అత్తా! అత్తా!!
ఎవరదీ? లలితా! రా! రా!! ఈవేళప్పుడొచ్చావ్, కాలేజీ లేదూ?చదువెలా సాగుతోంది? ప్రశ్నించింది సావిత్రమ్మ.
నాచదువుకేం అత్తా! బాగానే సాగుతోంది. ఇటువంటి వేళయితే నీతో తీరుబడిగా మాట్టాడటానికి కుదురుతుందని, కాలేజి డుమా కొట్టేసేను.
ఎవరే అదీ? పక్కగదిలోంచి ప్రశ్నించింది, సావిత్రమ్మ అత్తగారు.
మన పక్కింటి వాళ్ళమ్మాయి లలిత. సమాధానమిచ్చింది సావిత్రమ్మ.
దా కూచో! నాతో అంత ప్రత్యేకంగా మాటాడే రాచకార్యం ఏంటే?
అత్తా! డొంకతిరుళ్ళొద్దుగాని,నీ పెద్దకొడుకు ఆగేలా లేడు, మీద మీద పడుతున్నాడు,నాకూ ఆగాలని లేదు, పెళ్ళి చేసుకునే దాకా ఆగుదామన్నా వినేలా లేడు, అని ఆగింది.
అయ్యో! అయ్యొ!! అవేం పనులే! నీకు సిగ్గు లేదుటే? పరువు మర్యాద లేదుటే?
అత్తా! పెళ్ళి చేసి నీ కొడుకునూ నన్నూ గదిలోకి పంపి నువ్వు తలుపులేస్తే పరువు మర్యాద. పెళ్ళి కాకుండానే నీ కొడుకు నన్ను గదిలోకి తీసుకుపోయి తలుపులేస్తే మర్యాద అవుతుందా?
ఇంతకీ ఏంటంటావ్?
నాలుగు రోజుల్లో ప్రేమ సమాజంలో నాకు నీ పెద్ద కొడుక్కీ పెళ్ళి. చెప్పిపోదామని వచ్చా!
ఎంతకి తెగించేవే!కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఎగరేసుకుపోతావుటే?
అత్తా! అవసరం నాది, రేపు నీ కొడుకు దులుపుకుని వెళితే, నాకు కడుపో కాలో వస్తే, భరించేది నేనేగా! అందుకే ఈ జాగర్త. ఎర్రగా బుర్రగా ఉన్నాడని కదూ అంటున్నావు. ఏముంది నీ కొడుకు దగ్గర? చదువా? డిగ్రీలో రెండు సబ్జక్టులు తన్నేసేడు, తెలివా? కిరాణా చీటీ కూడా తిన్నగా తప్పులు లేకుండా రాయలేడు. మొన్న చీటిలో వెల్లుల్లి రాయమంటే వెళ్ళుళ్ళి అని రాశాడు. ఇక డబ్బా! ఇది అయ్యవార్లంగారి నట్టిల్లని తెలుసు. ఇంక ఎగరేసుకుపోడానికేం ఉంది?
అంత పనికి రానివాడెందుకే నీకూ?
మంచి ప్రశ్న వేసేవత్తా! నిజమే పిచ్చిదాన్ని, పడిపోయా! తన ప్రేమలో.
పెళ్ళి చేసుకుంటే ఏం తిని బతుకుతారే?
ఈ మాత్రం చదువులకి ఇక్కడేం గొప్ప ఉద్యోగాలు రావు. నీ కొడుకేం సైంటిస్ట్ కాడు. నాకైతే జీవితం మీద ఒక ప్లాన్ ఉంది. పల్లెటూరుకి పోయి, కూలీ చేసుకు బతుకుతాం.
సినిమాలు చూసి చెడిపోయారే!
నీ కొడుకే కూలీ నెంబర్.1, అనీ ముఠామేస్త్రీ ననీ అనుకుంటూ ఉంటాడు.
పెళ్ళి ఆగదుటే?
నీ చేతనైతే ఆపు.నేను పిలిస్తే నీకొడుకు కుక్కపిల్లలా తోక ఊపుకుంటూ వస్తాడు.నువ్వు బలవంతంగా ఆపితే పోలీసులొచ్చి తీసుకొస్తారు,నీ కొడుకుని. నా వెనక పడ్తుంటే, మీద పడుతుంటే,నీకు చెప్పినప్పుడు నువ్వు ఆపగలిగేవా? ఇప్పుడాపగలగడానికి, అంటూ, వస్తానత్తా! అని లేచి వెళ్ళింది.
