Wednesday 30 June 2021

ఇంటి దగ్గర సుగరు/బి.పి చూసుకోవడం

 ఇంటి దగ్గర సుగరు/బి.పి చూసుకోవడం

ఒకప్పుడు సుగర్ చూడాలంటే ఉదయమే లేవగానే మూత్రం పట్టి దానిని డాక్టర్ దగ్గరకి పట్టుకెళితే పరిక్ష నాళికలో పోసి వెచ్చచేసి బెనిడిక్ట్ సొల్యూషన్ వేస్తే ఆ మూత్రం రంగు మారేది, ఆ రంగు నీలంగా ఉంటే సుగర్ లేనట్టూ, ఇటుక రంగు వస్తే ఎక్కువున్నట్టూ, ఇలా రంగులనిబట్టి ఎంత సుగర్ ఉన్నదీ చెప్పేవారు. ఇది ఆ తరవాత కాలంలో అవసరాన్ని బట్టి ఇంటి దగ్గరే చేసేవాళ్ళం. రోజులు మారేయి, ఒక రక్తపు చుక్కతో సుగర్ చెప్పేరోజులొచ్చాయి. ఇందులో కూడా తేడాలు. ఒకప్పుడు ఒక సి.సి రక్తం తీసుకుని టెస్టు చేసేవారు, ఇప్పుడు ఒక చుక్కచాలు.ఆ రోజుల్లో లేబ్ లు లేవు, నేడు లేబ్ లు చాలా ఉన్నాయి. కరోనా కాలంలో సుగరూ బిపి లు చూసుకోవడానికి లేబ్ వారిని రమ్మన్నా,వెళ్ళినా ఒకటే :) అందుచేత ఇంటి దగ్గరే సుగర్ టెస్టు చేసుకునే విధానం ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ సాధనాలు చాలాకాలం కితమే ఉన్నా వీటి అవసరం ఇప్పుడు బయట పడింది, ఎందుకూ, కరోనా తో మనిషిని చూస్తే భయం మూలంగా


సుగర్ చూసుకునే మిషన్ని గ్లూకో మీటర్ అంటారు. చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి, కొన్ని ఉచితంగా కూడా ఇస్తున్నాయి.లాభం లేందే సెట్టి వరదని పోడని సామెత. ఈ మీటర్ ఊరికే వచ్చినా ఇందులో టెస్టుకోసం ఉపయోగించే స్టిక్కులు కొనుక్కోవాలి, అదీ అసలు సంగతి.ఈ meter ఖరీదు తక్కువే పదేను వందలలోపు, స్టిక్కులు మాత్రం ఒక్కోటి పన్నెండు రూపాయలపై మాట. 


ఇక బి.పి ఇది పది నిమిషాల వ్యవధిలోపలే రీడింగ్ మారిపోతూ ఉంటుంది.ఐతే సిస్టోలిక్ మారుతున్నా డైస్టోలిక్ అంత వేగంగా మారదు. దీనికీ మీటర్ దొరుకుతున్నాయి. ఇప్పుడు డాక్టర్లు బి,పి చూడటం లేదు, ఆటొమేటిక్ డిజిటల్ బి.పి మీటర్ తో నర్సులే చూస్తున్నారు, ఫలితం నోట్ చేస్తారు, డాక్టర్ చూస్తారు. దీనిని ఇంటీ దగ్గరె చూడచ్చు. మీటర్ ఉన్నదని అస్తమానమూ చూస్తే గాభరా పుడుతుంది.ఇది కూడా ఐదు వేలలోపే ఖరీదు. అనుమానం తీర్చుకోడానికి పనికొస్తుంది, అంతే. రీడింగులు చూసి గాభరా పడద్దు.


ఇక అసలు విషయానికొస్తే ఏ రెండు మీటర్లూ ఒకలా చూపవు.ఇక ఈ సుగర్ మీటర్ సంగతి, మన దగ్గర మీటర్ ఎక్కువ రీడింగ్ చూపుతుంది, లేబ్లో మీటర్ తక్కువ చూపుతుంది. మోసంకాదా అనిపిస్తుంది,ఆవేశపడ్డాకూడా. తెలిసినవారు విషయం వివరించినది చెబుతా. మనం తీసుకునే రక్తపు చుక్క ధమనులనుంచి వచ్చే రక్తం. లేబ్లో టెస్ట్ కోసం మన దగ్గర తీసే రక్తం సిరల నుంచి.ధమనుల్లో రక్తంలో గ్లూకోస్ శరీర చివరి భాగాల దాకా అందిస్తుంది కదా! దానిలో గ్లూకోస్ ఎక్కువ ఉంటుంది, సిరలలో రక్తంలో అది తక్కువ ఉంటుంది. సిరలలో రక్తం ఎందుకు టెస్ట్ చేస్తారు? చెప్పలేను. ఇలా ఈ తేడా ఎంతా అన్నది తెలియాలంటే లేబ్ కి రక్తం ఇచ్చిన వెంటనే మనమూ మన దగ్గర మీటర్ తో చూసుకుంటే తేడా తెలుస్తుంది. ఇది సాధరణంగా 20'% ఉంటుందంటారు. కాని నా అనుభవం 38% తేడా ఉంది, మరి రెండు మూడు సార్లు తేడా గమనించాలి. 


