కదా ? 🙂

      Delete
    17. "మరొక గోచీ కుట్టించుకుంటే" ----
      వింతగా ఉంది మేమెప్పుడూ గోచీలు కుట్టించుకోలేదు. Royal గోచీ గాళ్ళం కాదు లా ఉంది. పాత ధోవతి ముక్కలే గతి.

      Delete
    18. Haha :) don't take my comment so serious. Based on the discussion happening here I was curious to know who is Zilebi in these commentators posting in this blog. I too have not seen Zilebi comments for so long.

      Delete
    19. // “ వింతగా ఉంది” //
      అదే లెండి, అడుక్కుంటే (సన్యాసి కదా) 🙂.

      Delete

    20. సార్లూ,
      గోచీ,గోణం, లంగోటీ లు వేరు వేరు
      గోచీకి పెద్దది గోణానికి చిన్నదీ అని సామెత.

      Delete
    21. ఈ కథ తంతువేదో.. "గోచితో పోయే దానికి కోడలి దాక ఎందుకని*" లా అయ్యింది.. వెనకటికెవరో గుర్రపు నాడ దొరికిందని ఇనుప సామాను వాడికి అమ్మేయ కుండ గుర్రాన్ని కొన్నట్టు..

      *కథకు అనుగుణంగా గోటితో పోయేదానికి గొడ్డలి దాక తెచ్చుకున్నట్టు సామెత ను అదిలించి పెకిలించటం జరిగింది.

      Delete

    22. శ్రీధరా!
      గోచీతో పోయేదానికి కోడలిదాకా తెచ్చుకున్నట్టు కొత్త సామెత! చప్పట్లు వీరతాడు!

      Delete
  2. తప్పకుండ ఉండగలను, శర్మాచార్య.., ఫోర్ట్ నైట్ మాత్రమే కాదు.. నా చిన్నపుడు మంచే ఉండేది మా తాతగారి పొలంలో.. అక్కడ పడుకునే వాడిని.. ఓ సారలాగే పడుకున్నా 1988 మే లో.. ఆ పై నుండి పడ్డాను.. కాని మొదుగపూల చెట్టు కొమ్మ లో నా చొక్క ఇరుక్కుని చిరిగిననంతరం నా ఎడమ మోచేతి దగ్గర లాసిరేటెడ్ వూండ్ అయ్యింది.. ఇపుడు కూడా ఆ స్కారలానే ఉంది..!

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      అప్పుడు చాలా చిన్న వయసనుకుంటా కదా! ఇప్పుడు ఒంటరిగా ఉండే వయసు కాదు కదా! ఆ ప్రయత్నాలొద్దూ :)

      Delete
  3. బాబూ శ్రీధరా,
    మీరు వెళ్ళి మంచె మీద పడుకుంటారు. శర్మ గారేమో కిర్రు చెప్పులు వేసుకుని పొలానికి వెడతారేమో? కాబట్టి మీకెవరికీ భయం లేదు 🙂.

    అవునూ శ్రీధరా, మీకు తెలుగు టీవీ ఛానెళ్ళలో ఏంకరుడి ఉద్యోగం దొరికే అవకాశాలు మెండుగా ఉన్నాయని మీకు తెలుసా 🙂? అనవసరమైన చోట ఆ ఆంగ్ల పదాలెందుకండీ? ఇలా అనచ్చుగా 👇?
    ఫోర్ట్ నైట్ = పక్షం రోజులు / పదిహేను రోజులు
    లాసిరేటెడ్ వూండ్ = గీరుకుపోయి గాయం అయింది
    స్కార్ = మచ్చ
    🙂🙂

    ReplyDelete
    Replies
    1. సారూ! విన్నకోటవారూ!!

      ”గులుతె” చానల్లో ”లంగరిణి/లంగరుడు” ఉద్యోగం అంత గొప్పదాండీ???
      జిలెబి కి జై

      Delete
    2. ఛానెళ్ళు ఉన్నప్పుడు “లంగరుడు / లంగరిణి” (ఈ పేర్లు సరిగ్గా అతికేటట్లు పెట్టారండీ మీరు 😁) ఉద్యోగం అవసరమే కదా? భ్రష్టు పట్టించిన ఉచ్చారణ అయినా కూడా ఈ తరం యువతకు అదేదో గొప్ప ఉద్యోగం అనే భ్రమ కలిగిస్తున్నారు. రేడియో అనౌన్సర్ లాంటి ఉద్యోగం టీవీలో. కాకపోతే రేడియో వాళ్ళంటే గౌరవం ఉండేది, టీవీ వాళ్ళను చూస్తుంటే జాలేస్తుంటుంది (జాలి మన మీద మనకండోయ్ 😞).