పక్క గదిలోంచి బయటికొచ్చిన సావిత్రమ్మ అత్తగారు. ఏంటే అదీ అడిగింది.
చెప్పడానికేముందీ, మీ మనవడి నిరవాకం, అంది చేతులు తిప్పుకుంటూ, సావిత్రమ్మ.
అయ్యో! అయ్యొ!! ఎంతన్యాయం, ఎంతన్యాయం.వాడికేమే మగ మహరాజు. ఆడపిల్లలు బరి తెగించేస్తున్నారే! నువ్వేంటి దానికి సమాధానం చెప్పక నసుగుతావూ?
వాడికేం మగమహరాజని వెనకేసుకొచ్చే ఇలా కొంప మీదకి తెచ్చేరు.నా పెళ్ళయి పాతికేళ్ళయింది. ఏ విషయంలోనూ, నీకేం తెలీదు, నీకేం తెలీదూ అంటూ మీరూ,మీ కొడుకూ నా నోరు నొక్కేసేరుగా! ఇప్పుడు నేను నసుగుతున్నాననడమేం?
ఏమవుతుందంటావే?
ఏమో నాకు మాత్రం ఏo తెలుసూ! అది చెప్పిందిగా నాలుగు రోజుల్లో పెళ్ళీ అని. కానున్నది కాక మానదు! అని ముక్కు చీదుతూ పెరట్లోకెళ్ళింది సావిత్రమ్మ.
అంతేగా అంతేగా ఆచార్య
ReplyDeleteరాసి పెట్టి ఉంటే కానున్నది కాక మానదు, రానున్నది రాక మానదు.. రాసి లేక పోతే ఎంత ప్రాకులాడినా దరి దాపుల్లో గాని కనుచూపు మేరలో గాని కానరాదు.. యత్ కర్మ తత్ ఫలం.. యతార్థ కర్మఫలం.. మంచి ఐతే మంచే జరుగుతుంది.. కాల మహిమ.. తిరగమోత మాడితే ఎంత ఆర్భాటంగా వండుకున్నా వ్యాకే అగునుగా ఆచార్య. స్వస్తి
శ్రీధర్,
Deleteఅమ్మాయి మాటల్లో నిజాయితీ,కుర్రాడి తల్లి మాటల్లో వారి భవిష్యత్తు పట్ల ఆతృత, మామ్మగారి మాటల్లో.........కనపడుతున్నాయి కదండీ!
అమ్మాయంటే అల్లా
ReplyDeleteకుమ్మేస్తూంటేనె మంచికోడలవు గురూ!
బొమ్మాబొరుసూమల్లే
అమ్మాయబ్బాయి కలిసి హాయగ బతుకున్ .
రాజావారు,
Deleteకోడలు నలుపైతే కులమంతా నలుపేనని సామెత. కోడలు తెలుపైనది కాదు తెలివైనది కావాలి కదండీ.
ఆహా, ఆ మేనకోడలు వరసైన అమ్మాయి మహా వ్యూహాత్మకంగా, చాకచక్యంగా నడిపింది వ్యవహారాన్ని. ఇంకానయం, మీద పడడం కూడా దాటి తర్వాత దశకు ఆల్రెడీ చేరుకుంది పరిస్ధితి అనే పాచిక విసరలేదు, ఆ అవసరం లేకుండానే తనకు కావలసినది దక్కేట్లు చేసుకుంది. ఘటికురాలు సుమండీ 😁😁😁.
ReplyDeleteవిన్నకోటవారు,
Deleteమీకలా అనిపించిందా? మరో సారి చదవరూ
🤔🤔
Deleteఇవాళ భానుమతీ రామకృష్ణ గారి జయంతిట (సెప్టెంబర్ 7). ఎవరూ పెద్దగా తలుచుకున్న పాపాన పోలేదు. ఆవిడ జ్ఞాపకం మెల్లగా మరుగున పడిపోయినట్లుంది.