ఇక బిపి మీటర్లో ఈ తేడాలు గమనించలేం.కాని బిపి తీసుకునే ముందు జాగ్రతలూ తెలిసినవే చెబుతా. నడచిన వెంటనే, సైకిల్ తొక్కిన వెంటనే, భోజనం, టిఫిన్ చేసిన వెంటనే బిపి ఎక్కువ ఉంటుంది.ఇక మాట్లాడుతూ బిపి చూసుకుంటే ఎక్కువ ఉంటుంది. కుర్చీలో కూచుని కాళ్ళు కత్తెరేసి కూచుంటే బిపి ఎక్కువ చూపుతుంది. అంతెందుకు మీ చేతికి కట్టే బేండు వదులుగా కడితే బీపీ పరిగెడుతుంది. అందుచేత మీ శరీర పరిస్థితి గమనించుకోవాలి. అవసరాన్ని బట్టి డాక్టర్ని సంప్రదించాలి. కంగారు పడిపోకూడదు సుమా!ఈ రీడింగులు చూసుకుని మందులు మానెయ్యడం డోసులు మార్చేసుకోడం చేయకూడదు, ప్రమాదం తెచ్చి పెడతాయి. తస్మాత్ జాగ్రత.


10 comments:

  1. నా పాత మొబైల్ "శామ్‌సంగ్ గ్యాలక్సి నోట్ ౪" లో ఐతే కెమెరా కింద ఒక సెంసర్ ఉండింది. ఏదేని హెల్త్ యాప్, ఐ మీన్ "గూగుల్ ఫిట్", "ఎస్-హెల్త్" వంటివి ఇన్స్‌టాల్ చేసుకుంటే ఒకేమారు బీపి, యస్‌పీఓటూ, టెంపరేచర్, పల్స్ రేట్ వంటివి వెంటనే స్క్రీన్ పై వచ్చేస్తాయి, సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇహ ఆ తరువాత ఫిట్-నెస్ వాచెస్ వచ్చేశాయనుకోండి. పాత తరానికి కొత్త తరానికి వారధిలా.. మీరు చెప్పిన బెనెడిక్ట్ సొల్యూషన్ నేను ఒహపటి మా కెమిస్ట్రి ల్యాబ్ లో ప్రెజెన్స్ ఆఫ్ షుగర్ ఇన్ ఏ సొల్యూషన్ అనే ఎక్స్‌పెరిమెంట్ లో వాడాము. భగవంతుని కృప మూలానా నా షుగర్ లెవల్స్ నార్మల్ రేంజ్ లోనే ఉన్నాయాచార్య.. బీపీ కూడాను.. యాక్యు చెక్ అనే గ్లుకోమీటర్ బాగుంటుందిట.. కరోనా కాష్టం కనుక ముందస్తుగానే ఓ పల్స్ ఆక్సిమీటర్ కొనుకున్నాను.. యస్‌పీఓటూ కొఱకు. 96-99% ఆక్సిజెన్ లెవల్ ఐతే నో ప్రాబ్లం..! రీడింగ్ దగ్గరే జాగ్రత వహిస్తే మంచిది మీరన్నట్టు.

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      స్వానుభవంలో ఇబ్బందులు.అమెరికాలో ఇంప్లాంట్ ఆరు నెలలు బాగా చూపుతోందిట రీడింగులు, నేటి వార్త.

      Delete
    2. ఓహ్.. ఔతే.. యూరిన్ సాంపల్, పిన్ పంక్చర్ సాంపల్ దాటుకుని ఇంప్లాంట్ దాక వచ్చిందీ.. మీకు నీల్ హార్బిస్‌సన్ గురించి తెలిసే ఉందనుకుంటాను శర్మాచార్య. అతను ఓ సైబార్గ్.. తలలో యాంటెన ద్వార ఆలకిస్తు ఉంటాడు. అది వైఫై కి కనెక్ట్ చేసుకుని ఫోన్ కాల్స్, మ్యూజిక్, ఇతరత్ర వింటుంటాడుట..!

