Monday 26 July 2021

ఆకు కూరల్లో కల్తీ


 courtesy:what's app

ఒక ఆకు కూర పేరు చెప్పి మరొకటి అమ్మెయ్యడమూ, కాయ పెరగడానికి ఇంజక్షన్లు చెయ్యడమూ,నిలవ ఉండడానికి మందులు కొట్టడమూ, ముగ్గించడానికి బేటరీ పెట్టడమూ ఎరుగుదుం, అరటిగెల వేగంగా పెరగడానికి పువ్వు కోసిన తరవాత గుప్పెడు యూరియా ఒక పోలిథిన్ కవర్లో పోసి పువ్వు కోసిన చోట కట్టేస్తే గెల వేగంగా పెరుగుతుంది, ఇటువంటివి ఎరుగుదుంకాని,  ఆకు కూర తాజాగా కనపడ్డానికి ఇలా చేయడం తెలీదు.వినాశకాలే విపరీత బుద్ధిః 

10 comments:

  1. మార్కెట్‌లో కూరగాయలు అమ్మేవాళ్ళు అవి తాజాగా కనబడడానికి / వాడిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు వాటి మీద నీళ్ళు చిలకరించడం చూశాం. అది హానికరమైన పని కాదు (ఆ నీళ్ళు ఎక్కడ నుండి తెచ్చారు అన్నది తెలియనంత వరకు 😁).

    ఇలా కెమికల్స్ ని వాడడం దారుణమైన పని ఎంత వ్యాపారం అయినా. డబ్బు ముందు పూర్తిగా దిగజారిపోయిన బుద్ధులు. సర్వం కల్తీమయమై పోయి దేన్నీ నమ్మలేకుండానూ, దైవాధీనం గానూ తయారయింది పరిస్ధితి.

    ReplyDelete
    Replies
    1. విన్నకొట సార్
      సమాజానికి డబ్బు పిచ్చి పట్టిందండి.

      Delete
  2. ఇలా కల్తిలకు పాలుపడి ఎంత మంది అనారోగ్యం పాలవుతున్నారో తెలియదు. అంతెందుకు ఈ రోజు పొద్దున్నే జరిగిన విషయం.. నిన్న పొద్దుగూకినాక యల్పి గ్యాసైపాయే, రాత్రికి బ్రెడ్, పీనట్ బటర్ తో తిని బజ్జున్నాం, పొద్దుగాల టిఫిన్ సెంటర్ కు వెళ్ళి ఇడ్లి, వడ పార్శిల్ తెచ్చాను. తీరా ఇంటికి వచ్చినాక మాయావిడ ఇడ్లి చట్ని తీసి పాపకు పెడుతోంది, ఇంతలో చట్నిలో ఏదో నల్లగా నిగనిగ లాడుతు కనిపించింది.. ఏమిటా అని చూస్తే ఈగ.. ఇహ ఎక్కడిదక్కడే పడేసి, ముంతలేని చల్లను కొంచం ఉప్పేసి, తాగేశాం.. ఆ తరువాత వచ్చింది గ్యాస్ రీఫిల్..

    ఇలా ఎక్కడ చూసినా కల్తాలే ఐతే చివరాఖరుకి ఆయూక్షీణమైపోయి ఆయుర్ధాయం సగానికి తగ్గిపోయి వ్యాధినిరోధక శక్తి మందగించటమే తరువాయి..

    శ్రీమద్రమారమణగోవిందో హరి

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      అదృష్టం, ఈగ కనపడింది, పచ్చడిలో నలిగిపోలేదు.డబల్ సిలిండర్లు బాగానే ఇస్తున్నారుగా, గేస్ కి కూడ కొరత ఉన్నట్టు లేదు.

      Delete
    2. ఔను శర్మాచార్య.. డబల్ సిలిండరే మాది కూడా.. కాని ఆ కొత్త సిలిండర్ కి ఉన్న వాషర్ రబ్బర్ కట్ అయ్యి ఉండింది. అనవసరంగా గ్యాస్ లీక్ ఎందుకని ముందు జాగ్రత చర్య గా హెచ్పి వారికి చెబితే మరుసటి రోజు మరో రిప్లేస్మెంట్ సిలిండర్ తెచ్చాడు.

      బయట నుండి తినే పదార్థాలు తేవాలంటేనే ఓ మాదిరిగా ఉంటోంది ఈ రోజుల్లో..!

      Delete
  3. వియన్నారాచార్య.. మీరొకమారు அருவம் అనే మూవీ చూడండి..

    ReplyDelete
    Replies
    1. తెలుగు తెలుగు ప్లీజ్ ☝️.

      Delete
    2. "అరువం" * సిద్ధార్థ్ సూర్యనారాయణన్, కెథరిన్ ట్రెసా అలెక్జాండర్.. ఇది తెలుగులో కూడా తర్జుమ అయ్యింది "వదలడు" అనే టైటిల్ తో. ఎందుకు చూడమన్నానంటే ఈ మూవి అంతట ఆహార కల్తి మీదనే ఉంటుంది వియన్నారాచార్య.. నాకు ఒక అలవాటుంది ఏ సినిమ ఐనా దాని మాతృకలో చూడటం. అందుకే తమిళం లో టైటిల్ వేసా.

      Delete
  4. “వదలడు” ఏదో దెయ్యం సినిమా అనుకుంటానే? కాదా? సామాజిక సమస్యల మీదేనా?

    ReplyDelete