Friday, 15 January 2021

రకరకాల పందెం కోడి పుంజులు

 
















courtesy:Whats app



విజయమో వీర స్వర్గమో పుంజులదే అగ్ర స్థానం. గెలిస్తే సన్మానం, ఓడితే వీర స్వర్గం మర్నాడు దాకలో కోసగా కూరకే . ఏదైనా దొరుకుతుందేమో గాని ''కోస'' దొరకదట, కొనడానికైనా! పుంజులదే రాజ్యంగాని పెట్టలకి చోటు లేదు :)

6 comments:

  1. పొద్దున్న ఏదో టీవీఛానెల్ వార్తల్లో ఏదో ఊళ్ళో జరిగిన కోడిపందాలు అంటూ ఓ వార్త వడ్డిస్తూ, "నెమలి" గెలిచింది "కాకి" ఓడిపోయింది అన్నారు లెండి. మీ ఈ టపాయే గుర్తుకొచ్చింది. ఆ పేర్లేమిటో తమాషాగా ఉన్నాయే!

    సంక్రాంతి సందర్భంగా ప్రతి యేడూ జరిగే ఈ జాతర నాకు వింతగా తోస్తుంది. అదే .. కోడిపందేల గురించి. మీడియా వారికి పండగ కాకపోతే ఆ పందేల గురించి పోలీసు వారి అత్యుత్సాహం ఎందుకంటారు? ఆపగలరా / నిరోధించగలరా ... లేదు. మరెందుకు? ఈమధ్య కాలంలో ప్రజానాయకుల కనుసన్నల్లోనే జరగడం ఎక్కువవుతోందంటున్నారు - ఇంక చట్టం పట్ల మనకేం గౌరవం ఉన్నట్లు? అసలు జనాలేదో సరదాగా ఆ ఆట ఆడుకుంటే వాళ్ళకే గానీ ప్రభుత్వానికొచ్చే నష్టమేమిటి? పండగప్పుడు ఏదో ఒకటి రెండు రోజుల వ్యవహారం. కానీ ఇలాంటిదే మరొకటి అదే పేకాట తీసుకోండి ... సంవత్సరం పొడుగూతా నడుస్తూనే ఉంటుంది కదా. అక్కడా అంతే .. ఆ క్లబ్బుల మీద పోలీసుల దాడి, నగదు పట్టివేత, ఆటగాళ్ళలో నలుగురు పరారీ, ఎనిమిది మంది అరెస్టు ... వగైరా వగైరా వార్తలు. ఏమన్నా అరికట్ట గలుగుతున్నారా ... లేదు (పెద్దపెద్ద క్లబ్బుల్లో మాత్రం నిర్భయంగా నడుస్తూనే ఉంటుంది). ఇవన్నీ జూదాలు కాబట్టి నిషిద్ధం అంటారా? వీటికన్నా పెద్ద జూదం గుర్రప్పందాలు. కాని వాటిని లీగలైజ్ చేసినట్లున్నారే? పెద్ద రేసుకోర్సులు, విశాలమయిన మైదానాలు, భవనాలు ... అబ్బో. మరి అక్కడ మాత్రం జూదగాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం లేదా? కోడిపందాల కన్నా పేకాట, రేసులకు విరుద్ధంగా ఒకటే వాదన చెప్పచ్చు .... అప్పుల వలన సంసారాలు కూలిపోతాయని. ఆమాటకొస్తే తాగుడూ అంతే, కానీ మద్యాన్ని నిషేధించ లేదే.

    అవునూ, ఓడిపోయినంత మాత్రాన కోసకోడిని చంపి కూరొండేసుకోవడం ఎందుకండీ? పోరులో తగిలినది చిన్నదెబ్బే గనక అయితే వైద్యం చేయించి దాని మానాన్న దాన్ని బతకనివ్వచ్చుగా, పాపం?

    హేవిటో .. విష్ణుమాయ.

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      చెబితే శానా ఉంది సార్! మనమాట కంఠ శోష అంతే!! బరిలో చస్తే హింస, ఇంటి దగ్గర పీక కోసి చంతే హింస కాదు సార్! అదంతే.
      సుహృద్బావ పోటీలు జరుగుతాయి, కాళ్ళకి కత్తులు కట్టరు, పోలీసు హెచ్చరించి వెళతారంతే!అందరికితెలిసిందే జరిగేదంతా :) తిరకాసొచ్చిన చోట దాడులు జరుఇగాయది వింతే :)
      హేవిటో .. విష్ణుమాయ.
      This is correct sir.

      Delete
  2. బరిలో నోడిన కోడికి
    ధర మిక్కుటమట, రుచి పటుతరమట, నేతల్
    గరగరవడి, కొని, మంత్రుల
    కొరకై విందు లొనగూర్చ గోరుదు రటగా !

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      తెలిసి అడిగితే ఏం చెప్పేది? :)పందెం గెలవకపోయినా ఇది కోస అని పంపితే కాదనువారెవరు సార్?

      Delete
  3. కోడిని చూస్తే ఏంటో
    బాడబులకుకూడ కోసి వండి తినంగా
    గాఢముగా బుధ్ధిగలుగు
    చూడంగా దాని పౌరుషోధ్ధృతులు ఘనమా ?

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      ఒకప్పుడు అందరూ తిన్నవాళ్ళే :) ఆ తరవాత కాలంలో అది మానుంచి లాక్కుని స్వంతం చేసుకున్నారు.నేనే తినుంటే రుచి గురించి మిమ్మల్ని ట ట లు చెప్పనిచ్చేవాణ్ణా? అసలు పాటాలు చెప్పవలసిన మీరు ట టలు చెబితే ఎలా సార్?

      Delete