      Delete

    3. శ్రీధరా!

      మాకు దగ్గరలో తెలిసినవారి మనవడు పుట్టుకతో చెవులు వినపడకపోవడం గుర్తించారు,రెండేళ్ళ వయసులో హైదరాబాద్ లో అపరేట్ చేయించి చిప్ పెట్టేరు తలలో. ఆ కుర్రాడికి తలపైన బిళ్ళలా ఏటెన్నా ఉంటుంది,దానిని కావాలంటే పక్కకి జరుపుకుంటాడు. ఇష్టం లేని వి వినకుండాలంటే పక్కకి జరిపేస్తాడు, చక్కగా మాటాడుతున్నాదూ, వినగలడు.. వైద్యంలో మనదేశం చాలా ముందుంది,corporates దురాశతో చెడ్డపేరూ ఉంది.

      Delete
  2. ఏమిటో శర్మ గారు, ఒక్కోసారి ఆలోచించి చూస్తే వేలి కొస నుండో మోచేతి మడత దగ్గర నుండో రక్తం చిందించడం కన్నా పాత పద్ధతిలో బెనెడిక్ట్ సొల్యూషన్ తో ప్రయోగం చేసుకోవడం ఉత్తమం కదా అనిపిస్తుంది - ఈ సిరలు, ధమనుల వివాదం లేకుండా. ఇంటి వద్దది ఏదైనా మీరన్నట్లు for our guidance కోసమే కదా. అప్పుడప్పుడు రెండు మూడు నెలలకోసారి డాక్టర్ దగ్గర రక్త పరీక్ష చేయించడం ఎలాగూ తప్పదు, బెనెడిక్ట్ సూచించేది డాక్టర్లు ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి.

    అమెరికా ఇంప్లాంట్ ఏమిటి, మొదటిసారి వింటున్నాను?

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      యూరిన్ టెస్టులో పర్సెంటేజ్ వస్తుంది. దానిని మన ప్రస్థుత వాటికి మార్పు చేసుకుంటే మనం నిత్యమూ పొడుచుకోనక్కర లేదనుకుంటా. ఇది మన గైడెన్స్ కోసమే కనక.

      ఇక అమెరికాలో ఒక చిప్ శరీరంలో పెడుతున్నారు. అది శరీరంలో గ్లుకోస్,బిపి,వేది వగిరాలన్నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కి అందిస్తుంది అనుక్షణమూ, దానిని బట్టి ఎన్ని కాలరీలు తినాలి, ఎంతమానెయ్యాలి నిర్ణయించుకోవచ్చు. ఉజ్జామణీ లూ లేవు, అమ్మణ్ణీ జాడ తెలియలేదు.ఈ చిప్ ఆరు నెలలే బాగా పని చేస్తుందని ఆ దేశపు ఎఫ్.డి.ఎ శలవిచ్చిందిట.నేడో రేపో మనకి దిగుమతి అవుతుంది...


      Delete
  3. శ్రీధరా,
    బ్లడ్ షుగర్ లెవెలూ, బీపీ నార్మల్ గా ఉన్నందుకు అభినందనలు. అలాగే నిలుపుకోవడానికి ప్రయత్నించండి.
    (మనలో మన మాట - గీజర్, ఏసీ, పవర్ బిల్లు వంటి అంతర్జాతీయ సమస్యల గురించి పట్టించుకోకుండా ఉంటే బీపీ పెరగకుండా చూసుకోవడానికి దోహదం చేస్తుంది 😁😁 (jk 🙂)).

    ReplyDelete
    Replies
    1. మంచి మాటే శెలవిచ్చారు వియన్నారాచార్య.. నిజమే, అసలికే హోమ్ మినిస్టర్ అగ్గి మీద గుగ్గిలమయ్యే సావకాశము ఉండనే ఉంది. మీరన్నట్టుగానే ఆయా విషయాలపై చూసి చూడనట్టు వ్యవహరిస్తేనే మంచిది కాబోలు.. సరదాగా మీరన్నా అది సహజంగా జరిగేదే.. కుశలమనే తలుస్తున్న

      Delete
  4. అమ్మణ్ణి జాడ తెలియదు ,
    నెమ్మది పలవించు , సారు ! నెలదాటెను కం
    దమ్ము కకావికలై , డెం
    దమ్ములు కుందె , నిక నేదిదారి? తెలియగాన్ .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      అమ్మణ్ణీ మాట తెలిసి నెలకాదు, రెండు నెలలు దాటింది సార్

      Delete