ReplyDeleteఅసలు తెలుగు చిత్రరంగంలో వాళ్ళకీ వీళ్ళకీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు గానీ విశేష బహుముఖప్రజ్ఞాశాలి భానుమతి గారికి ఇవ్వవలసింది, ఇవ్వకపోవడం ఆశ్చర్యం, బహుశః రాజకీయం కూడా ఉందేమో? ఏమైనప్పటికీ ఆ ప్రముఖురాలికి 🙏.
నటుడు తనికెళ్ళ భరణి వ్రాసాడని ఒక నివాళి వాట్సప్ లో వచ్చింది 👇
========================
Start of WhatsApp message
—————————————-
“Forwarded
ఈరోజు శ్రీమతి భానుమతి గారి 95 వ జయంతి. ఆవిడ గురించి తనికెళ్ళ భరణి రాసిన కవిత (పొగిడాడా! తిట్టేడా!)
"అహంకారం నీకు అలంకారం
నీ పలుకుల నిండా కొరివి కారం.
కోపం నీకు వజ్రాల ముక్కు పుడక
సంగీత సాహిత్యాలు నీ చెవులకు లోలకులు
నీ చూపు చుర కత్తి
నీ నవ్వు పూల గుత్తి
నువ్వు ఒక మతివి గావు
" శత మతివి"
చిత్ర సీమకు నువ్వో భారమతివి.
కథానాయికల మార్గంలో నువ్వో నూతన గతివి
నువ్వు భద్రకాళి లా కనిపించే భారతివి
నువ్వు పులి తోలు కప్పుకున్న గంగి గోవువి
నువ్వు ఆడ హీరోవి
నువ్వు సంగీతం సంగతుల్లో పక్కా శ్రుతివి
నటనలో మాత్రం అప్పుడప్పుడు కొంచెం "అతివి"
ఇవ్వళ నువ్వో స్మృతివి
కానీ సినీ వినీలాకాశంలో
అస్తమయం లేని "భాను" మతివి”
—————————————
End of WhatsApp message
=========================
"వాళ్ళకీ వీళ్ళకీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు"
Deleteనాగిరెడ్డి, ఎల్వీ ప్రసాద్, అక్కినేని, రామానాయుడు, కే. విశ్వనాధ్
"రాజకీయం కూడా ఉందేమో?"
నాకు తెలిసి రామానాయుడు ఒక్కడే రాజకీయాలల్లో ఉన్నాడు, అదీ కొన్నేళ్లు మాత్రమే.
PS: భానుమతికి అర్హత లేదనడం నా ఉద్దేశ్యం కాదు.
విన్నకోటవారు,
Deleteరచన నిందా స్తుతి. బాగుంది. భరణిదా కాదా తెలియదు. ప్రజ్ఞాశాలులు చాలా మందిని మన సంఘం గుర్తించలేదు. గుర్తించడానికి ఇష్టపడదు కూడా, కారణాలనేకం, మీకు తెలియనివేం కాదు. అవార్డులో కొలబద్ద కాదేమో!
ఇంతకుమించి వొగడ్తలు
Deleteఇంతులకెన్నడునుగల్గలే,సిన్మాలో,
ఇంతకుమించినప్రతిభా
వంతులు భానుమతిగా కెవరుగలరండీ!
నేనైతే.. నాలుగు ముక్కల్లో
Deleteభాను చండ ప్రచండ అగ్నిహోత్రం ఆమే గాత్రం
నుత్న ఆలోచన పథం ఆమే మనసు మందిరం
మదిలో మెదిలే సుహృద భావగీతం ఆమే జీవితం
తిరోగమనం చవిచూడని "అందాల ఓ మేఘమాల" ఆమే దృక్పథం
కొలబద్ద కాకపోవచ్చు కానీ అర్హత ఉన్న మనిషికి ఇవ్వకపోవడం అంటే అ వ్యక్తిని వెనుక వరసల్లోకి నెట్టివెయ్యడమే కదా?
Delete————-
తనకు అవార్డ్ తెచ్చుకోవడమే కాదు, మరొకరికి రాకుండా చెయ్యడం కూడా రాజకీయమే (తను బ్రతికున్నంత కాలం). అందుకు పలు కారణాలు ఉండవచ్చు .... వృత్తిలో పోటీ కావచ్చు, తన కన్నా ప్రజ్ఞ కలిగినవారయి ఉండచ్చు, వృత్తిలో మాటామాటా వచ్చుండవచ్చు, మరీ ముఖ్యంగా కులం తేడా అయి ఉండచ్చు (మన చిత్రరంగంలో మరీ ఎక్కువ కదా?).