      టీవీ వాళ్ళ లాగా శ్రీధరుడు కూడా మరీ తెలుగుని ఇతర భాషలతో అనవసరంగా కలగాపులగం చేస్తుంటే అలా అడిగానన్నమాట 🙂.

      Delete
  4. ప్రకృతి రామణీయకతకు పట్టయిన మ
    నోఙ్ఞసీమలో నివసించు విఙ్ఞతలు వి
    డిచిరి , గాలి వెల్తురుల కోడి , బతుకులు వి
    కృతము లయ్యె , నిదే యభివృధ్ధి యనగ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      ప్రకృతికి మరీ దగ్గరగా లేముగాని కొంచం దగ్గరేనని చెప్పుకోవచ్చండి.

      Delete

  5. గోచీ అంటే 4" వెడల్పున అడుగున్నర పొడుగు గుడ్డ ముక్క. దీనిని ధరించడానికి మొలతాడు కావాలి. మొలతాడు కట్టుకున్న వాడే మగాడని నానుడి.

    గోణం, గోచీకి రెండు పక్కలా తాడు ముక్కల్లా ఉన్నవి కుట్టించుకోవాలి. దీనికి మొలతాడుతో ప్రమేయం లేదు. రెండు పక్కల కుట్టించుకున్న వాటిని మొలచుట్టు కట్టుకుని ముడేసుకుని గోచీ దోపుకుంటే సరిపోతుంది. నేటి కాలంలో ఆడ, మగ తేడా లేక దీనిని వాడుతున్నట్టే ఉంది.బ్రాండెడ్ గోణాలు బాగా అమ్ముడవుతున్నాయి.

    లంగూటీ, జననేద్రియాలను కొద్దిగా తొడలభాగాన్ని వెనక పిర్రలని కప్పి గట్టిగా, దగ్గరగా పట్టిఉంచే, పొట్టి లాగూ

    గోచీ కంటే దరిద్రం చావు కంటే కష్టం లేదని నానుడి.

    ReplyDelete
  6. థాంక్స్ శర్మ గారూ నేను వాటిని గురించి అడుగుదామనుకున్నాగానీ ---- బాగుండదేమోనని అడగలేదు.

    ReplyDelete
    Replies
    1. లక్కరాజా వారు,

      నిన్న రాత్రి పడుకునే టైమయిపోయి పూర్తిగా చెప్పలేదండి. తెనుగులో గోచీ, గోణం, అంటాం కానీ సంస్కృతంలో ఒకటే మాట కౌపీనం అనుకుంటున్నానండి. లంగూటీ తెలుగు కాదనుకుంటా.గోణం అన్నమాట గౌణం నుంచి వచ్చినదెమో

      Delete
  7. చాలా విషయాలు విపులంగా తెలియ జేశే తీరు శ్లాఘనీయం, శర్మాచార్య..!

    Irony: కోవింద్ రాజ్యంలో కోవిడ్ కలకలం.

    జనం తీరు: "కోవిడ్ ఎటు లేదు గుంపులుగా ఉందాం బ్రదర్.. టికాలు వేసుకున్నాం మాస్క్ మాటే వద్దు బ్రదర్.. లాక్‌డౌను లేదు కదా వీధి వీధి నీది నాదే బ్రదర్..!" అసలు సంగతి: "కోవిడ్: నేనెటూ పోలేదు మీ దరిదాపుల్లోనే ఉన్నా బ్రదర్.. మీరెంత దగ్గరగా తిరిగితే నాకంత మంచిది బ్రదర్.. నా మ్యుటేషన్ల ధాటికి ఆనందయ్య మందు కూడా బలాదూరే బ్రదర్.. టీకాల తరువాయి కూడా మాస్క్ శానిటైజర్ తొమిదడుగుల దూరం సూత్రాలు పాటించకుంటే థర్డ్ వేవ్ లా విరుచుకు పడుతా బ్రదర్..!"

    ఆకలి రాజ్యం పాట బాణిలో

    ReplyDelete
    Replies

    1. శ్రీధరా!
      మంచిగ చెప్పిన్రు

      Delete