Friday 30 July 2021

పరుగెట్టి పాలు తాగేకంటే

 పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.....కాదు.


సాధారణంగా పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని చెబుతారు, కాని దీనిని పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది కాదు అని కూడా చెప్పచ్చు.


పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.

దీనితో పాటు ఈ నానుడులు కూడా చెప్పుకోవచ్చు. మబ్బుల్లో నీరుచూసి ముంత ఒలకబోసుకున్నట్టు అని,ఒక ఆంగ్ల సామెత A bird in hand is better than two in bush

ఒక ఉదాహరణ: ఊళ్ళో ఉద్యోగం, స్వంతీంటిలో కాపరం, కడుపులో చల్ల కదలకుండా రోజు నడుస్తోంది,ఎలా కర్చు పెట్టుకున్నా పాతిక మిగులుతోంది, నెలకి.  విదేశీ సావకాశం వచ్చింది, అక్కడికెళితే, వచ్చేది, ''వేసిన వత్తికి పోసిన చమురు హాని హానిగా సరిపోతుందన్నట్టు'' ఉంటుంది.అంత దానికి విదేశం పోవడం మేలా? అప్పుడు ఈ నానుడి చెప్పచ్చు. ఆతృతతో నిర్ణయం తీసుకోకు,

 ఆనందంలో మాటివ్వకు, కోపంలో మాటాడకు. ఇచ్చిన మాట తిరిగిపోకు అన్నది ఇదేనేమో!




పరుగెట్టి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది.....కాదు.

పరుగెత్తిన తరవాత ఏమీ తాగడం మంచిది కాదని ఆరోగ్య శాస్త్రం చెబుతోంది. అలాగే నిలబడి నీళ్ళు తాగడమూ మంచిది కాదంటోంది, ఆయుర్వేదం. అలా నీళ్ళు తాగితే అనారోగ్యం చేస్తుందిట. పరుగెత్తి పాలు తాగడమూ మంచిది కాదు నిలబడి నీళ్ళు తాగడమూ మంచిది కాదు. అదేం కాదంటున్నారు అలోపతీ వైద్యులు, శిఖపట్ల గోత్రం నడుస్తున్నట్టుంది.


9 comments:

  1. "నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో" అనే పాటయే నాకు గుర్తుకు వచ్చింది శర్మాచార్య మీ టపాను చూస్తే.. అందులో ఒక లైన్ ఉంటుంది.. "నువ్వు నిలబడి నీళ్ళు తాగటం నథింగ్ స్పెషల్ పరుగులెత్తుతు పాలు తాగటం సమ్‌థింగ్ స్పెషల్" అంటు.. అలానే నిండు సెందురుడ్ ఓ వైప్ సుకల్ ఓ వైప్..! రికట గందో లో హేష్మ బుబా గారి సాంగ్..!

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా,
      పాటాళ భైరవి సినిమాలో మాంత్రికుడు ఎస్.వి.ఆర్ డయలాగు.”మనం చేసేది జనం మెచ్చాల, జనం మెచ్చేది మనం సేయాల”అలా వుంది.

      Delete
    2. ఔనౌను ఆచార్య.. "సాహసం శాయరా ఢింబక.. అంబ మెచ్చుకుంటుంది" అని కూడా అంటారు అదే మూవిలో..

      నిదానంగా చేయాల్సిన వాటిని హూటాహూటిన చేయాలనుకోవటం హఠాత్పరిణామాలకు దారి తీస్తుందనేది కూడా అంటారు.
      దేని తీరు దానిదే.. ఏది మారినా గందరగోళమే కదాచార్య

      Delete
    3. శ్రీధరా
      "సాహసం శాయరా ఢింబకా రాజకుమారి లభిస్తుంది"

      Delete
  2. అలో … అలో … అలోపతి వారికి తతిమ్మా అన్ని వైద్యవిధానాల తోనూ శిగపట్లే కదా.

    పరుగెత్తిన తరువాత వెంటనే నీళ్ళు త్రాగడం ఒక్కోసారి ప్రాణాంతకం అవచ్చని పెద్దవాళ్లు చెబుతుండేవారు. కానీ నిలబడి నీళ్ళు త్రాగడం కూడా అనారోగ్యకరం అంటే … ఎందువలనంటారు?

    ReplyDelete
    Replies
    1. VNR sir,
      please see the link
      https://telugu.boldsky.com/health/wellness/2018/is-it-ok-to-drink-water-while-standing-019759.html

      Delete
    2. చూశాను, సర్. ఏమిటో ప్రతిదాన్నీ భూతద్దంలో చూస్తున్నారేమో అనిపిస్తోంది 🙁.

      Delete

    3. విన్నకోటవారు,
      అంతేనంటారా

      Delete