ఏదో నటుడు / నిర్మాత / స్టూడియో ఓనర్ (లేదా వీటి కాంబినేషన్ గానీ) కాదు. భానుమతి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ ..... నటి, గాయని (శాస్త్రీయ సంగీతంతో సహా; మద్రాసు ప్రభుత్వం వారి మద్రాస్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్), సంగీత దర్శకురాలు, దర్శకురాలు, స్టూడియో ఓనర్, రచయిత్రి .... అన్నీ మూర్తీభవించిన వ్యక్తి అని గుర్తుంచుకోవాలి.
తరవాత తరవాత సినిమారంగానికి వచ్చి, ప్రవేశించినప్పుడు ఆవిడ ముందు పిపీలకాల వంటి వారు, తరువాతి కాలంలో పరిశ్రమను ఏలినవారు .... అటువంటి వారంతా అసలు సినిమారంగానికి వచ్చేనాటికే చిత్రరంగంలో ఆనాటికే ఆల్రెడీ స్టార్ గా వెలుగుతున్న వ్యక్తి భానుమతి గారు.
ఆవిడకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వకపోవడం కడు శోచనీయం.
Disclaimer:- అవార్డ్ దక్కిన వారిని కించపరచే ఉద్లేశం కాదు.
అవార్డులు ఇవ్వలేదని బాధ పడటం అనవసరమేమోనండి, ఇది నా వుద్దేశం మాత్రమే. ప్రతిభ లేనివాళ్ళకి అవార్డులిచ్చి ఆ తరవాత ప్రతిభ కలవారికి కూడా కంటి తుడుపుగా అవార్డులిచ్చి ఈ ప్రతిభ కలవారిని వారితో సమానం చేసెయ్యడం,అవమాన పరచడమేగా. నాకైతే ఈ అవార్డులు, బిరుదులు వగైరాలంతా నచ్చని విషయమె.
Deleteసూర్యుణ్ణి అరచేత మూసేయగలరా? సూర్యుని మీద ఉమ్మితే ముఖనపడదూ?
భానుమతి గారి గురించి తనికెళ్ళ భరణి వ్రాసిన ఈ మాటలు సత్యం.
Deleteనువ్వు భద్రకాళి లా కనిపించే భారతివి
నువ్వు పులి తోలు కప్పుకున్న గంగి గోవువి.
భానుమతి గారు ఎస్ వరలక్ష్మి గారు అసమాన ప్రతిభ కలవారు. వారికి తమిళనాడు లో సముచిత గౌరవం లభించింది. సంగీత కళాకారులను గొప్పగా గౌరవించే సంప్రదాయం తమిళనాడు కేరళ లో ఉంది.
బాలమురళి గారు వెళ్లిపోయిన సమయం లో కేరళ వారు చాలా గొప్ప నివాళులు ఇచ్చారు.
పి సుశీల గారికి కూడా పద్మ భూషణ్ తమిళ నాడు తరపున వచ్చింది.
నేదునూరి గారికి పద్మ విభూషణ్ ఇవ్వాలి. కానీ మన వాళ్ళు పట్టించుకోలేదు.
భానుమతి గారి గురించి తనికెళ్ళ భరణి వ్రాసిన ఈ మాటలు సత్యం.
Deleteనువ్వు భద్రకాళి లా కనిపించే భారతివి
నువ్వు పులి తోలు కప్పుకున్న గంగి గోవువి.
భానుమతి గారు ఎస్ వరలక్ష్మి గారు అసమాన ప్రతిభ కలవారు. వారికి తమిళనాడు లో సముచిత గౌరవం లభించింది. సంగీత కళాకారులను గొప్పగా గౌరవించే సంప్రదాయం తమిళనాడు కేరళ లో ఉంది.
బాలమురళి గారు వెళ్లిపోయిన సమయం లో కేరళ వారు చాలా గొప్ప నివాళులు ఇచ్చారు.
పి సుశీల గారికి కూడా పద్మ భూషణ్ తమిళ నాడు తరపున వచ్చింది.
నేదునూరి గారికి పద్మ విభూషణ్ ఇవ్వాలి. కానీ మన వాళ్ళు పట్టించుకోలేదు.
మనవాళ్ళని మనం గౌరవించుకోడం గొప్పేంటండీ! అందుకు పరాయి రాష్ట్రాలవాళ్ళు గౌరవిస్తే గొప్పని ఊరుకున్నారు మనవాళ్ళు. అంతే :)
Deleteఇదంతా తెలిసే గురజాడ ఒక్క ముక్కలో చెప్పేసేరు చూడండి, మన గురించి :)
చాలా బాగుంది గురువు గారు.
ReplyDeleteరచనా శైలి చాలా బాగుంది ... 🙏
రావుగారు,
ReplyDeleteమామూలుగా రాసే శైలి నుంచి మార్పు. కొత్త ప్రయత్నం, మార్పు గుర్తించినట్లు లేదు. మీరు గుర్తించినందుకు, నచ్చినందుకు
ధన్యవాదాలు.
అవ్యక్తమగు వేళ వ్యక్తి వ్యక్తి కి వ్యక్తమయ్యే భావాలు కొరవడి అవ్యక్తంగానే వ్యక్తపరిచే విధమూగా వ్యక్తావ్యక్తావస్థను వ్యక్తపరిచే విధమే వ్యక్తపరుస్తు అవ్యక్తంగానే వ్యక్తి వ్యక్తపరిచే తీరు అవ్యక్తం.
ReplyDelete~శ్రీత ధరణి
శ్రీధర్,
Deleteఈ రచనా శైలి నాది కాదు. ఇది శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది. ఇందులో పాత్ర,స్థలం,కాలం ,సంభాషణ అన్నీ కలగలిసి ఉంటాయి. పాఠకుణ్ణి రంగస్థలంలో నిలబెట్టి కత చెబుతాడు రచయిత. శాస్త్రిగారు ఇటువంటి రచనలు అలవోకగా చేశారు. పాఠకుని ఊహకి అందే విధంగా అవ్యక్తంగా వ్యక్తం చేయడం. విషయాన్ని వ్యక్తం చేస్తూనే పాఠకుని ఊహకు వదిలేయడం తో రచన చేయడం, బిగి తగ్గకుండా సంభాషణ నడిపించడం ,కత్తి మీద సాము.
నేను ఎంతవరకు అనుసరించగలిగేనన్నది పాఠకులే చెప్పాలి.
ఆచార్య.. భావాన్ని అందివేయటానికి ఒక్కోకరిది ఒక్కో శైలి. కొందరు కవితాముఖంగా, కొందరు మౌఖికంగా, కొందరు వ్యాసరూపేణ, మరి కొందరు గద్యపద్యాదులతో.. ఏ శైలి అవలంబించినా ఆయా భావం అందలికి తెలియజెప్పే విధానం శ్లాఘనీయం..!
Deleteశ్రీధర్,
Deleteఒక్కొక్కరిది ఒక్కొక శైలి. పైన చెప్పిన కవితలో భానుమతిగారిని నిందిస్తున్నట్టే ఉంది కదా! కాని అది స్తుతి. అదొక కవితా ప్రక్రియ. ఇటువంటివి మన పెద్దలు చాలానే చేశారు. కనీసం నాలాటి చదువు లేనివాళ్ళం అనుసరించగలమా? గుర్తించగలమా? అన్నదే నా తపన
// “ విన్నకోటవారు, మీకలా అనిపించిందా? మరో సారి చదవరూ” //
ReplyDeleteఓహో, శైలి గురించా? నేనింకా ... మేనకోడలి వరసైన ... అన్న నా మాటల గురించి “మీకలా అనిపించిందా” అని మీరన్నారు అనుకున్నాను. “పక్కింటి వాళ్ళమ్మాయి” అని మీ కథలో వ్రాసిన మాట గుర్తు లేకపోయింది నా కామెంట్ వ్రాస్తున్నప్పుడు.
శైలి విభిన్నంగా ఉందే అని చదివేటప్పుడు అనుకోవడమైతే అనుకున్నాను. బాగుంది, సర్, మంచి ప్రయత్నం. బాగా కుదిరింది. మరిన్ని వ్రాయండి.
విన్నకోటవారు,
Deleteతక్కువ మాటలలో, సంభాషణలో ఎక్కువ విషయాన్ని పాఠకులకు అందజేయడం, అదికూడా బిగి తగ్గకుండా ఉంచడం, ఏక బిగిని చదివించడం శ్రీపాద వారి రచనా లక్షణాలు.కొంత ప్రయత్నం చేశా అనుసరించాలని.
ధన్యవాదాలు.
"ఉఁ వచ్చే లెక్ఖ కంటే పోయేలెక్కే ఎక్కువుందేందిరా మేకడోలు" అంటు రెడిలో తన మార్క్ కామెడి ని సిరియస్ గా పండించినా.. "కావేరమ్మను ఆ గిరి గాడు పెండ్లి చేసుకోవటానికి తీస్క పోతావుండటం కరెక్టా రాంగా:" అంటు ప్రేమించుకుందాం రా.. లో కరుడు గట్టన విలన్ పాత్ర పోషించినా.. అది జయప్రకాశ్ రెడ్డి గారికే చెల్లింది. అనతి కాలం లోనే ఇటు విలని గాని, కామెడి గాని, కాస్త రాయలసీమ యాసలో సునాయాసంగా పండిస్తు ఇంత కాలం ఆబాలగోపాలాన్ని అలరించిన ఆయన ఈ రోజున గుండె పోటుకి గురై హటాన్మరణం చెందారనే వార్త కలచివేస్తుంది. అశృతప్త ఘననివాళి
ReplyDeleteఈ సంవత్సరం కరోనా సంకురుమయ్య సినిమా వారి మీద నడుస్తున్నట్టున్నాడు. జయప్రకాశ్ రెడ్డి సినిమాలైతే చూడలేదుగాని మంచి నటుడని విన్నా. ఈ లెక్కల మాస్టారు లెక్క ఇంత తొందరగా ఎందుకు పూర్తిచేసేసేరో! వారి ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటున్నా!
Deleteజయప్రకాష్ రెడ్డి గారు మంచి నటుడు. వారి అకాలమరణం విచారకరం.
Deleteవారి ఆత్మకు సద్గతులు సంప్రాప్తించు గాక 🙏.
జయప్రకాశ్ రెడ్డి గారు was a versatile actor. Rip sir. Sudden heart attack is one of the better ways to say goodbye to life.🙏
Deleteవైదిక ధర్మ అభిమానులకు నమస్కారం!వైదిక ధర్మ అనుయాయులకు నమస్కారం!వైదిక ధర్మ ప్రచారకులకు నమస్కారం!
ReplyDeleteరాజమండ్రిలో vedas world inc వారి అధ్వర్యంలో ఆగష్టు 19 నుంచి ధియోసాఫికల్ సోసైటీ వారు చస్తున్న యజ్ఞ ప్రక్రియ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నది.యజ్ఞం మొదలు పెట్టక ముందు తీసుకున్న గణాంకాలను బట్టి యజ్ఞం చెయ్యకపోతే ఉండగల ఇప్పటి పరిస్థితికీ యజ్ఞం చేశాక ఆయా తేదీల గణాంకాలను బట్టి యజ్ఞం చేశాక ఇప్పటి పరిస్థితికీ 40 శాతం వ్యత్యాసం ఉంది.
యజ్ఞం అనేది చాలా శాస్త్రీయమైన ప్రక్రియ.ఏయే ఓషధులు ఎంత పరిమాణం ఉంటే ఎన్ని హవిస్సులు వెయ్యాలి,ఎంత సమయం జరపాలి అనేవి లెక్క ప్రకారం తీసుకుంటారు.ఆగష్టు 19 నుంచి సెప్టెంబర్ 07 వరకు మొత్తం 26 రోజుల పాటు ఒక్క రాజమండ్రి నగరంలో జరిపిన యజ్ఞ ప్రక్రియ తూర్పు గోదావరి జిల్లా మొత్తాన్ని విశేష స్థాయిలో ప్రభావితం చేసి పొరుగు జిల్లాలను కూడా కొంత మేర ప్రభావితం చేస్తున్నది.
ఇది చేతివాటమో మోసమో వూక దంపుడు ప్రగల్భాలో ఎంత మాత్రం కాదు.కేవలం యజ్ఞం అనే శాస్త్రీయ ప్రక్రియ వల్లనే గోదావరి జిల్లాలలో 40% కేసులు యజ్ఞం మూలముగా తగ్గాయి. నాస్తికులు, ఇతరులు ఇది తప్పు అని నిరూపించగలరా?